
గ్రహం అనుగ్రహం, జూన్ 27, 2015
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం..
శ్రీ మన్మథనామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, అధిక ఆషాఢ మాసం, తిథి శు.దశమి ఉ.6.50 వరకు, తదుపరి ఏకాదశి, నక్షత్రం స్వాతి రా.1.02 వరకు, వర్జ్యం ఉ.5.01 నుంచి 6.44 వరకు, దుర్ముహూర్తం ఉ.5.33 నుంచి 7.15 వరకు, అమృతఘడియలు.. ప.3.26 నుంచి 5.10 వరకు
భవిష్యం
మేషం: ఆకస్మిక ధనలాభం. యత్నకార్యసిద్ధి. పోటీ పరీక్షల్లో విజయం. శుభకార్యాలలో పాల్గొంటారు. పాతబాకీలు వసూలవుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.
వృషభం: పాత మిత్రులతో ఆనందంగా గడుపుతారు. సేవలకు గుర్తింపు రాగలదు. హాజరైన ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. శుభవార్తలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తికరంగా ఉంటాయి.
మిథునం: కొన్ని వ్యవహారాలలో ఆటంకాలు. ఖర్చులు పెరుగుతాయి. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటా బయటా ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు పెరుగుతాయి.
కర్కాటకం: శ్రమ తప్పదు. పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనారోగ్యం. ఆర్థిక పరిస్థితి నిరుత్సాహ పరుస్తుంది. వ్యాపారాలు నిరాశాజనకంగా ఉంటాయి. ఉద్యోగులకు అదనపు బాధ్యతలు.
సింహం: నూతన వ్యక్తుల వారితో పరిచయం. సంఘంలో గౌరవం లభిస్తుంది. విలువైన వస్తువులు సేకరిస్తారు. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు అనుకూలిస్తాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు.
కన్య: ఆదాయానికి మించి ఖర్చులు. దూర ప్రయాణాలు చేసే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు పెరుగుతాయి. ఆరోగ్య భంగం. శ్రమ పెరుగుతుంది. వ్యాపారాలలో గందరగోళం. ఉద్యోగులకు పనిభారం.
తుల: శుభకార్యాలకు హాజరవుతారు. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ఆకస్మిక ధన, వస్తు లాభాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం నెలకొంటుంది.
వృశ్చికం: పనులు మధ్యలో విరమిస్తారు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. అనారోగ్యం. ప్రయాణాలు వాయిదా. వ్యాపారాలు, ఉద్యోగాలలో చిక్కులు.
ధనుస్సు: ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. సమస్యలు పరిష్కారమవుతాయి. శుభకార్యాలలో పాల్గొంటారు. గృహం, వాహనాలు కొనుగోలు చేస్తారు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సంతృప్తినిస్తాయి.
మకరం: కొత్త ఉద్యోగాలు దక్కుతాయి. మిత్రులు, బంధువులతో ఉత్సాహంగా గడుపుతారు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభకార్యాలలో పాల్గొంటారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ప్రోత్సాహం.
కుంభం: శ్రమాధిక్యం. కొన్ని పనులు వాయిదా వేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కొత్త బాధ్యతలు. దూరప్రయాణాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు పనిఒత్తిడులు.
మీనం: వివాదాలకు దూరంగా ఉండండి. ఆకస్మిక ప్రయాణాలు. బంధువిరోధాలు. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. వ్యాపారాలు ముందుకు సాగవు. ఉద్యోగాలలో ఒత్తిడులు.
- సింహంభట్ల సుబ్బారావు