ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో గురువారం భారీ వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. బెజ్జూరు మండలంలో కుషినేపల్లి, బొక్కెన వాగు భారీగా ప్రవహిస్తుండటంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.