యువకుడు ఆత్మహత్య | Younger Suicide | Sakshi
Sakshi News home page

యువకుడు ఆత్మహత్య

Published Thu, Oct 20 2016 11:06 PM | Last Updated on Mon, Sep 4 2017 5:48 PM

యువకుడు ఆత్మహత్య

యువకుడు ఆత్మహత్య

కడప అర్బన్‌ : కడప రైల్వే పోలీసుస్టేషన్‌ పరిధిలో కడప–రాజంపేట మార్గం మంటపంపల్లె సమీపంలో అల్లం రెడ్డెయ్య (22) తాను ప్రేమించిన అమ్మాయిని కాదని, పెద్దలు మరో అమ్మాయితో వివాహం చేసేందుకు సిద్ధమయ్యారని రైలు కిందపడి బుధవారం మృతి చెందాడు. రైల్వే ఎస్‌ఐ శ్యాం సుందర్‌రెడ్డి, బంధువుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేట పరిధిలోని మన్నూరుకు చెందిన అల్లం రెడ్డెయ్య వెంకట రమణ, సరస్వతిల ఏకైక కుమారుడు. ఇతను తన తండ్రితోపాటు కువైట్‌లో ఉండి ఇటీవలే స్వదేశానికి వచ్చాడు. యువకుడు ఓ యువతిని ప్రేమించసాగాడు. ఆ యువతిని కాదని, తల్లిదండ్రులు తాము కుదిర్చిన అమ్మాయి తో వివాహం చేయడానికి ప్రయత్నించారు. 24 గంటల్లో వివాహం జరుగుతుందనగా ఈనెల 19వ తేదీ సాయంత్రం తనకు డ్రస్‌ టైట్‌గా ఉందని, మార్చుకుని వస్తానని ఇంటి నుంచి మోటారుసైకిల్‌పై వెళ్లాడు.  రాత్రి పొద్దుపోయే వరకు రాకపోయేసరికి తల్లిదండ్రులు, బంధువులకు అనుమానం వచ్చింది. వెంటనే గాలింపు చర్యలు చేపట్టారు. రైల్వే పోలీసులు మోటారు సైకిల్‌ మంటపంపల్లె సమీపంలో పడి ఉందని, ఆ నెంబరు ప్రకారం అడ్రస్‌ తీసుకుని విచారించారు. మోటారు సైకిల్‌ సమీపంలోనే ఓ యువకుడు రైలు కిందపడి మృతి చెందడంతో దర్యాప్తు ప్రారంభించారు. ఆ యువకుడు తమ కుమారుడు రెడ్డెయ్యేనని తల్లిదండ్రులు గుర్తించారు. బోరున విలపించారు. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

 

Advertisement

Related News By Category

Advertisement
 
Advertisement
Advertisement