అగ్రికల్చర్ ఆఫీసర్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్‌లో అగ్రికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఖాళీలు: 120 వేతన స్కేలు: రూ.35,120 - రూ.87,130.
అర్హత: అగ్రికల్చర్ బీఎస్సీ డిగ్రీ. వయసు: 2015, జూలై 1 నాటికి కనిష్ట వయసు 18, గరిష్ట వయసు 44 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 5,పీహెచ్‌సీ అభ్యర్థులకు 10ఏళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో ఆన్‌లైన్ లేదా ఓఎంఆర్ విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి రెండో దశలో ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
పరీక్ష విధానం:
ప్రశ్నలు సమయం మార్కులు
పార్ట్-ఎ: రాత పరీక్ష
(ఆబ్జెక్టివ్ విధానం)
పేపర్: 1 -
జనరల్ స్టడీస్ అండ్
జనరల్ ఎబిలిటీస్ 150 150ని 150
పేపర్: 2 -
అగ్రికల్చర్(డిగ్రీ స్థాయి) 150 150ని 300
పార్ట్-బి: ఇంటర్వ్యూ 50
మొత్తం 500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 25, 2015.
పరీక్ష తేదీలు: అక్టోబర్ 17, అక్టోబర్ 18, 2015.
వెబ్‌సైట్: ఠీఠీఠీ.్టటఞటఛి.జౌఠి.జీ
హార్టికల్చర్ ఆఫీసర్
వ్యవసాయ, అనుబంధ డిపార్ట్‌మెంట్‌లో హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలను భర్తీ చేసేందుకు టీఎస్‌పీఎస్సీ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఖాళీలు: 75. వేతన స్కేలు: రూ.35,120 - రూ.87,130. అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి హార్టికల్చర్‌లో డిగ్రీ. హార్టికల్చర్ స్పెషలైజేషన్‌తో ఎంఎస్సీ అగ్రికల్చర్ చేసిన అభ్యర్థులు కూడా అర్హులే. అయితే హార్టికల్చర్ అభ్యర్థులు లేకపోతేనే వీరిని ఉద్యోగంలో నియమిస్తారు. ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల ఖాళీల భర్తీలో హార్టికల్చర్ డిగ్రీ అభ్యర్థులు లేనప్పుడు బీఎస్సీ అగ్రికల్చర్ డిగ్రీ ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుంది. వయసు: 2015, జూలై 1 నాటికి కనిష్ట వయసు 18, గరిష్ట వయసు 44 ఏళ్లు. గరిష్ట వయోపరిమితిలో ఎస్సీ, ఎస్టీ, బీసీలకు ఐదేళ్లు, పీహెచ్‌సీ అభ్యర్థులకు 10 ఏళ్లు సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం: రెండు దశలు ఉంటాయి. మొదటి దశలో ఆన్‌లైన్ లేదా ఓఎంఆర్ విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. ఇందులో అర్హత సాధించిన వారికి రెండో దశలో ఓరల్ టెస్ట్ (ఇంటర్వ్యూ) ఉంటుంది. ఈ రెండు పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
పరీక్ష విధానం:
ప్రశ్నలు సమయం మార్కులు
పార్ట్-ఎ: రాత పరీక్ష
(ఆబ్జెక్టివ్ విధానం)
పేపర్:1 -
జనరల్ స్టడీస్ అండ్ 150 150ని 150
జనరల్ ఎబిలిటీస్
పేపర్:2 - హార్టికల్చర్ 150 150ని 300
(డిగ్రీ స్థాయి)
పార్ట్-బి: ఇంటర్వ్యూ 50
మొత్తం 500
ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: సెప్టెంబరు 25, 2015.
పరీక్ష తేదీ: అక్టోబరు 17, 2015.
వెబ్‌సైట్: ఠీఠీఠీ.్టటఞటఛి.జౌఠి.జీ
సిలబస్- ప్రిపరేషన్ ప్రణాళిక
అన్ని పరీక్షలకు పేపర్-1 (జనరల్ స్టడీస్, జనరల్ ఎబిలిటీస్) పేపరు ఉమ్మడిగా ఉంది. పరీక్షలో విజయానికి ఈ పేపర్ కీలకమైంది. ఈ పేపర్‌లో ఉన్న అంశాలు..
వర్తమాన వ్యవహారాలు (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ). అంతర్జాతీయ వ్యవహారాలు జనరల్ సైన్స్, శాస్త్రసాంకేతిక రంగంలో భారత్ విజయాలు పర్యావరణ అంశాలు, విపత్తు నిర్వహణ భారత, తెలంగాణ ఆర్థిక, సామాజిక అభివృద్ధి భారత జాగ్రఫీ, తెలంగాణ జాగ్రఫీ (ఫిజికల్, సోషల్, ఎకనమిక్) ఆధునిక భారతదేశ చరిత్ర (భారత జాతీయోద్యమానికి ప్రాధాన్యం) తెలంగాణ సామాజిక-ఆర్థిక,రాజకీయ,సాంస్కృతిక చరిత్ర(తెలంగాణ ఉద్యమం,రాష్ర్ట ఏర్పాటుకు ప్రాధాన్యం)
భారత రాజ్యాంగం; తెలంగాణ సమాజం-సంస్కృతి-వారసత్వం, సాహిత్యం; తెలంగాణ రాష్ట్ర విధానాలు; లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్, పదో తరగతి స్థాయి ఇంగ్లిష్. పదో తరగతి వరకు పాఠ్యపుస్తకాలు ప్రిపరేషన్‌కు బాగా ఉపయోగపడతాయి. లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్‌కు ఆర్.ఎస్.అగర్వాల్ పుస్తకాలను రిఫరెన్స్‌గా ఉపయోగించుకోవచ్చు.
సబ్జెక్టును ఆబ్జెక్టివ్‌గా:
హైదరాబాద్ మెట్రోపొలిటన్ వాటర్ సప్లై అండ్ సివరేజ్ బోర్డులోని వివిధ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల పోస్టుల పరీక్షలకు సిద్ధమయ్యేవారు ఆయా బ్రాంచ్‌ల సిలబస్‌ను ఆబ్జెక్టివ్ కోణంలో చదవాలి. ప్రామాణిక పుస్తకాలను రిఫరెన్సుకు ఉపయోగించుకోవాలి.
సివిల్:
సివిల్ ఇంజనీరింగ్ (ఆబ్జెక్టివ్ టైప్): ఆర్.ఎస్.ఖుర్మి, జె.కె.గుప్త
సివిల్ ఇంజనీరింగ్ (ఆబ్జెక్టివ్ టైప్): ఎస్.పి.గుప్త అండ్ ఎస్.ఎస్.గుప్త
మెకానికల్:
మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్: ఆర్.కె.జైన్
మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్: రాజ్‌పుట్
మెకానికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్: జైన్ అండ్ జైన్
ఎలక్ట్రికల్:
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఆబ్జెక్టివ్: జె.బి.గుప్త
ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బేసిక్స్: వి.కె.మెహతా
ఈసీఈ:
ఈసీఈ ఆబ్జెక్టివ్: గల్గోటియా పబ్లికేషన్స్
ఈసీసీ ఆబ్జెక్టివ్: రాజ్‌పుట్
టిప్స్
అన్ని బ్రాంచ్‌ల వారు గత ఐఈఎస్, గేట్ ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. మేడ్‌ఈజీ పబ్లికేషన్స్ పుస్తకాలు కూడా ప్రిపరేషన్‌కు ఉపయోగపడతాయి.
రోజుకు ఆరు నుంచి ఎనిమిది గంటల ప్రిపరేషన్‌తో మంచి ఫలితాలు రాబట్టవచ్చు.
గ్రూప్‌గా చదవడం వల్ల తక్కువ సమయంలో ఎక్కువ అంశాలపై అవగాహన పెంపొందించుకోవచ్చు. కొత్త విషయాలను నేర్చుకునేందుకు అవకాశముంటుంది.
షార్ట్ నోట్స్‌ను రూపొందించుకోవడం వల్ల చివర్లో రివిజన్‌కు బాగా ఉపయోగపడుతుంది.
సిలబస్‌కు సంబంధించి ముఖ్యమైన అంశాలు, సూత్రాలు, సిద్ధాంతాలతో సొంతగా షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి.
అగ్రికల్చర్, హార్టికల్చర్ ఆఫీసర్స్
Published Wed, Sep 9 2015 10:58 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement