ప్రభుత్వ కొలువుకు.. వ్యవ‘సాయం’ | Telangana New jobs in TSPSC | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ కొలువుకు.. వ్యవ‘సాయం’

Published Thu, May 5 2016 1:02 AM | Last Updated on Tue, Jun 4 2019 5:16 PM

ప్రభుత్వ కొలువుకు.. వ్యవ‘సాయం’ - Sakshi

ప్రభుత్వ కొలువుకు.. వ్యవ‘సాయం’

కాంపిటీటివ్ గెడైన్స్ టీఎస్‌పీఎస్సీ - ఏఈవో

తెలంగాణలో నిరుద్యోగులకు టీఎస్‌పీఎస్సీ మరో కొత్త కొలువుల కానుక అందించింది! అగ్రికల్చరల్ సబార్డినేట్ సర్వీస్ డిపార్ట్‌మెంట్‌లో అగ్రికల్చర్ ఎక్స్‌టెన్షన్ ఆఫీసర్ (గ్రేడ్-2) ఉద్యోగాలకు ప్రకటన జారీ చేసింది. ‘వ్యవసాయ’ కోర్సులు పూర్తిచేసిన వారికి ఇదో మంచి అవకాశం!

ఉద్యోగం: వ్యవసాయ విస్తరణ అధికారి
మొత్తం ఖాళీలు: 1000
వేతన స్కేలు: రూ.22,460-రూ.66,330
అర్హత: అగ్రికల్చర్‌లో బీఎస్సీ (4 లేదా మూడేళ్ల కోర్సు) (లేదా) డిప్లొమా ఇన్ అగ్రికల్చరల్ ఇంజనీరింగ్ (లేదా) డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ లేదా డిప్లొమా ఇన్ అగ్రికల్చర్ పాలిటెక్నిక్ (సీడ్ టెక్నాలజీ), (ప్లాంట్ ప్రొటెక్షన్), (ఆర్గానిక్ ఫార్మింగ్) ఉత్తీర్ణత.
నోట్: పై అర్హతలున్నవారికి ప్రతి పది ఉద్యోగాలను 4:1:5 నిష్పత్తిలో కేటాయిస్తారు.

వయసు: జూలై 1, 2016 నాటికి 18-44 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో ఐదేళ్లు, ఫిజికల్లీ హ్యాండీక్యాప్డ్ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది.

ఎంపిక విధానం: ఆన్‌లైన్ లేదా ఓఎంఆర్ విధానంలో ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ఉంటుంది. ఇందులో వచ్చిన మార్కుల ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.
 
ముఖ్య తేదీలు
వన్‌టైం రిజిస్ట్రేషన్ (ఓటీఆర్) విధానంలో తొలుత టీఎస్‌పీఎస్సీ వెబ్‌సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత టీఎస్‌పీఎస్సీ ఐడీ, పుట్టిన తేదీ సహాయంతో ఆన్‌లైన్ దరఖాస్తు చేసుకోవాలి.

ఫీజు: ఆన్‌లైన్ అప్లికేషన్ ప్రాసెసింగ్ ఫీజు కింద రూ. 200 చెల్లించాలి. దీంతోపాటు రూ.80 పరీక్ష ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, పీడబ్ల్యూడీ, ఎక్స్‌సర్వీస్‌మెన్ అభ్యర్థులకు పరీక్ష ఫీజు మినహాయింపు ఉంటుంది. నిరుద్యోగ అభ్యర్థుల కోటాలో ఫీజు నుంచి మినహాయింపు పొందితే దీనికి సంబంధించి తగిన సమయంలో కమిషన్‌కు డిక్లరేషన్ సమర్పించాలి.

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం: మే 4, 2016.
దరఖాస్తుకు చివరి తేదీ: మే 19, 2016.
పరీక్ష తేదీ: జూన్ 4, 2016.
పరీక్ష కేంద్రాలు: హైదరాబాద్, కరీంనగర్
వెబ్‌సైట్: www.tspsc.gov.in

సిలబస్
పేపర్-1

కరెంట్ అఫైర్స్ (ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ)
అంతర్జాతీయ సంబంధాలు, కార్యక్రమాలు
జనరల్ సైన్స్; శాస్త్రసాంకేతిక రంగాల్లో భారత్
విజయాలు
పర్యావరణ సమస్యలు, విపత్తు నిర్వహణ
భారత్, తెలంగాణ ఆర్థిక అంశాలు
ఇండియన్ జాగ్రఫీ (తెలంగాణకు ప్రాధాన్యం)
భారత రాజ్యాంగం, రాజనీతి శాస్త్రం (స్థానిక ప్రభుత్వానికి ప్రాధాన్యం)
తెలంగాణ సమాజం, సంస్కృతి, వారసత్వం, కళలు, సాహిత్యం
తెలంగాణ రాష్ట్ర విధానాలు
ఆధునిక భారత చరిత్ర(జాతీయ ఉద్యమానికి ప్రాధాన్యం)
తెలంగాణ చరిత్ర (ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రాధాన్యం)
లాజికల్ రీజనింగ్, అనలిటికల్ ఎబిలిటీ, డేటా ఇంటర్‌ప్రెటేషన్
బేసిక్ ఇంగ్లిష్ (8వ తరగతి స్థాయిలో)

పేపర్-2 అగ్రికల్చర్ (డిప్లొమా స్థాయి)
సిలబ్ అంశాలు: సేద్య విజ్ఞానశాస్త్ర విభాగం; పంటల ప్రాముఖ్యత, మేలైన యాజమాన్య పద్ధతులు; నేల విజ్ఞానం; సస్య ప్రజననం/వృక్ష ప్రజననం-విత్తనోత్పత్తి, విత్తన పరీక్ష; పంటలపై కీటకాలు-వాటి యాజమాన్యం; పంటల తెగుళ్లు-వాటి నివారణ; ఉద్యాన, అటవీ శాస్త్ర విభాగం; వ్యవసాయ ఆర్థిక శాస్త్ర విభాగం; వ్యవసాయ విస్తరణ, గ్రామీణాభివృద్ధి; వ్యవసాయ శక్తివనరులు, యంత్రపరికరాలు; ల్యాండ్ సర్వేయింగ్, వాటర్ ఇంజనీరింగ్, గ్రీన్‌హౌస్ టెక్నాలజీ.

పేపర్-2 (అగ్రికల్చరల్ ఇంజనీరింగ్-డిప్లొమా స్థాయి)
సర్వేయింగ్ అండ్ లెవిలింగ్; హైడ్రాలజీ అండ్ సాయిల్-వాటర్ కన్జర్వేషన్ ఇంజనీరింగ్; ఇరిగేషన్ అండ్ డ్రెయినేజ్; రెన్యువబుల్ ఎనర్జీ సోర్సెస్; వర్క్‌షాప్ టెక్నాలజీ; అగ్రికల్చరల్ ఇంప్లిమెంట్స్ అండ్ మెషినరీ; అగ్రికల్చరల్ స్ట్రక్చర్స్ అండ్ ప్రాసెస్ ఇంజనీరింగ్; అగ్రికల్చరల్ సెన్సైస్ అండ్ కంప్యూటర్ బేసిక్స్ అంశాల నుంచి ప్రశ్నలు వస్తాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement