జిల్లా నుంచి ‘దివ్యదర్శనం’ రూట్ల ఖరారు | divyadarsanam ' Routes to be finalized | Sakshi
Sakshi News home page

జిల్లా నుంచి ‘దివ్యదర్శనం’ రూట్ల ఖరారు

Published Sun, Jul 24 2016 12:29 AM | Last Updated on Mon, Sep 4 2017 5:54 AM

జిల్లా నుంచి ‘దివ్యదర్శనం’ రూట్ల ఖరారు

జిల్లా నుంచి ‘దివ్యదర్శనం’ రూట్ల ఖరారు


కడప కల్చరల్‌ :
తిరుమల–తిరుపతి దేవస్థానాలు, రాష్ట్ర దేవాదాయశాఖ, ధర్మపరిరక్షణ ట్రస్టుతో కలిసి త్వరలో నిర్వహించనున్న దివ్యదర్శనం యాత్రలకు జిల్లా నుంచి రూట్లు ఖరారు అయ్యాయి. జిల్లా దేవాదాయశాఖ అధికారులు పలు కసరత్తుల అనంతరం ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర
కమిషనర్‌కు అందజేశారు. తుది పరిశీలన అనంతరం వాటినే ఖరారు చేసినట్లు సమాచారం. ఆ వివరాలిలా ఉన్నాయి.∙ తిరుమల–తిరుపతి దేవస్థానాల యాజమాన్యం రాష్ట్ర దేవాదాయశాఖతో కలిసి ప్రతి సంవత్సరం జిల్లాకు చెందిన పది వేల మందికి రాష్ట్రంలోని ఐదు సుప్రసిద్ధ  ఆలయాలకు ఉచితంగా యాత్రను నిర్వహించనుంది. బస్సులు, నాలుగు రోజులపాటు వసతి, మూడు పూటల భోజనం అన్నీ నిర్వాహకులే భరించనున్నారు.  ఈ మేరకు జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రాష్ట్ర అధికారులకు జిల్లా యాత్రల రూట్‌మ్యాప్‌ను పంపారు. అధికారులు వాటిని అంగీకరించినట్లు తెలుస్తోంది.
మొదటి రూట్‌æ(రాయచోటి నుంచి)..
జిల్లా నుంచి దివ్య దర్శనం యాత్రలకు రెండు రూట్లను ఖరారు చేశారు. యాత్ర ప్రారంభమయ్యాక సోమవారం రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో ఉదయం 7 గంటల్లోపు స్వామిని దర్శించుకుంటారు.  అల్పాహారం అనంతరం  కాణిపాకం ఆలయానికి ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. కాణిపాకం చేరుకుని 10.30 గంటల్లోగా దర్శనం ముగించుకుని మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుతుంది. మధ్యాహ్న భోజన అనంతరం 3 గంటల్లోగా స్వామిని దర్శించుకుని రాత్రి విజయవాడకు చేరనున్నారు. రాత్రి అక్కడే గడిపి
మంగళవారం ఉదయం 7.00 గంటల్లోగా కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.00 గంటకు అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం రాత్రి 8.30 గంటలకు ద్వారకా  తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి బుధవారం ఉదయం 7.00 గంటల్లోగా స్వామిని దర్శించుకుని అల్పాహారం స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. అక్కడి నుంచి దారిలో మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుని రాత్రి  తిరుపతికి చేరనున్నారు. రాత్రి అక్కడే గడిపి గురువారం ఉదయం  10.00 గంటల్లోగా తిరుమలేశుని దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్న భోజనంతరం తిరిగి రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి  చేరుకోనున్నారు.
రెండవ రూట్‌ (దేవునికడప నుంచి)..
రెండవ రూట్‌లో కూడా సోమవారం నాడే యాత్ర ప్రారంభం కానుంది. దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని ఉదయం 7.00 గంటల్లోగా దర్శించుకుని అల్పాహారం అనంతరం మధ్యాహ్నం శ్రీశైలం ఆలయానికి చేరి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు.
స్వామి దర్శనం అనంతరం రాత్రి విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయానికి చేరనున్నారు. మంగళవారం ఉదయం బయలుదేరి మధ్యాహ్నం  అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయానికి చేరనున్నారు. దర్శనం అనంతరం మధ్యాహ్న భోజనం స్వీకరించి  రాత్రి ద్వారకా తిరుమలకు చేరుకుంటారు. బుధవారం ఉదయం స్వామి దర్శనం అనంతరం మధ్యాహ్నం గుంటూరు పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం అదే దారిలో ఉన్న మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుంటారు. రాత్రి శ్రీకాళహస్తికి చేరుకుంటారు.  గురువారం ఉదయం స్వామిని దర్శించుకుని 10.00 గంటలకు
తిరుమలకు చేరనున్నారు. మధ్యాహ్నం స్వామిని దర్శించుకుని సాయంత్రం కడపకు చేరనున్నారు. 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement