కంటిలో రంగులను గుర్తించేవి?
మాదిరి ప్రశ్నలు (కాంతి)
1. కిందివాటిలో పరావర్తన సూత్రానికి సంబం ధించి సరైంది ఏది?
ఎ) పతనకోణం, పరావర్తన కోణం సమానం
బి) పతన కిరణం, పతన బిందువు వద్ద గీసిన లంబం, పరావర్తన కిరణం, ఒకే తలంలో ఉంటాయి
సి) ఎ, బి
డి) ఏదీకాదు
2. కాంతి ఒక తలంలో ప్రయాణించేటప్పుడు పాటించే నియమం?
ఎ) న్యూటన్ నియమం
బి) ద్రవ్యనిత్యత్వ నియమం
సి) ఫెర్మాట్ నియమం
డి) శక్తినిత్యత్వ నియమం
3. కిందివాటిలో సమతల దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం ఏది?
ఎ) నిటారు ప్రతిబింబం ఏర్పడుతుంది
బి) మిథ్యా ప్రతిబింబం ఏర్పడుతుంది
సి) ప్రతిబింబ దూరం, వస్తుదూరం
సమానం
డి) పైవన్నీ
4. సమతల దర్పణంలో ప్రతిబింబం కుడి, ఎడ మలుగా తారుమారవడాన్ని ఏమంటారు?
ఎ) పార్శ్వ విలోమం
బి) తలకిందులవడం
సి) ప్రతిబింబ విలోమం
డి) నిజ ప్రతిబింబం
5. సమతల దర్పణం ఉపరితలం నుంచి వస్తువును మన కంటి వైపుగా కదిలించినప్పుడు ఆ ప్రతిబింబ పరిమాణం?
ఎ) పెరుగుతుంది బి) తగ్గుతుంది
సి) మారదు
డి) అసలు ప్రతిబింబం ఏర్పడదు
6. గోళాకార దర్పణంలో దర్పణ ధ్రువానికి, వక్రతా కేంద్రానికి మధ్య ఉన్న దూరాన్ని ఏమంటారు?
ఎ) నాభ్యంతరం బి) వక్రతా వ్యాసార్ధం
సి) నాభి డి) ప్రతిబింబ దూరం
7. నాభ్యంతరం (జ) వక్రతా వ్యాసార్ధం (ట) ల మధ్య సంబంధం?
ఎ) ట = జ/2 బి) జ = 2ట
సి) ట = జ డి) ట = 2జ
8. పుటాకార దర్పణంలో మిథ్యా ప్రతిబింబం ఏర్పడాలంటే వస్తువును ఏ స్థానంలో ఉంచాలి?
ఎ) జ వద్ద బి) ఇ వద్ద
సి) జ, ఇ ల మధ్య డి) ఇ కి ఆవల
9. నీటిలోని గాలి బుడగ ఏ కటకంలా పనిచేస్తుంది?
ఎ) వికేంద్రీకరణ బి) కేంద్రీకరణ
సి) ద్వినాభ్యంతర డి) సమతల
10. కిందివాటిలో పుటాకార దర్పణాల ఉపయోగం ఏమిటి?
ఎ) దంత వైద్యులు ఉపయోగిస్తారు
బి) వాహన చోదకులు వాడతారు
సి) వెల్డింగ్ చేసేవారికి అవసరం
డి) క్షౌరశాలల్లో వాడతారు
11. వాహన చోదకులు వెనుక నుంచి వచ్చే వాహనాలను చూడటానికి వినియోగించే దర్పణం?
ఎ) సమతల దర్పణం
బి) పుటాకార దర్పణం
సి) కుంభాకార దర్పణం
డి) ద్విపుటాకార దర్పణం
12. దర్పణ సూత్రం?
ఎ) బి) జ = ఠ+ఠి
సి) డి)
13. {పకాశవంతమైన ఇంద్రధనుస్సును చూడాలంటే నీటిబిందువులోకి ప్రవేశించే కిరణాలు బయటకు వెళ్లే కిరణాల మధ్య కోణం ఎంత ఉండాలి?
ఎ) 0ని బి) 30ని సి) 45ని డి) 42ని
14. సోలార్ కుక్కర్ తయారీకి అనువైన దర్పణం ఏది?
ఎ) కుంభాకార దర్పణం
బి) పుటాకార దర్పణం
సి) సమతల దర్పణం
డి) దేన్నయినా వాడవచ్చు
15. {పతిబింబదూరం, వస్తుదూరానికి మధ్య నిష్పత్తిని ఏమంటారు?
ఎ) నాభ్యంతరం బి) వక్రతావ్యాసార్ధం
సి) ఆవర్తనం డి) ప్రతిబింబ పరిమాణం
16. పుటాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ పరిమాణం వస్తు పరిమాణం కంటే తక్కు వగా ఉండే సందర్భం?
ఎ) దర్పణ నాభి వద్ద వస్తువు ఉన్నప్పుడు
బి) దర్పణ ధ్రువం, నాభికి మధ్య వస్తువు ఉన్నప్పుడు
సి) వక్రతాకేంద్రం వద్ద వస్తువు ఉన్నప్పుడు
డి) వక్రతా కేంద్రానికి ఆవల వస్తువు ఉన్నప్పుడు
17. కుంభాకార దర్పణంలో ఏర్పడే ప్రతిబింబ లక్షణం?
ఎ) చిన్నది బి) నిటారైంది
సి) మిథ్యాప్రతిబింబం
డి) పైవన్నీ
18. గాలిలో/శూన్యంలో కాంతి వేగం ఇ=?
ఎ) 3ప10ృ8 మీ/సె బి) 3ప106 మీ/సె
సి) 3ప108 మీ/సె డి) 3ప10ృ6 మీ/సె
19. కిందివాటిలో కాంతివేగం దేంట్లో తక్కువ?
ఎ) గాలి బి) బెంజీన్
సి) గాజు డి) వజ్రం
20. యానకం వక్రీభవన గుణకం ఎక్కువైతే, ఆ యానకంలో కాంతి వేగం?
ఎ) తగ్గుతుంది బి) పెరుగుతుంది
సి) మారదు
డి) వక్రీభవన గుణకానికి కాంతివేగానికి
సంబంధం లేదు
21. కిందివాటిలో వక్రీభవన గుణకం ఏయే అంశాలపై ఆధారపడి ఉంటుంది?
1. పదార్థ స్వభావం
2. కాంతి తరంగదైర్ఘ్యం
3. కాంతి వేగం 4. కాంతిరంగు
ఎ) 1, 2 బి) 2, 3
సి) 3, 4 డి) ఏదీకాదు
22. ఒక గదిలోని మాటలు మరో గదిలోకి వినిపించడానికి కారణమైన ధర్మం?
ఎ) పరావర్తనం బి) వక్రీభవనం
సి) వ్యతికరణం డి) వివర్తనం
23. వక్రీభవన కోణం 90 అయినప్పుడు పతన కోణాన్ని ఏమంటారు?
ఎ) కనిష్ఠ కోణం బి) సందిగ్ధ కోణం
సి) గరిష్ఠ కోణం డి) గట్టు కోణం
24. ఎండమావులు ఏర్పడటానికి కారణమైన కాంతి దృగ్విషయం?
ఎ) కాంతి పరావర్తనం
బి) కాంతి వక్రీభవనం
సి) సంపూర్ణాంతర పరావర్తనం
డి) సందిగ్ధ కోణం ఏర్పడటం
25. కిందివాటిలో సంపూర్ణాంతర పరావర్తన అనువర్తనం ఏది?
ఎ) వజ్రాలు ప్రకాశించడం
బి) ఆప్టికల్ ఫైబర్లు పనిచేయడం
సి) ఎండమావులు ఏర్పడటం
డి) పైవన్నీ
26. కుంభాకార కటకాన్ని భూతద్దంగా వాడే సందర్భంలో వస్తువు స్థానం?
ఎ) జ, ఞ ల మధ్య బి) జ, ఇ ల మధ్య
సి) ఇ వద్ద డి) జ వద్ద
27. నిజ, మిథ్యా ప్రతిబింబాలను ఏర్పరిచే కటకం?
ఎ) పుటాకార కటకం
బి) కుంభాకార కటకం
సి) సమతల కుంభాకార కటకం
డి) సమతల పుటాకార కటకం
28. స్పష్టదృష్టి కనిష్ఠ దూరం?
ఎ) 20 ఛిఝ బి) 30 ఛిఝ
సి) 25 ఛిఝ డి) 35 ఛిఝ
29. ఆరోగ్యవంతుడైన మానవుని దృష్టికోణం?
ఎ) 30ని బి) 60ని సి) 45ని డి) 90ని
30. కంటిలో రంగులను గుర్తించేవి?
ఎ) దండాలు బి) శంకువులు
సి) సిలియారి కండరాలు
డి) కంటినాడులు
31. కంటి కటక నాభ్యంతరాన్ని సర్దుబాటు చేయడంలో ఉపకరించేవి?
ఎ) నేత్రోదక ద్రవం బి) దండాలు
సి) శంకువులు
డి) సిలియారి కండరాలు
32. {హస్వదృష్టి దోష నివారణకు వాడేది?
ఎ) కుంభాకార కటకం
బి) కుంభాకార దర్పణం
సి) పుటాకార కటకం
డి) పుటాకార దర్పణం
33. కంటికటకం కనిష్ఠ నాభ్యంతరం విలువ?
ఎ) 2.5 ఛిఝ బి) 2 ఛిఝ
సి) 2.27 ఛిఝ డి) 1.5 ఛిఝ
34. ఏ దృష్టిదోషం ఉన్నవారు ద్వినాభ్యంతర కటకాన్ని వాడతారు?
ఎ) హ్రస్వదృష్టి బి) దీర్ఘదృష్టి
సి) చత్వారం డి) వర్ణ అంధత్వం
35. కంటివైద్యుడు ఒక వ్యక్తికి 2ఈ కటకాన్ని వాడాలని సూచించాడు. ఆ కటక నాభ్యంతరం?
ఎ) 20 ఛిఝ బి) 100 ఛిఝ
సి) 200 ఛిఝ డి) 50 ఛిఝ
36. పట్టకం ద్వారా ప్రయాణించిన తెల్లని కాంతి 7 రంగులుగా విడిపోవడాన్ని ఏమంటారు?
ఎ) కాంతి పరావర్తనం
బి) కాంతి వక్రీభవనం
సి) కాంతి విక్షేపణం
డి) కాంతి పరిక్షేపణం
37. కాంతివేగం ఎక్కువగా ఉండే యానకం?
ఎ) విరళ యానకం
బి) సాంద్రతర యానకం
సి) విశ్వవ్యాప్త యానకం డి) ఈథర్
38. ఇంద్రధనుస్సు ఏర్పడటంలో ఇమిడి ఉన్న కాంతి దృగ్విషయం?
ఎ) పరిక్షేపణం బి) వక్రీభవనం
సి) పరావర్తనం డి) విక్షేపణం
39. ఇంద్రధనుస్సు ఆకారం?
ఎ) వృత్తాకారం బి) అర్ధవృత్తాకారం
సి) త్రిమితీయ శంకువు డి) రేఖీయం
40. సూర్యోదయం, సూర్యాస్తమయ సమ యాల్లో సూర్యుడు ఎర్రగా కనిపించడానికి కారణం?
ఎ) కాంతి పరిక్షేపణం
బి) కాంతి విక్షేపణం
సి) కాంతి పరావర్తనం
డి) కాంతి వక్రీభవనం
41. ద్రవాలు, వాయువుల్లో జరిగే కాంతి పరిక్షేపణాన్ని వివరించిన శాస్త్రవేత్త?
ఎ) న్యూటన్ బి) సి.వి. రామన్
సి) హైగెన్‌స డి) మాక్స్‌ప్లాంక్
42. కాంతి తరంగ సిద్ధాంతాన్ని ప్రతిపాదించిందెవరు?
ఎ) న్యూటన్ బి) హైగెన్‌స
సి) మాక్స్‌వెల్ డి) మాక్స్‌ప్లాంక్
43. హైగెన్‌స సిద్ధాంతం ప్రకారం బిందు కాంతి జనకం నుంచి వెలువడే తరంగాగ్రాల ఆకారం?
ఎ) రేఖీయం బి) దీర్ఘఘనాకారం
సి) గోళాకారం డి) శంకువు ఆకారం
44. కాంతి ధర్మాలన్నింటినీ వివరించిన సిద్ధాంతం?
ఎ) కణ సిద్ధాంతం బి) తరంగ సిద్ధాంతం
సి) విద్యుదయస్కాంత సిద్ధాంతం
డి) వికిరణ క్వాంటం సిద్ధాంతం
45. సంపూర్ణ గోళానికి ఘనకోణం విలువ?
ఎ) ఞ స్టెరేడియన్లు బి) 2ఞ స్టెరేడియన్లు
సి) 3ఞ స్టెరేడియన్లు డి) 4ఞ స్టెరేడియన్లు
46. కాంతి తరంగాగ్రాల అంచుల వెంబడి వంగి ప్రయాణించడాన్ని ఏమంటారు?
ఎ) వక్రీభవనం బి) వివర్తనం
సి) వ్యతికరణం డి) పరావర్తనం
47. లేజరులను ఉపయోగించే ప్రత్యేక త్రిమి తీయ ఫొటోగ్రఫీని ఏమంటారు?
ఎ) క్రొమటోగ్రఫీ బి) రేడియోగ్రఫీ
సి) హాలోగ్రఫీ డి) ఓషనోగ్రఫీ
48. లేజర్లకు సంబంధించిన శాస్త్ర విజ్ఞానాన్ని అందించినవారు?
ఎ) ఛార్లెస్ హెచ్ టౌన్‌స
బి) క్రిస్టియన్ హైగెన్
సి) ఐజాక్ న్యూటన్ డి) మాక్స్‌ప్లాంక్
49. లేజర్ కిరణాల ఏకవర్ణీయతకు కారణం?
ఎ) అధిక పట్టీ వెడల్పు
బి) అతిస్వల్ప పట్టీ వెడల్పు
సి) దిశనీయత డి) తీవ్రత
50. కాంతి అభివాహానికి ప్రమాణం?
ఎ) ల్యూమెన్ బి) కాండెలా
సి) స్టెరేడియన్ డి) ల్యూమోన్/సెకను
51. తరంగాల అధ్యయనం ద్వారా కాంతి లక్షణాలను తెలుసుకోవడానికి తోడ్పడేది?
ఎ) కుంభాకార కటకం బి) లేసర్
సి) రిపిల్ టాంక్ డి) పట్టకం
52. కాంతి వివిధ రంగులకు కారణం?
ఎ) కాంతి వేగంలో మార్పు
బి) కాంతి తరంగదైర్ఘ్యంలో మార్పు
సి) కాంతి పౌనఃపున్యంలో మార్పు
డి) కాంతి జనకాల్లో మార్పు
53. జ = ృ20 ఛిఝ అయితే ఆ కటకం? ఎ) కుంభాకార కటకం
బి) పుటాకార కటకం
సి) సమతల కుంభాకార కటకం
డి) సమతల పుటాకార కటకం
54. పుటాకార దర్పణం ద్వారా వస్తు పరిమాణానికి సమాన పరిమాణం ఉన్న ప్రతిబింబం ఏర్ప డాలంటే వస్తువును ఉంచాల్సిన ప్రదేశం?
ఎ) జ వద్ద బి) ఇ వద్ద
సి) జ, ఇ ల మధ్య డి) ఇ కి ఆవల
55. ఇంద్రధనుస్సులో ఏర్పడే రంగుల్లో అధిక తరంగదైర్ఘ్యం దేనికి ఉంటుంది?
ఎ) ఆకుపచ్చ బి) నీలం
సి) నారింజ డి) ఎరుపు
56. ఒక పుటాకార దర్పణం ద్వారా ఏర్పడిన ప్రతిబింబ ఆవర్తనం -6 అయితే ఆ ప్రతి బింబ లక్షణం?
ఎ) తలకిందులుగా ఏర్పడుతుంది
బి) నిజ ప్రతిబింబం
సి) వస్తువు కంటే పెద్ద ప్రతిబింబం
డి) పైవన్నీ
సమాధానాలు
1) సి; 2) సి; 3) డి; 4) ఎ;
5) బి; 6) బి; 7) డి; 8) ఎ;
9) ఎ; 10) ఎ; 11) సి; 12) డి;
13) డి; 14) బి; 15) సి; 16) డి;
17) డి; 18) సి; 19) డి; 20) ఎ;
21) ఎ; 22) డి; 23) బి; 24) సి;
25) డి; 26) ఎ; 27) బి; 28) సి;
29) బి; 30) ఎ; 31) డి; 32) సి;
33) సి; 34) సి; 35) డి; 36) సి;
37) ఎ; 38) డి; 39) సి; 40) ఎ;
41) బి; 42) బి; 43) సి; 44) బి;
45) డి; 46) బి; 47) సి; 48) ఎ;
49) బి; 50) ఎ; 51) సి; 52) సి;
53) బి; 54) బి. 55) డి; 56) డి.