తునికాకు టెండర్ల ఖరారు
తునికాకు టెండర్ల ఖరారు
Published Wed, Feb 1 2017 9:53 PM | Last Updated on Tue, Sep 5 2017 2:39 AM
గతేడాది కంటే అధిక రేటు
చింతూరు (రంపచోడవరం) : ఏజెన్సీ ప్రాంత గిరిజనులు కాసుల పంటగా భావించే తునికాకు (బీడీ ఆకు) టెండర్లు ఖరారయ్యాయి. చింతూరు అటవీ డివిజన్‌లోని ఐదు రేంజ్‌లలోని తొమ్మిది యూనిట్లకు గతేడాది కంటే అధికంగా రేటు లభించినట్టు చింతూరు డీఎఫ్‌వో ఎంవీ ప్రసాదరావు బుధవారం తెలిపారు. తునికాకు సేకరణకు ఏటా మార్చిలో ఫ్రూనింగ్ పనులు, ఏప్రిల్, మే నెలల్లో కోతలు జరుగుతాయి. గతేడాది 50 ఆకుల తునికాకు కట్టకు 1.52 పైసల చొప్పున అటవీశాఖ కార్మికులకు చెల్లించింది. కూనవరం రేంజ్ పరిధిలోని చింతూరు ఏడుగురాళ్లపల్లి యూనిట్‌లో నాణ్యమైన తునికాకు లభిస్తుండడంతో కాంట్రాక్టర్లు ఈ యూనిట్‌ను దక్కించుకునేందుకు పోటీ పడుతుంటారు. కాగా తునికాకు సేకరణ అనంతరం కార్మికులకు బకాయిపడిన 2013 నుంచి చెల్లించక పోవడంపై కార్మికులతో పాటు రాజకీయ పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వెయ్యి కట్టల తునికాకును ఒక స్టాండర్డ్ బ్యాగ్‌గా పరిగణించి టెండర్లు ఖరారు చేస్తారు.
చింతూరు అటవీ డివిజన్‌లోని తొమ్మిది యూనిట్లకు ఈ ఏడాది తునికాకు సేకరణ లక్ష్యం, ఖరారైన టెండర్ల వివరాలు
యూనిట్లు లక్ష్యం స్టాండర్డ్ బ్యాగుల్లో – స్టాండర్డు బ్యాగుకు ఖరారైన రేటు
చింతూరు – 4000 – రూ.14,116
కుందులూరు – 3500 – రూ.12,567
లక్కవరం – 2700 – రూ.14,116
ఏడుగురాళ్లపల్లి – 7300 – రూ.15,000
కూనవరం – 2400 – రూ.11,369
మురుమూరు – 1200 – రూ.13,179
వీఆర్‌పురం – 1800 – రూ.13,791
నెల్లిపాక – 3100 – రూ.11,299
మాధవరావుపేట – 3065 – రూ.15,340
Advertisement
Advertisement