
కమళదళానికి కొత్త కమిటీలు
మండల అధ్యక్షులు ఖరారు
ఓట్ల ప్రాతిపదికన కొత్తగా కమిటీల ఏర్పాటు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: భారతీయ జనతా పార్టీ మండల స్థాయి కమిటీల ఏర్పాటుకు అధ్యక్షుడు బొక్క నర్సింహారెడ్డి ఉపక్రమించారు. ఇటీవల జిల్లా కార్యవర్గాన్ని ప్రకటించిన ఆయన.. తాజాగా మండల పార్టీ అధ్యక్షులను ఖరారు చేశారు. ఇప్పటికే కొన్ని మండలాలకు కార్యవర్గాల్ని ప్రకటించినప్పటికీ.. మిగిలిన మండలాలకు సైతం కమిటీలను ఏర్పాటు చేస్తున్నారు. ఇందులో భాగంగా ఆదివారం 12 మంది అధ్యక్షుల్ని ఖరారు చేశారు. వీరిలో చిటికెల వెంకటయ్య (శంషాబాద్), కొప్పుల సత్యనారాయణ రెడ్డి (వికారాబాద్), వెంకటేష్‌గౌడ్ (బంట్వారం), పి.సంజీవరెడ్డి(తాండూరు), రాజుకుమార్ కులకర్ణి (బషీరాబాద్), దోసాడ మల్లేష్ (నవాబ్‌పేట్), క్యామ పద్మనాభం (మొయినాబాద్), వి.పెంటయ్య (పరిగి), ఎండీ జమీల్ (దోమ) ఉన్నారు. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసేందుకు ఓట్ల ప్రాతిపదికన కొత్త కమిటీలకు శ్రీకారం చుట్టారు. 15 వేలు దాటిన పంచాయతీగానీ, బూత్ స్థాయిలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నారు. ఈ క్రమంలో జయంతి చంద్రశేఖర్ (నాగారం), సుర్‌జిత్ (నిజాంపేట్), ఆంగోత్ కల్యాణ్ (అన్నోజిగూడ) కమిటీలను కొత్తగా ఏర్పాటు చేశారు.