హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ శాసనసభ కమిటీ హాల్లో ఏపీ అసెంబ్లీ, పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్ కమిటీల భేటీ జరిగింది. మూడు కమిటీలను ఉద్దేశించి సోమవారం శాసన సభ కమిటీ హాల్లో ఏపీ అసెంబ్లీ స్వీకర్ కోడెల శివప్రసాద రావు ప్రసంగించారు. ఈ సందర్భంగా పీఏసీ ఛైర్మన్గా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్ బాధ్యతలను స్వీకరించారు. అయితే స్పీకర్తో భేటీ అనంతరం పీఏసీ, పీయూసీ, ఎస్టిమేట్ కమిటీలు విడివిడిగా సమావేశమయ్యాయి.
ఈ సమావేశంలో కమిటీల రిపోర్టులు సభకు సమర్పించడం వాటి సిఫార్సుల అమలు వంటి అంశాలను భేటీలో స్పీకర్తో కమిటీలు ప్రస్తావించాయి. అదేవిధంగా కమిటీల భేటికి వరుసగా మూడు సార్లు గైర్హాజరు అయిన సభ్యులను విధుల నుంచి తొలగించాలని కమిటీ ఛైర్లన్లు పేర్కొన్నారు. అలాగే కమిటీ మీటింగ్కు అలవెన్స్ పెంచాలని కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు.
పీఏసీ ఛైర్మన్గా ఎమ్మెల్యే బుగ్గన బాధ్యతలు'
Published Mon, May 9 2016 3:08 PM | Last Updated on Mon, Jul 29 2019 2:44 PM
Advertisement
Advertisement