sindhu river
-
భారత్‌లో కాలుష్యకాటుకు 24 లక్షలమంది బలి
సాక్షి, న్యూఢిల్లీ: భారతదేశంలో కాలుష్యం కారణంగా 2019లో 23.5 లక్షలకు పైగా అకాల మరణాలు సంభవించాయని లాన్సెట్ జర్నల్ పేర్కొంది. ప్రపంచ దేశాలన్నింటిలో 2019లో సంభవించిన కాలుష్య మరణాలు భారత్‌లోనే అత్యధికమని తెలిపింది. కాలుష్య మరణాల్లో అత్యధికం (16.7 లక్షలు) వాయుకాలుష్యం వల్ల జరిగాయని, వాయుకాలుష్య మరణాల్లో అత్యధిక మరణాలు(9.8 లక్షలు) పీఎం2.5 కాలుష్యకాల వల్ల సంభవించాయని వివరించింది. గాలిలో 2.5 మైక్రాన్లు, అంతకన్నా తక్కువ సైజుండే కణాలను పీఎం 2.5 కాలుష్యకాలంటారు. మిగిలిన వాయు కాలుష్య మరణాలు గృహసంబంధిత వాయు కాలుష్యకాల వల్ల సంభవించినట్లు తెలిపింది. భారత్‌లో 2019లో నీటి కాలుష్యంతో 5 లక్షలు, పారిశ్రామిక కాలుష్యంతో 1.6 లక్షల మంది మరణించారని తెలిపింది. ప్రపంచం మొత్తం మీద 2019లో అన్ని రకాల కాలుష్యాలతో 90 లక్షల మంది మరణించినట్లు నివేదిక తెలిపింది. వీటిలో అత్యధికంగా (66.7 లక్షలు) వాయుకాలుష్యం వల్లనే సంభవించాయి. అభివృద్ధి చెందుతున్న దేశాల్లో కాలుష్య తీవ్రత అధికంగా ఉందని నివేదిక రూపకర్త రిచర్డ్ చెప్పారు. 2015 నుంచి మాత్రమే దేశాలు కాలుష్య నివారణ బడ్జెట్‌ను స్వల్పంగా పెంచుతున్నాయన్నారు. గంగా మైదానంలో అధికం భారత్‌లో వాయు కాలుష్యం గంగా– సింధు మైదాన ప్రాంతం (ఉత్తర భారతం)లో అధికమని నివేదిక తెలిపింది. ఇళ్లలో బయోమాస్ తగలబెట్టడం వల్ల వాయుకాలుష్య మరణాలు సంభవిస్తున్నాయని తెలిపింది. దేశ వాతావరణంలో కాలుష్య కారకాలు 2014లో గరిష్ఠంగా ఉన్నాయని, ఆ తర్వాత కాస్త తగ్గినట్లు కనిపించినా తిరిగి వీటి సరాసరి పెరుగుతోందని తెలిపింది. భారత్‌లో జాతీయ వాయు శుభ్రతా కార్యక్రమం సహా పలు కార్యక్రమాలను ప్రభుత్వం కాలుష్య నివారణకు చేపట్టిందని, కానీ భారత్‌లో వాయుకాలుష్య నివారణకు బలమైన కేంద్రీయ వ్యవస్థ లేదని నివేదిక తెలిపింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధేశించిన ప్రమాణాల కన్నా భారత వాతావరణంలో కాలుష్యకాలు ఎక్కువగా ఉన్నాయని పేర్కొంది. అయితే సాంప్రదాయక కాలుష్యకాల వల్ల మరణాలు 2000 సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుతం 50 శాతం వరకు తగ్గినట్లు తెలిపింది. ఇదే సమయంలో కాలుష్యం వల్ల ఆర్థిక నష్టం జీడీపీలో ఒక్క శాతానికి పెరిగిందని తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా కాలుష్యం వల్ల జరిగిన ఆర్థిక నష్టం 46లక్షల కోట్ల డాలర్లుగా అంచనా వేసింది. అంతర్జాతీయంగా కాలుష్యాల వల్ల మరణాలు ఎక్కువగా ఉన్న దేశాల జాబితాలో అమెరికా 7వ స్థానంలో ఉంది. 2015లో చైనాలో 18 లక్షల మంది కాలుష్యంతో మరణించగా, ఈ సంఖ్య 2019లో 21.7 లక్షలకు పెరిగిందని నివేదిక తెలిపింది. -
వేసవి నేస్తం.. తీరుస్తుంది మీ తాపం!
వేసవి పేరు చెప్పగానే భగభగ మండే భానుడి ఎండ ప్రతాపం గుర్తుకు రావడం ఎంత సహజమో.. వాటి నుంచి ఉపశమనం ఇచ్చే తియ్యనైన చల్లని పుచ్చకాయ ముక్కలు గుర్తుకురావడం కూడా అంతే సహజం. వీటి రుచిని ఆస్వాదించకుండా వేసవి పూర్తికాదనే చెప్పాలి. అందరికీ అందుబాటు ధరలో అత్యధిక పోషకాలనందిస్తూ వేసవి తాపాన్ని తీరుస్తున్నాయి. మార్చిలో కూడా అడుగుపెట్టక ముందే అప్పడే భానుడు తన ప్రతాపం చూపడం మొదలు పెట్టాడు. అందుకే మార్కెట్లో పుచ్చకాయల వినియోగం ఊపందుకుంది. ఈరోజు వాటి విశేషాల గురించి తెలుసుకుందాం..! - సాక్షి, స్కూల్ ఎడిషన్ పుచ్చకాయనే కర్జూజ అని కూడా పిలుస్తారు. దీన్ని మన దేశంలో ఉద్యాన పంటగా సాగుచేస్తున్నారు. పుచ్చకాయ ఎక్కడ పుట్టిందో కచ్చితమైన ఆధారాలు లేకపోయినా ఈజిప్టులో ఐదు వేల ఏళ్ల క్రితమే పుచ్చను పండించినట్టు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. అప్పటి ఫారో చక్రవర్తులకు పుచ్చకాయ రుచి ఎంతో నచ్చడం వల్లే వారి గోడల మీదున్న చిత్రాల్లో వీటికి చోటు కల్పించారు. సమాధుల్లో కూడా వీటిని ఉంచేవారట. 13వ శతాబ్దానికి ఈ పంట యూరప్‌కు విస్తరించింది. మన దేశానికి.. క్రీ.శ నాలుగో శతాబ్దంలో మనదేశానికి పుచ్చకాయ వచ్చిందని చరిత్రకారులు చెబుతున్నప్పటికీ ఇక్కడే పుట్టిందని వాదించే వాళ్లూ ఉన్నారు. శుశృతుడు తన శుశృత సంహితలో సింధునదీ తీరంలో పుచ్చకాయలను పండించినట్టు పేర్కొన్నాడు. అందులో దీన్ని ‘కళింద’గా రాసాడట. పొడిగా ఉండే ఉష్ణమండల వాతావరణంలో ఎలాంటి నేలలో అయినా పుచ్చ పంటను సాగుచేయవచ్చు. అందుకే ఇది ప్రపంచమంతా విస్తరించింది. ఈ పంట అమెరికన్లకు 17వ శతాబ్దంలో పరిచయమయింది. పోషకాలమయం.. ఎండలో దాహార్తిని తీర్చుకోవాలంటే మొదట ప్రాధాన్యం ఇచ్చేది ఎర్రని పుచ్చకాయలకే. అన్ని సీజన్లలోనూ ఇవి లభ్యమవుతున్నా వేసవిలో పండించే వాటికి నాణ్యత, రుచి ఎక్కువ. బి-విటమన్లు, పొటాషియం సమృద్ధిగా లభించే పుచ్చకాయల నుంచి ఎలక్ట్రోలైట్లు పుష్కలంగా అందుతాయి. బి-విటమిన్లు శరీరానికి శక్తినందిస్తే, పొటాషియం గుండెకు మేలు చేస్తుంది. వడదెబ్బ బారిన పడి శరీరం నిస్తేజం అయిపోకుండా కాపాడుతుంది. వేడికి కమిలిన శరీరానికి చల్లని పుచ్చకాయ గుజ్జును రాస్తే చర్మం నిగారింపు సంతరించుకుంటుంది. ముదురు ఎరుపు లేక గులాబీ రంగు పుచ్చకాయలో కెరోటినాయిడ్స్, బీటా కెరోటిన్లు అధికంగా లభ్యమవుతాయి. వీటిని మన శరీరం ఎ-విటమిన్‌గా మార్చుకుంటుంది. వీటితో పాటు విటమిన్ బీ6, విటమిన్ సీ, పీచు పదార్థాలు కూడా ఉంటాయి. మిగిలిన పండ్లతో పోల్చుకుంటే నీటి శాతం వీటిలో అత్యధికం. విశేషాలు.. - అమెరికన్లు పుచ్చ పంటను సాగుచేయడంలో ఆఫ్రికన్లతో పోటీపడి అనేక ప్రయోగాలు చేస్తూన్నారు. గింజలు లేని పుచ్చకాయల్ని పండించడంతో పాటు ఎరుపు, పసుపు, గులాబీ రంగుల్లో పండిస్తున్నారు. - వీటి ఉత్పత్తిలో అమెరికాది నాలుగో స్థానం. - జపాన్‌లో చతురస్రాకారంలో ఉండే పుచ్చకాయల్ని పండిస్తున్నారు. పిందె దశలో ఉన్నప్పుడే కావాల్సిన పరిమాణంలో ఒక దీర్ఘ చతురస్రాకారపు చెక్క పెట్టెలో తీగకు ఉన్న పిందెను అమర్చుతారు. అది క్రమంగా అదే ఆకారంలో అమరుతుంది. ఇవి చూడటానికి కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. - చైనా,జపాన్లలో ఇంటికి వచ్చే అతిథులు ఎక్కువగా తెచ్చే బహుమతులు పుచ్చకాయలే. - సాధారణ పుచ్చకాయ బరువు 5-10 కిలోల బరువుంటే, వీటికి భిన్నంగా అమెరికాలో 20 కిలోల బరువుండే పుచ్చకాయల్ని పెంచుతారు. - అమెరికాలోని ఎరింగ్టన్కు చెందిన బిల్కార్నర్ 119 కిలోల బరువున్న పుచ్చకాయను పండించాడు. - పుచ్చలు డిసెంబర్ నుంచి మే వరకు బాగా పండుతాయి. - ఇజ్రాయెల్, ఈజిప్టు దేశాల్లో పుచ్చకాయముక్కలకు ఉప్పగా ఉండే చీజ్ ముక్కలు చేర్చి తినడాన్ని బాగా ఇష్టపడతారు. 100 గ్రాములు పుచ్చకాయ గుజ్జులో.. 1 నీరు - 95.2 గ్రా 1 ప్రోటీన్ - 0.3 గ్రా 1 కొవ్వు పదార్థాలు - 0.2 గ్రా 1 పీచు పదార్థాలు - 0.4 గ్రా 1 కెరోటిన్ - 169 మి.గ్రా 1 సీ విటమిన్ - 26 మి.గ్రా 1 కాల్షియం - 32 మి.గ్రా 1 ఫాస్పరస్ - 14 మి.గ్రా 1 ఇనుము - 1.4 మి.గ్రా 1 సోడియం - 104.6 మి.గ్రా 1 పొటాషియం - 341 మి.గ్రా 1 శక్తి - 17 కిలోక్యాలరీలు విభిన్న రకాలు.. ప్రపంచవ్యాప్తంగా 1200 రకాల పుచ్చ జాతుల్ని పండిస్తున్నారు. వాటిలో కొన్ని ముఖ్యమైనవి.. 1 నూర్జహాన్ 1 షర్బత్-ఎ- అనార్ 1 అనార్కలీ 1 షుగర్బేబీ (మహారాష్ట్రలోని అమెరికా రకం) 1 అసాహా యమటో (పశ్చిమ బెంగాల్‌లోని జపాన్ రకం) 1 నందారి (ఏపీలో అధికంగా పండించే రకం) 1 రెడ్ టైగర్ 1 ఆల్ స్వీట్ 1 వాల్ పెయింట్ -
‘సరస్సుల నగరం’ అని దేన్ని పిలుస్తారు?
మాదిరి ప్రశ్నలు (భారత దేశ నదీ వ్యవస్థ) 1. కిందివాటిలో ఏది సింధునది ఉపనది కాదు? 1) జీలం 2) బియాస్ 3) గండక్ 4) సట్లెజ్ 2. నదులు, వాటి ఉపనదులకు సంబంధించి కిందివాటిలో సరికానిదాన్ని గుర్తించండి. 1) కృష్ణా - భీమా 2) బ్రహ్మపుత్ర - తీస్తా 3) గోదావరి - ఇంద్రావతి 4) యమున - సట్లెజ్ 3. కిందివాటిలో ఏ నగరం గంగానది ఒడ్డున లేదు? 1) వారణాసి 2) లక్నో 3) కాన్పూర్ 4) అలహాబాద్ 4. కృష్ణానది దాని ఉపనది తుంగభద్రతో ఎక్కడ కలుస్తుంది? 1) కృష్ణాజిల్లాలోని మచిలీపట్నం 2) ఆదిలాబాద్ జిల్లాలోని బాసర 3) కర్నూలు జిల్లాలోని సంగం 4) మహబూబ్‌నగర్ జిల్లాలోని తంగడి 5. ఆంధ్రప్రదేశ్‌లోని నదులు ఏ సముద్రంలో కలుస్తాయి? 1) బంగాళాఖాతం 2) అరేబియా సముద్రం 3) హిందూ మహాసముద్రం 4) పసిఫిక్ మహాసముద్రం 6. కిందివాటిలో గోదావరి నదికి ఉపనది కానిది ఏది? 1) మంజీర 2) మూసీ 3) ప్రాణహిత 4) శబరి 7. డుడుమా జలపాతం ఏ నదిపై ఉంది? 1) నాగావళి 2) వంశధార 3) మాచ్‌ఖండ్ 4) తుంగభద్ర 8. బాలాఘాట్ పర్వతాల్లో జన్మించే నది? 1) తుంగభద్ర 2) కృష్ణా 3) పెన్నా 4) మంజీర 9. హైదరాబాద్ నగరంలో ప్రవహించే నది? 1) మంజీర 2) మూసీ 3) నాగావళి 4) కొయనా 10. లాంగుల్యనది అని కిందివాటిలో ఏ నదిని పిలుస్తారు? 1) వంశధార 2) మాచ్‌ఖండ్ 3) నాగావళి 4) దిండి 11. }M>Mుళం జిల్లాలో ప్రవహించే ప్రముఖ నది ఏది? 1) వంశధార 2) పెన్నా 3) కిన్నెరసాని 4) పాపగ్ని 12. కర్నూలు పట్టణం ఏ నదీతీరాన ఉంది? 1) కృష్ణా 2) పెన్నా 3) గోదావరి 4) తుంగభద్ర 13. {బహ్మపుత్రనదికి సంభవించే వరదల వల్ల అమితంగా నష్టపోతున్న రాష్ట్రం ఏది? 1) అరుణాచల్ ప్రదేశ్ 2) అసోం 3) మేఘాలయ 4) సిక్కిం 14. మనదేశంలోకెల్లా అతిపెద్ద ఉప్పునీటి సరస్సు ‘సాంబారు’ ఏ రాష్ట్రంలో ఉంది? 1) జమ్మూ-కాశ్మీర్ 2) మహారాష్ర్ట 3) రాజస్థాన్ 4) ఒడిశా 15. పంచనదుల భూమి అని దేన్ని పిలుస్తారు? 1) రాజస్థాన్ 2) పంజాబ్ 3) హర్యానా 4) ఉత్తరప్రదేశ్ 16. {పపంచంలోకెల్లా అతిపెద్ద డెల్టా సుందర్బన్. దీన్ని ఏర్పరిచే నది ఏది? 1) గంగా 2) బ్రహ్మపుత్ర 3) 1, 2 4) యమున 17. చిలుకా సరస్సు ఎక్కడ ఉంది? 1) కేరళ 2) రాజస్థాన్ 3) ఆంధ్రప్రదేశ్ 4) ఒడిశా 18. కిందివాటిలో హిమాలయాల కంటే ప్రాచీనమైన నది ఏది? 1) బియాస్ 2) సట్లెజ్ 3) తీస్తా 4) కోసీ 19. కిందివాటిలో భూపరివేష్టిత నది ఏది? 1) నర్మద 2) సబర్మతి 3) లూని 4) తపతి 20. ‘ది హాంగ్’ అని ఏ నదిని పిలుస్తారు? 1) సింధు 2) బ్రహ్మపుత్ర 3) యమున 4) గంగా 21. సరస్సుల నగరం (సిటీ ఆఫ్ లేక్స్) అని దేన్ని పిలుస్తారు? 1) ఉదయ్‌పూర్ 2) బికనీర్ 3) శ్రీనగర్ 4) జోథ్‌పూర్ 22. ఢిల్లీ నగరం ఏ నది ఒడ్డున ఉంది? 1) గోమతి 2) గంగా 3) సింధూనది 4) యమున 23. మార్బుల్ జలపాతం ఏ నదిపై ఉంది? 1) తపతి 2) సబర్మతి 3) నర్మద 4) మహానది 24. కిందివాటిలో ఏ ప్రాంతాన్ని మలబార్ తీరం అని పిలుస్తారు? 1) తమిళనాడు 2) కేరళ 3) ఒడిశా 4) పశ్చిమ బెంగాల్ 25. కిందివాటిలో సరైనదాన్ని గుర్తించండి. 1) పశ్చిమబెంగాల్ - సర్కార్ తీరం 2) ఒడిశా - వంగ తీరం 3) ఉత్తర ఆంధ్ర - ఉత్కళ్ తీరం 4) తమిళనాడు - కోరమాండల్ తీరం 26. భారతదేశ గొప్ప ఎడారి థార్. ఇది ఏ రాష్ట్రంలో అధిక భాగం విస్తరించి ఉంది? 1) గుజరాత్ 2) పంజాబ్ 3) రాజస్థాన్ 4) మహారాష్ట్ర 27. కిందివాటిలో ఏ నదిని ‘నారాయణి’ అని పిలుస్తారు? 1) రాంగంగా 2) గండక్ 3) కోసి 4) యమున 28. దామోదర్ నది ఎందులో అంతమవు తుంది? 1) గంగానదిలో 2) బంగాళాఖాతంలో 3) హుగ్లీనదిలో 4) యమునానదిలో 29. శివసముద్రం జలపాతం ఏ నదిపై ఉంది? 1) శరావతి 2) భీమ 3) ఘటప్రభ 4) కావేరి 30. లోక్తక్ సరస్సు ఎక్కడ ఉంది? 1) నాగాలాండ్ 2) త్రిపుర 3) మణిపూర్ 4) ఒడిశా 31. లూనీ నది జన్మస్థానం ఏది? 1) అమర్ కంటక్ పీఠభూమి 2) ముల్టాయి 3) అజ్మీర్‌లోని అన్నాసాగర్ 4) థార్ ఎడారి 32. సిక్కింలో ప్రవహించే ప్రధాన నది ఏది? 1) మానస్ 2) టోర్సు 3) జల్దకా 4) తీస్తా 33. కావేరి నదీజల వివాదంతో సంబంధం ఉన్న రాష్ట్రాలేవి? 1) తమిళనాడు, కర్ణాటక, కేరళ 2) తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక 3) తమిళనాడు, కేరళ, ఒడిశా 4) కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, కేరళ 34. సింధూనది భారతదేశంలో ఒక రాష్ట్రం ద్వారానే ప్రవహిస్తోంది. ఆ రాష్ట్రం ఏది? 1) పంజాబ్ 2) జమ్మూ కాశ్మీర్ 3) హర్యానా 4) రాజస్థాన్ 35. భారతదేశంలో కెల్లా అత్యంత పొడవైన కేబుల్ ఆధారిత ఆనకట్ట ‘విద్యా సాగర్ సేతు’. దీన్ని ఏ నదిపై నిర్మించారు? 1) గోదావరి 2) బ్రహ్మపుత్ర 3) హుగ్లీ 4) గంగా 36. వివాదాస్పద సర్దార్ సరోవర్ ప్రాజెక్టు ఏ నదిపై నిర్మించారు? 1) బ్రహ్మపుత్ర 2) నర్మదా 3) తపతి 4) యమున 37. ‘లిమ్నాలజీ’ అనేది వేటి పుట్టుక గురించి తెలియజేసే శాస్త్రం? 1) సరస్సులు 2) నదులు 3) శిలలు 4) పైవేవీ కాదు 38. రిడ్లే తాబేళ్లకు ప్రసిద్ధి చెందిన సరస్సు ఏది? 1) వెంబనాడ్ 2) చిలకా 3) పులికాట్ 4) ఊలర్ 39. దేశంలో అగ్నిపర్వత ప్రక్రియ వల్ల ఏర్పడిన జ్వాలాబిల సరస్సు ఏది? 1) మహారాష్ట్రలోని లూనార్ సరస్సు 2) మణిపూర్‌లోని లోక్తక్ సరస్సు 3) జమ్మూ-కాశ్మీర్‌లోని ఊలర్ సరస్సు 4) ఆంధ్రప్రదేశ్‌లోని పులికాట్ సరస్సు 40. భారతదేశంలో రెండో అతిపెద్ద నది ఏది? 1) గంగా 2) కృష్ణానది 3) గోదావరి 4) నర్మదా 41. యమునా, గంగా నదులు కలిసే ప్రదేశం ఏది? 1) లక్నో 2) అలహాబాద్ 3) పాట్నా 4) హరిద్వార్ 42. పెన్ గంగా దేనికి ఉపనది? 1) గంగా 2) నర్మదా 3) గోదావరి 4) కృష్ణా 43. కిందివాటిలో పెన్నానది ఉపనది కానిది ఏది? 1) చిత్రావతి 2) సగిలేరు 3) జయమంగళ 4) ఇంద్రావతి సమాధానాలు 1) 3; 2) 4; 3) 2; 4) 3; 5) 1; 6) 2; 7) 3; 8) 4; 9) 2; 10) 3; 11) 1; 12) 4; 13) 2; 14) 3; 15) 2; 16) 3; 17) 4; 18) 2; 19) 3; 20) 2; 21) 1; 22) 4; 23) 3; 24) 2; 25) 4; 26) 3; 27) 2; 28) 3; 29) 4; 30) 3; 31) 3; 32) 4; 33) 1; 34) 2; 35) 3; 36) 2; 37) 1; 38) 2; 39) 1; 40) 3; 41) 2; 42) 3; 43) 4.