కీసర: రంగారెడ్డి జిల్లా కీసర మండలకేంద్రంలో ఓ యువకుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. స్థానిక రాజీవ్‌గృహ కల్పలో నివాసం ఉండే వెంకటేశ్(19) సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకున్నాడు. మంగళవారం ఉదయం చుట్టుపక్కల వారు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలో జరుగుతున్న గొడవల కారణంగా అతడు మృతిచెంది ఉంటాడని సమాచారం.