హోటల్ మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- సాగర్, విజయవాడ
హైదరాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ అండ్ అప్లైడ్ న్యూట్రిషన్.. హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్‌లో బీఎస్సీ అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్ లేదా 10+2
ప్రవేశం: ప్రవేశపరీక్ష ఆధారంగా.
వెబ్‌సైట్: www.ihmhyd.org
హైదరాబాద్‌లోని కలినరీ అకాడమీ ఆఫ్ ఇండియా.. హోటల్ మేనేజ్‌మెంట్‌లో వివిధ కోర్సులను అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
ప్రవేశం: ప్రవేశపరీక్ష, గ్రూప్ డిస్కషన్, ఇంటర్వ్యూ ఆధారంగా
వెబ్‌సైట్: iactchefacademy.com
యానిమేషన్ కోర్సును అందిస్తున్న సంస్థల వివరాలు తెలపండి?
- రాంమోహన్,విజయవాడ
జేఎన్‌టీయూహెచ్‌కు అనుబంధంగా ఉన్న హైదరాబాద్‌లోని ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ కంప్యూటర్ గ్రాఫిక్స్.. యానిమేషన్‌లో డిగ్రీని అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
వెబ్‌సైట్: www.iacg.co.in
హైదరాబాద్‌లోని అన్నపూర్ణ ఇంటర్నేషనల్ స్కూల్ ఆఫ్ ఫిల్మ్ అండ్ మీడియా.. యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్‌లో డిగ్రీని అందిస్తోంది.
అర్హత: ఇంటర్మీడియెట్/10+2
వెబ్‌సైట్: www.aisfm.edu.in
ఐఐఎస్సీ (బెంగళూరు) నుంచి పీహెచ్‌డీ చేయడం ఎలా?
- ధరణి, సికింద్రాబాద్.
ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ)-బెంగళూరు.. నేచురల్ సెన్సైస్, ఫిజికల్ సెన్సైస్, ఇంజనీరింగ్, కెమికల్ సెన్సైస్, మ్యాథమెటిక్స్ విభాగాల్లో పీహెచ్‌డీ, ఇంటిగ్రే టెడ్ పీహెచ్‌డీ కోర్సులను అందిస్తోంది. పీహెచ్‌డీ కోర్సులకు సీఎస్‌ఐఆర్-నెట్ జేఆర్‌ఎఫ్/డీబీటీ జేఆర్‌ఎఫ్/ ఐసీఎంఆర్ జేఆర్‌ఎఫ్; జెస్ట్, ఎన్‌బీహెచ్‌ఎం లేదా ఐఐఎస్సీ ఎంట్రెన్స్ టెస్ట్/ గేట్‌లో స్కోర్ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు. ఐఐటీ-జామ్ ఆధారంగా ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు
వివరాలకు: www.iisc.ernet.in
మీ సలహాలు, సందేహాలు పంపాల్సిన ఈ-మెయిల్: sakshieducation@gmail.com
కెరీర్ కౌన్సెలింగ్
Published Wed, May 4 2016 2:24 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM
Advertisement
Advertisement