అర్జున అవార్డు పొందిన క్రికెటర్?
జీకే - కరెంట్ అఫైర్స్
1.ప్రపంచ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో వరుసగా రెండు పతకాలు నెగ్గిన తొలి భారతీయ క్రీడాకారిణి?
1) సైనా నెహ్వాల్ 2) అశ్విని పొన్నప్ప
3) గుత్తా జ్వాల 4) పి.వి. సింధు
2. ఈ ఏడాది జాతీయ క్రీడా అవార్డుల్లో అర్జున అవార్డును ఏ క్రికెటర్‌కు ప్రకటించారు?
1) విరాట్ కోహ్లి 2) ఆర్. అశ్విన్
3) చతేశ్వర్ పుజారా 4) రవీంద్ర జడేజా
3. ఏ నగరాన్ని క్యోటో తరహాలో స్మార్‌ట సిటీగా తీర్చిదిద్దేలా జపాన్ దేశంతో అవగాహనా ఒప్పందాన్ని (2014 ఆగస్టు 30న) కుదుర్చుకున్నారు?
1) గాంధీనగర్ 2) వడోదరా
3) వారణాసి 4) అయోధ్య
4. {పధాన మంత్రి జన ధన యోజన పథకాన్ని ఏ రోజున ప్రారంభించారు?
1) ఆగస్టు 15 2) ఆగస్టు 25
3) ఆగస్టు 30 4) ఆగస్టు 28
5. 2014 ఆగస్టులో రాజస్థాన్ గవర్నర్‌గా ఎవరిని నియమించారు?
1) పద్మనాభ ఆచార్య
2) సీహెచ్. విద్యాసాగర్‌రావు
3) వి.కె. మల్హోత్రా 4) కల్యాణ్ సింగ్
6. భారతదేశంలో ఫిబ్రవరి 28వ తేదీని ఏ విధంగా జరుపుకుంటారు?
1) జాతీయ గణాంక దినం
2) జాతీయ విద్యాదినం
3) జాతీయ గణిత దినం
4) జాతీయ సైన్‌స దినం
7. 2014 జనవరి 1న లాత్వియా దేనిలో సభ్యదేశంగా చేరింది?
1) నాటో
2) యూరోపియన్ యూనియన్
3) యూరో జోన్ 4) ఐక్యరాజ్య సమితి
8. 1971లో వరల్డ్ ఎకనమిక్ ఫోరంను ఎవరు స్థాపించారు?
1) రాబర్‌ట జోలిక్
2) రాబర్‌ట మెక్‌నమారా
3) క్లాస్ ష్వాబ్ 4) జోసెఫ్ స్టిగ్లిట్జ్
9. అణ్వాయుధ సామర్థ్యం ఉన్న అగ్ని-4 క్షిపణి ఎన్నివేల కిలోమీటర్ల దూరంలోని లక్ష్యాన్ని ఛేదించగలుగుతుంది?
1) 3 2) 4 3) 5 4) ఏదీకాదు
10. ‘క్రానికల్స్ ఆఫ్ ఏ కార్‌ప్స బేరర్’ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు?
1) జీత్ థాయిల్ 2) హెచ్.ఎం. నక్వీ
3) సైరస్ మిస్త్రీ
4) షెహాన్ కరుణ తిలక
11. డొమినికా సిబుల్కోవా ఏ దేశానికి చెందిన టెన్నిస్ క్రీడాకారిణి?
1) చెక్ రిపబ్లిక్ 2) స్పెయిన్
3) స్లొవేకియా 4) బల్గేరియా
12. 2014 జనవరి 1న న్యూయార్‌క నగరానికి మేయర్‌గా పదవీ బాధ్యతలు స్వీకరించింది?
1) మైకేల్ బ్లూమ్‌బర్‌గ 2) బిల్ డి. బ్లేసియో
3) బ్రాడ్ లాండర్ 4) జో లోటా
13. 2014 ఫిబ్రవరిలో 101వ భారత సైన్‌స కాంగ్రెస్ ఎక్కడ జరిగింది?
1) జమ్మూ 2) న్యూఢిల్లీ
3) చెన్నై 4) కోల్‌కతా
14. 2014 జనవరి 25న హెరీ రాజొనారిమమ్ పియానినా ఏ దేశానికి అధ్యక్షుడయ్యారు?
1) సోమాలియా 2) దక్షిణ సుడాన్
3) గాంబియా 4) మడగాస్కర్
15. అంతర్జాతీయ క్రికెట్ సంఘం (ఐసీసీ) అంపైర్ ప్యానల్‌లో స్థానం పొందిన మొదటి మహిళ క్యాతీ క్రాస్. ఈమె ఏ దేశానికి చెందిన వ్యక్తి?
1) దక్షిణాఫ్రికా 2) ఇంగ్లండ్
3) న్యూజిలాండ్ 4) వెస్టిండీస్
16. ఇటీవల విస్ఫోటనం చెందిన మౌంట్ కెలుద్ అగ్నిపర్వతం ఏ దేశంలో ఉంది?
1) ఇటలీ 2) ఇండోనేషియా
3) ఫిలిప్పీన్‌స 4) జపాన్
17. ఫార్చ్యూన్ జాబితాలో అత్యంత శక్తి వంత మైన మహిళా వ్యాపారవేత్తగా అగ్రస్థా నంలో నిలిచిన మేరీ బర్రా ఏ కంపెనీకి సీఈవో?
1) ఐబీఎం 2) పెట్రోబ్రాస్
3) యాహు 4) జనరల్ మోటార్‌స
18. 2014లో కర్ణాటక క్రికెట్ జట్టు కిందివాటిలో ఏ ట్రోఫీని గెలుచుకుంది?
1) రంజీ ట్రోఫీ 2) ఇరానీ ట్రోఫీ
3) 1, 2 4) ఏదీకాదు
19. విజ్డెన్ క్రికెటర్‌స అల్మనాక్ కవర్ పేజీకెక్కిన తొలి భారతీయుడు?
1) సునీల్ గవాస్కర్ 2) కపిల్‌దేవ్
3) రాహుల్ ద్రవిడ్
4) సచిన్ టెండూల్కర్
20. 2014 ఫిబ్రవరిలో స్వర్ణోత్సవాలను జరుపుకున్న సంస్థ?
1) ఇంటెలిజెన్‌స బ్యూరో
2) కేంద్ర దర్యాప్తు సంస్థ
3) కేంద్ర విజిలెన్‌స కమిషన్
4) రీసెర్‌చ అండ్ అనాలిసిస్ వింగ్
21. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల 7వ వేతన సంఘం చైర్మన్‌గా ఎవరు నియమితు లయ్యారు?
1) వివేక్ రే 2) రతన్ రాయ్
3) అశోక్ కుమార్ మాథుర్
4) రాజేష్ కుమార్ అగర్వాల్
22. ఇటీవల ఏ వయసు బాలలకైనా కారుణ్య మరణాలను చట్టబద్ధం చేసిన ఐరోపా దేశం?
1) నార్వే 2) బెల్జియం
3) లక్సెమ్‌బర్‌గ 4) ఫిన్‌లాండ్
23. 2014 ఫిబ్రవరిలో భారత్‌లో పర్యటించిన జొయాచిమ్ గౌక్ ఏ దేశాధ్యక్షుడు?
1) ఇటలీ 2) ఎస్టోనియా
3) డెన్మార్‌క 4) జర్మనీ
24. 103 ఏళ్ల సిల్వరీన్ స్వేర్ 2014 ఫిబ్రవరి 1న మరణించారు. ఆమె ఏ రాష్ట్రానికి చెందిన తొలి పద్మశ్రీ అవార్డు గ్రహీత?
1) మేఘాలయ 2) మణిపూర్
3) మిజోరం 4) అరుణాచల్ ప్రదేశ్
25. జాతీయ క్రీడా దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు?
1) ఆగస్టు 14 2) ఆగస్టు 2
3) ఆగస్టు 29 4) ఆగస్టు 22
26. భారతరత్న లభించని శాస్త్రవేత్త?
1) సి.వి.రామన్
2) ఎ.పి.జె. అబ్దుల్ కలామ్
3) సి.ఎన్.ఆర్. రావు 4) ఎస్. చంద్రశేఖర్
27. సచిన్ టెండూల్కర్‌కు భారతరత్న అవార్డును రాష్ర్టపతి ప్రణబ్ ముఖర్జీ ఎప్పుడు ప్రదానం చేశారు?
1) 2013 నవంబర్ 16
2) 2013 డిసెంబర్ 16
3) 2014 ఫిబ్రవరి 4
4) 2014 జనవరి 4
28. 2014 జనవరిలో లూసోఫోనియా క్రీడలు ఎక్కడ జరిగాయి?
1) కేరళ 2) గోవా
3) పంజాబ్ 4) మణిపూర్
29. ఏ భాష వాడుకలో ఉన్న దేశాల మధ్య జరిగే క్రీడలను లూసోఫోనియా క్రీడలు అంటారు?
1) ఫ్రెంచ్ 2) జర్మన్
3) స్పానిష్ 4) పోర్చుగీస్
30. 2014 జనవరిలో జరిగిన లూసోఫోనియా క్రీడల్లో 37 స్వర్ణాలతో మొత్తం 92 పతకా లతో అగ్రస్థానంలో నిలిచిన దేశం?
1) భారత్ 2) శ్రీలంక
3) అంగోలా 4) బ్రెజిల్
31. నాలుగో లూసోఫోనియా క్రీడలు 2017లో ఏ దేశంలో నిర్వహిస్తారు?
1) కేప్ వెర్డె 2) తూర్పు తైమూర్
3) గినియా బిస్సావు 4) మొజాంబిక్
32. కిందివాటిలో సరికాని జత ఏది?
1) నేపాల్ ప్రధాన మంత్రి
- సుశీల్ కొయిరాలా
2) దక్షిణ కొరియా అధ్యక్షుడు
- పార్‌క గెయిన్ హే
3) మాల్దీవుల అధ్యక్షుడు
- అబ్దుల్లా యమీన్
4) బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి
- ఖలీదా జియా
33. వార్సా ఏ దేశానికి రాజధాని?
1) స్పెయిన్ 2) పోలండ్
3) పోర్చుగల్ 4) మాసిడోనియా
34. జ్ఞానపీఠ్ అవార్డును ఎంతమంది తెలుగు రచయితలకు ప్రదానం చేశారు?
1) 1 2) 2 3) 3 4) 4
35. శ్వేత విప్లవం వేటి ఉత్పత్తికి సంబంధించింది?
1) చేపలు 2) నూనె గింజలు
3) కూరగాయలు 4) ఏవీకావు
36. 1991లో కె.కె. బిర్లా ఫౌండేషన్ స్థాపించిన వ్యాస్ సమ్మాన్ పురస్కారాన్ని ఏ భాషా రచయితలకు ప్రదానం చేస్తారు?
1) సంస్కృతం 2) రాజస్థానీ
3) హిందీ 4) బెంగాలీ
37. 2013 వ్యాస్ సమ్మాన్ పురస్కార గ్రహీత?
1) విశ్వనాథ త్రిపాఠి
2) సుగతా కుమారి
3) శ్రీలాల్ శుక్లా
4) సత్యవ్రత్ శాస్త్రి
38. ఒకే టెస్ట్ మ్యాచ్‌లో ట్రిపుల్ సెంచరీ, సెంచరీ చేసిన రెండో బ్యాట్స్‌మన్?
1) మహేల జయవర్ధనే
2) వీరేంద్ర సెహ్వాగ్
3) బ్రియాన్ లారా 4) కుమార సంగక్కర
39. దేశంలోనే మొదటి మోనోరైలు ఎక్కడ ప్రారంభమైంది?
1) న్యూఢిల్లీ 2) బెంగళూరు
3) ముంబై 4) కోల్‌కతా
40. భారత ఒలింపిక్ సంఘం అధ్యక్షుడిగా ఎంపికైనవారు?
1) ఎన్. శ్రీనివాసన్
2) అఖిలేష్ దాస్ గుప్తా
3) ఎన్. రామచంద్రన్
4) సురేశ్ కల్మాడీ
సమాధానాలు
1) 4; 2) 2; 3) 3; 4) 4;
5) 4; 6) 4; 7) 3; 8) 3;
9) 2; 10) 3; 11) 3; 12) 2;
13) 1; 14) 4; 15) 3; 16) 2;
17) 4; 18) 3; 19) 4; 20) 3;
21) 3; 22) 2; 23) 4; 24) 1;
25) 3; 26) 4; 27) 3; 28) 2;
29) 4; 30) 1; 31) 4; 32) 4;
33) 2; 34) 3; 35) 4; 36) 3;
37) 1; 38) 4; 39) 3; 40) 3.
జన్‌ధన్ యోజన
కేంద్ర ప్రభుత్వం 2014 ఆగస్టు 15న ‘ప్రధానమంత్రి జనధన్ యోజన’ పథకాన్ని ప్రకటించింది. పేద ప్రజలందరికీ బ్యాంక్ ఖాతాలను కల్పించడం ద్వారా ఆర్థిక అస్పృశ్యతను.. తద్వారా పేదరికాన్ని నిర్మూ లించడమే ఈ పథకం లక్ష్యం. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆగస్టు 28న ఢిల్లీలో ప్రారంభించారు. దేశం మొత్తంమీద 600 కార్యక్రమాలు 77 వేల శిబిరాల ద్వారా ఈ పథకం ప్రారంభమైంది.
ముఖ్యాంశాలు:
- జన్‌ధన్ యోజన కింద ఆగస్టు 28న ఒక్క రోజే దేశవ్యాప్తంగా 1.5 కోట్ల బ్యాంకు ఖాతాలను పేద ప్రజల పేరిట తెరిచారు. వచ్చే ఏడాది జనవరి 26 లోపు ఈ పథకం కింద బ్యాంకు ఖాతా తెరిచినవారికి లక్ష రూపాయల ప్రమాద బీమా కల్పిస్తారు. రూ. 30 వేల జీవిత బీమాను కూడా కల్పిస్తారు.
- ఖాతా తెరిచిన ఆరు నెలల తర్వాత ప్రతి ఖాతాదారునికి 5 వేల రూపాయల వరకు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం కల్పిస్తారు. కనీస మొత్తమేమీ లేకుండానే ఈ ఖాతాను తెరవవచ్చు. ఖాతాదారులకు రూపే డెబిట్ కార్డు అందజేస్తారు.
- జన్‌ధన్ యోజన ద్వారా 2015 జనవరి 26 నాటికి దేశంలోని ఏడున్నర కోట్ల మందికి బ్యాంకు ఖాతాలు లభిస్తాయి.
- హైదరాబాద్‌లో ప్రధానమంత్రి జన్‌ధన్ యోజన పథకాన్ని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు ప్రారంభించారు. రాజమండ్రిలో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రారంభించారు.
- ఈ పథకం ట్యాగ్‌లైన్ ‘మేరా ఖాతా భాగ్య విధాతా’.
- దీని లోగోను రూపకల్పన చేసినవారు - ప్రియాశర్మ. పథక ప్రారంభోత్సవంలో ప్రధానమంత్రి ఈ మహిళకు 25 వేల రూపాయల బహుమతిని అందజేశారు.
- ఈ పథకం ద్వారా ప్రజలకు కొంత రుణలభ్యత ఉండటం వల్ల వడ్డీ వ్యాపారుల నుండి రుణాలు తీసుకునే పరిస్థితి నుంచి బయటపడే అవకాశం ఉంది. ప్రభుత్వం సంక్షేమ పథకాలకు వెచ్చిస్తున్న వేల కోట్ల రూపాయలను లబ్ధిదారుల ఖాతాల్లోకి నేరుగా బదలాయించడం సాధ్యమవుతుంది. దీనివల్ల అట్టడుగు స్థాయిలో అవినీతికి అడ్డుకట్ట వేయవచ్చు. పేదరికం, అప్పులతో కూడిన విష వలయం నుంచి ప్రజలు విముక్తి పొందుతారు.
- రూపే డెబిట్ కార్డును నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రూపొందించింది. రూపే కార్డు ఉన్నవారికి ఎల్‌ఐసీ 30 వేల రూపాయల జీవిత బీమా అందిస్తుంది. హెచ్‌డీఎఫ్‌సీ ఎర్గో లక్ష రూపాయల ప్రమాద బీమాను అందిస్తుంది.