mulkala ramesh
-
మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రం?
భూపటల ఉపరితలంపై వదులుగా,∙అదృఢీ భూతంగా ఉండే పొరను మృత్తిక అంటారు.∙మృత్తికలో ఉండే పొరలను ‘హారైజన్స్’ అంటారు. మృత్తికలు ఏర్పడే స్వభావాన్ని బట్టి వీటిని 2 రకాలుగా విభజించారు. అవి.. 1. స్థానబద్ధ మృత్తికలు: స్థానిక మాతృశిల నుంచి ఏర్పడతాయి. 2. నిక్షేప మృత్తికలు: నీరు, పవనాల నిక్షేపణల వల్ల ఏర్పడతాయి. రష్యాకు చెందిన ‘దెకుబన్’, అమెరికా శాస్త్రజ్ఞుడు‘మార్పట్’లు మృత్తికలు ఏర్పడే ప్రాంతాల లక్షణాలు, శీతోష్ణస్థితి వంటి అంశాల ఆధారంగా వీటిని మూడు రకాలుగా వర్గీకరించారు. అవి.. 1. జోనల్ (మండల మృత్తికలు): ఇవి విశాలంగా విస్తరించి ఉన్న ముఖ్యమైన మృత్తికలు. మాతృ శిలపైఏర్పడి అభివృద్ధి చెందాయి. ఉదా‘‘ చెర్నోజెమ్, ఎర్ర, లాటరైట్, ఎడారి మృత్తికలు 2. ఇంట్రా జోనల్ (అంతర మండల మృత్తికలు): నీటిలో కరిగిన లవణాలు భూమి లోపలి నుంచి ఉపరితలానికి కేశ నాళిక ప్రక్రియ వల్ల వచ్చి, నీరు ఆవిరై ఆ లవణాలు మిగిలిపోగా ఏర్పడ్డాయి.ఉదా‘‘ లవణ మృత్తికలు, పీట్, సున్నపు మృత్తికలు 3. అజోనల్ (అమండల మృత్తికలు): వివిధ లవణాలు రవాణా కావడం వల్ల ఏర్పడిన మృత్తికలు. ఉదా‘‘ ఒండ్రు మృత్తికలు, లోయస్ మృత్తికలు, లావా మృత్తికలు.నేలలు లేదా మృత్తికలను అధ్యయనం చేసే శాస్త్రాన్ని ‘పెడాలజీ’ అంటారు. భారతదేశం– మృత్తికలు (నేలలు) భూ ఉపరితలంపై శిథిలమైన శిలా శకలాలు, కుళ్లిన జంతు, వృక్ష సంబంధిత పదార్థాల పలుచటి పొరనే మృత్తికలుగా నిర్వచించవచ్చు. వ్యవసాయం ప్రధాన వృత్తిగా ఉన్న భారత్ వంటి దేశాల్లో మానవ ఆర్థిక, సాంఘిక, సాంస్కృతిక పురోగతిని నిర్ణయించడంలో మృత్తికలు ప్రముఖ పాత్ర పోషిస్తాయి. మంచి మృత్తికలు, ముఖ్యంగా ఒండ్రు మృత్తికలున్న ప్రదేశాల్లో అనేక గొప్ప నాగరికతలు వెల్లివిరిశాయి. వయనం, లవణాలు, కుళ్లిన జీవ సంబంధ పదార్థాల (హ్యూమస్)ను సరైన పాళ్లలో కలిగిన మృత్తికలు వ్యవసాయదారులకు, దేశ ఆర్థిక వ్యవస్థకు సత్ఫలితాలను అందిస్తాయి. 1893లో ఓల్కర్, 1898లో లెదర్ సాగించిన పరిశోధనల వల్ల భారతదేశంలోని మృత్తికలను ప్రధానంగా 4 రకాలుగా వర్గీకరించారు. అవి.. 1. గంగా– సింధు ఒండలి మృత్తికలు, 2. నల్లరేగడి మృత్తికలు, 3. ఎర్ర మృత్తికలు, 4. లాటరైట్ మృత్తికలు. మృత్తికల లక్షణాలను పరిగణనలోకి తీసుకుని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి (ఐసీఏఆర్) 8 ప్రధాన వర్గాలుగా వర్గీకరించింది. అవి.. 1. ఒండలి మృత్తికలు 2. నల్లరేగడి మృత్తికలు 3. ఎర్ర మృత్తికలు 4. లాటరైట్ మృత్తికలు 5. శుష్క, ఎడారి మృత్తికలు 6. లవణీయ, క్షార మృత్తికలు 7. అటవీ మృత్తికలు 8. పీట్, జీవ సంబంధ మృత్తికలు. ఒండలి మృత్తికలు నదులు క్రమక్షయం చేసి తీసుకొచ్చిన ఒండ్రు మట్టి నిక్షేపితాలతో ఏర్పడినవే ఒండలి మృత్తికలు. ఇవి సాధారణంగా నదీ ప్రవాహానికి ఇరు వైపులా, నదీ మైదానాలు, డెల్టా ప్రాంతాల్లో ఏర్పడతాయి. ఈ మృత్తికలు అత్యంత సారవంతమైనవి. కాబట్టి వ్యవసాయభివృద్ధిలో ఈ మృత్తికలు కీలకంగా వ్యవహరిస్తాయి. వీటిలో సున్నం, పొటాష్, భాస్వరం సమృద్ధిగా ఉంటాయి. కానీ, నత్రజని, హ్యూమస్లు తక్కువ పరిమాణంలో ఉంటాయి. ఇవి దేశంలోని మొత్తం భూభాగంలో 23.40 శాతం మేర విస్తరించి వ్యవసాయ ఉత్పత్తిలో సింహ భాగాన్ని కలిగి ఉన్నాయి. మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాల్లోని నర్మద, తపతి నదీ లోయలు, మధ్యప్రదేశ్, ఒడిశాలోని మహానది డెల్టా, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోని గోదావరి, కృష్ణా నదీ లోయలు, తమిళనాడులోని కావేరి డెల్టా, ఉత్తరాన పంజాబ్ నుంచి అసోం వరకూ ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. ఒండలి నేలల్లో డెల్టాయిక్ ఒండలి, కాల్కేరియస్ ఒండలి, తీరస్థమైన ఒండలి, తీర ప్రాంతాల్లో ఇసుక నేలలు ఉన్నాయి. ఈ నేలలు ప్రధానంగా హిమాలయాల నుంచి వచ్చిన విచ్ఛిన్నావశేషం నుంచి లేదా ప్రస్తుతంlవిలుప్తమైపోయిన టెథిస్ సముద్రం వదిలి పెట్టిన సిల్ట్ నుంచి ఏర్పడ్డాయి. గంగా మైదానంలో వీటిని రకరకాలుగా పిలుస్తారు. అవి.. 1. ఖాదర్ 2. భంగర్ 3. భాబర్ 4. టెరాయ్ ఖాదర్: బాగా మెత్తగా ఉండే కొత్త ఒండలి మైదానాన్ని ఖాదర్ అంటారు. ఈ నేలలు లేత రంగులో ఉండి లైమ్, పొటాష్లను ఎక్కువగా కలిగి ఉంటాయి. భంగర్: పాత ఒండలి మైదానాన్ని భంగర్ అంటారు. ఈ నేలలు ముదురు రంగులో ఉండి, బంకమన్నును అధికంగా కలిగి ఉంటాయి. భాబర్: శివాలిక్ పర్వత పాదాల వెంటlముతక లేదా గులకరాళ్లతో కూడిన ఒండలి మండలాన్ని భాబర్ అంటారు. టెరాయ్: భాబర్‌కు దక్షిణాన సిల్ట్ నేలలతో కూడిన తుంపర పల్లపు భూములను టెరాయ్ అంటారు. భారతదేశంలో ఈ నేలలున్న ప్రాంతాలు గోధుమ, వరి ధాన్యాగారాలుగా ప్రసిద్ధి చెందాయి. నల్లరేగడి మృత్తికలు కొన్ని మిలియన్ సంవత్సరాల కిందట అగ్ని పర్వతాలు నిక్షిప్తం చేసిన లావా నిక్షేపణ, నీస్, గ్రానైట్ శిలలు శైథిల్యానికి గురి కావడం వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి. వీటిలో ఇనుము, కాల్షియం, మెగ్నీషియం, కార్బొనేట్లు, అల్యూమినియం ఫుష్కలంగా ఉంటాయి. నత్రజని, పాస్ఫారిక్ ఆమ్లం, హ్యూమస్లు తక్కువ మోతాదులో ఉంటాయి. ఇవి అధిక మొత్తంలో మెత్తని ఇనుప పదార్థాన్ని కలిగి ఉండటం వల్ల నలుపు రంగులో ఉంటాయి. వీటినే చెర్నోజమ్ నేలలని కూడా పిలుస్తారు. పత్తి పంటకు అనువైనవి కావడం వల్ల వీటిని బ్లాక్ కాటన్ సాయిల్స్ అని కూడా అంటారు. వీటిలో బంకమన్ను శాతం అధికంగా ఉంటుంది. అందువల్లే ఇవి తేమను ఎక్కువ రోజులు నిల్వ చేసుకునే శక్తిని కలిగి ఉంటాయి. కాబట్టే ఈ నేలలు భూసారానికి ప్రసిద్ధి చెందాయి. ఈ మృత్తికలు ముఖ్యంగా దక్కన్ పీఠభూమి ప్రాంతంలో విస్తరించి ఉన్నాయి. మహారాష్ట్ర, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాలతోపాటు ఉత్తరప్రదేశ్, రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. ఎర్ర మృత్తికలు తక్కువ వర్షపాతం ఉండే ప్రాంతాల్లో అధిక ఉష్ణోగ్రతల వల్ల స్ఫటిక, రూపాంతర శిలలు శైథిల్యం చెంది ఈ మృత్తికలు ఏర్పడతాయి. వీటిలో ఇనుము, ఫెర్రో మెగ్నీషియం ఖనిజాలు పుష్కలంగా ఉండి, సున్నపురాయి, కంకర, నైట్రోజన్, ఫాస్ఫారికామ్లం, ఫ్రీ కార్బొనేట్లు లోపించి ఉంటాయి. కాబట్టి ఈ నేలలు ఎక్కువ పొడిగా, తక్కువ సారవంతంగా గాలి పారేటట్లు ఉంటాయి. ఇవి లోతైన పల్లపు ప్రాంతాల్లో రేగడి మన్ను, ఇసుక కలిసిన మృత్తికలుగా, ఉన్నత భూముల్లో వదులైన గ్రావిల్గా ఉంటాయి. భారతదేశ భూభాగంలో ఈ నేలలు 29.08 శాతం మేర విస్తరించి ఉన్నాయి. తమిళనాడు (అంతటా), కర్ణాటకలోని కొన్ని ప్రాంతాలు, ఏపీ, తెలంగాణ, మధ్యప్రదేశ్‌లోని తూర్పు ప్రాంతం, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌లోని ఛోటా నాగ్‌పూర్ ప్రాంతాల్లో ఈ నేలలున్నాయి. లాటరైట్ మృత్తికలు ఏకాంతరంగా ఉండే ఆర్ధ్ర, అనార్ధ్ర రుతువుల్లోని అధిక వర్షపాత, ఉష్ణోగ్రతా పరిస్థితుల్లో లాటరైట్ మృత్తికలు ఏర్పడతాయి. ఆయా పరిస్థితులు మౌలిక శిల నుంచి సిలికా అనే పదార్థం ఎక్కువగా నిక్షాళనం చెందేందుకు దోహదపడతాయి. వీటిలో అల్యూమినియం, ఇనుముల హైడ్రేటె ఆక్సైడ్ల మిశ్రమం ఉంటుంది. ఇనుముతో కూడిన మిశ్రమం ఎక్కువగా ఉండడం వల్ల ఈ మృత్తికలు ఎరుపు రంగులో ఉంటాయి. ఈ నేలల భూ సారం అతి తక్కువగా ఉంటుంది. ఇవి తోట పంటలకు అనువైనవి. ఈ నేలలు మన దేశంలో 4.30 శాతం భూ భాగంలో విస్తరించి ఉన్నాయి. మధ్యపదేశ్లోని వింధ్య, సాత్పురా పర్వతాలకు చెందిన బసాల్టిక్ పర్వత శిఖరాల మీద, ఒడిశాలోని తూర్పు కనుమల ప్రాంతం, దక్షిణ మహారాష్ట్ర, కర్ణాటక, కేరళల్లోని కొన్ని ప్రాంతాల్లో ఈ నేలలు విస్తరించి ఉన్నాయి. తక్కువ ఎత్తులో ఉన్న లాటరైట్ నేలల్లో వరి, ఎక్కువ ఎత్తులో ఉన్న నేలల్లో తేయాకు, కాఫీ, రబ్బరు, మల్బరీ వంటి తోట పంటలు బాగా పండుతాయి. శుష్క, ఎడారి మృత్తికలు శుష్క, అర్ధ శుష్క పరిస్థితుల్లో అధిక ఉష్ణోగ్రత, అల్ప వర్షపాతం వల్ల ఈ మృత్తికలు ఏర్పడతాయి, వాయు నిక్షేపిత ఇసుక దిబ్బలు (లోయస్లు) కూడా ఈ నేలల కిందకే వస్తాయి. ఈ మృత్తికల్లో ఫాస్ఫేట్, ఫాస్ఫారిక్ ఆమ్లం ఎక్కువ మోతాదులో ఉండి, నత్రజని, భాస్వరం, ఇనుములు తక్కువ మోతాదులో ఉంటాయి. ఈ నేలలు దేశ భూభాగంలో 8.46 శాతం మేర విస్తరించి ఉన్నాయి. పశ్చిమ రాజస్థాన్, దక్షిణ పంజాబ్, దక్షిణ హరియాణాల్లో ఈ నేలలు ఎక్కువగా ఉన్నాయి. క్షారత్వాన్ని తట్టుకోగలిగే బార్లీ, పత్తి వంటి పంటలు ఈ నేలల్లో అధికంగా పండుతాయి. లవణీయ, క్షార మృత్తికలు ఇవి ఉత్తరప్రదేశ్, బిహార్, రాజస్థాన్, పంజాబ్, మహారాష్ట్ర, కర్ణాటక, గుజరాత్ రాష్ట్రాల్లోని శుష్క, అర్ధ శుష్క ప్రాంతాల్లో కనిపిస్తాయి. ఈ నేలల ఉపరితలం మీద సోడియం, కాల్షియం, మెగ్నీషియంలతో కూడిన గట్టి పొరలుంటాయి. వీటినే రే, కల్లర్, ఊసర్ నేలలు అని కూడా అంటారు. లవణీయ మృత్తికల్లో సోడియం లోపం ఉంటే, క్షార మృత్తికల్లో సోడియం క్లోరైడ్ నిక్షేపాలుంటాయి. అటవీ మృత్తికలు (పర్వత మృత్తికలు) అడవుల నుంచి ఉత్పన్నమైన కర్బన çపదార్థ నిక్షేపణ వల్ల ఈ నేలలు ఏర్పడ్డాయి. వీటినే పర్వత మృత్తికలు అని కూడా అంటారు. ఇవి వివిధ స్థాయిల్లో అభివృద్ధి చెంది ఉంటాయి. స్వల్ప రసాయన శైథిల్యం, స్వల్ప బృహచ్ఛలనం వల్ల పూర్తిగా పరిణతి చెందని ఈ మృత్తికలు తక్కువ సారవంతమైనవి. ఈ నేలల్లో హ్యూమస్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎత్తయిన ప్రాంతంలో ఈ నేలలు ఆమ్ల రహితమైన పోడ్జీత్లుగా ఉంటాయి. ఈ నేలలు దేశం మొత్తం భూభాగంలో 10.64 శాతం మేర విస్తరించి ఉన్నాయి. హిమాలయాలు, ఉత్తరాన ఉన్న ఇతర పర్వత శ్రేణులు, తూర్పు, పశ్చిమ కనుమలు, కర్ణాటక (కూర్గ్)లో ఈ నేలలున్నాయి. తేయాకు, కాఫీ, సుగంధ ద్రవ్యాలు, పండ్ల తోటలకు ఈ నేలలు అనుకూలం. పీట్, జీవ సంబంధ మృత్తికలు నేలల్లో జీవ సంబంధ పదార్థం ఎక్కువగా సంచయనం కావడం వల్ల ఆర్ర ్ధ ప్రాంతాల్లో పీట్ మృత్తికలు ఏర్పడతాయి. వీటిలో ద్రావణీయమైన లవణాలు గణనీయంగా ఉండే అవకాశం ఉంది. దేశంలో ఈ నేలలు 150 చ.కి.మీ విస్తీర్ణంలో ఉన్నాయి. ఇవి ఎక్కువగా కేరళలోని కొట్టాయమ్, అలెప్పీ జిల్లాల్లో విస్తరించి ఉన్నాయి. అక్కడ వీటిని స్థానికంగా ‘కరి’ నేలలంటారు. ఒడిశా సముద్రతీర ప్రాంతాలు, బెంగాల్‌లోని సుందర వనాలతోపాటు ఉత్తర బిహార్, ఆగ్నేయ తమిళనాడుల్లో ఈ నేలలున్నాయి. -ముల్కల రమేష్ సబ్జెక్ట్ నిపుణులు, హన్మకొండ -
వారణాసి నగరం ఏ నది ఒడ్డున ఉంది?
పోలీస్ కానిస్టేబుల్ మాదిరి ప్రశ్నలు (భారతదేశం - మృత్తికలు) 1. తేయాకు, కాఫీ, పండ్ల తోటలను ఎక్కువగా ఏ రకం నేలల్లో పెంచుతారు? 1) ఒండలి నేలలు 2) నల్ల నేలలు 3) డెల్టా నేలలు 4) పర్వత నేలలు 2. మృత్తికా క్రమక్షయం అంటే ఏమిటి? 1) భూమిపై ఉన్న సారవంతమైన పొర కొట్టుకొని పోవడం 2) భూసారం పెరగడం 3) ఉద్భిజ సంపద క్షీణించడం 4) పైవేవీకావు 3. గాలి వల్ల అత్యధికంగా మృత్తికా క్రమక్షయానికి గురవుతున్న రాష్ట్రం? 1) మధ్యప్రదేశ్ 2) గుజరాత్ 3) రాజస్థాన్ 4) మహారాష్ట్ర 4. రబ్బరు లాంటి తోటల పెంపకానికి అనువైన నేలలేవి? 1) ఎడారి నేలలు 2) లాటరైట్ నేలలు 3) నల్లరేగడి నేలలు 4) ఎర్ర నేలలు 5. ఒండలి నేలలు సారవంతంగా ఉండటానికి కారణం? 1) వాటిలో హ్యూమస్ పుష్కలంగా ఉండటం 2) సున్నం పుష్కలంగా ఉండటం 3) మొక్కలు సులభంగా శోషించుకోవడానికి వీటిలో సన్నని రేణువుల రూపంలో ఖనిజాలుండటం 4) ఏదీకాదు 6. కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి. 1) భాబర్ - సచ్ఛిద్ర మండలం 2) టెరాయ్ - దట్టమైన అడవులు 3) భంగర్ - పురాతన ఒండ్రుమట్టి 4) ఖాదర్ - స్ఫటికీయ భూభాగాలు 7. బసాల్ట్ శిలల శైథిల్యం వల్ల ఏర్పడే నేలలు? 1) ఒండ్రు నేలలు 2) ఎర్ర నేలలు 3) నల్లరేగడి నేలలు 4) లాట్రైట్ నేలలు 8. నల్లరేగడి నేలలు పత్తిపంటకు బాగా అనుకూలంగా ఉండటానికి కారణం? 1) అవి నలుపు రంగులో ఉండటం 2) అవి తేమను నిలుపుకోవడం 3) అవి లావాతో రూపొంది ఉండటం 4) పీఠభూమి ప్రాంతాల్లో ఉండటం 9. కిందివాటిలో ఎర్ర నేలలను కలిగిన ప్రాంతం ఏది? 1) గంగా - సింధూ మైదానం 2) దక్షిణ ద్వీపకల్ప ప్రాంతం 3) గుజరాత్, మహారాష్ట్ర 4) జమ్మూ కాశ్మీర్ 10. భారతదేశ ఆర్థిక వ్యవస్థకు ఇతోధికంగా తోడ్పడుతున్న మృత్తికలు? 1) ఒండ్రు 2) పర్వత 3) ఎడారి 4) ఎర్ర 11. పిర్ పంజాల్, మహాభారత శ్రేణులు ఏ హిమాలయాల్లో భాగంగా ఉన్నాయి? 1) హిమాద్రి 2) హిమాచల్ 3) శివాలిక్ 4) పూర్వాంచల్ 12. ‘ఖాసి’ కొండలు ఏ రాష్ట్రంలో ఉన్నాయి? 1) అసోం 2) అరుణాచల్ ప్రదేశ్ 3) మేఘాలయ 4) త్రిపుర 13. థార్ ఎడారిలో వర్షపాతం ఎన్ని మిల్లీ మీటర్ల మధ్య ఉంటుంది? 1) 50 - 100 2) 100 - 150 3) 50 - 150 4) 100 - 200 14. రెండు నదుల మధ్య ప్రాంతాన్ని ఏమంటారు? 1) మైదానం 2) కనుమ 3) అంతర్వేది 4) జలసంధి 15. కిందివాటిలో హిమాలయ నది కానిది? 1) గంగ 2) సింధు 3) గోదావరి 4) బ్రహ్మపుత్ర 16. థార్ ఎడారిలో ప్రవహించే ఏకైక నది? 1) లూని 2) మహి 3) సబర్మతి 4) యమున 17. భారతదేశ దక్షిణ అంచు ‘ఇందిరా పాయింట్’ ఏ దీవుల్లో ఉంది? 1) అండమాన్ దీవులు 2) నికోబార్ దీవులు 3) లక్షద్వీప్ 4) మాల్దీవులు 18. కిందివాటిలో తూర్పు తీర మైదానానికి స్థానిక పేరు కానిది? 1) ఉత్కల్ తీరం 2) సర్కార్ తీరం 3) కోరమండల్ తీరం 4) కొంకణ్ తీరం 19. శివాలిక్ శ్రేణిని ‘అసోం’లో స్థానికంగా ఎలా పిలుస్తారు? 1) మిష్మి కొండలు 2) పూర్వాంచల్ 3) కచార్ 4) జమ్మూ కొండలు 20. హిమాలయాలకు తూర్పు వైపున సరిహద్దుగా ఉన్న లోయ? 1) కాశ్మీర్ లోయ 2) కులు, కాంగ్ర 3) పద్మాలోయ 4) బ్రహ్మపుత్ర లోయ 21. థార్ ఎడారి ఏ పర్వతాల వర్షచ్ఛాయ ప్రాంతంలో ఉంది? 1) వింధ్య 2) ఆరావళి 3) హిమాలయ పర్వతాలు 4) సాత్పురా 22. {X-°-^Œలో సమయం ఉదయం 10 గంటలైతే భారత్‌లో సమయం ఎంత? 1) ఉదయం 4.30 గంటలు 2) సాయంత్రం 4.30 గంటలు 3) సాయంత్రం 3.30 గంటలు 4) ఉదయం 5.30 గంటలు 23. భారతదేశం ఉత్తర దక్షిణాలుగా సుమారు ఎన్ని కి.మీ. పొడవున వ్యాపించి ఉంది? 1) 3214 కి.మీ. 2) 3412 కి.మీ. 3) 3124 కి.మీ. 4) 2933 కి.మీ. 24. భారతదేశ ద్వీపకల్పం ఏ భూభాగంలోనిది? 1) గోండ్వానా భూమి 2) అంగారా భూమి 3) లారెసియా 4) థెటిస్ సముద్ర భాగం 25. నీలగిరి పర్వతాల్లో ఎత్తయిన శిఖరం ఏది? 1) అనైముడి 2) దొడబెట్ట 3) అరోమకొండ 4) అన్నామలై కొండ 26. భారతదేశం తూర్పు, పడమరలుగా ఎన్ని కి.మీ. వ్యాపించి ఉంది? 1) 2633 2) 2733 3) 2833 4) 2933 27. కిందివాటిలో ప్రవాళభిత్తికలు (కోరల్స్)తో ఏర్పడిన దీవులేవి? 1) అండమాన్ 2) నికోబార్ 3) లక్షద్వీవులు 4) పైవన్నీ 28. ఏ పీఠభూమిలో ఖనిజ వనరులు సమృద్ధిగా ఉన్నాయి? 1) మాల్వా 2) దక్కన్ 3) ఛోటా నాగ్‌పూర్ 4) బుందేల్ ఖండ్ 29. పడమటి కనుమలు అవిచ్ఛిన్నంగా ఎన్ని కి.మీ. పొడవున వ్యాపించి ఉన్నాయి? 1) 1400 2) 1600 3) 1500 4) 1700 30. ‘డూన్’లు ఏ శ్రేణుల మధ్య విస్తరించి ఉన్నాయి? 1) నిమ్న హిమాలయాలు, హిమాద్రి 2) నిమ్న హిమాలయాలు, శివాలిక్ {శేణులు 3) హిమాద్రి, శివాలిక్ శ్రేణులు 4) పైవన్నీ 31. నర్మదా నదికి ఉత్తరాన, గంగా మైదానానికి దక్షిణాన ఉన్న ఉన్నత భూములు ఏవి? 1) ఛోటా నాగ్‌పూర్ పీఠభూమి 2) దక్కన్ పీఠభూమి 3) మాల్వా పీఠభూమి 4) బుందేల్ ఖండ్ పీఠభూమి 32. నార్కొండం, బారెన్ దీవులు దేనివల్ల ఏర్పడ్డాయి? 1) అగ్ని పర్వతాలు 2) ప్రవాళభిత్తికలు 3) ఖండ పర్వతాలు 4) ముడత పర్వతాలు 33. కిందివాటిలో భారతదేశం పూర్తిగా ఏ భాగంలో విస్తరించి ఉంది? 1) ఉత్తరార్ధ గోళం 2) దక్షిణార్ధ గోళం 3) పశ్చిమార్ధ గోళం 4) 1, 2 34. పడమటి తీర మైదానం ఉత్తరాన రాణ్ ఆఫ్ కచ్ నుంచి దక్షిణాన ఏ ప్రాంతం వరకు విస్తరించి ఉంది? 1) కావేరి డెల్టా 2) అన్నామలై కొండలు 3) మలబార్ తీరం 4) కన్యాకుమారి 35. కిందివాటిలో శిలా ఉపరితలం మీద ఉన్న దీవి ఏది? 1) అండమాన్ 2) లక్షదీవులు 3) నికోబార్ 4) పాంబన్ దీవి 36. కైబర్, బోలాన్ అనేవి? 1) కనుమలు 2) లోయలు 3) డూన్లు 4) శ్రేణులు 37. విసర్జిత లోయ అని దేనికి పేరు? 1) బోర్ ఘాట్ 2) థాల్ ఘాట్ 3) పాల్ ఘాట్ 4) కైబర్, బోలాన్ 38. కిందివాటిలో ఖొండలైట్, చార్నొకైట్ శిలలతో ఏర్పడింది ఏది? 1) పశ్చిమ కనుమలు 2) తూర్పు కనుమలు 3) ద్వీపకల్ప పీఠభూమి 4) హిమాలయాలు 39. మెత్తని రేణుయుత నిక్షేపాల వల్ల ఏర్పడిన మృత్తికలేవి? 1) ఒండ్రు మృత్తికలు 2) లాటరైట్ మృత్తికలు 3) నల్లరేగడి మృత్తికలు 4) ఎర్ర మృత్తికలు 40. అకస్మాత్తుగా సంభవించే వర్షాలు, వరదలకు భూమి పై భాగం పొరలు పొరలుగా కొట్టుకుపోవడాన్ని ఏమంటారు? 1) వంక క్రమక్షయం 2) అవనాళికా క్రమక్షయం 3) పట క్రమక్షయం 4) ఏదీకాదు 41. భారతదేశం ఏయే అక్షాంశాల మధ్య విస్తరించి ఉంది? 1) 8ని.4’ల నుంచి 37ని.6’ల దక్షిణ అక్షాంశాలు 2) 37ని.6’ల నుంచి 8ని.4’ల దక్షిణ అక్షాంశాలు 3) 8ని.4’ల నుంచి 37ని.6’ల ఉత్తర అక్షాంశాలు 4) ఏదీకాదు 42. భారతదేశంలోని ‘తీన్భీగా’ ప్రాంతాన్ని ఏ దేశానికి 999 ఏళ్ల పాటు అద్దెకిచ్చారు? 1) పాకిస్థాన్ 2) మయన్మార్ 3) శ్రీలంక 4) బంగ్లాదేశ్ 43. భారతదేశంలో అతి పురాతనమైన భూభాగం? 1) హిమాలయాలు 2) ద్వీపకల్ప పీఠభూమి 3) ఉత్తర మైదానాలు 4) ఎడారి ప్రాంతం సమాధానాలు 1) 4; 2) 1; 3) 3; 4) 2; 5) 3; 6) 4; 7) 3; 8) 2; 9) 2; 10) 1; 11) 2; 12) 3; 13) 2; 14) 3; 15) 3; 16) 1; 17) 2; 18) 4; 19) 3; 20) 4; 21) 2; 22) 3; 23) 1; 24) 1; 25) 2; 26) 4; 27) 3; 28) 3; 29) 2; 30) 2; 31) 3; 32) 1; 33) 1; 34) 4; 35) 4; 36) 1; 37) 3; 38) 2; 39) 1; 40) 3. 41) 3; 42) 4; 43) 2. -
‘సరస్సుల నగరం’ అని దేన్ని పిలుస్తారు?
మాదిరి ప్రశ్నలు (భారత దేశ నదీ వ్యవస్థ) 1. కిందివాటిలో ఏది సింధునది ఉపనది కాదు? 1) జీలం 2) బియాస్ 3) గండక్ 4) సట్లెజ్ 2. నదులు, వాటి ఉపనదులకు సంబంధించి కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి. 1) కృష్ణా - భీమా 2) బ్రహ్మపుత్ర - తీస్తా 3) గోదావరి - ఇంద్రావతి 4) యమున - సట్లెజ్ 3. కిందివాటిలో ఏ నగరం గంగానది ఒడ్డున లేదు? 1) వారణాసి 2) లక్నో 3) కాన్పూర్ 4) అలహాబాద్ 4. కృష్ణానది దాని ఉపనది తుంగభద్రతో ఎక్కడ కలుస్తుంది? 1) కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం 2) ఆదిలాబాద్ జిల్లాలోని బాసర 3) కర్నూలు జిల్లాలోని సంగం 4) మహబూబ్‌నగర్ జిల్లాలోని తంగడి 5. ఆంధ్రప్రదేశ్‌లోని నదులు ఏ సముద్రంలో కలుస్తాయి? 1) బంగాళాఖాతం 2) అరేబియా సముద్రం 3) హిందూ మహాసముద్రం 4) పసిఫిక్ మహాసముద్రం 6. కిందివాటిలో గోదావరి నదికి ఉపనది కానిది ఏది? 1) మంజీర 2) మూసీ 3) ప్రాణహిత 4) శబరి 7. డుడుమా జలపాతం ఏ నదిపై ఉంది? 1) నాగావళి 2) వంశధార 3) మాచ్‌ఖండ్ 4) తుంగభద్ర 8. బాలాఘాట్ పర్వతాల్లో జన్మించే నది? 1) తుంగభద్ర 2) కృష్ణా 3) పెన్నా 4) మంజీర 9. హైదరాబాద్ నగరంలో ప్రవహించే నది? 1) మంజీర 2) మూసీ 3) నాగావళి 4) కొయనా 10. లాంగుల్యనది అని కిందివాటిలో ఏ నదిని పిలుస్తారు? 1) వంశధార 2) మాచ్‌ఖండ్ 3) నాగావళి 4) దిండి 11. }M>Mుళం జిల్లాలో ప్రవహించే ప్రముఖ నది ఏది? 1) వంశధార 2) పెన్నా 3) కిన్నెరసాని 4) పాపగ్ని 12. కర్నూలు పట్టణం ఏ నదీతీరాన ఉంది? 1) కృష్ణా 2) పెన్నా 3) గోదావరి 4) తుంగభద్ర 13. {బహ్మపుత్రనదికి సంభవించే వరదల వల్ల అమితంగా నష్టపోతున్న రాష్ట్రం ఏది? 1) అరుణాచల్ ప్రదేశ్ 2) అసోం 3) మేఘాలయ 4) సిక్కిం 14. మనదేశంలోకెల్లా అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ‘సాంబారు’ ఏ రాష్ట్రంలో ఉంది? 1) జమ్మూ-కాశ్మీర్ 2) మహారాష్ర్ట 3) రాజస్థాన్ 4) ఒడిశా 15. పంచనదుల భూమి అని దేన్ని పిలుస్తారు? 1) రాజస్థాన్ 2) పంజాబ్ 3) హర్యానా 4) ఉత్తరప్రదేశ్ 16. {పపంచంలోకెల్లా అతిపెద్ద డెల్టా సుందర్బన్. దీన్ని ఏర్పరిచే నది ఏది? 1) గంగా 2) బ్రహ్మపుత్ర 3) 1, 2 4) యమున 17. చిలుకా సరస్సు ఎక్కడ ఉంది? 1) కేరళ 2) రాజస్థాన్ 3) ఆంధ్రప్రదేశ్ 4) ఒడిశా 18. కిందివాటిలో హిమాలయాల కంటే ప్రాచీనమైన నది ఏది? 1) బియాస్ 2) సట్లెజ్ 3) తీస్తా 4) కోసీ 19. కిందివాటిలో భూపరివేష్టిత నది ఏది? 1) నర్మద 2) సబర్మతి 3) లూని 4) తపతి 20. ‘ది హాంగ్’ అని ఏ నదిని పిలుస్తారు? 1) సింధు 2) బ్రహ్మపుత్ర 3) యమున 4) గంగా 21. సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్స్) అని దేన్ని పిలుస్తారు? 1) ఉదయ్‌పూర్ 2) బికనీర్ 3) శ్రీనగర్ 4) జోథ్‌పూర్ 22. ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది? 1) గోమతి 2) గంగా 3) సింధూనది 4) యమున 23. మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది? 1) తపతి 2) సబర్మతి 3) నర్మద 4) మహానది 24. కిందివాటిలో ఏ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు? 1) తమిళనాడు 2) కేరళ 3) ఒడిశా 4) పశ్చిమ బెంగాల్ 25. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. 1) పశ్చిమబెంగాల్ - సర్కార్ తీరం 2) ఒడిశా - వంగ తీరం 3) ఉత్తర ఆంధ్ర - ఉత్కళ్ తీరం 4) తమిళనాడు - కోరమాండల్ తీరం 26. భారతదేశ గొప్ప ఎడారి థార్. ఇది ఏ రాష్ట్రంలో అధిక భాగం విస్తరించి ఉంది? 1) గుజరాత్ 2) పంజాబ్ 3) రాజస్థాన్ 4) మహారాష్ట్ర 27. కిందివాటిలో ఏ నదిని ‘నారాయణి’ అని పిలుస్తారు? 1) రాంగంగా 2) గండక్ 3) కోసి 4) యమున 28. దామోదర్ నది ఎందులో అంతమవు తుంది? 1) గంగానదిలో 2) బంగాళాఖాతంలో 3) హుగ్లీనదిలో 4) యమునానదిలో 29. శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది? 1) శరావతి 2) భీమ 3) ఘటప్రభ 4) కావేరి 30. లోక్తక్ సరస్సు ఎక్కడ ఉంది? 1) నాగాలాండ్ 2) త్రిపుర 3) మణిపూర్ 4) ఒడిశా 31. లూనీ నది జన్మస్థానం ఏది? 1) అమర్ కంటక్ పీఠభూమి 2) ముల్టాయి 3) అజ్మీర్‌లోని అన్నాసాగర్ 4) థార్ ఎడారి 32. సిక్కింలో ప్రవహించే ప్రధాన నది ఏది? 1) మానస్ 2) టోర్సు 3) జల్దకా 4) తీస్తా 33. కావేరి నదీజల వివాదంతో సంబంధం ఉన్న రాష్ట్రాలేవి? 1) తమిళనాడు, కర్ణాటక, కేరళ 2) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3) తమిళనాడు, కేరళ, ఒడిశా 4) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ 34. సింధూనది భారతదేశంలో ఒక రాష్ట్రం ద్వారానే ప్రవహిస్తోంది. ఆ రాష్ట్రం ఏది? 1) పంజాబ్ 2) జమ్మూ కాశ్మీర్ 3) హర్యానా 4) రాజస్థాన్ 35. భారతదేశంలో కెల్లా అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత ఆనకట్ట ‘విద్యా సాగర్ సేతు’. దీన్ని ఏ నదిపై నిర్మించారు? 1) గోదావరి 2) బ్రహ్మపుత్ర 3) హుగ్లీ 4) గంగా 36. వివాదాస్పద సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? 1) బ్రహ్మపుత్ర 2) నర్మదా 3) తపతి 4) యమున 37. ‘లిమ్నాలజీ’ అనేది వేటి పుట్టుక గురించి తెలియజేసే శాస్త్రం? 1) సరస్సులు 2) నదులు 3) శిలలు 4) పైవేవీ కాదు 38. రిడ్లే తాబేళ్లకు ప్రసిద్ధి చెందిన సరస్సు ఏది? 1) వెంబనాడ్ 2) చిలకా 3) పులికాట్ 4) ఊలర్ 39. దేశంలో అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన జ్వాలాబిల సరస్సు ఏది? 1) మహారాష్ట్రలోని లూనార్ సరస్సు 2) మణిపూర్‌లోని లోక్తక్ సరస్సు 3) జమ్మూ-కాశ్మీర్‌లోని ఊలర్ సరస్సు 4) ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్ సరస్సు 40. భారతదేశంలో రెండో అతిపెద్ద నది ఏది? 1) గంగా 2) కృష్ణానది 3) గోదావరి 4) నర్మదా 41. యమునా, గంగా నదులు కలిసే ప్రదేశం ఏది? 1) లక్నో 2) అలహాబాద్ 3) పాట్నా 4) హరిద్వార్ 42. పెన్ గంగా దేనికి ఉపనది? 1) గంగా 2) నర్మదా 3) గోదావరి 4) కృష్ణా 43. కిందివాటిలో పెన్నానది ఉపనది కానిది ఏది? 1) చిత్రావతి 2) సగిలేరు 3) జయమంగళ 4) ఇంద్రావతి సమాధానాలు 1) 3; 2) 4; 3) 2; 4) 3; 5) 1; 6) 2; 7) 3; 8) 4; 9) 2; 10) 3; 11) 1; 12) 4; 13) 2; 14) 3; 15) 2; 16) 3; 17) 4; 18) 2; 19) 3; 20) 2; 21) 1; 22) 4; 23) 3; 24) 2; 25) 4; 26) 3; 27) 2; 28) 3; 29) 4; 30) 3; 31) 3; 32) 4; 33) 1; 34) 2; 35) 3; 36) 2; 37) 1; 38) 2; 39) 1; 40) 3; 41) 2; 42) 3; 43) 4.