మాదిరి ప్రశ్నలు
(భారత దేశ నదీ వ్యవస్థ)
1. కిందివాటిలో ఏది సింధునది ఉపనది కాదు?
1) జీలం 2) బియాస్
3) గండక్ 4) సట్లెజ్
2. నదులు, వాటి ఉపనదులకు సంబంధించి కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి.
1) కృష్ణా - భీమా
2) బ్రహ్మపుత్ర - తీస్తా
3) గోదావరి - ఇంద్రావతి
4) యమున - సట్లెజ్
3. కిందివాటిలో ఏ నగరం గంగానది ఒడ్డున లేదు?
1) వారణాసి 2) లక్నో
3) కాన్పూర్ 4) అలహాబాద్
4. కృష్ణానది దాని ఉపనది తుంగభద్రతో ఎక్కడ కలుస్తుంది?
1) కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం
2) ఆదిలాబాద్ జిల్లాలోని బాసర
3) కర్నూలు జిల్లాలోని సంగం
4) మహబూబ్‌నగర్ జిల్లాలోని తంగడి
5. ఆంధ్రప్రదేశ్‌లోని నదులు ఏ సముద్రంలో కలుస్తాయి?
1) బంగాళాఖాతం
2) అరేబియా సముద్రం
3) హిందూ మహాసముద్రం
4) పసిఫిక్ మహాసముద్రం
6. కిందివాటిలో గోదావరి నదికి ఉపనది కానిది ఏది?
1) మంజీర 2) మూసీ
3) ప్రాణహిత 4) శబరి
7. డుడుమా జలపాతం ఏ నదిపై ఉంది?
1) నాగావళి 2) వంశధార
3) మాచ్‌ఖండ్ 4) తుంగభద్ర
8. బాలాఘాట్ పర్వతాల్లో జన్మించే నది?
1) తుంగభద్ర 2) కృష్ణా
3) పెన్నా 4) మంజీర
9. హైదరాబాద్ నగరంలో ప్రవహించే నది?
1) మంజీర 2) మూసీ
3) నాగావళి 4) కొయనా
10. లాంగుల్యనది అని కిందివాటిలో ఏ నదిని పిలుస్తారు?
1) వంశధార 2) మాచ్‌ఖండ్
3) నాగావళి 4) దిండి
11. }M>Mుళం జిల్లాలో ప్రవహించే ప్రముఖ నది ఏది?
1) వంశధార 2) పెన్నా
3) కిన్నెరసాని 4) పాపగ్ని
12. కర్నూలు పట్టణం ఏ నదీతీరాన ఉంది?
1) కృష్ణా 2) పెన్నా
3) గోదావరి 4) తుంగభద్ర
13. {బహ్మపుత్రనదికి సంభవించే వరదల వల్ల అమితంగా నష్టపోతున్న రాష్ట్రం ఏది?
1) అరుణాచల్ ప్రదేశ్ 2) అసోం
3) మేఘాలయ 4) సిక్కిం
14. మనదేశంలోకెల్లా అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ‘సాంబారు’ ఏ రాష్ట్రంలో ఉంది?
1) జమ్మూ-కాశ్మీర్ 2) మహారాష్ర్ట
3) రాజస్థాన్ 4) ఒడిశా
15. పంచనదుల భూమి అని దేన్ని పిలుస్తారు?
1) రాజస్థాన్ 2) పంజాబ్
3) హర్యానా 4) ఉత్తరప్రదేశ్
16. {పపంచంలోకెల్లా అతిపెద్ద డెల్టా సుందర్‌బన్. దీన్ని ఏర్పరిచే నది ఏది?
1) గంగా 2) బ్రహ్మపుత్ర
3) 1, 2 4) యమున
17. చిలుకా సరస్సు ఎక్కడ ఉంది?
1) కేరళ 2) రాజస్థాన్
3) ఆంధ్రప్రదేశ్ 4) ఒడిశా
18. కిందివాటిలో హిమాలయాల కంటే ప్రాచీనమైన నది ఏది?
1) బియాస్ 2) సట్లెజ్
3) తీస్తా 4) కోసీ
19. కిందివాటిలో భూపరివేష్టిత నది ఏది?
1) నర్మద 2) సబర్మతి
3) లూని 4) తపతి
20. ‘ది హాంగ్’ అని ఏ నదిని పిలుస్తారు? 1) సింధు 2) బ్రహ్మపుత్ర
3) యమున 4) గంగా
21. సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్స్) అని దేన్ని పిలుస్తారు?
1) ఉదయ్‌పూర్ 2) బికనీర్
3) శ్రీనగర్ 4) జోథ్‌పూర్
22. ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది?
1) గోమతి 2) గంగా
3) సింధూనది 4) యమున
23. మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది?
1) తపతి 2) సబర్మతి
3) నర్మద 4) మహానది
24. కిందివాటిలో ఏ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు?
1) తమిళనాడు 2) కేరళ
3) ఒడిశా 4) పశ్చిమ బెంగాల్
25. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి.
1) పశ్చిమబెంగాల్ - సర్కార్ తీరం
2) ఒడిశా - వంగ తీరం
3) ఉత్తర ఆంధ్ర - ఉత్కళ్ తీరం
4) తమిళనాడు - కోరమాండల్ తీరం
26. భారతదేశ గొప్ప ఎడారి థార్. ఇది ఏ రాష్ట్రంలో అధిక భాగం విస్తరించి ఉంది?
1) గుజరాత్ 2) పంజాబ్
3) రాజస్థాన్ 4) మహారాష్ట్ర
27. కిందివాటిలో ఏ నదిని ‘నారాయణి’ అని పిలుస్తారు?
1) రాంగంగా 2) గండక్
3) కోసి 4) యమున
28. దామోదర్ నది ఎందులో అంతమవు తుంది?
1) గంగానదిలో 2) బంగాళాఖాతంలో
3) హుగ్లీనదిలో 4) యమునానదిలో
29. శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది?
1) శరావతి 2) భీమ
3) ఘటప్రభ 4) కావేరి
30. లోక్‌తక్ సరస్సు ఎక్కడ ఉంది?
1) నాగాలాండ్ 2) త్రిపుర
3) మణిపూర్ 4) ఒడిశా
31. లూనీ నది జన్మస్థానం ఏది?
1) అమర్ కంటక్ పీఠభూమి
2) ముల్టాయి
3) అజ్మీర్‌లోని అన్నాసాగర్
4) థార్ ఎడారి
32. సిక్కింలో ప్రవహించే ప్రధాన నది ఏది?
1) మానస్ 2) టోర్సు
3) జల్దకా 4) తీస్తా
33. కావేరి నదీజల వివాదంతో సంబంధం ఉన్న రాష్ట్రాలేవి?
1) తమిళనాడు, కర్ణాటక, కేరళ
2) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక
3) తమిళనాడు, కేరళ, ఒడిశా
4) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ
34. సింధూనది భారతదేశంలో ఒక రాష్ట్రం ద్వారానే ప్రవహిస్తోంది. ఆ రాష్ట్రం ఏది?
1) పంజాబ్ 2) జమ్మూ కాశ్మీర్
3) హర్యానా 4) రాజస్థాన్
35. భారతదేశంలో కెల్లా అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత ఆనకట్ట ‘విద్యా సాగర్ సేతు’. దీన్ని ఏ నదిపై నిర్మించారు?
1) గోదావరి 2) బ్రహ్మపుత్ర
3) హుగ్లీ 4) గంగా
36. వివాదాస్పద సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు?
1) బ్రహ్మపుత్ర 2) నర్మదా
3) తపతి 4) యమున
37. ‘లిమ్నాలజీ’ అనేది వేటి పుట్టుక గురించి తెలియజేసే శాస్త్రం?
1) సరస్సులు 2) నదులు
3) శిలలు 4) పైవేవీ కాదు
38. రిడ్లే తాబేళ్లకు ప్రసిద్ధి చెందిన సరస్సు ఏది?
1) వెంబనాడ్ 2) చిలకా
3) పులికాట్ 4) ఊలర్
39. దేశంలో అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన జ్వాలాబిల సరస్సు ఏది?
1) మహారాష్ట్రలోని లూనార్ సరస్సు
2) మణిపూర్‌లోని లోక్‌తక్ సరస్సు
3) జమ్మూ-కాశ్మీర్‌లోని ఊలర్ సరస్సు
4) ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్ సరస్సు
40. భారతదేశంలో రెండో అతిపెద్ద నది ఏది?
1) గంగా 2) కృష్ణానది
3) గోదావరి 4) నర్మదా
41. యమునా, గంగా నదులు కలిసే ప్రదేశం ఏది?
1) లక్నో 2) అలహాబాద్
3) పాట్నా 4) హరిద్వార్
42. పెన్ గంగా దేనికి ఉపనది?
1) గంగా 2) నర్మదా
3) గోదావరి 4) కృష్ణా
43. కిందివాటిలో పెన్నానది ఉపనది కానిది ఏది?
1) చిత్రావతి 2) సగిలేరు
3) జయమంగళ 4) ఇంద్రావతి
సమాధానాలు
1) 3; 2) 4; 3) 2; 4) 3;
5) 1; 6) 2; 7) 3; 8) 4;
9) 2; 10) 3; 11) 1; 12) 4;
13) 2; 14) 3; 15) 2; 16) 3;
17) 4; 18) 2; 19) 3; 20) 2;
21) 1; 22) 4; 23) 3; 24) 2;
25) 4; 26) 3; 27) 2; 28) 3;
29) 4; 30) 3; 31) 3; 32) 4;
33) 1; 34) 2; 35) 3; 36) 2;
37) 1; 38) 2; 39) 1; 40) 3;
41) 2; 42) 3; 43) 4.
‘సరస్సుల నగరం’ అని దేన్ని పిలుస్తారు?
Published Mon, Oct 13 2014 9:51 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement