సీఎం చంద్రబాబు మాటలు నీటి మూటలంటూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గురువారం విశాఖపట్నంలోని సారగర తీరంలో నిరసన తెలిపారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయంటూ మండిపడ్డారు. ‘రాష్ట్ర ప్రభుత్వం హామీలు - నీటి మూటలు, గాలి బుడగలు... మంత్రులు రాజీనామాలు చేయండి - ఆంధ్రప్రదేశ్‌ను కాపాడండి’ అని రాసి ఉన్న బ్యానర్‌ను, నీటి మూటలను, గాలి బుడగలను చేత్తో పట్టుకుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ సమన్వయకర్త పోలా గురువులు, జాన్‌వెడ్లీ ఇతర నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
‘బాబు మాటలు నీటి మూటలు...'
Published Thu, Jun 2 2016 11:23 AM | Last Updated on Fri, Aug 10 2018 8:16 PM
Advertisement
Advertisement