– తొలి జాబితాలో 40 మందికి చోటు
–నేతల సమక్షంలో పూర్తయిన కసరత్తు
– సమర్థులైన అభ్యర్థుల ఎంపిక
– నేటితో ఉపసంహరణకు తెర
కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారరయ్యారు. తొలి విడతగా 40 మందితో కూడిన జాబితాను పార్టీ విడుదల చేసింది. సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యనేతలంతా సమావేశమై ఎంపిక ప్రక్రియను మంగళవారం రాత్రి పూర్తి చేశారు. ఆయా డివిజన్లలో ప్రజా సమస్యలతో మమేకమవుతూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్న అభ్యర్థులను సర్వేలు ద్వారా గుర్తించి ఎంపిక చేశారు. సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి జాబితాను మంగళవారం రాత్రి పత్రికలకు విడుదల చేశారు. అంతకుముందు స్థానిక హోటల్ సరోవర్ పోర్టికోలో విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సమక్షంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, సిటీ కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్, కాకినాడ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్‌తో కూడా నేతలంతా సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. సర్వే నివేదికలు, అభ్యర్థుల సమర్థత, ఇతర అంశాలపై చర్చించిన అనంతరం జాబితాను ప్రకటించారు.
నేడు ఉపసంహరణకు చివరి తేదీ...
నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. శనివారం నుంచి నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. అయితే బుధవారం ఉపసంహరణకు చివరితేదీ కావడం, ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో రంగంలోకి దిగిన ఎక్కువ మంది నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది.
వైఎస్సార్‌సీపీ అ«భ్యర్థులు
4 పలకా సూర్యకుమారి, 5 కనుసూది సరోజ, 6 అమలదాసు చిరంజీవి, 7 మారుకుర్తి బ్రమరాంబ,8 చిట్నీడి సత్యవతి, b9 కంపర రమేష్, 10 దాసరి సూర్యనారాయణమ్మ, 11 మెర్ల వరలక్ష్మీ, 12 బోదిరెడ్డి పుష్ప, 13 ఎమ్.డి.అస్గర్, 14 అంకడి సత్తిబాబు, 15 పినబోతు సత్తిబాబు, 17 అర్జెళ్ల వీర వెంకట సత్య విజయ్,19 సిద్దాంపు రాజు, 20 పేసంగి మోహన్, 21 బుర్రా విజయకుమారి, 22 మల్లా కిషోర్, 23 మీసాల శ్రీదేవి, 24 మీసాల ఉదయ్‌కుమార్, 25 బత్తిన చిన్నతల్లి, 26 మచ్చా లోకేష్‌వర్మ, 27 నారిపల్లి వెంకట రమణమ్మ, 29 శిరియాల చంద్రరావు, 30 రాగిరెడ్డి చంద్రకళ దీపిక, 31 బంగారు ఆదిలక్ష్మీ,32 రోకళ్ల సత్యనారాయణ, 34 పసుపులేటి వెంకటలక్ష్మీ, 35 బెండ విష్ణుమూర్తి, 36 బెజవాడ దుర్గాదేవి,37 కర్రి దేవిక, 38 యార్లగడ్డ పద్మజ, 39 బాదం మంగారత్నం, 40 బసవ సత్యకుమారి,
41 పెద్దిరెడ్డి రామలక్ష్మీ, ,43 కోకా వెంకటగిరి, 44 ఇంటి గంగారత్నం, 45 తిరుమలశెట్టి మేని, 46 ర్యాలి రాంబాబు, 47 రాజరపు వెంకటలక్ష్మీ, ,50 ఇజ్జపురెడ్డి శ్రీనివాస్