Aerospace Engineering
-
‘అగ్ని’ అగర్వాల్ ఇక లేరు
భారత్‌కు చెందిన ప్రముఖ ఏరోస్పెస్ ఇంజనీర్ రామ్ నారాయణ్ అగర్వాల్ ఇక లేరు. 84 ఏళ్ల వయసులో హైదరాబాద్‌లోని నివాసంలో గురువారం(ఆగస్టు 15) ఆయన తుదిశ్వాస విడిచారు. గత కొంత కాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్నట్లు తెలుస్తోంది. భూతల (surface-to-surface missile) క్షిపణి.. భారత క్షిపణుల్లో మణిహారంగా పేర్కొనే ‘అగ్ని’ని రూపొందించడంలో ఈయనదే ప్రముఖ పాత్ర. అందుకే ఆర్ఎన్ అగర్వాల్‌ను ఫాదర్ ఆఫ్ ది అగ్ని సిరీస్ ఆఫ్ మిస్సైల్స్‌గా పిలుస్తుంటారు.రామ్ నారాయణ్ అగర్వాల్ రాజస్థాన్‌లోని జైపూర్‌లో వ్యాపారుల కుటుంబంలో జన్మించారు. బెంగుళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. అనంతరం ప్రోగ్రాం డైరెక్టర్‌గా (AGNI), డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లాబొరేటరీ డైరెక్టర్‌గా పనిచేశారు.అగర్వాల్ 1983 నుంచి అగ్ని ప్రయోగానికి నాయకత్వం వహించారు. 33 ఏళ్ల క్రితం మే 22 1989న.. ప్రోగ్రామ్ డైరెక్టర్‌గా ఉన్న అగర్వాల్.. తన బృందంతో కలిసి 1000 కిలోల పేలోడ్‌తో 800 కి.మీపైగా అగ్ని క్షిపణిని విజయవంతంగా పరీక్షించారు. ఈ మీడియం రేంజ్ బాలిస్టిక్ క్షిపణిని ఒడిశా తీరంలోని బాలాసోర్‌లోని చండీపూర్‌లో ప్రయోగించారు.రక్షణ రంగంలో ఈయన చేసిన కృషికి గానూ భారత ప్రభుత్వం 1990లో పద్మశ్రీ, 2000 సంవత్సరంలో పద్మభూషణ్ అవార్డులతో సత్కరించింది. దేశ రక్షణ కోసం అవిరామంగా కృషి చేసిన అగర్వాల్.. స్వాతంత్ర దినోత్సవం నాడే కన్నుమూయడం గమనార్హం. AgniWall, the father of India’s Agni missile (ICBM), R N Agarwal passes away on Independence Day today in Hyderabad. pic.twitter.com/eiRnEk1fi1— M Somasekhar (@Som_mulugu) August 15, 2024 ఆర్ ఎన్ అగర్వాల్ మృతితో.. దేశం ఓ గొప్ప సైంటిస్ట్‌ను కోల్పోయింది. అగ్ని క్షిపణి కోసం అగర్వాల్ విశేషంగా పని చేశారు. తన కృషిని విస్తృతస్థాయికి తీసుకెళ్లి.. వేరుర్వేరు క్షిఫణుల తయారీకి దోహదపడ్డారు. క్షిపణి రంగంలో అనేక వ్యవస్థలను ఏర్పాటు చేశారాయన. ::: జి. సతీష్‌రెడ్డి, ఏరోనాటికల్ సొసైటీ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్, డీఆర్డీవో మాజీ చైర్మన్ -
అంతరిక్షంలో ‘ధృవ’
సాక్షి, హైదరాబాద్: అంతరిక్ష రంగంలో ప్రైవేటు సంస్థల భాగస్వామ్యానికి కేంద్ర ప్రభుత్వం నిబంధనలు సడలించిన నేపథ్యంలో... కేంద్ర అంతరిక్ష విభాగానికి చెందిన ప్రభుత్వ రంగ సంస్థ ‘న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్’(ఎన్ఎస్ఐఎల్)లో హైదరాబాద్‌కు చెందిన అంతరిక్ష ఇంజనీరింగ్ పరిష్కారాల ఆవిష్కర్త ‘ధృవ స్పేస్ ప్రైవేటు లిమిటెడ్’ గురువారం ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం అంతరిక్ష రంగంలో తొలిసారి ప్రైవేటుగా వాణిజ్య ప్రయోగ సేవల్ని ‘ధృవ స్పేస్’అందించనుంది. స్పేస్‌క్రాఫ్ట్ ప్లాట్ఫారం, నియంత్రణ, సమాచార, విద్యుత్ వ్యవస్థలు, సోలార్ ప్యానెళ్లతో ఉపగ్రహ ప్రయోగ రంగంలో ‘ధృవ స్పేస్ ఆర్బిటల్ డిప్లాయర్స్’(డీఎస్‌ఓడీ) పేరిట కొత్త సాంకేతికతను అభివృద్ధి చేసింది. ఉపగ్రహ వాహక నౌకల్లో భద్రతా ప్రమాణాలు, కచ్చితత్వం నెలకొల్పడంతో పాటుగా వాటిని మరింత సులువుగా ప్రయోగించడంలో ఈ సాంకేతికత ఉపయోగపడనుంది. ఒప్పందానికి తొలిమెట్టు డీఎస్‌ఓడీ టెక్నాలజీ పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (పీఎస్ఎల్వీ), స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ (ఎస్ఎస్ఎల్వీ)లో ధృవ తన డీఎస్‌ఓడీ సాంకేతికత ద్వారా ప్రయోగ సేవలు అందించడానికి ఇది తొలిమెట్టు. ఒప్పం దం మేరకు ధృవ తొలుత ‘డీఎస్‌ఓడీ –1యు ç పరీ క్షించనున్నారు. ఉపగ్రహం నిర్దేశిత కక్ష్యలోకి చేరింది లేనిదీ కచ్చితంగా తెలిపే సెన్సర్లు ఈ సాంకేతికతలో కీలకంగా పరిగణిస్తున్నారు. మరో ఏడాది కాలంలో మరింత సామర్థ్యంతో కూడిన డీఎస్‌ఓడీ 3యు, 6యు, 12యు డిప్లాయర్స్ పనితీరునూ ‘ధృవ’ పరీక్షించనుంది. ఇన్‌స్పేస్, ఇస్రో, కేంద్ర అంతరిక్ష విభాగం నుంచి లభించిన మద్దతుతో స్మాల్ శాటిలైట్ సాంకేతికతలో దేశీయ ఆవిష్కరణలకు చోటు లభించిందని ధృవ స్పేస్ సీఈఓ సంజయ్ నెక్కంటి వ్యాఖ్యానించారు. దీంతో భారతీయ అంతరిక్ష స్టార్టప్‌లకు మరింత ఊతం లభిస్తుందని ఎన్ఎస్ఐఎల్ సీఎండీ డాక్టర్ రాధాకృష్ణ దురైరాజ్ చెప్పారు. -
ఫైటర్ పైలట్..బ్రైట్ అండ్ ఫైట్
‘అపజయాలు ఎదురైతే అధైర్యం వద్దు. వెనక్కి తగ్గవద్దు. అపజయం అంటే ఏమిటో కాదు... నేర్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నం’ ఆకాశంలో బొయ్య్మని విమానం చేసే శబ్దాలు వినడమన్నా, చిన్ని విమానాన్ని కళ్లు పెద్దవి చేసి చూడడమన్నా అందరు పిల్లల్లాగే రోషిణికీ ఇష్టం. ఆ ఇష్టం ఆమెను వైమానిక చరిత్రకు సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను తెలుసుకునేలా చేసింది. ఠాణె (మహారాష్ట్ర)లోని లోక్ పురం పబ్లిక్ స్కూల్లో చదివే రోజుల్లో రోషిణికి వచ్చే సందేహాలు...ఆమె విజ్ఞాన దాహానికి నిదర్శనాలుగా ఉండేవి. మాజీ రాష్ట్రపతి, ఏరోస్పేస్ సైంటిస్ట్ అబ్దుల్ కలామ్ అంటే రోషిణికి ఎంతో అభిమానం. తాను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేయడానికి, ఫైటర్ పైలట్ కావడానికి ఆయనే స్ఫూర్తి. మంచి మాటలు మంచి కలలను ఇస్తాయి. కలామ్ ఏం అన్నారు? ‘అపజయాలు ఎదురైతే అధైర్యం వద్దు. వెనక్కి తగ్గవద్దు. అపజయం అంటే ఏమిటో కాదు... నేర్చుకునే ప్రక్రియలో మొదటి ప్రయత్నం’ ... ఇదిమాత్రమే కాదు, ‘ప్రతి గురువు ఒకప్పుడు విద్యార్థే. ప్రతి విజేత ఒకప్పుడు పరాజితుడే. ప్రతి నిపుణుడు ఒకప్పుడు తొలి అడుగులు వేసిన వాడే. అందరూ నేర్చుకోవడం అనే వంతెనను దాటి వచ్చినవారే’ ఇలాంటి మాటలు రోషిణి ఆశయ బలానికి అవసరమైన ఉత్సాహాన్ని ఇచ్చాయి. ‘చిన్నప్పటి నుంచి తన ఆలోచనలకు విలువ ఇస్తూ వచ్చాం. ఫైటర్ పైలట్ కావాలనేది తన లక్ష్యమని చెప్పినప్పుడు ఆశీర్వదించాం. మా అమ్మాయి ఫైటర్ పైలట్ అని గర్వంగా చెప్పుకోవడంతో పాటు, పిల్లల కలలను నిరక్ష్యం చేయకండి. వారి కలలకు బలాన్ని ఇవ్వండి...అని తల్లిదండ్రులకు చెప్పే సందర్భాన్ని ఇచ్చాయి’ అంటున్నాడు రోషిణి తండ్రి రవి అయ్యర్. చెన్నై సమీపంలోని ఎస్ఆర్ఎం యూనివర్శిటీలో ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చేసిన అయ్యర్ ఎయిర్‌ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ (ఏఎఫ్‌సీఏటి) ద్వారా ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లోకి వచ్చింది. ‘ఫైటర్ పైలట్ అంటే నా దృష్టిలో ఉద్యోగం కాదు. బృహత్తరమైన బాధ్యత. జాతికి సేవ చేసుకునే అదృష్టం’ అంటుంది రోషిణి. స్కూల్లో చదివే రోజుల్లో రోషిణి జాతీయస్థాయిలో ఆటలు ఆడింది. రీడింగ్, ట్రెక్కింగ్, పెయింటింగ్ అంటే రోషిణికి బాగా ఇష్టం. మూడు అభిరుచులను ముచ్చటగా సమన్వయం చేసుకోవడం కూడా ఆమెకు తెలుసు. చదువు ఊహలను ఇస్తుంది. ఆ ఊహాలు అందమైన పెయింటింగ్స్‌గా మారతాయి. ఆ చిత్రాల భావుకత తనను ప్రకృతి ప్రపంచంలోకి తీసుకెళ్లి ట్రెక్కింగ్ చేయిస్తుంది. ‘సిటీ ఆఫ్ లేక్స్’గా చెప్పుకునే ఠాణెలోని ఈడెన్వుడ్ కాంప్లెక్స్‌లో రోషిణి బాల్యం గడిచింది. ఇప్పుడు కాంప్లెక్స్ వాసులతో సహా ఎంతోమందికి రోల్‌మోడల్‌గా మారింది రోషిణి. ఫైటర్ పైలట్‌గా ఆమె మంచి పేరు తెచ్చుకోవాలని ఆశిద్దాం. -
శత్రువుల డ్రోన్లను హ్యాక్ చేస్తాయి
సాక్షి, హైదరాబాద్: పెళ్లిళ్లు మొదలుకొని వ్యవసాయం వరకు.. డ్రోన్లను వాడని రంగం అంటూ లేదంటే అతిశయోక్తి కాదేమో. అయితే.. ఉగ్రవాదులెవరైనా ఈ డ్రోన్లను వాడితే? దేశ రక్షణకు కీలకమైన స్థావరాలపై దాడులకు పాల్పడితే? ఏం ఫర్వాలేదంటున్నారు ఐఐటీ మద్రాస్ పరిశోధకులు. ఇలాంటి శత్రు డ్రోన్లను గుర్తించేందుకు వీరు ఓ కొత్త రకం డ్రోన్లను డిజైన్ చేశారు. కృత్రిమ మేధ సాయంతో పనిచేస్తూ, శత్రువుల డ్రోన్లను హ్యాక్ చేసి, వాటి దిశ మార్చి సురక్షితంగా ల్యాండ్ అయ్యేలా చేస్తాయని ఐఐటీ మద్రాస్ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ డ్రోన్లను ఇంటర్నెట్ ద్వారా ఎక్కడి నుంచైనా నియంత్రిం చొచ్చు. ఇవి పోలీసులు, మిలిటరీ వారికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయని పేర్కొంటున్నారు. ఇవి ఎంతో భిన్నం.. ఇప్పుడు అందుబాటులో ఉన్న డ్రోన్ల పని తీరుకు ఇవి పూర్తి భిన్నంగా పనిచేస్తాయి. ఇంటర్నెట్ ద్వారా డ్రోన్లను నియంత్రించే అవకాశం ఉండటం వల్ల ఒకటి కంటే ఎక్కువ డ్రోన్లను ఏకకాలంలో ఉపయోగించొచ్చు. వాహనాలు, మానవులు, ఇతర వస్తువులను గుర్తించేందుకు ఒకేసారి బోలెడన్ని ఈ డ్రోన్లను వాడొచ్చన్నమాట. చీకట్లోనూ పనిచేస్తుంది.. ఈ డ్రోన్లను ఏరోస్పేస్ ఇంజనీరింగ్ విద్యార్థి వసు గుప్తా, ఐఐటీ మద్రాస్‌లోని ఆర్ఏఎఫ్టీ ల్యాబ్‌కు చెందిన రిషభ్ వశిష్టలు కలసి రూపొందించారు. ‘ఇవి తమ చూపుతోనే నేరుగా వస్తువులను, వ్యక్తులను కచ్చితంగా గుర్తించగలవు. నమూనా డ్రోన్ల సామర్థ్యాన్ని పరీక్షించిన తర్వాత అవసరమైన వారికి అందుబాటులోకి తీసుకొస్తాం’అని ప్రాజెక్టుకు నేతృత్వం వహించిన ఏరోస్పేస్ ఇంజినీరింగ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ రంజిత్ మోహన్ వివరించారు. అవసరాలకు తగ్గట్టుగా వీటితో పనిచేయించుకోవచ్చని, ఒకేసారి బోలెడన్ని వాహనాలను ట్రాక్ చేయడమూ సాధ్యమని తెలిపారు. డీప్ న్యూరల్ నెట్వర్క్స్ సాయంతో పనిచేసే ఈ కొత్త డ్రోన్ల సాయంతో చీకటిలోనూ కదలికలను గుర్తించొచ్చనని, ఇందుకు పరారుణ కాంతి కిరణాలను వాడాల్సిన అవసరం ఉండదని చెప్పారు. గాల్లోనే హ్యాక్ చేస్తాయి.. ఈ కొత్త డ్రోన్లు నకిలీ జీపీఎస్ సంకేతాలను ప్రసారం చేయడం ద్వారా శత్రు డ్రోన్లను తప్పుదోవ పట్టిస్తాయని, నకిలీ జీపీఎస్ ప్యాకెట్లను విడుదల చేస్తూ వాటిని కావాల్సిన చోట సురక్షితంగా దింపేస్తాయని వసు గుప్తా, రిషభ్ వశిష్టలు తెలిపారు. శత్రువుల డ్రోన్ల కోసం ప్రత్యేకంగా జీపీఎస్ సంకేతాలను అభివృద్ధి చేసి వాటిని హ్యాక్ చేస్తాయన్నమాట. తాము ఇప్పటికే ఈ సాఫ్ట్వేర్ ఆధారిత నకిలీ జీపీఎస్ సంకేతాలను అందుబాటులో ఉన్న అన్ని రకాల జీపీఎస్ రిసీవర్లతో పరిశీలించి చూశామని, నాలుగైదు సెకన్లలోనే శత్రువుల డ్రోన్లను తమ అధీనంలోకి తీసుకురావడం సాధ్యమైందని వివరించారు. -
ఉజ్వల భవిష్యత్తుకు... బెస్ట్ ఇన్స్టిట్యూట్స్
బేసిక్ సెన్సైస్ నుంచి స్టాటిస్టిక్స్ వరకు... ఆతిథ్య రంగం నుంచి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ వరకు.. ఐఐటీలు, ఐఐఎంలకు దీటుగా.. వినూత్న కోర్సులను అందిస్తూ.. ఉజ్వల భవితకు మార్గం వేస్తున్న ఉత్తమ విద్యా సంస్థలు దేశంలో ఎన్నో! ఇంటర్మీడియెట్ అర్హతతో.. ఇంజనీరింగ్, మెడికల్‌కు సరితూగే కోర్సులను ఆఫర్ చేస్తున్న బెస్ట్ ఇన్స్టిట్యూట్స్పై ఫోకస్.. ఐఐఎస్ఈఆర్ బేసిక్ సైన్స్ రంగంలో విద్యార్థులను ప్రోత్సహించి, వారిని మెరికల్లా తీర్చిదిద్దే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకంగా ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ క్యాంపస్‌లను ఏర్పాటు చేసింది. కోర్సులు: ఏడు క్యాంపస్‌ల్లో (బరంపూర్, భోపాల్, కోల్‌కత, పుణె, తిరువనంతపురం, మొహాలి, తిరుపతి) ఇంటర్మీడియెట్ అర్హతగా ఐదేళ్ల బీఎస్-ఎంఎస్ డ్యూయల్ డిగ్రీ. ప్రవేశం: మూడు విధానాల్లో ఉంటుంది. అవి.. జేఈఈ అడ్వాన్స్డ్ ర్యాంకు; కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజన స్ట్రీమ్ ఎక్స్ఏ ఉత్తీర్ణత ఆధారంగా; ఐఐఎస్ఈఆర్ ప్రత్యేకంగా నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత ద్వారా. ప్రకటన మేలో వెలువడుతుంది. వెబ్సైట్: www.iiseradmission.in ఐఐఎస్సీ (బెంగళూరు) బేసిక్ సైన్స్‌లో కెరీర్ అందించేందుకు, పోటీ ప్రపంచానికి తగినట్లు సైన్స్ నిపుణులను తీర్చిదిద్దేందుకు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ) తోడ్పడుతోంది. బ్యాచిలర్ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ సైన్స్ (రీసెర్చ్). ఇది నాలుగేళ్ల కోర్సు. ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్‌లో 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ప్రవేశం: జాతీయ స్థాయిలో నిర్వహించే పరీక్షల్లో ఉత్తీర్ణులకు నిర్ణీత సంఖ్యలో వేర్వేరుగా సీట్లు కేటాయిస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రవేశం సమయంలో పరిగణనలోకి తీసుకునే అంశాలు: కిశోర్ వైజ్ఞానిక్ ప్రోత్సాహన్ యోజనలో అర్హత; జేఈఈ-మెయిన్ స్కోర్; జేఈఈ అడ్వాన్స్డ్ స్కోర్; ఏఐపీఎంటీ ర్యాంకు. ఎంపికైన వారికి స్కాలర్షిప్స్ ఉంటాయి. వెబ్సైట్: www.iisc.ernet.in ఐఐఎస్టీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్టీ).. అంతరిక్ష శాస్త్రంలో అద్భుత కెరీర్‌కు మార్గం వేస్తోంది. కోర్సులు: ఇస్రో ఆధ్వర్యంలో తిరువనంతపురంలో ఉన్న క్యాంపస్‌లో నాలుగు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అవి.. బీటెక్- ఏరోస్పేస్ ఇంజనీరింగ్; బీటెక్ ఏవియానిక్స్; ఐదేళ్ల బీటెక్+ఎంఎస్/ఎంటెక్ డ్యూయల్ డిగ్రీ. అర్హత: ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణతతో పాటు జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ర్యాంకు పొందాలి. ఎంపికైన విద్యార్థులకు ట్యూషన్ ఫీజు, మౌలిక సదుపాయాల వ్యయాలకు అయ్యే మొత్తానికి సమానమైన స్థాయిలో అసిస్టెన్స్‌షిప్ పేరిట ఆర్థిక ప్రోత్సాహం లభిస్తుంది. ప్రవేశాలకు సంబంధించి మేలో ప్రకటన వెలువడుతుంది. వెబ్సైట్: www.iist.ac.in ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ గణాంక శాస్త్రంలో నిపుణులను తీర్చిదిద్దుతూ.. ఉన్నత విద్య, ఉద్యోగావకాశాల పరంగా గుర్తింపు పొందిన సంస్థ ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్. కోల్‌కతలో ప్రధాన క్యాంపస్ ఉంది. ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్, తేజ్‌పూర్‌లో బోధన కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. బ్యాచిలర్ కోర్సులు: బ్యాచిలర్ ఆఫ్ మ్యాథమెటిక్స్ (ఆనర్స్); బ్యాచిలర్ ఆఫ్ స్టాటిస్టిక్స్ (ఆనర్స్). అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. ఎంపిక: ఇన్స్టిట్యూట్ నిర్వహించే ప్రత్యేక ఎంట్రన్స్‌లో ప్రతిభ, ఇంటర్వ్యూ ఆధారంగా. కోర్సుల్లో ప్రవేశం పొందిన వారికి నెలకు రూ.మూడు వేల స్కాలర్షిప్ లభిస్తుంది. వెబ్సైట్: www.isical.ac.in టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ ముంబై ప్రధాన క్యాంపస్‌తో పాటు హైదరాబాద్, తుల్జాపూర్, గువహటిలలో మరో మూడు క్యాంపస్‌లు ఉన్నాయి. సోషల్ సైన్స్ ఎడ్యుకేషన్‌లో ఉత్తమ సంస్థగా టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సెన్సైస్ (టిస్) నిలుస్తోంది. బ్యాచిలర్ కోర్సులు: ఐదేళ్ల బీఏ-ఎంఏ సోషల్ సైన్స్ కోర్సు; సోషల్ సైన్స్ విత్ రూరల్ డెవలప్మెంట్ స్పెషలైజేషన్.తో బీఏ (ఆనర్స్). ప్రవేశం: ఇంటర్ అర్హతతో నిర్వహించే బ్యాచిలర్ అడ్మిషన్ టెస్ట్‌లో ర్యాంకు ఆధారంగా ఉంటుంది. ఎంపికైనవారికి స్కాలర్షిప్, అసిస్టెన్స్‌షిప్‌లు లభిస్తాయి. వెబ్సైట్: www.admissions.tiss.edu ప్రొఫెసర్ కె.పి.జె.రెడ్డి, ఏరోస్పేస్ ఇంజనీరింగ్, ఐఐఎస్సీ (బెంగళూరు). సైన్స్ కోర్సులకు ఆదరణ, విద్యార్థుల చేరిక పరంగా కొంతకాలం స్తబ్ధత నెలకొన్నా. ప్రస్తుతం మళ్లీ పూర్వ వైభవం వచ్చింది. ఐఐఎస్సీ, ఐఐఎస్ఈఆర్ వంటి సైన్స్ స్పెషలైజ్డ్ ఇన్స్టిట్యూట్స్లో కోర్సులు పూర్తిచేస్తే ఉజ్వల భవిష్యత్తుకు మార్గం వేసుకోవచ్చు. ప్రొఫెసర్ జి.ఎస్.ఆర్.మూర్తి,ఐఎస్ఐ (హైదరాబాద్). గణాంక శాస్త్రంలో బ్యాచిలర్, పీజీ డిగ్రీ పూర్తిచేసిన వారికి ఉన్నత అవకాశాలున్నాయి. మ్యాథమెటిక్స్, కంప్యుటేషనల్ స్కిల్స్ ఉన్న విద్యార్థులు ఈ రంగాన్ని ఎంచుకుంటే కెరీర్లో మరింత రాణించగలరు. ఇతర బెస్ట్ ఇన్స్టిట్యూట్స్ ఇఫ్లూ (ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ) : ఇంగ్లిష్తో పాటు వివిధ విదేశీ భాషల్లో ఇంటర్మీడియెట్ అర్హతతో కోర్సులున్నాయి. వెబ్సైట్: www.efluniversity.ac.in ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్: బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్ హోటల్ అడ్మినిస్ట్రేషన్ పేరుతో బ్యాచిలర్ డిగ్రీ కోర్సు అందుబాటులో ఉంది. వెబ్సైట్: www.applyadmission.net/nchmjee ఫ్యాషన్ కోర్సులకు కేరాఫ్ నిఫ్ట్: ఈ సంస్థ ఇంటర్ అర్హతతో దేశవ్యాప్తంగా 16 క్యాంపస్‌ల్లో వివిధ బ్యాచిలర్ కోర్సులను అందిస్తోంది. అవి: బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (యాక్సెసరీ డిజైన్, ఫ్యాషన్ కమ్యూనికేషన్, ఫ్యాషన్ డిజైన్, నిట్వేర్ డిజైన్, లె దర్ డిజైన్, టెక్స్టైల్ డిజైన్); బీఎఫ్‌టెక్. -
ఎంఎస్సీ-జియాలజీ కోర్సు వివరాలు..
టి. మురళీధరన్ టి.ఎం.ఐ. నెట్వర్క్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న సంస్థల వివరాలు తెలుపగలరు? - వెంకట్, జడ్చర్ల. విమానాలు, హెలికాప్టర్లు, అంతరిక్ష నౌకలు, ఉపగ్రహాలు, రాకెట్లు, క్షిపణులు తదితరాల డిజైన్, నిర్మాణం, నిర్వహణలకు సంబంధించిందే ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఇది విమానయానం, అంతరిక్ష యాత్రలు, రక్షణ వ్యవస్థలకు వెన్నెముక వంటిది. కోర్సుల వివరాలు: జేఎన్టీయూ-హైదరాబాద్.. ఏరోస్పేస్ ఇంజనీరింగ్‌లో ఎంటెక్‌ను అందిస్తోంది. ఈ కోర్సులో ప్రవేశానికి సంబంధిత అంశంలో బీఈ/బీటెక్ పూర్తిచేసిన వారు అర్హులు. వెబ్సైట్: www.jntuh.ac.in ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్సీ), బెంగళూరు.. ఏరోస్పేస్లో మాస్టర్ ఆఫ్ ఇంజనీరింగ్‌ను ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.iisc.ernet.in డిఫెన్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్డ్ టెక్నాలజీ, పుణే.. ఎంటెక్-ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సును ఆఫర్ చేస్తోంది. వెబ్సైట్: www.diat.ac.in కెరీర్ అవకాశాలు: ఏరోస్పేస్ ఇంజనీరింగ్ కోర్సులు పూర్తిచేసిన వారికి విమానయాన రంగం; వివిధ ప్రభుత్వ విభాగాలు; విద్య, పరిశోధన సంస్థల్లో ఉన్నత ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఎంఎస్సీ-జియాలజీ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవీ? -మధు, నల్లగొండ. జియాలజీ కోర్సులను పూర్తి చేసిన వారు మినరల్ ఎక్స్‌ప్లోరేషన్, గ్యాస్, ఖనిజ సంబంధ పరిశ్రమలలో వివిధ హోదాల్లో స్థిరపడొచ్చు. అంతేకాకుండా వివిధ పరిశోధన సంస్థల్లో కూడా అవకాశాలు ఉంటా యి. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ నిర్వహించే జియాలజిస్ట్ పరీక్షల్లో అర్హత సాధించి ప్రభుత్వ రంగంలో స్థిర పడొచ్చు. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ వెబ్సైట్: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి వెబ్సైట్: http://svuniversity.ac.in పీజీలో ఎలక్ట్రానిక్స్/ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి? -రవీందర్, బోధన్ ఎలక్ట్రానిక్స్/ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సు పూర్తి చేసిన వారికి కన్సూమర్ ఎలక్ట్రానిక్స్, మెడికల్ ఎలక్ట్రానిక్స్, ఆటోమేషన్, ఆటోమోటివ్, సాఫ్ట్వేర్, హార్డ్‌వేర్ రంగాల్లో అవకాశాలు ఉంటాయి. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ కోర్సు: ఎంఎస్సీ (ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయిడ్ ఎలక్ట్రానిక్స్). వెబ్సైట్: ఠీఠీఠీ.ౌటఝ్చజ్చీ.్చఛి.జీ ఆంధ్రా యూనివర్సిటీ- విశాఖపట్నం కోర్సు: ఎంఎస్సీ (టెక్)-ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్. వెబ్సైట్: www.andhrauniversity.edu.in మన రాష్ట్రంలో ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సు డిప్లొమా/పీజీ డిప్లొమా/ఎంటెక్ స్థాయిల్లో మాత్రమే అందుబాటులో ఉంది. కొన్ని ఇంజనీరింగ్ కాలేజీలు ఎంటెక్ ఎంబెడెడ్ సిస్టమ్స్ కోర్సును ఆఫర్ చేస్తున్నాయి. సీ-డాక్-హైదరాబాద్ కోర్సు: డిప్లొమా ఇన్ ఎంబెడెడ్ సిస్టమ్ డిజైన్ వెబ్సైట్: www.cdachyd.in ఎంఎస్సీ ఫుడ్ అండ్ న్యూట్రిషన్ కోర్సును అందిస్తున్న సంస్థలేవీ? కెరీర్ ఎలా ఉంటుంది? - అలేఖ్య, వరంగల్ న్యూట్రిషన్ సంబంధిత కోర్సులు పూర్తి చేసిన తర్వాత ఫుడ్, ఫుడ్‌ప్రాసెసింగ్, డెయిరీ, ప్యాకేజింగ్, ఫిషరీస్, బయోటెక్నాలజీ, వ్యవసాయ సంబంధిత పరిశ్రమలు, ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల్లో, బహుళజాతి కంపెనీల్లో, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ విభాగాల్లో అవకాశాలు లభిస్తాయి. సొంతంగా బేకరీ, స్టోరేజ్ యూనిట్లను స్థాపించడం ద్వారా స్వయం ఉపాధి పొందొచ్చు. ఆఫర్ చేస్తున్న ఇన్స్టిట్యూట్లు: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం- హైదరాబాద్. కోర్సు: ఎంఎస్సీ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అర్హత: బీటెక్‌లో అగ్రికల్చర్ ఇంజనీరింగ్/డెయిరీ/ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, బీవీఎస్సీ, బీహెచ్ఎస్సీ, బీఎస్సీ అగ్రికల్చర్/ హార్టికల్చర్/ సెరికల్చర్/ఫారెస్ట్రీ/ బీఎఫ్ఎస్సీలో ఉత్తీర్ణులై ఉండాలి. ప్రవేశం: బ్యాచిలర్ డిగ్రీలో వచ్చిన మార్కుల ఆధారంగా వివరాలకు: www.angrau.net ఉస్మానియా యూనివర్సిటీ-హైదరాబాద్ ప్రవేశం: ఎంట్రన్స్ ఆధారంగా వివరాలకు: www.osmania.ac.in ఆంధ్రా యూనివర్సిటీ-విఖాఖపట్నం కోర్సు: ఎంఎస్సీ (న్యూట్రిషన్ అండ్ డెటైటిక్స్) వెబ్సైట్: www.andhrauniversity.edu.in శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ-తిరుపతి కోర్సు: ఎంఎస్సీ (ఫుడ్ టెక్నాలజీ) వెబ్సైట్: http://svuniversity.ac.in