కెరీర్ కౌన్సెలింగ్
ఎంఎస్సీ సెరీకల్చర్ కోర్సును అందిస్తున్న ఇన్‌స్టిట్యూట్‌ల వివరాలు తెలపండి?
-సాయి రమ్య, తెనాలి.
అనంతపురంలోని శ్రీ కృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం.. సెరీకల్చర్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత: ఏదైనా బయాలజీ సబ్జెక్టుతో బీఎస్సీ.
ప్రవేశం: ఎస్‌కేయూసెట్‌లో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.skuniversity.org
తిరుపతిలోని శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం.. సెరీ- బయోటెక్నాలజీలో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత: సెరీకల్చర్/అగ్రికల్చర్/హార్టీకల్చర్/ఫారెస్ట్రీ/జువాలజీ/బోటనీ/ కెమిస్ట్రీ/ క్లినికల్ పాథాలజీ/మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ/ జెనెటిక్స్/ మాలిక్యులార్ బయాలజీ/ బయోటెక్నాలజీ/ ఎంటమాలజీ/ మెడికల్ ల్యాబ్ టెక్నాలజీల్లో ఏదైనా రెండు సబ్జెక్టులతో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.spmvv.ac.in
వరంగల్‌లోని కాకతీయ విశ్వవిద్యాలయం.. సెరీకల్చర్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత: సంబంధిత సబ్జెక్టుతో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
ఇదే విశ్వవిద్యాలయం సెరీకల్చర్‌లో డిప్లొమా కోర్సు కూడా అందిస్తోంది.
వెబ్‌సైట్: www.kakatiya.ac.in
బెంగళూరులోని యూనివర్సిటీ ఆఫ్ అగ్రికల్చరల్ సెన్సైస్‌లో సెరీకల్చర్‌లో ఎంఎస్సీ అందిస్తోంది.
అర్హత: అగ్రికల్చర్/హార్ట్టికల్చర్/అగ్రి బయోటెక్/ ఫారెస్ట్రీ/ సెరీకల్చర్‌లో బీఎస్సీ.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.uasbangalore.edu.in