routes
-
కోల్‌కతాలో ట్రామ్లకు సెలవు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్ రాజధాని కోల్‌కతా అనగానే వెంటనే గుర్తుకొచ్చేవి ట్రామ్‌లు. రహదారుల మధ్యలో పట్టాల మీదుగా పరుగులు తీసే ట్రామ్‌ల్లో ప్రయాణించడం ఒక మధురమైన జ్ఞాపకం. నగరంలో 150 సంవత్సరాలుగా కొనసాగుతున్న ట్రామ్‌ల సేవలను త్వరలో పూర్తిగా నిలిపివేయాలని నిర్ణయించినట్లు పశ్చిమ బెంగాల్ రవాణా శాఖ మంత్రి స్నేహశిష్ చక్రబర్తి వెల్లడించారు. ఆయన తాజాగా మీడియాతో మాట్లాడారు. ఆధునిక కాలంలో నగరంలో వేగవంతమైన ప్రయాణ సాధనాల అవసరం నానాటికీ పెరుగుతోందని అన్నారు. తక్కువ వేగంతో ప్రయాణించే ట్రామ్‌ల వల్ల రోడ్లలో ఇతర వాహనాల రాకపోకలకు ఇబ్బంది కలుగుతోందని, తరచుగా ట్రాఫిక్ జామ్‌ల వల్ల జనం తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారని చెప్పారు. అందుకే ట్రామ్‌ల సేవలు నిలిపివేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలిపారు. ‘‘ట్రామ్‌లు 1873 నుంచి కోల్‌కతా సంస్కృతిలో భాగంగా ఉన్నాయి. కానీ నగరంలో వాహనాల రద్దీ భారీగా పెరిగిపోతోంది. అందుకే ఇకపై ట్రామ్‌లను నడపలేం’’ అన్నారు.పలు మార్గాల్లో వాటినిప్పటికే పూర్తిగా నిలిపేసినట్లు గుర్తుచేశారు. మిగిలిన మార్గాల్లోనూ ముగింపు పలుకుతున్నట్లు వివరించారు. ప్రజలకు ఇబ్బందులు తప్పించాలన్న ఉద్దేశంతోనే కఠిన నిర్ణయం తీసుకోవాల్సి వచి్చందని వివరణ ఇచ్చారు. కేవలం మైదాన్– ఎస్ప్లాండే హెరిటేజ్ మార్గంలో మాత్రమే ఇకపై ట్రామ్‌లు నడుస్తాయని చెప్పారు. -
రెండో దశ మెట్రో రూట్ చేంజ్!
సాక్షి, హైదరాబాద్: మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులు చేసే అంశంపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ తాజాగా కసరత్తు ప్రారంభించింది. ప్రధానంగా బీహెచ్ఈఎల్– లక్డికాపూల్ (27 కి.మీ)మార్గం ఏర్పాటుపై గతంలో ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ రూపొందించిన నివేదికలో సూచించిన అలైన్మెంట్లో స్వల్ప మార్పులు చేసే అవకాశాలున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఈ రూట్లో ఎస్ఆర్డీపీ పథకం కింద నూతనంగా ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు, లింక్దారులు ఏర్పాటు చేసిన నేపథ్యంలో మెట్రో మార్గాన్ని ఫ్లైఓవర్ల వద్ద అత్యంత ఎత్తున ఏర్పాటు చేయడం అనేక వ్యయ ప్రయాసలతో కూడుకోవడమే కారణమని సమాచారం. గతంలో ఈ మార్గానికి సంబంధించి సమగ్ర ప్రాజెక్టు నివేదికను రెండేళ్ల క్రితం ఢిల్లీ మెట్రోరైలు కార్పొరేషన్ సిద్ధం చేసిన విషయం విదితమే. బీహెచ్ఈఎల్– లక్డికాపూల్ మెట్రో రూట్ ఇలా.. ఈ మార్గాన్ని బీహెచ్ఈఎల్, మదీనాగూడ, హఫీజ్‌పేట్, కొండాపూర్, గచ్చిబౌలి, రాయదుర్గం, కొత్తగూడ జంక్షన్, షేక్‌పేట్, రేతిబౌలి, మెహిదీపట్నం, లక్డికాపూల్ రూట్లో ఏర్పాటు చేయాలని గతంలో ప్రతిపాదించారు. ఈ రూట్లోనే తాజాగా జీహెచ్ఎంసీ, హెచ్ఎండీఏల ఆధ్వర్యంలో పలు ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు ఏర్పాటు చేయడంతో మెట్రో మార్గానికి అడ్డొచ్చే పరిస్థితులు నెలకొన్నాయి. వీటిని దాటుతూ మెట్రోను ఏర్పాటు చేసేందుకు అధిక వ్యయం కావడం, ప్రధాన రహదారిపై పనులు చేపట్టేందుకు వీలుగా రైట్ఆఫ్ వే ఏర్పాటు చేయడం వీలుకానందున మెట్రో మార్గంలో స్వల్ప మార్పులు అనివార్యమని హెచ్ఎంఆర్ వర్గాలు భావిస్తున్నట్లు సమాచారం. మార్పులపై మెట్రో వర్గాల మౌనం.. మెట్రో రెండోదశ మార్గంలో మార్పులు చేర్పులపై హైదరాబాద్ మెట్రో రైలు సంస్థ (హెచ్ఎంఆర్) ఉన్నతాధికారులను ‘సాక్షి’ ప్రతినిధి సంప్రదించగా.. ఈ అంశం తమ పరిధిలోది కాదని.. మున్సిపల్ పరిపాలన శాఖ పరిశీలనలో ఉందని స్పష్టంచేశారు. ఈ అంశంపై మాట్లాడేందుకు నిరాకరించడం గమనార్హం. డీఎంఆర్సీ సమగ్ర ప్రాజెక్టు నివేదిక అంశాలివే.. బీహెచ్ఎఈఎల్–లక్డికాపూల్ మార్గంలో 22 మెట్రో స్టేషన్ల ఏర్పాటు. బీహెచ్ఈఎల్లో మెట్రో డిపో ఏర్పాటుకు 70 ఎకరాల స్థలం కేటాయింపు. రెండోదశ మెట్రో రైళ్లకు సిగ్నలింగ్ వ్యవస్థ, కోచ్‌ల ఎంపిక,ట్రాక్‌ల నిర్మాణం. భద్రతా పరమైన చర్యలు. టికెట్ ధరల నిర్ణయం. రెండోదశ ప్రాజెక్టుకు నిధుల సమీకరణ. వివిధ రకాల ఆర్థిక నమూనాల పరిశీలన. ప్రాజెక్టును పూర్తిచేయాల్సిన గడువు, దశలవారీగా చేపట్టాల్సిన షెడ్యూలు ఖరారు. (చదవండి: పోలీసు కొలువు కొట్టేలా!) -
వివిధ మార్గాల్లో ప్రత్యేక రైళ్లు
సాక్షి, హైదరాబాద్ : రద్దీ దృష్ట్యా పలు మార్గా ల్లో ప్రత్యేక రైళ్లు నడపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎం.ఉమాశంకర్‌కుమార్ తెలిపారు. సికింద్రాబాద్–రెక్సాల్ (07091/ 07092) ప్రత్యేక రైలు ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29, జూన్ 5, 12, 19, 26 తేదీల్లో (మంగళవారం) రాత్రి 9.40 గంటల కు సికింద్రాబాద్‌లో బయలుదేరి గురువారం సాయంత్రం 6.15 గంటలకు రెక్సాల్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29 తేదీల్లో (శుక్రవారం) మధ్యా హ్నం 12.45 గంటలకు రెక్సాల్లో బయలుదేరి ఆదివారం ఉదయం 6.55 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. కాచిగూడ– టాటానగర్ (07438/ 07439)ప్రత్యేక రైలు ఫిబ్రవరి 5, 12, 19, 26, మార్చి 5, 12, 19, 26, ఏప్రిల్ 2, 9, 16, 23, 30, మే 7, 14, 21, 28, జూన్ 4, 11, 18, 25 తేదీల్లో మధ్యా హ్నం ఒంటిగంటకు కాచిగూడలో బయలుదే రి మరుసటి రోజు సాయంత్రం 7.45 గంటల కు టాటానగర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఫిబ్రవరి 6, 13, 20, 27, మార్చి 6, 13, 20, 27 ఏప్రిల్ 3, 10, 17, 24, మే 1, 8, 15, 22, 29 జూన్ 5, 12, 19, 26 తేదీల్లో రాత్రి 10.50 గంటలకు టాటానగ ర్లో బయలుదేరి రెండవ రోజు ఉదయం 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. హైద రాబాద్–జైపూర్ (02731/ 02732) ప్రత్యేక రైలు మార్చి 2, 9, 16, 23, 30, ఏప్రిల్ 6, 13, 20, 27, మే 4, 11, 18, 25, జూన్ 1, 8, 15, 22, 29 తేదీల్లో సాయంత్రం 4.25 గంటలకు హైదరాబాద్‌లో బయలుదేరి ఆదివారం ఉదయం 6.25కు జైపూర్ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1, 8, 15, 22, 29 మే 6, 13, 20, 27, జూన్ 3, 10, 17, 24, జూలై 1 తేదీల్లో మధ్యాహ్నం 2.35కు జైపూర్‌లో బయలుదేరి మంగళవారం తెల్లవారుజామున 2 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. -
జిల్లా నుంచి ‘దివ్యదర్శనం’ రూట్ల ఖరారు
కడప కల్చరల్ : తిరుమల–తిరుపతి దేవస్థానాలు, రాష్ట్ర దేవాదాయశాఖ, ధర్మపరిరక్షణ ట్రస్టుతో కలిసి త్వరలో నిర్వహించనున్న దివ్యదర్శనం యాత్రలకు జిల్లా నుంచి రూట్లు ఖరారు అయ్యాయి. జిల్లా దేవాదాయశాఖ అధికారులు పలు కసరత్తుల అనంతరం ప్రణాళికలు రూపొందించి రాష్ట్ర కమిషనర్‌కు అందజేశారు. తుది పరిశీలన అనంతరం వాటినే ఖరారు చేసినట్లు సమాచారం. ఆ వివరాలిలా ఉన్నాయి.∙ తిరుమల–తిరుపతి దేవస్థానాల యాజమాన్యం రాష్ట్ర దేవాదాయశాఖతో కలిసి ప్రతి సంవత్సరం జిల్లాకు చెందిన పది వేల మందికి రాష్ట్రంలోని ఐదు సుప్రసిద్ధ ఆలయాలకు ఉచితంగా యాత్రను నిర్వహించనుంది. బస్సులు, నాలుగు రోజులపాటు వసతి, మూడు పూటల భోజనం అన్నీ నిర్వాహకులే భరించనున్నారు. ఈ మేరకు జిల్లా దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్ రాష్ట్ర అధికారులకు జిల్లా యాత్రల రూట్‌మ్యాప్‌ను పంపారు. అధికారులు వాటిని అంగీకరించినట్లు తెలుస్తోంది. మొదటి రూట్æ(రాయచోటి నుంచి).. జిల్లా నుంచి దివ్య దర్శనం యాత్రలకు రెండు రూట్లను ఖరారు చేశారు. యాత్ర ప్రారంభమయ్యాక సోమవారం రాయచోటి వీరభద్రస్వామి ఆలయంలో ఉదయం 7 గంటల్లోపు స్వామిని దర్శించుకుంటారు. అల్పాహారం అనంతరం కాణిపాకం ఆలయానికి ప్రత్యేక బస్సు బయలుదేరనుంది. కాణిపాకం చేరుకుని 10.30 గంటల్లోగా దర్శనం ముగించుకుని మధ్యాహ్నం 1.00 గంటకు శ్రీకాళహస్తి ఆలయానికి చేరుతుంది. మధ్యాహ్న భోజన అనంతరం 3 గంటల్లోగా స్వామిని దర్శించుకుని రాత్రి విజయవాడకు చేరనున్నారు. రాత్రి అక్కడే గడిపి మంగళవారం ఉదయం 7.00 గంటల్లోగా కృష్ణానదిలో స్నానమాచరించి అమ్మవారిని దర్శించుకుంటారు. మధ్యాహ్నం 1.00 గంటకు అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామిని దర్శించుకుంటారు. భోజనం అనంతరం రాత్రి 8.30 గంటలకు ద్వారకా తిరుమలలోని శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయానికి చేరుకుంటారు. రాత్రి అక్కడే బసచేసి బుధవారం ఉదయం 7.00 గంటల్లోగా స్వామిని దర్శించుకుని అల్పాహారం స్వీకరిస్తారు. మధ్యాహ్నం 12.30 గంటలకు గుంటూరు పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుని మధ్యాహ్నం అక్కడే భోజనం చేస్తారు. అక్కడి నుంచి దారిలో మంగళగిరిలోని శ్రీ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుని రాత్రి తిరుపతికి చేరనున్నారు. రాత్రి అక్కడే గడిపి గురువారం ఉదయం 10.00 గంటల్లోగా తిరుమలేశుని దర్శనం కల్పిస్తారు. మధ్యాహ్న భోజనంతరం తిరిగి రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయానికి చేరుకోనున్నారు. రెండవ రూట్ (దేవునికడప నుంచి).. రెండవ రూట్లో కూడా సోమవారం నాడే యాత్ర ప్రారంభం కానుంది. దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని ఉదయం 7.00 గంటల్లోగా దర్శించుకుని అల్పాహారం అనంతరం మధ్యాహ్నం శ్రీశైలం ఆలయానికి చేరి మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేస్తారు. స్వామి దర్శనం అనంతరం రాత్రి విజయవాడ శ్రీ కనకదుర్గాదేవి ఆలయానికి చేరనున్నారు. మంగళవారం ఉదయం బయలుదేరి మధ్యాహ్నం అన్నవరంలోని శ్రీ వీర వెంకట సత్యనారాయణస్వామి ఆలయానికి చేరనున్నారు. దర్శనం అనంతరం మధ్యాహ్న భోజనం స్వీకరించి రాత్రి ద్వారకా తిరుమలకు చేరుకుంటారు. బుధవారం ఉదయం స్వామి దర్శనం అనంతరం మధ్యాహ్నం గుంటూరు పెదకాకానిలోని శ్రీ మల్లేశ్వరస్వామిని దర్శించుకుంటారు. మధ్యాహ్న భోజనం అనంతరం అదే దారిలో ఉన్న మంగళగిరి శ్రీ లక్ష్మి నరసింహాస్వామిని దర్శించుకుంటారు. రాత్రి శ్రీకాళహస్తికి చేరుకుంటారు. గురువారం ఉదయం స్వామిని దర్శించుకుని 10.00 గంటలకు తిరుమలకు చేరనున్నారు. మధ్యాహ్నం స్వామిని దర్శించుకుని సాయంత్రం కడపకు చేరనున్నారు. -
ఆదిలాబాద్ జిల్లాలో భారీ వర్షాలు
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బెజ్జూరు మండలంలో కుషినేపల్లి, బొక్కెన వాగు భారీగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. -
400 ఆర్టీసీ స్పెషల్ బస్సులు..
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో సోమవారం జరిగే నిమజ్జనం కోసం ఆర్టీసీ, రైల్వే అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వేడుకలను తిలకించేందుకు ట్యాంక్‌బండ్‌కు తరలి వచ్చే వారికోసం స్పెషల్ సర్వీసులను నడపనున్న ట్టు ఆర్టీసీ గ్రేటర్ హైదరాబాద్ ఎగ్జిక్యూటివ్ డెరైక్టర్ జయరావు తెలిపారు. వివిధ రూట్లలో 400 ప్రత్యేక బస్సులు నడపనున్నారు. ఈ బస్సులపై‘గణేశ్ నిమజ్జనం స్పెషల్’ అనే బోర్డులను ఏర్పాటు చేస్తారు. సోమవారం అర్ధరాత్రి దాటిన తరువాత కూడా ఈ సర్వీసులను తిప్పుతారు. ప్రత్యేక బస్సులు తిరిగే రూట్లు.. దిల్సుఖ్నగర్, వనస్థలిపురం, మిధాని, ఎల్బీనగర్ నుంచి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ వరకు, కాచిగూడ నుంచి బషీర్‌బాగ్, సికింద్రాబాద్ నుంచి ఖైర తాబాద్, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్, రిసాలాబజార్, మల్కాజిగిరి, జామై ఉస్మానియా, ఈసీఐఎల్ క్రాస్‌రోడ్స్, ఉప్పల్ నుంచి ఇందిరాపార్కు వరకు, ఉప్పల్ నుంచి లిబర్టీ టీటీడీ కళ్యాణ మండపం, టోలిచౌకి నుంచి లక్డీకాపూ ల్, బీహెచ్ఈఎల్, కొండాపూర్, రాజేంద్రనగర్, జీడిమెట్ల, జగద్గిరిగుట్ట, సనత్‌నగర్, కూకట్పల్లి, కేపీహెచ్‌బీ కాలనీ, పటాన్చెరు, లింగంపల్లి, బోరబండ, బాచుపల్లి, గాజుల రామారం తదితర ప్రాంతాల నుంచి లక్డీకాపూల్/ఖైరతాబాద్ వరకు 400 ప్రత్యేక బస్సులు నడుస్తాయి. ప్రయాణికుల రద్దీని బట్టి బస్సుల సంఖ్యను పెంచుతారు. ఎక్కడి నుంచి ఎక్కడికి.. బస్సుల రాకపోకలను పలు ప్రాంతాలకు పరిమితం చేయనున్నారు. సోమవారం ఉదయం 8 నుంచి ఈ ఆంక్షలు అమలులో ఉంటాయి. చార్మినార్ వైపు వెళ్లే బస్సులను అఫ్జల్‌గంజ్ వరకే పరిమితం చేస్తారు. కూకట్పల్లి, జీడిమెట్ల, మియాపూర్, బీహెచ్ఈఎల్ రూట్ల నుంచి వచ్చే బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి ఖైరతాబాద్ వరకే పరి మితం చేస్తారు. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి అర్ధరాత్రి వరకు ఈ రూట్లలో బస్సులను షటిల్స్‌గా ఖైరతాబాద్ వరకు తిప్పుతారు. మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే బస్సులను మధ్యాహ్నం ఒంటిగంట నుంచి లక్డీకాపూల్ వరకు పరిమితం చేస్తారు. దిల్సుఖ్నగర్, హయత్‌నగర్, మిధాని ప్రాంతాల నుంచి నాంపల్లి మీదుగా వెళ్లే బస్సులను కోఠి ఉమెన్స్ కాలేజ్ వరకే నడుపుతారు. బస్సుల సమాచారం.. కోఠి ఉమెన్స్ కాలేజ్ ఫోన్ : 9959226160 రెతిఫైల్ బస్‌స్టేషన్ ఫోన్ : 9959226154 -
‘శంఖారావా’నికి ఇలా వెళ్లాలి
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు శనివారం హైదరాబాద్ లాల్‌బహదూర్ స్టేడియంలో జరుగనున్న సమైక్య శంఖారావం సభకు తరలివెళ్లే వారి కోసం విస్తృత ఏర్పాట్లు చేశారు. వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్‌లో ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు ఏర్పాటు చేశారు. సాక్షి, సిటీబ్యూరో: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజధాని నగరంలోని ఎల్బీ స్టేడియంలో శనివారం సమైక్య శంఖారావం పేరుతో భారీ బహిరంగ సభ నిర్వహిస్తోంది. పార్టీ అభిమానులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో వస్తారని భావిస్తున్న పోలీసులు దీనికి విస్తృత బందోబస్తు, భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చే వాహనాలు హైదరాబాద్ నగరంలోకి ప్రవేశించాక అనుసరించడం కోసం ప్రత్యేక మార్గాలు, పార్కింగ్ వసతులు కల్పించారు. స్టేడియం చుట్టు పక్కల మినహా మిగిలినచోట్ల నిలుపుకోవాల్సిన వాహనాల్లో వచ్చిన కార్యకర్తలు, అభిమానులు ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద దిగిపోవాలి. అక్కడ నుంచి వాహనాలు వాటికి కేటాయించిన పార్కింగ్ ప్రాంతాలకు వెళ్లాలి. కార్యకర్తలు, అభిమానులు మాత్రం కాలినడకన వేదిక వద్దకు చేరుకోవాల్సి ఉంటుంది. సభ పూర్తయిన తరవాత సైతం ఎన్టీఆర్ స్టేడియం, ఎంజే మార్కెట్ వద్ద నుంచే తమ తమ వాహనాల్లో ఎక్కి వెళ్లాల్సి ఉంటుంది. సహాయసహకారాలు, సూచనల కోసం విధుల్లో ఉండే వాలంటీర్లు, ట్రాఫిక్, శాంతిభద్రతల విభాగం పోలీసుల్ని సంప్రదించవచ్చు. మార్గాలు, పార్కింగ్స్ ఇలా... విజయవాడ, నాగార్జునసాగర్ మార్గాల్లో వచ్చే వాహనాలు నల్లగొండ చౌరస్తా, చాదర్‌ఘాట్, కాచిగూడ ట్రాఫిక్ పోలీసు స్టేషన్, కాచిగూడ రైల్వేస్టేషన్, టూరిస్ట్ హోటల్, బర్కత్‌పుర, క్రౌన్ కేఫ్, బాగ్‌లింగంపల్లి, వీఎస్టీ, ఆర్టీసీ క్రాస్‌రోడ్స్ మీదుగా ప్రయాణించి ఎన్టీఆర్ స్టేడియం వద్దకు చేరుకోవాలి. కార్యకర్తలు, అభిమానుల్ని అక్కడ దింపి వాహనాలను ఎన్టీఆర్ స్టేడియం, సికింద్రాబాద్‌లోని పెరేడ్ గ్రౌండ్స్‌లో పార్క్ చేసుకోవాల్సి ఉంటుంది.