ఎస్‌ఎస్‌సీ - ఇంజనీరింగ్ ఉద్యోగాలు | Engineering Jobs | Sakshi
Sakshi News home page

ఎస్‌ఎస్‌సీ - ఇంజనీరింగ్ ఉద్యోగాలు

Published Thu, Jul 16 2015 12:21 AM | Last Updated on Sun, Sep 3 2017 5:33 AM

Engineering Jobs

 స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ).. వివిధ కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 1,000 గ్రూప్-బి నాన్ గెజిటెడ్ జూనియర్ ఇంజనీర్ల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోస్టుల వివరాలు, పరీక్షా విధానంపై ఫోకస్..
 
 ఉద్యోగాల వివరాలు:
 సెంట్రల్ వాటర్ కమిషన్ (సివిల్, మెకానికల్): వయసు 32 ఏళ్లకు మించకూడదు. విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా లేదా సివిల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ. సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్‌మెంట్ (సివిల్):
 వయసు 32 ఏళ్లకు మించకూడదు.
 విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.
 సెంట్రల్ పబ్లిక్ వాటర్ డిపార్ట్‌మెంట్(ఎలక్ట్రికల్):
 వయసు 32 ఏళ్లకు మించకూడదు.
 విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా.
 డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (సివిల్):
 వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
 విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/తత్సమానం.
 డిపార్ట్‌మెంట్ ఆఫ్ పోస్ట్ (ఎలక్ట్రికల్):
 వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
 ద్యార్హత: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/తత్సమానం.
 మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (సివిల్):
 వయసు 30 ఏళ్లకు మించకూడదు.

 ద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు సివిల్ ఇంజనీరింగ్ విభాగంలో రెండేళ్ల పని అనుభవంవిద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిగ్రీ లేదా గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమాతోపాటు ఎలక్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్ విభాగాల్లో రెండేళ్ల పని అనుభవం.
 
 మిలిటరీ ఇంజనీర్ సర్వీసెస్ (సర్వేయింగ్ అండ్ కాంట్రాక్ట్ విభాగాలు): వయసు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
 విద్యార్హత: గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సర్వేయర్స్ నిర్వహించే బిల్డింగ్ అండ్ క్వాంటిటీ సర్వేయింగ్ సబ్‌డివిజనల్-ఐఐ ఇంటర్మీడియెట్ పరీక్షలో ఉత్తీర్ణులై ఉండాలి.గమనిక: అన్ని విభాగాల్లోని పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఓబీసీలకు గరిష్ట వయోపరిమితిలో మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు పదేళ్లు సడలింపు ఉంటుంది. పేస్కేల్: రూ.9,300-34,800. గ్రేడ్ పే: రూ.4,200
 
 పరీక్ష విధానం:
 రాత పరీక్షను రెండు దశల్లో నిర్వహిస్తారు. ఇది మొత్తం 500 మార్కులకు ఉంటుంది. మొదటి దశలో ఉత్తీర్ణత సాధిస్తే రెండో దశ పరీక్షకు అనుమతిస్తారు. రాతపరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు ఇంటర్వ్యూ (100 మార్కులు)కు అర్హులు. పేపర్-1; రాత పరీక్ష: మొత్తం పరీక్ష 200 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం: రెండుగంటలు. పరీక్ష మూడు భాగాలుగా ఉంటుంది. ఈ పరీక్ష ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.1. జనరల్ ఇంటలిజెన్స్ అండ్ రీజనింగ్: ఈ పరీక్షను అన్ని విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాలి. ఇది 50 మార్కులకు ఉంటుంది.2. జనరల్ అవేర్‌నెస్: ఈ పరీక్షను అన్ని విభాగాలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రాయాలి. ఇది 50 మార్కులకు ఉంటుంది.
 
 3. సివిల్/స్ట్రక్చరల్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-ఏ, ఎలక్ట్రికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-బి, మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పార్ట్-సి భాగాలు రాయాలి. ఈ పరీక్ష 100 మార్కులకు ఉంటుంది.పేపర్-2; రాతపరీక్ష: పేపర్-1లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులను పేపర్-2 పరీక్ష రాసేందుకు అర్హులు. ఈ పరీక్ష 300 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం: రెండు గంటలు. సివిల్/స్ట్రక్చరల్ విభాగాలకు దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-ఏ, ఎలక్ట్రికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్నవారు పార్ట్-బి, మెకానికల్ విభాగానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు పార్ట్-సి భాగాలు రాయాలి. దరఖాస్తు రుసుం: రూ. 100. మహిళలు, ఎస్సీ, ఎస్టీ, ప్రత్యేక కేటగిరీ అభ్యర్థులకు ఫీజు మినహాయింపు ఉంది.
 
 ముఖ్యతేదీలు:
 పార్ట్-1 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 7, 2015
 పార్ట్-2 రిజిస్ట్రేషన్ చివరి తేదీ: జూలై 10, 2015.
 కేంద్రాలు: హైదరాబాద్, విశాఖపట్నం
 వెబ్‌సైట్: http://ssconline.nic.in,
 http://ssconline2.gov.in
 
 ప్రిపరేషన్ ప్రణాళిక
 జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ కోసం బ్యాంకింగ్, ఆర్‌ఆర్‌బీ తదితర పరీక్షల పాత ప్రశ్నపత్రాలను ప్రాక్టీస్ చేయాలి. జనరల్ అవేర్‌నెస్‌లో ఇండియన్ జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ, ఎకానమీ, అవార్డులు-విజేతలు, క్రీడలు-విజేతలు తదితర అంశాలను చదవాలి. ఇంజనీరింగ్‌కు సంబంధించి ఆయా బ్రాంచ్‌ల టెక్నికల్ సబ్జెక్టు నుంచి ప్రశ్నలు వస్తాయి.ఎలక్ట్రికల్: సర్క్యూట్లలోని బేసిక్ ప్రిన్సిపుల్స్, బేసిక్ ఫార్ములాలు, వాటి యూనిట్లు తదితర అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి. ఎలక్ట్రికల్ మెషీన్స్, పవర్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ మెజర్‌మెంట్స్ అంశాలపై అవగాహన అవసరం.
 
 సివిల్ ఇంజనీరింగ్: స్ట్రెంథ్ ఆఫ్ మెటీరియల్స్, ఫ్లూయిడ్ మెకానిక్స్,సర్వేయింగ్ వంటి అంశాలకు సంబంధించిన ప్రిన్సిపుల్స్, ఫార్ములాలు, యూనిట్లపై అవగాహన అవసరం.మెకానిక్స్: థర్మోడైనమిక్స్, ఇంజనీరింగ్ మెకానిక్స్, ఐసీ ఇంజన్, హీట్ ఇంజన్ వంటి అంశాల నుంచి ఎక్కువ ప్రశ్నలు ఇస్తారు. వీటికి సంబంధించిన బేసిక్ ప్రిన్సిపుల్స్‌ను అధ్యయనం చేయాలి.ఇంజనీరింగ్ బ్రాంచ్ సబ్జెక్టులకు సంబంధించిన ప్రాథ మిక సూత్రాలను ఒకచోట రాసుకొని,రివిజన్ చేస్తుండాలి.సమయపాలనను అలవరచుకోవడం కోసం నమూనా ప్రశ్నపత్రాలను సాధిస్తుండాలి.చదివిన అంశానికి సంబంధించిన ప్రశ్నలను సేకరించి, ప్రాక్టీస్ చేయాలి.- జి.రమణ, డెరైక్టర్, సాయిమేధ విద్యా సంస్థలు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement