తాడిపత్రి రూరల్ : తాడిపత్రి రెవెన్యూ కార్యాలయ సమీపంలో టీ హోటల్‌లో రాజస్థాన్‌కు చెందిన రాజారాం(24) అనుమానస్పదస్థితిలో శనివారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇక్కడి టీ హోటల్‌లో రాజారాం గుమాస్తాగా పని చేస్తున్నాడు. హోటల్ యజమాని రాజస్థాన్‌కు వెళ్లాడు. అయితే రాజారాం హోటల్‌లో ఉరేసుకుని మృతి చెందడం కలకలం రేపుతోంది. హోటల్‌లో నుంచి దుర్వాస రావడంతో గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. రెండ్రోజుల కిందట మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
రాజారాం ఆత్మహత్య చేసుకున్నాడా, లేక వేరే ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సమాచారం తెలుసుకున్న పట్టణ పోలీసులు హోటల్ షట్టర్ పగులగొట్టి చూసేసరికి రాజారాం ఉరికి వేలాడుతూ కనిపించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
యువకుడి అనుమానాస్పద మృతి
Published Sat, May 13 2017 11:22 PM | Last Updated on Tue, Sep 5 2017 11:05 AM
Advertisement
Advertisement