గొంతుకోసుకుని యువకుడి ఆత్మహత్య
Published Tue, Sep 6 2016 7:28 PM | Last Updated on Wed, Aug 1 2018 2:29 PM
పెద్దపల్లిరూరల్ : పెద్దపల్లి మండలం చీకురాయి గ్రామానికి చెందిన మేకల పోల్‌రాజ్(28) మద్యం మత్తులో గొంతుకోసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై శ్రీనివాస్ కథనం ప్రకారం... చీకురాయికి చెందిన పోల్‌రాజ్ సైకిల్ రిపేరింగు, చిన్న దుకాణం నడుపుతు జీవనం సాగిస్తున్నాడు. కొద్దిరోజులుగా సైకోగా వ్యవహరిస్తున్నాడు. మద్యానికి కూడా బానిసయ్యాడు. సోమవారం రాత్రి మద్యం సేవించిన తర్వాత కత్తితో గొంతు కోసుకుని రక్తం కారుతుండగా తల్లిదండ్రులవద్దకు వచ్చాడు. వారు పెద్దపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించి ప్రాథమిక చికిత్స చేసిన తర్వాత కరీంనగర్‌కు తీసుకెళ్లారు. అక్కడ్నుంచి వరంగల్ ఎంజీఎంకు తీసుకెళ్తుండగా మార్గమధ్యంలోనే మృతిచెందాడు. పోల్‌రాజ్ తండ్రి కొమురయ్య ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
Advertisement
Advertisement