వైఎస్సార్సీపీ ప్లీనరీ విజయవంతం | ysrcp plenary successfully completed | Sakshi
Sakshi News home page

వైఎస్సార్సీపీ ప్లీనరీ విజయవంతం

Published Sat, Jun 24 2017 4:10 PM | Last Updated on Fri, Mar 22 2019 6:18 PM

వైఎస్సార్సీపీ ప్లీనరీ విజయవంతం - Sakshi

వైఎస్సార్సీపీ ప్లీనరీ విజయవంతం

నెల్లూరు(మినీబైపాస్‌): మాగుంట లేఅవుట్లోని పిచ్చిరెడ్డి కల్యాణ మండపంలో శుక్రవారం నిర్వహించిన వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ప్లీనరీ సమావేశం విజయవంతమైంది. నగరంలో భారీ ఎత్తున ఫ్లెక్సీలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. పలువురు కార్పొరేటర్లు, నాయకులు బైక్‌ ర్యాలీలతో ప్రాంగణానికి చేరుకున్నారు. జగన్‌మోహన్‌రెడ్డిని సీఎంని చేయాలంటూ భారీగా నినాదాలు చేశారు.

నెల్లూరు రూరల్‌ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమానికి ముఖ్యఅతిథులుగా ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షుడు, సర్వేపల్లి ఎమ్మెల్యే కాకాణి గోవర్ధన్‌రెడ్డి, నెల్లూరు నగర ఎమ్మెల్యే పోలుబోయిన అనిల్‌కుమార్‌యాదవ్, మాజీ మంత్రి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్‌రెడ్డి, ఆనం విజయకుమార్‌రెడ్డి, డిప్యూటీ మేయర్‌ ముక్కాల ద్వారకానాథ్, పార్టీ కార్పొరేషన్‌ ఫ్లోర్‌లీడర్‌ రూప్‌కుమార్‌యాదవ్, నగరాధ్యక్షుడు తాటి వెంకటేశ్వరరావు, మండల కన్వీనర్‌ పుచ్చలపల్లి రామ్‌ప్రసాద్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

భారీ ర్యాలీ
నెల్లూరు(వేదాయపాళెం): కొత్తూరు పరిధిలోని 31, 32వ డివిజన్ల నుంచి ప్లీనరీ సమావేశానికి నాయకులు, కార్యకర్తలు భారీ మోటార్‌ బైక్‌ ర్యాలీని నిర్వహించారు. పార్టీ నాయకులు పోలుబోయిన ఆదిశేషయ్య, కూకాటి హరిబాబు, కూకాటి ప్రసాద్, బత్తల కృష్ణ, యానాదయ్య, జమీర్, త్యాగీ, రాజా, గోళ్ల జనార్దన్, శేషయ్య, మురళి, దాసు మారెప్ప, విజయరామిరెడ్డి, వంశీ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement