వారణాసి నగరం ఏ నది ఒడ్డున ఉంది? | Varanasi city is located on the banks of a river? | Sakshi
Sakshi News home page

వారణాసి నగరం ఏ నది ఒడ్డున ఉంది?

Published Fri, Oct 31 2014 10:05 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

వారణాసి నగరం ఏ నది ఒడ్డున ఉంది? - Sakshi

వారణాసి నగరం ఏ నది ఒడ్డున ఉంది?

పోలీస్ కానిస్టేబుల్
 
మాదిరి ప్రశ్నలు
(భారతదేశం - మృత్తికలు)

 
 1.    తేయాకు, కాఫీ, పండ్ల తోటలను ఎక్కువగా ఏ రకం నేలల్లో పెంచుతారు?
     1) ఒండలి నేలలు    2) నల్ల నేలలు
     3) డెల్టా నేలలు    4) పర్వత నేలలు
 2.    మృత్తికా క్రమక్షయం అంటే ఏమిటి?
     1)    భూమిపై ఉన్న సారవంతమైన పొర కొట్టుకొని పోవడం
     2) భూసారం పెరగడం
     3) ఉద్భిజ సంపద క్షీణించడం
     4) పైవేవీకావు
 3.    గాలి వల్ల అత్యధికంగా మృత్తికా క్రమక్షయానికి గురవుతున్న రాష్ట్రం?
     1) మధ్యప్రదేశ్    2) గుజరాత్
     3) రాజస్థాన్    4) మహారాష్ట్ర
 4.    రబ్బరు లాంటి తోటల పెంపకానికి అనువైన నేలలేవి?
     1) ఎడారి నేలలు    2) లాటరైట్ నేలలు
     3) నల్లరేగడి నేలలు    4) ఎర్ర నేలలు
 5.    ఒండలి నేలలు సారవంతంగా ఉండటానికి కారణం?
     1)    వాటిలో హ్యూమస్ పుష్కలంగా ఉండటం
     2) సున్నం పుష్కలంగా ఉండటం
     3)    మొక్కలు సులభంగా శోషించుకోవడానికి వీటిలో సన్నని రేణువుల రూపంలో ఖనిజాలుండటం
     4) ఏదీకాదు
 6.    కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి.
     1) భాబర్ - సచ్ఛిద్ర మండలం
     2) టెరాయ్ - దట్టమైన అడవులు
     3) భంగర్ - పురాతన ఒండ్రుమట్టి
     4) ఖాదర్ - స్ఫటికీయ భూభాగాలు
 7.    బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే నేలలు?
     1) ఒండ్రు నేలలు    2) ఎర్ర నేలలు
     3) నల్లరేగడి నేలలు    4) లాట్‌రైట్ నేలలు
 8.    నల్లరేగడి నేలలు పత్తిపంటకు బాగా అనుకూలంగా ఉండటానికి కారణం?
     1) అవి నలుపు రంగులో ఉండటం
     2) అవి తేమను నిలుపుకోవడం
     3) అవి లావాతో రూపొంది ఉండటం    4) పీఠభూమి ప్రాంతాల్లో ఉండటం
 9.    కిందివాటిలో ఎర్ర నేలలను కలిగిన ప్రాంతం ఏది?
     1) గంగా - సింధూ మైదానం
     2) దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం
     3) గుజరాత్, మహారాష్ట్ర
     4) జమ్మూ కాశ్మీర్
 10.    భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా తోడ్పడుతున్న మృత్తికలు?
     1) ఒండ్రు    2) పర్వత
     3) ఎడారి    4) ఎర్ర
 11.    పిర్ పంజాల్, మహాభారత శ్రేణులు ఏ హిమాలయాల్లో భాగంగా ఉన్నాయి?
     1) హిమాద్రి    2) హిమాచల్
     3) శివాలిక్    4) పూర్వాంచల్
 12.    ‘ఖాసి’ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి?
     1) అసోం    2) అరుణాచల్ ప్రదేశ్
     3) మేఘాలయ    4) త్రిపుర
 13.    థార్ ఎడారిలో వర్షపాతం ఎన్ని మిల్లీ మీటర్ల మధ్య ఉంటుంది?
     1) 50 - 100    2) 100 - 150
     3) 50 - 150    4) 100 - 200
 14.    రెండు నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు?
     1) మైదానం    2) కనుమ
     3) అంతర్వేది    4) జలసంధి
 15.    కిందివాటిలో హిమాలయ నది కానిది?
     1) గంగ    2) సింధు
     3) గోదావరి    4) బ్రహ్మపుత్ర
 16.    థార్ ఎడారిలో ప్రవహించే ఏకైక నది?
     1) లూని    2) మహి
     3) సబర్మతి    4) యమున
 17.    భారతదేశ దక్షిణ అంచు ‘ఇందిరా పాయింట్’ ఏ దీవుల్లో ఉంది?
     1) అండమాన్ దీవులు
     2) నికోబార్ దీవులు
     3) లక్షద్వీప్     4) మాల్దీవులు
 18.    కిందివాటిలో తూర్పు తీర మైదానానికి స్థానిక పేరు కానిది?
     1) ఉత్కల్ తీరం    2) సర్కార్ తీరం
     3) కోరమండల్ తీరం 4) కొంకణ్ తీరం
 19.    శివాలిక్ శ్రేణిని ‘అసోం’లో స్థానికంగా ఎలా పిలుస్తారు?
     1) మిష్మి కొండలు    2) పూర్వాంచల్
     3) కచార్    4) జమ్మూ కొండలు
 20.    హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఉన్న లోయ?
     1) కాశ్మీర్ లోయ    2) కులు, కాంగ్ర
     3) పద్మాలోయ    4) బ్రహ్మపుత్ర లోయ
 21.    థార్ ఎడారి ఏ పర్వతాల వర్షచ్ఛాయ ప్రాంతంలో ఉంది?
     1) వింధ్య     2) ఆరావళి
     3) హిమాలయ పర్వతాలు
      4) సాత్పురా
 22.    {X-°-^Œలో సమయం ఉదయం 10 గంటలైతే భారత్‌లో సమయం ఎంత?
     1) ఉదయం 4.30 గంటలు
     2) సాయంత్రం 4.30 గంటలు
     3) సాయంత్రం 3.30 గంటలు
     4) ఉదయం 5.30 గంటలు
 23.    భారతదేశం ఉత్తర దక్షిణాలుగా సుమారు ఎన్ని కి.మీ. పొడవున వ్యాపించి ఉంది?
     1) 3214 కి.మీ.    2) 3412 కి.మీ.
     3) 3124 కి.మీ.    4) 2933 కి.మీ.
 24.    భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలోనిది?
     1) గోండ్వానా భూమి
     2) అంగారా భూమి
     3) లారెసియా
     4) థెటిస్ సముద్ర భాగం
 25.    నీలగిరి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది?
     1) అనైముడి    2) దొడబెట్ట
     3) అరోమకొండ    4) అన్నామలై కొండ
 26.    భారతదేశం తూర్పు, పడమరలుగా ఎన్ని కి.మీ. వ్యాపించి ఉంది?
     1) 2633         2) 2733    
     3) 2833        4) 2933
 27.    కిందివాటిలో ప్రవాళభిత్తికలు (కోరల్స్)తో ఏర్పడిన దీవులేవి?
     1) అండమాన్    2) నికోబార్
     3) లక్షద్వీవులు    4) పైవన్నీ
 28.    ఏ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి?
     1) మాల్వా     2) దక్కన్
     3) ఛోటా నాగ్‌పూర్    4) బుందేల్ ఖండ్
 29.    పడమటి కనుమలు అవిచ్ఛిన్నంగా ఎన్ని కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి?
     1) 1400        2) 1600    
     3) 1500        4) 1700
 30.    ‘డూన్’లు ఏ శ్రేణుల మధ్య విస్తరించి ఉన్నాయి?
     1)    నిమ్న హిమాలయాలు, హిమాద్రి
     2)    నిమ్న హిమాలయాలు, శివాలిక్
         {శేణులు
     3)    హిమాద్రి, శివాలిక్ శ్రేణులు
     4)    పైవన్నీ
 31.    నర్మదా నదికి ఉత్తరాన, గంగా మైదానానికి దక్షిణాన ఉన్న ఉన్నత భూములు ఏవి?
     1) ఛోటా నాగ్‌పూర్ పీఠభూమి
     2) దక్కన్ పీఠభూమి
     3) మాల్వా పీఠభూమి
     4) బుందేల్ ఖండ్ పీఠభూమి
 32.    నార్కొండం, బారెన్ దీవులు దేనివల్ల ఏర్పడ్డాయి?
     1) అగ్ని పర్వతాలు    2) ప్రవాళభిత్తికలు
     3) ఖండ పర్వతాలు
     4) ముడత పర్వతాలు
 33.    కిందివాటిలో భారతదేశం పూర్తిగా ఏ భాగంలో విస్తరించి ఉంది?
     1) ఉత్తరార్ధ గోళం    2) దక్షిణార్ధ గోళం
     3) పశ్చిమార్ధ గోళం     4) 1, 2
 34.    పడమటి తీర మైదానం ఉత్తరాన రాణ్ ఆఫ్ కచ్ నుంచి దక్షిణాన ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉంది?
     1) కావేరి డెల్టా   2) అన్నామలై కొండలు
     3) మలబార్ తీరం    4) కన్యాకుమారి
 35.    కిందివాటిలో శిలా ఉపరితలం మీద ఉన్న దీవి ఏది?
     1) అండమాన్     2) లక్షదీవులు
     3) నికోబార్     4) పాంబన్ దీవి
 36.    కైబర్, బోలాన్ అనేవి?
     1) కనుమలు    2) లోయలు
     3) డూన్‌లు    4) శ్రేణులు
 37.    విసర్జిత లోయ అని దేనికి పేరు?
     1) బోర్ ఘాట్    2) థాల్ ఘాట్
     3) పాల్ ఘాట్    4) కైబర్, బోలాన్
 38.    కిందివాటిలో ఖొండలైట్, చార్నొకైట్ శిలలతో ఏర్పడింది ఏది?
     1) పశ్చిమ కనుమలు
     2) తూర్పు కనుమలు
     3) ద్వీపకల్ప పీఠభూమి
     4) హిమాలయాలు
 39.    మెత్తని రేణుయుత నిక్షేపాల వల్ల ఏర్పడిన మృత్తికలేవి?
     1) ఒండ్రు మృత్తికలు
     2) లాటరైట్ మృత్తికలు
     3) నల్లరేగడి మృత్తికలు
     4) ఎర్ర మృత్తికలు
 40.    అకస్మాత్తుగా సంభవించే వర్షాలు, వరదలకు భూమి పై భాగం పొరలు పొరలుగా కొట్టుకుపోవడాన్ని ఏమంటారు?
     1) వంక క్రమక్షయం
     2) అవనాళికా క్రమక్షయం
     3) పట క్రమక్షయం    4) ఏదీకాదు
 41.    భారతదేశం ఏయే అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది?
     1)    8ని.4’ల నుంచి 37ని.6’ల దక్షిణ    అక్షాంశాలు
     2)    37ని.6’ల నుంచి 8ని.4’ల దక్షిణ
         అక్షాంశాలు
     3)    8ని.4’ల నుంచి 37ని.6’ల ఉత్తర
         అక్షాంశాలు
     4) ఏదీకాదు
 42.    భారతదేశంలోని ‘తీన్‌భీగా’ ప్రాంతాన్ని ఏ దేశానికి 999 ఏళ్ల పాటు అద్దెకిచ్చారు?
     1) పాకిస్థాన్    2) మయన్మార్
     3) శ్రీలంక    4) బంగ్లాదేశ్
 43.    భారతదేశంలో అతి పురాతనమైన భూభాగం?
     1) హిమాలయాలు
     2) ద్వీపకల్ప పీఠభూమి
     3) ఉత్తర మైదానాలు
     4) ఎడారి ప్రాంతం
 
 సమాధానాలు
     1) 4;    2) 1;    3) 3;    4) 2;    5) 3;
     6) 4;    7) 3;    8) 2;    9) 2;    10) 1;
     11) 2;    12) 3;    13) 2;    14) 3;    15) 3;
     16) 1;    17) 2;    18) 4;    19) 3;    20) 4;
     21) 2;    22) 3;    23) 1;    24) 1;    25) 2;
     26) 4;    27) 3;    28) 3;    29) 2;    30) 2;
     31) 3;    32) 1;    33) 1;    34) 4;    35) 4;
     36) 1;    37) 3;    38) 2;    39) 1;    40) 3.
     41) 3;    42) 4;    43) 2.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement