
యువతి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం:
గోపవరం పంచాయతీ పరిధిలోని ఆచార్లకాలనీలో ఆదివారం సాయంత్రం గుర్రమ్మ (25) అనే మహిళ ఆత్మహత్య చేసుకుంది. త్రీ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రమ్మ బీఎస్సీ, బిఈడీ చదువుకుంది. ఆమెకు చిన్న తనంలోనే పోలియో వ్యాధి సోకింది. ఆమెకు అప్పుడప్పుడు మతిస్థిమితం కూడా సరిగా ఉండదు. బెంగుళూరు, మధురై ఆస్పత్రుల్లో చూపించినప్పటికీ నయం కాలేదు. తీవ్ర మనస్థాపానికి గురైన గుర్రమ్మ ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ మహేష్ తెలిపారు.