ఎంఎస్సీ-జియాలజీ కోర్సు వివరాలు.. | Career Counselling - Ask the expert | Sakshi
Sakshi News home page

ఎంఎస్సీ-జియాలజీ కోర్సు వివరాలు..

Published Wed, Mar 12 2014 11:43 PM | Last Updated on Sat, Sep 2 2017 4:38 AM

Career Counselling - Ask the expert

టి. మురళీధరన్
టి.ఎం.ఐ. నెట్‌వర్క్

 ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలుపగలరు?    - వెంకట్, జడ్చర్ల.  విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలు, రాకెట్లు, క్షిపణులు తదితరాల డిజైన్, నిర్మాణం, నిర్వహణలకు సంబంధించిందే ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇది విమానయానం, అంతరిక్ష యాత్రలు, రక్షణ వ్యవస్థలకు వెన్నెముక వంటిది.
 
 కోర్సుల వివరాలు:
     జేఎన్‌టీయూ-హైదరాబాద్.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది. ఈ కోర్సులో ప్రవేశానికి సంబంధిత అంశంలో బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. వెబ్‌సైట్: www.jntuh.ac.in
     ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరు.. ఏరోస్పేస్‌లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్‌సైట్: www.iisc.ernet.in
     డిఫెన్స్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ, పుణే.. ఎంటెక్-ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్‌సైట్: www.diat.ac.in
 
 కెరీర్ అవకాశాలు:
 ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి విమానయాన రంగం; వివిధ ప్రభుత్వ విభాగాలు; విద్య, పరిశోధన సంస్థల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి.  
 
 ఎంఎస్సీ-జియాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవీ?
     -మధు, నల్లగొండ.

జియాలజీ కోర్సులను పూర్తి చేసిన వారు మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, గ్యాస్, ఖనిజ సంబంధ పరిశ్రమలలో వివిధ హోదాల్లో స్థిరపడొచ్చు. అంతేకాకుండా వివిధ పరిశోధన సంస్థల్లో కూడా అవకాశాలు ఉంటా యి. యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ నిర్వహించే జియాలజిస్ట్ పరీక్షల్లో అర్హత సాధించి ప్రభుత్వ రంగంలో స్థిర పడొచ్చు.
 
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
వెబ్‌సైట్: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
వెబ్‌సైట్: http://svuniversity.ac.in


 పీజీలో ఎలక్ట్రానిక్స్/ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
 -రవీందర్, బోధన్

 ఎలక్ట్రానిక్స్/ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సు పూర్తి చేసిన వారికి కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, ఆటోమోటివ్, సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో అవకాశాలు ఉంటాయి.
 ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
     ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
     కోర్సు: ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్). వెబ్‌సైట్: ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ
     ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం
     కోర్సు: ఎంఎస్సీ (టెక్)-ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్.
 వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
 మన రాష్ట్రంలో ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సు డిప్లొమా/పీజీ డిప్లొమా/ఎంటెక్ స్థాయిల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎంటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి.
     సీ-డాక్-హైదరాబాద్
     కోర్సు: డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్
     వెబ్‌సైట్: www.cdachyd.in

 
 ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సును అందిస్తున్న సంస్థలేవీ? కెరీర్ ఎలా ఉంటుంది?
 - అలేఖ్య, వరంగల్

 న్యూట్రిషన్ సంబంధిత కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఫుడ్, ఫుడ్‌ప్రాసెసింగ్, డెయిరీ, ప్యాకేజింగ్, ఫిషరీస్, బయోటెక్నాలజీ, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో, బహుళజాతి కంపెనీల్లో, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. సొంతంగా బేకరీ, స్టోరేజ్ యూనిట్‌లను స్థాపించడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు.
 
ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
ఆచార్య ఎన్‌జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- హైదరాబాద్.
కోర్సు: ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ
అర్హత: బీటెక్‌లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్/డెయిరీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీవీఎస్‌సీ, బీహెచ్‌ఎస్‌సీ, బీఎస్సీ అగ్రికల్చర్/ హార్టికల్చర్/ సెరికల్చర్/ఫారెస్ట్రీ/ బీఎఫ్‌ఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి.
ప్రవేశం: బ్యాచిలర్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా
వివరాలకు: www.angrau.net


ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్
ప్రవేశం: ఎంట్రన్స్ ఆధారంగా
వివరాలకు: www.osmania.ac.in
ఆంధ్రా యూనివర్సిటీ-విఖాఖపట్నం
కోర్సు: ఎంఎస్సీ (న్యూట్రిషన్ అండ్ డెటైటిక్స్)
వెబ్‌సైట్: www.andhrauniversity.edu.in
శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి
కోర్సు: ఎంఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ)
వెబ్‌సైట్: http://svuniversity.ac.in

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement