- తప్పించుకున్న అధికారపక్షం
- సమస్యలపై చర్చలేకుండా చినబాబుకు భజన
- హాట్‌హాట్‌గా జెడ్పీ సర్వసభ్య సమావేశం
నిలదీసిన విపక్షం
Published Fri, Apr 7 2017 12:14 AM | Last Updated on Tue, Sep 5 2017 8:07 AM
సమస్యలపై నిలదీసిన ప్రతిపక్షం... నిర్దిష్టమైన సమాధానాలు ఇవ్వలేక తప్పించుకునే ప్రయత్నంలో అధికారపక్షం. సమస్యలను గాలికొదిలేసి చినబాబుకు అభినందనలకు ప్రాధాన్యం ఇవ్వడం ... అనవసర ప్రస్తావనలతో సభను పక్కదోవపట్టించే అధికారపక్ష ప్రయత్నం...ఇదీ జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు అధ్యక్షతన గురువారం జరిగిన జెడ్పీ సర్వసభ్య సమావేశం తీరు. శాసన మండలి డిప్యూటీ చైర్మ¯ŒSగా జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంను అభినందించడంలో ఎవరూ తప్పు పట్టరు. కానీ జిల్లాతో సంబంధంలేని లోకేష్ విషయంలో స్వామి భక్తిని చాటుకోవడం విమర్శలకు తావిచ్చింది. ఆ ఇద్దరితోపాటు పనిలో పనిగా పి. గన్నవరం ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి జన్మదిన వేడుకలకు కూడా సర్వసభ్య సమావేశాన్ని వేదికగా చేసుకున్నారు.
జెడ్పీ సర్వసభ్యసమావేశం గురువారం జెడ్పీ చైర్మన్ నామన రాంబాబు అధ్యక్షతన జరిగింది. పలు సమస్యలపై వాడీవేడిగా చర్చ సాగింది. ఎప్పటిలానే ప్రతిపక్ష వైఎస్సార్‌సీపీ సభ్యులు జిల్లాలోని ప్రజాసమస్యలపై గళమెత్తారు. జిల్లాలో పింఛన్ల మంజూరులో పచ్చతమ్ముళ్ల కర్రపెత్తనం, మూడేళ్లుగా సహకార సంఘాలకు రావాలి్సన వడ్డీరాయితీ, సామాన్యుని పాలిట గుదిబండలా మారిన ఇంటిపన్నులు, పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పనలో వెనుకబాటుతనం, సాంఘిక సంక్షేమ శాఖ ద్వారా రుణాల మంజూరులో జాప్యం, కాపుకార్పొరేష¯ŒS రుణాల పేరుతో జరుగుతున్న మోసం.. ఇలా పలు ప్రజాసమస్యలను ప్రతిపక్ష నేత శాకా ప్రసన్నకుమార్, ఎమ్మెల్యే చిర్లజగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి ఏకరువు పెట్టారు.
ప్రశ్నోత్తరాలతో ప్రారంభం
జిల్లా ఎమ్మెల్సీ రెడ్డిసుబ్రహ్మణ్యం పెద్దల సభకు డిప్యూటీ చైర్మ¯ŒSగా ఎన్నికకావడంపై సభ అభినందనలు తెలిపింది. ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి జన్మదిన వేడుకలు సందర్భంగా ప్రజాప్రతినిధులు ఆయనను ఘనంగా సత్కరించారు.
అక్రమ పింఛన్ల మాటేంటీ?
ప్రశ్నోత్తరాల సమయంలో ప్రతిపక్షనేత శాకా ప్రసన్నకుమార్ మాట్టాడుతూ జిల్లాలో పిఠాపురంలో ఇటీవల విడుదల చేసిన 300 పింఛన్లలో 105 అనర్హతగా తేలాయని, అనపర్తి మండలం కొంకుదురులో 42 మంది పింఛన్లు పచ్చచొక్కాల అనుయాయులకు అడ్డంగా ఇచ్చారని, ‘సాక్షి’ దినపత్రిక వెలుగులోకి తీసుకువచ్చిన ఈ విషయంపై ఎటువంటి చర్యలు తీసుకున్నారని దుయ్యబట్టారు. దీనికి డీడీ మల్లిబాబు సమాధానమిస్తూ జిల్లాలో 30వేల పింఛన్లు మంజూరయ్యాయని, ఎక్కడా ఇటువంటి లోపాలు రాలేదని, పిఠాపురం, అనపర్తి నియోజకవర్గాల్లో చోటుచేసుకున్న ఈ పొరపాట్లకు కంప్యూటర్ ఆపరేటర్లు బాధ్యులుగా చేస్తూ వారిని తొలగించామని, పంచాయతీ కార్యదర్శిని సస్పెండ్ చేశామన్నారు. దీనికి ప్రతిపక్ష సభ్యులు చిర్లజగ్గిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. చేతులు దులుపుకొనే చర్యలు మానుకోవాలని కలెక్టర్ తీరును విమర్శించారు.
వడ్డీరాయితీ ఏదీ?
జిల్లాలో 297 సహకార సంఘాలకు మూడేళ్లుగా ప్రభుత్వం రావాలి్సన ఆరు శాతం వడ్డీరాయితీ రూ.90 కోట్లు మంజూరు కావాల్సి ఉందని, రైతులకు ఈ ప్రభుత్వంలో ఒరిగిందేమీ లేదని ఎమ్మెల్యే చిర్ల జగ్గిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్ స్పందిస్తూ రాష్ట్రస్థాయి సమస్యలను అసెంబ్లీలో చర్చించాలని, జెడ్పీ సమావేశాల్లో కాదన్నారు. రైతు సమస్యలు ఎక్కడైనా ప్రస్తావించే హక్కు ప్రజాప్రతినిధిగా తనకుందన్న విషయాన్ని పెందురి్తకి చిర్ల గుర్తుచేశారు. మీకు సత్తా ఉంటే వడ్డీరాయితీని ప్రభుత్వం నుంచి తెప్పించాలని సవాల్ విసిరారు. అరగంట పాటు ఇరువురి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. జిల్లా కలెక్టర్ ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామనడంతో వాగ్వాదం సద్దుమణిగింది.
స్వామి భక్తి చాటేలా..
శాసన మండలి డిప్యుటీ చైర్మ¯ŒSగా జిల్లా నుంచి ఎన్నికైన ఎమ్మెల్సీ రెడ్డి సుబ్రహ్మణ్యంను అభినందంచడంలో ఎవరూ తప్పు పట్టరు. జిల్లా వాసే కావడంతో సుబ్రహ్మణ్యంను ప్రత్యేకంగా సత్కరించినా స్వాగతించే అంశమే. కానీ జిల్లాతో ఎటువంటి సంబంధం లేని లోకేష్ విషయంలో స్వామి భక్తిని చాటుకోవడానికే తాపత్రయపడ్డట్టుగా కనిపించింది.
ఎంతమంది ప్రాణాలు పోవాలి?
గిరిజన మహిళలు, పిల్లలు సరైన వైద్యం అందక ప్రాణాలు విడుస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి పేర్కొన్నారు. తన నియోజకవర్గంలో 11 మండలాల్లో 216 మంది చిన్నారులు ఈ యేడాది పురిట్లోనే ప్రాణాలు విడిచారని కలెక్టర్‌కు వివరించారు. కనీసం వైద్యసౌకర్యాలు అందించని ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. దీనిపై చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే శాంతించారు. జిల్లావిద్యాశాఖ, సర్వశిక్షాభియాన్, వేసవిలో దాహార్తిని తీర్చేందుకు చేపడుతున్న చర్యలు ఇలా 24శాఖల ప్రగతిని సమావేశం ముందుంచడంతో సమావేశం ముగిసింది. కార్యక్రమానికి జెడ్పీ చైర్మ¯ŒS నామన రాంబాబు అ«ధ్యక్షత వహించగా, కలెక్టర్ హెచ్‌ఆర్ అరుణ్‌కుమార్, సీఈవో పద్మ, ఎమ్మెల్యేలు చిర్ల జగ్గిరెడ్డి, వంతల రాజేశ్వరి, పెందుర్తి వెంకటేష్, తోట త్రిమూర్తులు, వేగుళ్ల జోగేశ్వరరావు, పులపర్తి నారాయణమూర్తి, ఎమ్మెల్సీ రత్నాభాయి, జెడ్పీటీసీ సభ్యులు, అధికారులు పాల్గొన్నారు.
సామాన్యులకు గుదిబండలా ఇంటిపన్నులు..
సామన్యప్రజానీకానికి గుదిబండలా మారిన ఇంటిపన్నులు తగ్గించే యోచన ప్రభుత్వానికి లేకపోవడం, ఉభయ గోదావరి జిల్లాల్లో మాత్రమే ఇటువంటి పన్ను విధానం ఉండడం విడ్డూరమని ప్రతిపక్ష నేత శాకా జీవో ప్రతులను సభ ముందుంచారు. ఈ విధానం రద్దుపై తీర్మానానికి పట్టుబట్టారు. దీనిపై కాసేపు సభలో గందరగోళ పరిస్థితి నెలకొంది. దీనికి జిల్లాపంచాయతీ అధికారి, కలెక్టర్ దాటవేత ధోరణిలో వ్యవహరిస్తున్నారని శాకా పేర్కొన్నారు.
కాపు రుణాల మంజూరులో జాప్యం
కాపు రుణాల మంజూరులో తీవ్ర జాప్యం జరుగుతోందని తన నియోజకవర్గంలోని అయినవిల్లి మండలంలో ఒక్క కాపుసోదరునికి రుణం ఇప్పించలేకపోయానని ఎమ్మెల్యే పులపర్తి నారాయణమూర్తి ఆవేదన వ్యక్తం చేశారు. అధికార పక్ష సభ్యుల్లో అనేకమంది ఇదే సమస్యను లేవనెత్తడంతో సమవేశంలో కాసేపు కాపుల చర్చ జరిగింది.
Advertisement
Advertisement