ఎథికల్ హ్యాకింగ్ కోర్సును అందిస్తున్న వర్సిటీలు.. | Ethical hacking course offered by Coventry University | Sakshi
Sakshi News home page

ఎథికల్ హ్యాకింగ్ కోర్సును అందిస్తున్న వర్సిటీలు..

Published Thu, Jan 29 2015 12:12 AM | Last Updated on Sat, Sep 2 2017 8:25 PM

ఎథికల్ హ్యాకింగ్ కోర్సును అందిస్తున్న వర్సిటీలు..

ఎథికల్ హ్యాకింగ్ కోర్సును అందిస్తున్న వర్సిటీలు..

 బీటెక్ (ఈఈఈ) తర్వాత ఎటువంటి అవకాశాలు ఉంటాయి?    -కిరణ్, మంచిర్యాల.
 బీటెక్ (ఈఈఈ) తర్వాత ఉన్నత విద్యపై ఆసక్తి ఉంటే గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్) పరీక్షకు హాజరు కావచ్చు. తద్వారా ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటీ), ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)-బెంగళూరు, నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (నిట్)లు సహా ఏ ఇన్‌స్టిట్యూట్‌లోనైనా.. ఎంఈ/ ఎంటెక్/పీహెచ్‌డీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. పలు పబ్లిక్ సెక్టార్ కంపెనీలు ఎంట్రీలెవల్ రిక్రూట్‌మెంట్ కోసం కూడా గేట్ స్కోర్‌ను ప్రామాణికంగా తీసుకుంటున్నాయి.

బార్క్, భారత అణుశక్తి శాఖలోని కొన్ని విభాగాలు, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, నేషనల్ థర్మల్ పవర్ కార్పొరేషన్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్‌లు.. గేట్ స్కోర్ ఆధారంగానే ఎంట్రీ లెవల్ ఉద్యోగులను భర్తీ చేసుకుంటున్నాయి. మన రాష్ట్రంలో పీజీఈసెట్ ద్వారా ఎంటెక్/ఎంఈ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. మరో అవకాశం యూపీఎస్సీ జాతీయ స్థాయిలో నిర్వహించే ఇంజనీరింగ్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ (ఐఈఎస్). ఈ పరీక్ష ద్వారా ఇండియన్ రైల్వే సర్వీస్, ఇండియన్ రైల్వే స్టోర్ సర్వీస్, సెంట్రల్ పవర్ ఇంజనీరింగ్ సర్వీస్, సెంట్రల్ వాటర్ ఇంజనీరింగ్ సర్వీస్, ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ తదితర కేంద్ర ప్రభుత్వ విభాగాల్లో గ్రూప్-ఏ, బీ ఆఫీసర్ల పోస్టులను భర్తీ చేస్తారు. వివరాలకు: www.upsc.gov.in
 
 సైబర్ సెక్యూరిటీ అండ్ ఎథికల్ హ్యాకింగ్ కోర్సును ఆఫర్ చేస్తున్న యూనివర్సిటీలేవి?
 -శంకర్, నెల్లూరు.
 ఇంటర్నెట్, కంప్యూటర్ల వినియోగంలో అనుసంధానం చేసిన నెట్‌వర్క్‌కు సంబంధించిన లోపాలను గుర్తించి వాటికి పరిష్కారం చూపడమే ఎథికల్ హ్యాకింగ్. హ్యాకింగ్ టూల్స్, టెక్నిక్స్ ఉపయోగించి నెట్‌వర్క్, అప్లికేషన్స్, వెబ్‌సైట్స్ తదితరాల నెట్‌వర్క్‌కు చెందిన సెక్యూరిటీ ప్రోటోకాల్‌ను సురక్షితంగా ఉంచేందుకు కావల్సిన వ్యూహాలను ఎథికల్ హ్యాకర్స్ రూపొందిస్తారు. కోర్సులో భాగంగా నెట్‌వర్క్ ప్రోటోకాల్స్, ఆర్కిటెక్చర్, నెట్‌వర్కింగ్‌టూల్స్, టెక్నిక్స్ ప్రోగ్రామింగ్, ఆపరేటింగ్ సిస్టమ్ అంశాలను బోధిస్తారు. ఎథికల్ హ్యాకింగ్ కోర్సును పలు యూనివర్సిటీలు పీజీ స్థాయిలో ఆఫర్ చేస్తున్నాయి. వివరాలు..
 ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐఐఐటీ)- హైదరాబాద్
 కోర్సు: ఎంటెక్ (కంప్యూటర్ సైన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)
 వివరాలకు: www.iiit.ac.in
 ేఎన్‌టీయూ-హైదరాబాద్
 కోర్సు: ఎంటెక్ (కంప్యూటర్ నెట్‌వర్క్స్ అండ్ ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ)
 వివరాలకు: www.jntuh.ac.in
 ఆంధ్రా యూనివర్సిటీ-విశాఖపట్నం
 కోర్సు: ఎంటెక్ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కంప్యూటర్ నెట్‌వర్క్స్)
 వివరాలకు:
 www.andhrauniversity.edu.in
 
 ఈ యూనివర్సిటీలు గేట్ (గ్రాడ్యుయేట్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఇంజనీరింగ్)లేదా పోస్ట్‌గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (పీజీఈసెట్) ఆధారంగా ప్రవేశం కల్పిస్తాయి.
 
 పీజీ (రోబోటిక్స్) కోర్సు వివరాలను తెలపండి?
 -కళ, విజయనగరం.
 రోబోటిక్స్ అనేది మెకానికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సాఫ్ట్‌వేర్ బ్రాంచ్‌లకు సంబంధించిన ఇంటర్‌డిసిప్లినరీ సబ్జెక్ట్. రోబోటిక్స్‌లో ఎంఈ/ఎంటెక్ చేయాలనుకునే వారు బీటెక్ (మెకానికల్)/అనుబంధ బ్రాంచ్‌లతో పూర్తి చేయాల్సి ఉంటుంది. రోబోటిక్స్ పూర్తిచేసిన వారికి ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, మైనింగ్, టూల్ డిజైన్, ఏవియేషన్, ఆటోమొబైల్ వంటి రంగాలు కెరీర్ అవెన్యూస్‌గా ఉంటాయి.
 
 ఎంఈ/ఎంటెక్ (రోబోటిక్స్) కోర్సును ఆఫర్ చేస్తున్న ఇన్‌స్టిట్యూట్‌లు:
 యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్
 కోర్సు: ఎంటెక్(కంప్యూటర్ సైన్స్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సీ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ)
 అడ్మిషన్: గేట్ స్కోర్ ఆధారంగా.
 వివరాలకు: www.uohyd.ac.in
 యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్- ఉస్మానియా యూనివర్సిటీ
 కోర్సు: ఎంఈ(ఆటోమేషన్ అండ్ రోబోటిక్స్)
 అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా
 ఆంధ్రా యూనివ ర్సిటీ-విశాఖపట్నం
 కోర్సు: కంప్యూటర్ సైన్స్ అండ్ టెక్నాలజీ విత్ ఆర్టిఫిషీయల్ ఇంటెలిజెన్సీ రోబోటిక్స్ స్పెషలైజేషన్‌గా
 అడ్మిషన్: గేట్/పీజీఈసెట్ స్కోర్ ఆధారంగా
 వివరాలకు: www.andhrauniversity.edu.in
 
 పెట్రోలియం, గ్యాస్, చమురు రంగాలకు సంబంధించి ఎంబీఏ మేనేజ్‌మెంట్ కోర్సులను అందిస్తున్న సంస్థలేవి?    - జీవిత, నరసన్నపేట.
 ఎంబీఏ-పెట్రోలియం మేనేజ్‌మెంట్ కోర్సును అందిస్తున్న సంస్థలు భారతదేశంలో తక్కువగానే ఉన్నాయని చెప్పొచ్చు.
 రాజీవ్‌గాంధీ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం టెక్నాలజీ, రాయ్‌బరేలీ (ఉత్తరప్రదేశ్).. పెట్రోలియం అండ్ ఎనర్జీ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
 అర్హత: ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి గ్రాడ్యుయేషన్ పూర్తిచేయాలి. ప్రవేశపరీక్షలో ప్రతిభ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
 వెబ్‌సైట్: www.rgipt.ac.in
 యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ ఎనర్జీ స్టడీస్, డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్).. ఆయిల్ అండ్ గ్యాస్ మేనేజ్‌మెంట్‌లో ఎంబీఏ కోర్సును అందిస్తోంది. వెబ్‌సైట్: www.upesindia.org
 స్కూల్ ఆఫ్ పెట్రోలియం మేనేజ్‌మెంట్, గాంధీనగర్ (గుజరాత్).. చమురు, గ్యాస్ రంగానికి సంబంధించి ఎంబీఏ కోర్సును అందిస్తోంది.
 అర్హత: కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్. క్యాట్ స్కోర్, జీడీ, ఇంటర్వ్యూ ఆధారంగా ప్రవేశం కల్పిస్తారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement