మీ సాయం..నిలుపుతుంది ప్రాణం
ఆదోని అర్బన్ : ఈ చిత్రంలో ఉన్న చిన్నారి పేరు యశ్వంత్. ఆదోని పట్టణం మరాఠిగేరికి చెందిన పరశురామ్, రూప దంపతుల కుమారుడు ఇతను. ఎనిదేళ్ల ప్రాయంలో అనీమియా అనే వ్యాధి సోకింది. తల్లిదండ్రులు వివిధ పట్టణాల్లోని ఆస్పత్రుల్లో చికిత్స చేయించారు. నెల రోజులు కర్ణాటకలోని బళ్లారిలో చికిత్స చేయించి ప్రస్తుతం రెండునెలలుగా బెంగళూరులో చికిత్స చేయిస్తున్నారు. బోన్ మ్యారో ట్రాన్స్‌ప్లాంట్ ఆపరేషన్ కోసం రూ.12లక్షలు ఖర్చవుతుందని వైద్యులు తెలిపారు. దీంతో వారు బంధువులు, తెలిసిన వారితో సాయం పొంది, వారివద్ద ఉన్న బంగారం అమ్ముకొని రూ.6లక్షలు పోగుచేసుకున్నారు. చికిత్సకు ఇంకా రూ.6లక్షలు అవసరం ఉందని.. ఇందుకోసం దాతలు సహకరించాలని కోరారు. సాయం అందించేవారు సెల్‌నం: 09945297378, 09740100678, 09951893602లను సంప్రదించాల్సి ఉంది.