finalized
-
నేడో, రేపో బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు?
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చింది. రెండుమూడురోజుల్లో మూడు స్థానాలకు అభ్యర్థులను పార్టీ అధిష్టానం ఖరారు చేయనుంది. ఒక్కో స్థానానికి మూడేసి పేర్లతో జాబితాను రూపొందించి ఢిల్లీలోని జాతీయ ఎన్నికల కమిటీకి పంపించనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల ఉపాధ్యాయ, పట్టభద్రులు, వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలు వచ్చే ఏడాది మార్చి 29తో ఖాళీ కానున్నాయి.రాష్ట్రంలో బీజేపీకి 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు ఉండగా, వారిలో నలుగురు ఎంపీలు, ఏడుగురు ఎమ్మెల్యేలు కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల పరిధిలోనే గెలిచారు. దీంతో ఈ జిల్లాల పరిధిలోని ఒక టీచర్, ఒక గ్రాడ్యుయేట్ స్థానాలను కచ్చితంగా గెలవాలని రాష్ట్ర నాయకత్వం పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో బలమైన ఎమ్మెల్సీ అభ్యర్థులను నిలిపేలా చేస్తున్న కసరత్తు పూర్తి అయినట్టు పార్టీవర్గాల సమాచారం. శని, ఆదివారాల్లో ఈ మూడు స్థానాలకు ముగ్గురు చొప్పున అభ్యర్థులను (తొమ్మిది మందితో) ప్రతిపాదిస్తూ కేంద్ర ఎన్నికల కమిటీకి జాబితా పంపించనున్నారు.ప్రధానంగా ఉత్తర తెలంగాణ జిల్లాల పరిధిలోని ఉపాధ్యాయ, పట్టభద్రుల స్థానాల్లో నేతలు టికెట్ కోసం తీవ్రంగా పోటీ పడుతున్నారు. పార్టీకి అంతగా బలం లేదని భావిస్తున్న వరంగల్, ఖమ్మం, నల్లగొండ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ స్థానం నుంచి కూడా పలువురు టికెట్ ఆశిస్తున్నారు. ఇటీవల జరిగిన భేటీలో అభ్యర్థుల పేర్లపై ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలు, ఎన్నికలు జరగబోయే ఆయాజిల్లాల పార్టీ అధ్యక్షుల నుంచి కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, సంస్థాగత ప్రధానకార్యదర్శి చంద్రశేఖర్ తివారీ అభిప్రాయాలు సేకరించారు. ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఎంపీ ధర్మపురి అరవింద్, ఎమ్మెల్యే పాల్వాయి హరీశ్‌బాబు, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, కాసం వెంకటేశ్వర్లు, ప్రదీప్‌కుమార్‌లతో ఓ ప్రత్యేక కమిటీని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నియమించింది. పోటాపోటీగా ప్రయత్నాలు కరీంనగర్, మెదక్, నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల పట్టభద్రులు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాల్లో పోటీకి పార్టీనేతలతోపాటు, తటస్తులు కూడా టికెట్ ఆశిస్తున్నట్టు సమాచారం. ఈ రెండు స్థానాల్లో గ్రాడ్యుయేట్ స్థానం నుంచి టికెట్ కోసం మంచిర్యాలకు చెందిన ఎర్రబెల్లి రఘునాథరావు, సంగారెడ్డి జిల్లాకు చెందిన గోదావరి అంజిరెడ్డి, ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన గుజ్జుల రామకృష్ణారెడ్డి, దుగ్యాల ప్రదీప్‌కుమార్ ముందువరుసలో ఉన్నట్టుగా పార్టీనాయకులు చెబుతున్నారు. ఈ జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీగా పోటీకి విద్యాసంస్థల అధినేత మల్క కొమురయ్య, గత ఎన్నికల్లో ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మామిడి సుధాకర్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. ఖమ్మం, నల్లగొండ, వరంగల్ టీచర్ ఎమ్మెల్సీ టికెట్ కోసం పీఆర్టీయూ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు సర్వోత్తమరెడ్డి, సంఘ్ పరివార్‌కు చెందిన టీపీయూఎస్ నాయకుడు సాయిరెడ్డి తదితరుల పేర్లు వినిపిస్తున్నాయి. -
వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులు ఖరారు
సాక్షి,అమరావతి : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థులను గురువారం ఖరారు చేశారు. పార్టీ అభ్యర్థులుగా గొల్ల బాబూరావు, మేడా రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డిని ఎంపిక చేశారు. ముగ్గురు అభ్యర్థులను సీఎం జగన్ అభినందించారు. గురువారం అసెంబ్లీలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ముగ్గురు అభ్యర్థులు సీఎం జగన్‌ను కలిశారు. తమకు రాజ్యసభ అభ్యర్థులుగా అవకాశం కల్పించినందుకు వారు సీఎం జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సీఎం జగన్ రుణం తీర్చుకోలేనిది: మేడా రఘునాధరెడ్డి వైఎస్సార్సీపీ రాజ్యసభ అభ్యర్థిగా పోటీ చేసే అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రుణం తీర్చుకోలేనిది అని మేడా రాఘునాధరెడ్డి చెప్పారు. రాజ్యసభ అభ్యర్థులు రఘునాధరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, గొల్ల బాబూరావు గురువారం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబానికి, తమ కుటుంబానికి మంచి అనుబంధం ఉందని రఘునాధరెడ్డి చెప్పారు. వైఎస్సార్ మరణాంతరం వైఎస్ జగనే తమకు పెద్ద దిక్కని నమ్ముకున్నామన్నారు. సీఎం జగన్ తమపై పెట్టిన నమ్మకాన్ని వమ్ము చేయబోమని అన్నారు. ఊపిరి ఉన్నంతవరకు సీఎం జగన్ ఏది ఆదేశిస్తే అదే చేస్తామని చెప్పారు. ఆయన వచ్చే ఎన్నికల్లో ఏ బాధ్యత అప్పగించినా విజయవంతం అయ్యేందుకు కృషి చేస్తామన్నారు. ఉమ్మడి కడప, చిత్తూరు జిల్లాల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం కోసం కృషి చేస్తామని చెప్పారు. ఇది సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు: వైవీ సుబ్బారెడ్డి పారీ్టకి క్రమ శిక్షణతో పనిచేసిన తమకు ఇది సీఎం జగన్ ఇచ్చిన గుర్తింపు అని వైవీ సుబ్బారెడ్డి చెప్పారు. సీఎం జగన్ తమపై నమ్మకంతో ఇచ్చిన బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేస్తామని తెలిపారు. నమ్మిన వారిని ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్తారు : గొల్ల బాబూరావు వైఎస్సార్ కుటుంబాన్ని నమ్మిన వారిని ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఉన్నత స్థానాల్లోకి తీసుకెళ్తారని గొల్ల బాబూరావు అన్నారు. వైఎస్సార్ తర్వాత వైఎస్ జగన్‌ను నమ్మానని, కష్ట కాలంలో ఆయన వెంట అడుగులో అడుగేసి నడిచానని చెప్పారు. ‘అన్న నేను ఉన్నాను.. నిన్ను చూసుకుంటాను’ అని అన్నారని, అలాగే ఉన్నత స్థానం కోసం అవకాశం కల్పించారని తెలిపారు. తుది శ్వాస వరకు సీఎం జగన్ వెంట నడుస్తానని, వైఎస్సార్సీపీ గెలుపే ధ్యేయంగా పని చేస్తానని ఆయన చెప్పారు. -
1న మోదీ షెడ్యూల్ ఖరారు
సాక్షి, హైదరాబాద్: వచ్చేనెల 1న (అక్టోబర్) ప్రధాని నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన షెడ్యూల్ ఖరారైంది. ఆదివారం మధ్యాహ్నం 11.20 గంటలకు ఢిల్లీ ఎయిర్‌పోర్టు నుంచి ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో బయల్దేరి మధ్యాహ్నం 1.30 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడికి దగ్గరలోనే ఉన్న ఏవియేషన్ రీసెర్చ్ సెంటర్, రైల్వే, ఇతర శాఖల అభివృద్ధి కార్యక్రమాలు, ప్రాజెక్ట్‌లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. మధ్యాహ్నం 2.30 గంటలకు బేగంపేట నుంచి ఎంఐ–17 ప్రత్యేక హెలీకాప్టర్‌లో బయల్దేరి మధ్యాహ్నం 3.05 గంటలకు మహబూబ్‌నగర్‌కు చేరుకుంటారు. మహబూబ్‌నగర్ శివార్లలోని భూత్పూర్లో మధ్యాహ్నం 3.15 నుంచి 4.15 గంటల వరకు జరిగే బహిరంగసభలో పాల్గొంటారు. సాయంత్రం 4.30 గంటలకు మహబూబ్‌నగర్ హెలీపాడ్ నుంచి హెలీకాప్టర్‌లో 5.05 గంటలకు బేగంపేట ఎయిర్‌పోర్ట్‌కు చేరుకుంటారు. అక్కడి నుంచి 5.10 గంటలకు ఐఏఎఫ్ ప్రత్యేక విమానంలో ఢిల్లీకి తిరుగు పయనమవుతారు. 3న మరోసారి రాష్ట్రానికి మోదీ అక్టోబర్ 3న ప్రధాని మోదీ మరోసారి రాష్ట్రానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన నిజామాబాద్‌లో రోడ్‌షో, బహిరంగసభలో పాల్గొంటారు. ఈ సందర్భంగా పసుపుబోర్డుకు సంబంధించిన ప్రాంతీయ కార్యాలయాన్ని ప్రారంభించడంతోపాటు, వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. -
ఇంజనీరింగ్ ఫిజులను ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
-
టీఆర్ఎస్ అభ్యర్థుల ఖరారు!
సాక్షి, హైదరాబాద్: మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల గడువుకు కేవలం రెండ్రోజుల వ్యవధి మాత్రమే మిగిలి ఉండ టంతో అధికార టీఆర్ఎస్ పార్టీ శరవేగంగా పావులు కదుపుతోంది. రిజర్వేషన్ల జాబితా వెలువడిన మరుక్షణం నుంచే అభ్యర్థుల ఎంపికపై దృష్టి సారించిన టీఆర్ఎస్, బుధవారం రాత్రికే అభ్యర్థుల ఎంపిక ప్రక్రియను దాదాపు పూర్తి చేసింది. అభ్యర్థుల ఖరారు బాధ్యతను పార్టీ ఎమ్మెల్యేలకు పూర్తి స్థాయిలో అప్పగించడంతో వార్డులు, డివిజన్ల వారీగా రిజర్వేషన్ కేటగిరీలను దృష్టిలో పెట్టుకుని అభ్యర్థుల ఎంపిక కసరత్తు ముగింపు దశకు చేరుకుంది. పార్టీ టికెట్ల కోసం తీవ్ర స్థాయిలో పోటీ ఉండటంతో సర్వే లను ప్రామాణికంగా తీసుకుని ఎంపిక చేస్తున్నట్లు ఆశావహులకు ఎమ్మెల్యేలు సర్దిచెప్తున్నారు. టికెట్లు దక్కని నేత లు ఇతర పార్టీలోకి వెళ్లడమో, స్వతంత్రులుగా బరిలో నిలవడమో జరగకుండా ఎమ్మెల్యేలు బుజ్జగిస్తున్నారు. టికెట్ ఆశించి భంగపడిన ఔత్సాహికులు తమ నిర్ణయాన్ని ధిక్కరించకుండా అధికారిక అభ్యర్థి గెలుపు కోసం పనిచేసేలా నయానో భయానో ఒప్పిస్తున్నారు. మరోవైపు పార్టీ నియమించిన మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జులు కూడా ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయి పరిస్థితిని పార్టీ అధిష్టానానికి నివేదిస్తున్నారు. నేడు తెలంగాణ భవన్లో కీలక భేటీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి గురువారం టీఆర్ ఎస్ పార్టీ రాష్ట్ర కార్యాలయం తెలంగాణభవన్‌లో కీలక భేటీ జరగనుంది. ఉదయం 10 గంటలకు జరిగే సమావే శంలో పార్టీ అధినేత, సీఎం కె.చంద్రశేఖర్‌రావు పాల్గొం టారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలో గురువారం కేంద్ర పౌర విమానయాన శాఖ ఆధ్వర్యంలో జరిగే వింగ్స్ ఇండియా 2020 సన్నాహక సమావేశంలో పాల్గొనేందుకు వెళ్తున్నందున పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు తెలంగాణ భవ న్లో జరిగే సమావేశంలో పాల్గొనే అవకాశం కనిపించడం లేదు. కాగా గురువారం తెలంగాణభవన్‌లో జరిగే సమావేశానికి మున్సిపల్ ఎన్నికలు జరిగే అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను ఆహ్వానించారు. పార్టీ ఎమ్మెల్యేల ప్రాతినిధ్యం లేని నియోజకవర్గాలకు సంబంధించి నియోజకవర్గ ఇన్చార్జులకు ఆహ్వానం పంపారు. నామినేషన్ల దాఖలుకు తక్కువ సమయం ఉండటంతో బుధవారం రాత్రికే హైదరాబాద్‌కు చేరుకోవాల్సిందిగా పార్టీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జులకు పార్టీ కార్యాలయం టీఆర్ఎస్భవన్ నుంచి స్పష్టమైన సందేశం పంపారు. ‘తాండూరు’లో నేతల రాజీ.. తాండూరు మున్సిపాలిటీ పరిధిలో మాజీ మంత్రి పట్నం మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డికి నడుమ టికెట్ల పంపిణీపై నెలకొన్న వివాదాలకు ఫుల్స్టాప్ పడింది. గురువారం తెలంగాణభవన్‌లో కేసీఆర్‌తో జరిగే సమావే శానికి ఎమ్మెల్యే హోదాలో రోహిత్‌రెడ్డికి ఆహ్వానం అందిన నేపథ్యంలో, ఆలోపే ఇద్దరి మధ్య సయోధ్య కుదర్చాలని పార్టీ అధిష్టానం మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌కు బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే టికెట్ల పంపిణీపై వీరిద్దరి నడుమ బుధవారం రాజీ కుదరడంతో, తలసాని ఇద్దరిని వెంట బెట్టుకుని తెలంగాణభవన్‌కు వచ్చారు. తమ ఇద్దరి నడుమ విభేదాల్లేవని, కలసికట్టుగా పనిచేస్తామని వారితో ప్రకటన ఇప్పించారు. ఎమ్మెల్యేల చేతికి బీ ఫారాలు మున్సిపోల్స్‌లో పార్టీ అభ్యర్థులను ఎంపిక చేసే బాధ్యతను ఇప్పటికే స్థానిక ఎమ్మెల్యేలకు అప్పగించినందున, బీ ఫారాలనూ వారి చేతికే అందజేయాలని పార్టీ నిర్ణయించింది. అభ్యర్థుల ఎంపికలో విపక్ష పార్టీలు అనుసరిస్తున్న తీరు, ప్రచార వ్యూహంపై ఇప్పటికే వివిధ వర్గాల నుంచి సేకరించిన సమాచారం ఆధారంగా, టీఆర్ఎస్ అనుసరించాల్సిన ప్రచార వ్యూహంపై పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ సమావేశంలో ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకు దిశానిర్దేశం చేస్తారు. అభ్యర్థుల ఎంపికలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అనుసరిస్తున్న తీరునూ రాష్ట్రస్థాయిలో పార్టీ అధిష్టానం నిశితంగా పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో అభ్యర్థుల ఎంపికలో తడబడుతున్న కొందరు ఎమ్మెల్యేలకు సీఎం కేసీఆర్ సూచనలు చేసే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా పార్టీ ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి ఎమ్మెల్యేలు, ఇన్చార్జులకు ‘ఏ’ఫారాలు, ‘బీ’ఫారాలు అందజేస్తారు. -
గుండెల్ని కాల్చి తిన్నాడు..!
వాషింగ్టన్: చేసిన పాపం ఊరికే పోదంటారు. లైబీరియా అంతర్యుద్ధంలో వందలాది మందిని పొట్టనపెట్టుకుని అమెరికాకు పారిపోయివచ్చిన ఓ నర హంతకుడి విషయంలో అదే రుజువైంది. ఓ తీవ్రవాద సంస్థకు చెందిన కమాండర్ మొహమ్మద్ జబ్బతెహ్(51) గతాన్ని వెలికితీసిన అమెరికా అధికారులు అతన్ని కటకటాల వెనక్కు నెట్టారు. ఈ కేసు విచారణ సందర్భంగా అతని బాధితులు ఇచ్చిన వాంగ్మూలాలు విన్న న్యాయమూర్తులు సైతం విస్తుపోయారు. లైబీరియా నుంచి విచారణకు హాజరైన ఓ మహిళ(60) జడ్జీల ముందు వాంగ్మూలమిస్తూ.. ‘జంగిల్ జబ్బాగా పేరుగాంచిన మొహమ్మద్ జబ్బతెహ్, అతని సైనికులు మా ఊరిపై 1991లో దాడిచేశారు. నా భర్తతో పాటు, మరిది గుండెల్ని పెకలించి హత్యచేశారు. తర్వాత తినేందుకు వీలుగా ఆ గుండెలను వండాలని ఆదేశించారు’ అని కన్నీటి పర్యంతమయ్యారు. ‘ధైర్యం తెచ్చుకో. వెంటనే మంట రాజేసి ఆ గుండెల్ని వండకుంటే జబ్బతెహ్ నీతో పాటు నన్నూ చంపేస్తాడు’ ఆ దళ సభ్యుడు ఒకరు తనతో చెప్పాడని పేర్కొన్నారు. లైబీరియాలోని ఓ తీవ్రవాద సంస్థకు చెందిన జబ్బతెహ్ అత్యంత కిరాతకుడిగా ముద్రపడ్డాడు. 1991–98 మధ్య చెలరేగిన అంతర్యుద్ధంలో అతని సైనికులు వందలాది మందిని ఊచకోత కోశారు. చిన్నారులను సైనికులుగా మార్చడం, హత్యలు, బహిరంగ అత్యాచారాలు వంటి అకృత్యాలకు పాల్పడ్డారు. అనంతరం 1998లో అమెరికాకు శరణార్థిగా పారిపోయిన జబ్బతెహ్.. అక్కడే వివాహం చేసుకుని ఫిలడెల్ఫియాలో వ్యాపారవేత్తగా స్థిరపడ్డాడు. అయితే అమెరికాలో ప్రవేశించేముందు తన నేర చరిత్రను జబ్బతెహ్ అధికారులకు వెల్లడించలేదు. 2013లో జబ్బతెహ్ గతాన్ని గుర్తించిన హోంల్యాండ్ సెక్యూరిటీ అధికారులు.. అప్పట్లో జరిగిన మారణహోమం బాధితుల్ని సాక్షులుగా ప్రవేశపెట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. దీంతో పలువురు సాక్షుల్ని విచారించిన ధర్మాసనం.. అమెరికాలోకి అక్రమంగా ప్రవేశించిన కేసులో జబ్బతెహ్‌ను గతేడాది అక్టోబర్‌లో దోషిగా తేల్చింది. అమెరికా చట్టాలను ఉల్లంఘించిన నేపథ్యంలో జబ్బతెహ్‌కు 30 ఏళ్ల వరకూ జైలుశిక్ష విధించే అవకాశముందనీ, అలాగే అతణ్ని వెంటనే స్వదేశానికి పంపేస్తారని అధికారులు తెలిపారు. కాగా, ఈ కేసులో గురువారం ఇక్కడి కోర్టు జబ్బతెహ్‌కు శిక్ష ఖరారు చేయనుంది. -
టీటీడీ చైర్మన్‌గా సుధాకర్ యాదవ్?
సాక్షి ప్రతినిధి, తిరుపతి: టీటీడీ పాలక మండలి కూర్పుపై సీఎం చంద్రబాబు కసరత్తు ప్రారంభించారు. పార్టీలోని కీలక నేతలతో సమావేశమై నూతన ట్రస్ట్ బోర్డుపై చర్చిస్తున్నారు. దసరాలోపే పాలక మండలిని ప్రకటించాలని మొదట నిర్ణయించినా పలు కారణా లతో అది సాధ్యంకాలేదు. దీంతో ట్రస్ట్‌బోర్డు లేకుండానే శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఆదివారంతో ఇవి కూడా ముగియనున్నాయి. బ్రహ్మోత్సవాల లోపు పాలకమండలి నియామకం పూర్తయితే బ్రహ్మోత్సవాల సంబరం మరింత వేడుకగా ఉండేదన్న అభిప్రాయం వ్యక్తంకావడంతో సీఎం శుక్రవారం నుంచి దృష్టిసారించారు. తాజాగా వైఎస్సార్ జిల్లా మైదుకూరు టీడీపీ నేత పుట్టా సుధాకర్‌యాదవ్ పేరు వినిపిస్తోంది. టీటీడీ ట్రస్ట్ బోర్డు నూతన చైర్మన్‌గా సుధాకర్‌యాదవ్ పేరు ఖరారైనట్లేనని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ప్రసార మాధ్యమాల ద్వారా సీఎంకి సుధాకర్‌యాదవ్ ధన్యవాదాలు కూడా తెలిపారు. అయితే శుక్రవారం నుంచి మళ్లీ మదనపల్లికి చెందిన రవిశంకర్ పేరు వినిపిస్తోంది. కాగా, సుధాక ర్యాదవ్ పేరు ఖరారు విషయంలో మంత్రి యనమల రామకృష్ణుడు సీఎం దగ్గర వ్యూహాత్మకంగా చక్రం తిప్పారని వినికిడి. దీనికితోడు డీఎల్ రవీంద్రా రెడ్డికి మైదుకూరులో స్థానం కల్పించాలంటే సుధాకర్‌యాదవ్‌ను మరోచోటికి పంపించాలన్న ఆలోచన కూడా కారణమని ప్రచారం జరుగుతోంది. తెలంగాణ నుంచి నలుగురికి..: ఈసారి ట్రస్ట్ బోర్డు సభ్యుల్లో నలుగురు తెలం గాణ నేతలకు కూడా చోటు దక్కనున్నట్లు తెలుస్తోంది. చింతల రామచం ద్రారెడ్డి, సండ్ర వీరయ్యతో పాటు రేవంత్‌రెడ్డి, మరో నేత పేర్లు తెరమీదికొ స్తున్నాయి. అక్టోబర్ 2.. లేదా 5న నూతన పాలక మండలిని సీఎం అధికారి కంగా ప్రకటించే వీలుందని తెలుస్తోంది. -
సమర్థతను గుర్తించే అభ్యర్థిత్వాల ఖరారు
- అన్ని వర్గాలకూ సముచిత ప్రాధాన్యం - కాకినాడ మేయర్ పీఠం వైఎస్సార్సీపీదే - మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు కాకినాడ: ప్రజా సమస్యల పట్ల అవగాహన, పార్టీ పట్ల అంకిత భావంతో పనిచేయడంతోపాటు సమర్థతను గుర్తించి కాకినాడ కార్పొరేషన్ నుంచి పోటీచేసే అభ్యర్థులను ఎంపిక చేశామని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. స్థానిక సరోవర్ పోర్టికోలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ అన్ని కులాలు, వర్గాలకు టిక్కెట్ల కేటాయింపులో ప్రాధాన్యతనిచ్చామన్నారు. ప్రజలు, ప్రజా సంఘాలు, పార్టీ నేతలు, ఇతర వర్గాల నుంచి విస్తృత స్థాయిలో అభిప్రాయాలు సేకించిన తరువాతే అభ్యర్థుల జాబితాను ప్రకటించామన్నారు. ఓసీ కేటగిరిలో కాపులకు 17 స్థానాలతోపాటు బీసీ వర్గాల్లోని తూర్పు కాపులకు రెండు, శెట్టిబలిజలకు 4, మత్స్యకార వర్గాల్లోని అగ్నికుల క్షత్రియ, వాడబలిజ, జాలర్లకు ఐదు సీట్లు ఇచ్చామన్నారు. కమ్మ 2, ఎస్టీ 1, ఎస్సీలకు 4 ఇచ్చామన్నారు. బీసీల్లో వెనుకబడిన వర్గాల్లోని వెలమ, గవర, ఉప్పర, శెట్టిబలిజలకు తగిన రీతిలో సీట్లు కేటాయించామన్నారు. వైశ్య, ముస్లింలకు ఒకొక్కటి, రెడ్దిక కులానికి మూడు ఇచ్చామన్నారు. మూడున్నరేళ్ల తెలుగుదేశం పాలనలో అవినీతిమయమైందని, విజ్ఞులైన కాకినాడ ఓటర్లు ప్రభుత్వ అవినీతి, అసమర్థ విధానాలను గమనించి తమ ఓటు ద్వారా తెలుగుదేశం పాలకులకు బుద్ధి చెప్పాలని ధర్మాన పిలుపునిచ్చారు. బాబు వల్లే స్మార్ట్ సిటీ వెనుకడుగు... ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసమర్థ విధానాల వల్లే కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీలో కాకినాడ వెనుకబడిందని మాజీ మంత్రి ధర్మాన పేర్కొన్నారు. మూడేళ్ల కిందటే కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహించి ఉంటే కేంద్రం ప్రకటించిన స్మార్ట్ సిటీపై పాలకవర్గ పర్యవేక్షణ ఉండి అభివృద్ధిలో ఈ ప్రాంతం ముందడుగువేసి ఉండేదన్నారు. దురదృష్టవశాత్తు టీడీపీ ప్రభుత్వం స్థానిక సంస్థలకు ఎన్నికలు జరగకుండా అడ్డుతగులుతోందని, న్యాయస్థానం జోక్యంతో ఇప్పుడు తప్పనిసరి పరిస్థితుల్లో కాకినాడ ఎన్నికలకు ముందుకు వచ్చిందన్నారు. నిధులు వచ్చినా రాష్ట్ర ప్రభుత్వ వాటా విడుదల కాకపోవడం, నిధుల వినియోగ పత్రాలు సకాలంలో పంపించకపోవడం వల్ల కేంద్ర నిధులు విడుదల కావడంలేదన్నారు. జీవోల మాయాజాలం... తెలుగుదేశం ప్రభుత్వం అనేక రహస్య జీవోలను విడుదల చేస్తోందని ధర్మాన విమర్శించారు. అధికారంలోకి వచ్చిన తరువాత 1500లకు పైగా ఇలాంటి జీవోలు విడుదలయ్యాయని, దేశంలో ఇలా ఎక్కడా జరగలేదన్నారు. ప్రభుత్వ నిర్ణయాలు పారదర్శకంగా ఉండాలని, పౌరుల హక్కులకు భంగం కలగకూడదని, సమాచార హక్కు చట్టాన్ని కేంద్రం తెచ్చినా దానికి కూడా దొరకకుండా జీవోలు ఉంటున్నాయన్నారు. వైఎస్సార్సీపీని గెలిపించండి... విజ్ఞులైన కాకినాడ ఓటర్లు రానున్న కార్పొరేషన్ ఎన్నికల్లో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మాజీ మంత్రి ధర్మాన విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో పార్టీ పట్ల ఎంతో ఆదరణ కనిపిస్తోందన్నారు. ఖచ్చితంగా మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోగలమన్న ధీమాను ధర్మాన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున పోటీచేస్తున్న పలువురు అభ్యర్థులకు నాయకులు ధర్మాన, బొత్స బి ఫారాలు అందజేశారు. విలేకర్ల సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, ఎమ్మెల్సీ పిల్లి సుభాష్‌చంద్రబోస్, కాకినాడ పార్లమెంట్ కో ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్, కాకినాడసిటీ కో–ఆర్డినేటర్లు మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్, రాష్ట్ర ప్రచార కమిటీ ప్రధాన కార్యదర్శి రావూరి వెంకటేశ్వరరావు, రాష్ట్ర బీసీసెల్ కార్యదర్శి బొబ్బిలి గోవిందు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ అభ్యర్థుల జాబితా ఖరారు
– తొలి జాబితాలో 40 మందికి చోటు –నేతల సమక్షంలో పూర్తయిన కసరత్తు – సమర్థులైన అభ్యర్థుల ఎంపిక – నేటితో ఉపసంహరణకు తెర కాకినాడ: కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీచేసే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఖరారరయ్యారు. తొలి విడతగా 40 మందితో కూడిన జాబితాను పార్టీ విడుదల చేసింది. సమర్థులైన అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు ముఖ్యనేతలంతా సమావేశమై ఎంపిక ప్రక్రియను మంగళవారం రాత్రి పూర్తి చేశారు. ఆయా డివిజన్లలో ప్రజా సమస్యలతో మమేకమవుతూ ప్రజలతో సత్సంబంధాలు ఏర్పరుచుకున్న అభ్యర్థులను సర్వేలు ద్వారా గుర్తించి ఎంపిక చేశారు. సామాజిక సమతుల్యాన్ని పాటిస్తూ అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ పూర్తి చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎంపీ విజయసాయి రెడ్డి జాబితాను మంగళవారం రాత్రి పత్రికలకు విడుదల చేశారు. అంతకుముందు స్థానిక హోటల్ సరోవర్ పోర్టికోలో విజయసాయి రెడ్డి, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, జిల్లా పరిశీలకులు, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు, చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కరరెడ్డి సమక్షంలో జిల్లా పార్టీ అధ్యక్షుడు కురసాల కన్నబాబు, సిటీ కో–ఆర్డినేటర్లు ద్వారంపూడి చంద్రశేఖరరెడ్డి, ముత్తా శశిధర్, కాకినాడ పార్లమెంట్ కో–ఆర్డినేటర్ చలమలశెట్టి సునీల్‌తో కూడా నేతలంతా సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపికపై సుదీర్ఘంగా చర్చించారు. సర్వే నివేదికలు, అభ్యర్థుల సమర్థత, ఇతర అంశాలపై చర్చించిన అనంతరం జాబితాను ప్రకటించారు. నేడు ఉపసంహరణకు చివరి తేదీ... నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ బుధవారంతో ముగియనుంది. శనివారం నుంచి నామినేషన్లను ఉపసంహరించుకోనున్నారు. అయితే బుధవారం ఉపసంహరణకు చివరితేదీ కావడం, ఆయా రాజకీయ పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించడంతో రంగంలోకి దిగిన ఎక్కువ మంది నామినేషన్లు ఉపసంహరించుకునే అవకాశం ఉంది. దీంతో ప్రధాన పార్టీల అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. వైఎస్సార్సీపీ అ«భ్యర్థులు 4 పలకా సూర్యకుమారి, 5 కనుసూది సరోజ, 6 అమలదాసు చిరంజీవి, 7 మారుకుర్తి బ్రమరాంబ,8 చిట్నీడి సత్యవతి, b9 కంపర రమేష్, 10 దాసరి సూర్యనారాయణమ్మ, 11 మెర్ల వరలక్ష్మీ, 12 బోదిరెడ్డి పుష్ప, 13 ఎమ్.డి.అస్గర్, 14 అంకడి సత్తిబాబు, 15 పినబోతు సత్తిబాబు, 17 అర్జెళ్ల వీర వెంకట సత్య విజయ్,19 సిద్దాంపు రాజు, 20 పేసంగి మోహన్, 21 బుర్రా విజయకుమారి, 22 మల్లా కిషోర్, 23 మీసాల శ్రీదేవి, 24 మీసాల ఉదయ్‌కుమార్, 25 బత్తిన చిన్నతల్లి, 26 మచ్చా లోకేష్‌వర్మ, 27 నారిపల్లి వెంకట రమణమ్మ, 29 శిరియాల చంద్రరావు, 30 రాగిరెడ్డి చంద్రకళ దీపిక, 31 బంగారు ఆదిలక్ష్మీ,32 రోకళ్ల సత్యనారాయణ, 34 పసుపులేటి వెంకటలక్ష్మీ, 35 బెండ విష్ణుమూర్తి, 36 బెజవాడ దుర్గాదేవి,37 కర్రి దేవిక, 38 యార్లగడ్డ పద్మజ, 39 బాదం మంగారత్నం, 40 బసవ సత్యకుమారి, 41 పెద్దిరెడ్డి రామలక్ష్మీ, ,43 కోకా వెంకటగిరి, 44 ఇంటి గంగారత్నం, 45 తిరుమలశెట్టి మేని, 46 ర్యాలి రాంబాబు, 47 రాజరపు వెంకటలక్ష్మీ, ,50 ఇజ్జపురెడ్డి శ్రీనివాస్ -
ఎన్నికల నిఘావేదిక సమావేశం
-
తునికాకు టెండర్ల ఖరారు
గతేడాది కంటే అధిక రేటు చింతూరు (రంపచోడవరం) : ఏజెన్సీ ప్రాంత గిరిజనులు కాసుల పంటగా భావించే తునికాకు (బీడీ ఆకు) టెండర్లు ఖరారయ్యాయి. చింతూరు అటవీ డివిజన్లోని ఐదు రేంజ్లలోని తొమ్మిది యూనిట్లకు గతేడాది కంటే అధికంగా రేటు లభించినట్టు చింతూరు డీఎఫ్‌వో ఎంవీ ప్రసాదరావు బుధవారం తెలిపారు. తునికాకు సేకరణకు ఏటా మార్చిలో ఫ్రూనింగ్ పనులు, ఏప్రిల్, మే నెలల్లో కోతలు జరుగుతాయి. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు 1.52 పైసల చొప్పున అటవీశాఖ కార్మికులకు చెల్లించింది. కూనవరం రేంజ్ పరిధిలోని చింతూరు ఏడుగురాళ్లపల్లి యూనిట్లో నాణ్యమైన తునికాకు లభిస్తుండడంతో కాంట్రాక్టర్లు ఈ యూనిట్‌ను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. కాగా తునికాకు సేకరణ అనంతరం కార్మికులకు బకాయిపడిన 2013 నుంచి చెల్లించక పోవడంపై కార్మికులతో పాటు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెయ్యి కట్టల తునికాకును ఒక స్టాండర్డ్ బ్యాగ్‌గా పరిగణించి టెండర్లు ఖరారు చేస్తారు. చింతూరు అటవీ డివిజన్లోని తొమ్మిది యూనిట్లకు ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం, ఖరారైన టెండర్ల వివరాలు యూనిట్లు లక్ష్యం స్టాండర్డ్ బ్యాగుల్లో – స్టాండర్డు బ్యాగుకు ఖరారైన రేటు చింతూరు – 4000 – రూ.14,116 కుందులూరు – 3500 – రూ.12,567 లక్కవరం – 2700 – రూ.14,116 ఏడుగురాళ్లపల్లి – 7300 – రూ.15,000 కూనవరం – 2400 – రూ.11,369 మురుమూరు – 1200 – రూ.13,179 వీఆర్‌పురం – 1800 – రూ.13,791 నెల్లిపాక – 3100 – రూ.11,299 మాధవరావుపేట – 3065 – రూ.15,340 -
ఏపీ ఎంబీఏ, ఎంసీఏ ఫీజులు ఖరారు
-
కమళదళానికి కొత్త కమిటీలు
మండల అధ్యక్షులు ఖరారు ఓట్ల ప్రాతిపదికన కొత్తగా కమిటీల ఏర్పాటు సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారతీయ జనతా పార్టీ మండల స్థాయి కమిటీల ఏర్పాటుకు అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఉపక్రమించారు. ఇటీవల జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించిన ఆయన.. తాజాగా మండల పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు. ఇప్పటికే కొన్ని మండలాలకు కార్యవర్గాల్ని ప్రకటించినప్పటికీ.. మిగిలిన మండలాలకు సైతం కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం 12 మంది అధ్యక్షుల్ని ఖరారు చేశారు. వీరిలో చిటికెల వెంకటయ్య (శంషాబాద్), కొప్పుల సత్యనారాయణ రెడ్డి (వికారాబాద్), వెంకటేష్‌గౌడ్ (బంట్వారం), పి.సంజీవరెడ్డి(తాండూరు), రాజుకుమార్ కులకర్ణి (బషీరాబాద్), దోసాడ మల్లేష్ (నవాబ్‌పేట్), క్యామ పద్మనాభం (మొయినాబాద్), వి.పెంటయ్య (పరిగి), ఎండీ జమీల్ (దోమ) ఉన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఓట్ల ప్రాతిపదికన కొత్త కమిటీలకు శ్రీకారం చుట్టారు. 15 వేలు దాటిన పంచాయతీగానీ, బూత్ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో జయంతి చంద్రశేఖర్ (నాగారం), సుర్జిత్ (నిజాంపేట్), ఆంగోత్ కల్యాణ్ (అన్నోజిగూడ) కమిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు. -
జిల్లా నుంచి ‘దివ్యదర్శనం’ రూట్ల ఖరారు
కడప కల్చరల్ : తిరుమల–తిరుపతి దేవస్థానాలు, రాష్ట్ర దేవాదాయశాఖ, ధర్మపరిరక్షణ ట్రస్టుతో కలిసి త్వరలో నిర్వహించనున్న దివ్యదర్శనం యాత్రలకు జిల్లా నుంచి రూట్లు ఖరారు అయ్యాయి. జిల్లా దేవాదాయశాఖ అధికారులు పలు కసరత్తుల అనంతరం ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర కమిషనర్‌కు అందజేశారు. తుది పరిశీలన అనంతరం వాటినే ఖరారు చేసినట్లు సమాచారం. ఆ వివరాలిలా ఉన్నాయి.∙ తిరుమల–తిరుపతి దేవస్థానాల యాజమాన్యం రాష్ట్ర దేవాదాయశాఖతో కలిసి ప్రతి సంవత్సరం జిల్లాకు చెందిన పది వేల మందికి రాష్ట్రంలోని ఐదు సుప్రసిద్ధ ఆలయాలకు ఉచితంగా యాత్రను నిర్వహించనుంది. బస్సులు, నాలుగు రోజులపాటు వసతి, మూడు పూటల భోజనం అన్నీ నిర్వాహకులే భరించనున్నారు. ఈ మేరకు జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాష్ట్ర అధికారులకు జిల్లా యాత్రల రూట్‌మ్యాప్‌ను పంపారు. అధికారులు వాటిని అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదటి రూట్æ(రాయచోటి నుంచి).. జిల్లా నుంచి దివ్య దర్శనం యాత్రలకు రెండు రూట్లను ఖరారు చేశారు. యాత్ర ప్రారంభమయ్యాక సోమవారం రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో ఉదయం 7 గంటల్లోపు స్వామిని దర్శించుకుంటారు. అల్పాహారం అనంతరం కాణిపాకం ఆలయానికి ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. కాణిపాకం చేరుకుని 10.30 గంటల్లోగా దర్శనం ముగించుకుని మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుతుంది. మధ్యాహ్న భోజన అనంతరం 3 గంటల్లోగా స్వామిని దర్శించుకుని రాత్రి విజయవాడకు చేరనున్నారు. రాత్రి అక్కడే గడిపి మంగళవారం ఉదయం 7.00 గంటల్లోగా కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.00 గంటకు అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం రాత్రి 8.30 గంటలకు ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి బుధవారం ఉదయం 7.00 గంటల్లోగా స్వామిని దర్శించుకుని అల్పాహారం స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. అక్కడి నుంచి దారిలో మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుని రాత్రి తిరుపతికి చేరనున్నారు. రాత్రి అక్కడే గడిపి గురువారం ఉదయం 10.00 గంటల్లోగా తిరుమలేశుని దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్న భోజనంతరం తిరిగి రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి చేరుకోనున్నారు. రెండవ రూట్ (దేవునికడప నుంచి).. రెండవ రూట్లో కూడా సోమవారం నాడే యాత్ర ప్రారంభం కానుంది. దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని ఉదయం 7.00 గంటల్లోగా దర్శించుకుని అల్పాహారం అనంతరం మధ్యాహ్నం శ్రీశైలం ఆలయానికి చేరి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. స్వామి దర్శనం అనంతరం రాత్రి విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయానికి చేరనున్నారు. మంగళవారం ఉదయం బయలుదేరి మధ్యాహ్నం అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయానికి చేరనున్నారు. దర్శనం అనంతరం మధ్యాహ్న భోజనం స్వీకరించి రాత్రి ద్వారకా తిరుమలకు చేరుకుంటారు. బుధవారం ఉదయం స్వామి దర్శనం అనంతరం మధ్యాహ్నం గుంటూరు పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం అదే దారిలో ఉన్న మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుంటారు. రాత్రి శ్రీకాళహస్తికి చేరుకుంటారు. గురువారం ఉదయం స్వామిని దర్శించుకుని 10.00 గంటలకు తిరుమలకు చేరనున్నారు. మధ్యాహ్నం స్వామిని దర్శించుకుని సాయంత్రం కడపకు చేరనున్నారు. -
శిరీషకే జిల్లా దేశం కిరీటం !
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం :తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షురాలిగా శిరీష పేరు దాదాపు ఖరారైపోయింది. ఈ నెల 21న పార్టీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారికంగా ప్రకటించడం కేవలం లాంఛనమేనని తెలుస్తోంది. పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామసుందర శివాజీకి కుమార్తె అయిన ఆమె ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఆమె జిల్లాకు రానున్నారు. గురువారం హైదరాబాద్‌లో సీఎంను కలిసి ఆయన ఆశీస్సులు పొందిన తరువాత జిల్లాకు చేరుకోనున్నట్టు తెలుస్తోంది. జిల్లాలో తొలిసారి ఓ మహిళకు పార్టీ అధ్యక్షురాలిగా అవకాశం దక్కడం విశేషం. స్వాతంత్య్రసమరయోధుడు గౌతు లచ్చన్నకు మనుమరాలిగా, మొన్నటి ఎన్నికల్లో తండ్రి శివాజీ గెలుపునకు నియోజకవర్గం మొత్తం తిరిగిన వ్యక్తిగా ఆమెకు పేరుంది. జిల్లాలోని మంత్రి, ఎమ్మెల్యేలు సహా రాష్ట్ర పరిశీలకులు, ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత, పార్టీ అధిష్టానం పంపించిన కీలక నేతలు, విప్, కళా వెంకట్రావు అందరూ ఏకగ్రీవంగా శిరీష పేరును ఖరారు చేయడం, ఇదే విషయాన్ని సీఎంకు తెలియజేయడం తెలిసిందే. నెగ్గుకొస్తారా? జిల్లా పార్టీలో కుమ్ములాటలు, వర్గపోరు ఎక్కువగానే ఉంది. పదేళ్ల తరువాత పార్టీ అధికారంలోకి వచ్చినా తమకేమీ ఒరిగేది లేదని, అధికారులు నేతల చెప్పుచేతల్లో ఉంటున్నా కొంతమందికే లబ్ధికలుగుతోందని తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాదాపు జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ ఇలాంటి పరిస్థితి కొనసాగుతోంది. నర్శింగ్ కళాశాల ఏర్పాటువిషయమై విప్, మంత్రి మధ్య సయోధ్య లేకపోవడం, రాజాంలో మాజీ స్పీకర్ ప్రతిభాభారతి, సీనియర్‌నేత కళావెంకటరావుల మధ్య వర్గపోరువల్ల కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. టెక్కలి నియోజకవర్గానికే మంత్రి అచ్చెన్న పరిమితమైపోయారనీ, ఎంపీ స్థానికంగా అందుబాట్లో ఉండలేకపోతున్నారని దేశం తమ్ముళ్లు శని, ఆదివారాల్లో జరిగిన కార్యక్రమాల్లో గగ్గోలు పెట్టారు. ఈ నేపథ్యంలో తొలిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్న శిరీష ఎలా నెగ్గుకొస్తారన్నది వేచిచూడాలి. ఈమె వెనుక తండ్రి శివాజీ మార్కు రాజకీయం నడుస్తుందా అన్నది కూడా పార్టీలో చర్చజరుగుతోంది. రోజుకోపేరుతో సర్వేపై విమర్శలు శ్రీకాకుళం : ఇదిలా ఉండగా జిల్లా కేంద్రంలో అధ్యక్ష పదవికోసం చర్చలు జరిగి... కార్యకర్తల అభిప్రాయాలను తెలుసుకున్న ఇన్చార్జి మంత్రి పరిటాల సునీత జిల్లా అధ్యక్షుని పేరును ముఖ్యమంత్రి ప్రకటిస్తారని చెప్పి వెళ్లిపోయిన తరువాత పార్టీ అధిష్టానం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా సర్వేను సోమవారం కూడా కొనసాగించడాన్ని కేడర్ తప్పుపడుతోంది. మూడు రోజుల క్రితం గౌతు శ్యామసుందరశివాజీ, చౌదరి నారాయణమూర్తి, కలిశెట్టి అప్పలనాయుడుల పేర్లతో సర్వే జరిపారని, ఆదివారం ఓ పక్క ఎన్నిక ప్రక్రియ జరుగుతుండగా గౌతు శివాజీ, చౌదరి బాబ్జితో పాటు బగ్గు రమణమూర్తిలలో ఎవరికి అధ్యక్ష పదవి ఇస్తే బాగుంటుందని కార్యకర్తల నుంచి సమాచారాన్ని సేకరించారని పలువురు నాయకులు, కార్యకర్తలు చెబుతున్నారు. ఈ పేర్లలో దేనినీ కాకుండా గౌతు శిరీషను ఎంపిక చేసినట్టు పరోక్షంగా చెప్పిన విషయాన్ని ఈ సందర్భంగా టీడీపీ నాయకులు గుర్తు చేస్తున్నారు. రాష్ట్రస్థాయిలో శిరీష పేరును ప్రకటిస్తారని భావించగా సోమవారం సర్వేను కొనసాగిస్తూ గౌతు శిరీష, చౌదరి బాబ్జీలలో ఎవరికిస్తే సమంజసంగా ఉంటుందని అడగడం పట్ల టీడీపీ కేడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. జిల్లా మంత్రి, ప్రభుత్వ విప్‌తో పాటు పార్లమెంట్ సభ్యుడు, జెడ్పీ చైర్మన్, ఐదుగురు శాసనసభ్యులు, మున్సిపల్ చైర్మన్లు నుంచి జిల్లా ఇన్చార్జి మంత్రి, ఇద్దరు రాష్ట్ర పార్టీ పరిశీలకులు అభిప్రాయాలను సేకరించి ఎన్నిక ప్రక్రియను పూర్తి చేసిన తరువాత సర్వే కొనసాగిస్తుండడం ఎవరిపై నమ్మకం లేకపోవడానికి కారణమని అధిష్టానాన్ని నిలదీస్తున్నారు. -
కాంగ్రెస్ నుంచి వలస వెళ్తున్న ఎమ్మెల్యేలు