ఇంటీరియర్ డిజైన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- ఇందిర, వరంగల్.
హైదరాబాద్‌లోని జవహర్‌లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ.. ఇంటీరియర్ డిజైన్ స్పెషలైజేషన్‌తో ఎంఆర్క్ అందిస్తోంది.
అర్హత: బీఆర్క్ ఉత్తీర్ణత.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.jnafau.ac.in
హైదరాబాద్‌లోని హామ్స్‌టెక్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ అండ్ ఇంటీరియర్ డిజైన్.. ఇంటీరియర్ డిజైన్‌లో ఏడాది, రెండేళ్ల వ్యవధి గల డిప్లొమా కోర్సులు అందిస్తోంది.
అర్హత: పదోతరగతి/ ఇంటర్మీడియెట్
వెబ్‌సైట్: www.hamstech.com
తమిళనాడులోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ.. విజువల్ కమ్యూనికేషన్స్‌లో బీఎస్సీ అందిస్తోంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా 10+2.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.srmuniv.ac.in
చెన్నైలోని లయోలా కాలేజ్.. విజువల్ కమ్యూనికేషన్‌లో బీఎస్సీ అందిస్తోంది.
అర్హత: కనీసం 60 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ లేదా 10+2.
ప్రవేశం: ప్రవేశపరీక్షలో ఉత్తీర్ణత ఆధారంగా.
వెబ్‌సైట్: www.loyolacollege.edu
తమిళనాడులోని అన్నామలై విశ్వవిద్యాలయం.. దూరవిద్య ద్వారా బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్‌ను అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2 ఉత్తీర్ణత.
వెబ్‌సైట్: www.annamalaiuniversity.ac.in/dde/
చెన్నైలో సెయింట్ పీటర్స్ యూనివర్సిటీలోని దూరవిద్య కేంద్రం.. దూరవిద్య ద్వారా బీఎస్సీ విజువల్ కమ్యూనికేషన్స్ అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2.
వెబ్‌సైట్: www.stpetersuniversity.org/cde/
కెరీర్ కౌన్సెలింగ్
Published Wed, Oct 5 2016 1:11 AM | Last Updated on Mon, Sep 4 2017 4:09 PM
Advertisement
Advertisement