
'వైఎస్ జగన్ హెచ్చరించినా పట్టించుకోలేదు'
కర్నూలు: రాష్ట్ర విభజన జరగకముందే జల వివాదాలు వస్తాయని వైఎస్ జగన్ మోహన్ రెడ్డి హెచ్చరించినా ఎవరూ పట్టించుకోలేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ గోదావరి, కృష్ణా జలాలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆధారపడి ఉందన్నారు.
రాజకీయాల కోసం చంద్రబాబు...రైతుల జీవితాలతో ఆడుకుంటున్నారని అనంత వెంకట్రామిరెడ్డి ధ్వజమెత్తారు. ఓ వైపు తెలంగాణ సర్కార్ అక్రమంగా ప్రాజెక్టులు నిర్మిస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, గౌరు సుచరిత పాల్గొన్నారు. కాగా తెలంగాణ నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టులకు నిరసనగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఈ నెల 16,17,18 తేదీల్లో కర్నూలు కేంద్రంగా దీక్ష చేపట్టనున్న విషయం తెలిసిందే.