వైఎస్ జగన్ను కలిసిన లాజిస్టిక్ హబ్ నిర్వాసితులు | ys jagan mohan reddy reach yalamanchili in visakhapatnam | Sakshi
Sakshi News home page

వైఎస్ జగన్ను కలిసిన లాజిస్టిక్ హబ్ నిర్వాసితులు

Published Thu, Dec 10 2015 11:55 AM | Last Updated on Wed, Jul 25 2018 4:09 PM

ys jagan mohan reddy reach yalamanchili in visakhapatnam

విశాఖపట్నం : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి విశాఖపట్నం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం యలమంచిలి చేరుకున్నారు. జాతీయ రహదారిపై ఆయన పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో స్వాగతం పలికారు. అనంతరం ఆయన చింతపల్లిలో బాక్సైట్ వ్యతిరేక  సభలో వైఎస్ జగన్ పాల్గొనున్నారు. అంతకుముందు అనకాపల్లిలోని నూకాంబిక అమ్మవారిని వైఎస్ జగన్ దర్శించుకున్నారు. ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు.

అనంతరం వైఎస్ జగన్ను తుమ్మపాల కో ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బాధితులు కలిశారు. ఫ్యాక్టరీ ఆధునీకరించేలా చర్యలు తీసుకునేందుకు కృషి చేయాలని ఆయనకుకి కార్మికులు విజ్ఞప్తి చేశారు. అలాగే తమ బకాయిలు తీర్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తేవాలని కోరారు. అందుకు వైఎస్ జగన్ సానుకూలంగా స్పందించారు.

అలాగే వల్లూరు లాజిస్టిక్ హబ్ భూ నిర్వాసితులు కూడా వైఎస్ జగన్ను కలిశారు. తమకు నష్టపరిహారం చెల్లింపులో పక్షపాతం చూపుతున్నారంటూ వారు వైఎస్ జగన్ వద్ద ఆవేదన వక్తం చేశారు. ఈ అంశంలో అన్యాయం జరగకుండా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తానని వైఎస్ జగన్ భూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement