వీఆర్‌వో/ వీఆర్‌ఏ పంచాయతీ సెక్రటరీలు ప్రత్యేకం
1. మకర రేఖ ప్రాంతంలో ఏ రోజున సూర్యకిరణాలు లంబంగా పడతాయి?
డిసెంబరు 22
2. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి?
జూన్ రెండో వారంలో
3. ప్రపంచంలో అరుదైన ఎర్ర చందనం వృక్షాలు ఏ జిల్లాలో ఉన్నాయి?
కడప
4. పండ్లతోటల సాగుకు అనుకూలమైన నేలలు/మృత్తికలు?
ఒండ్రు మృత్తికలు
5. వరి ఎక్కువగా ఏ రాష్ర్టంలో పండుతుంది?
పశ్చిమబెంగాల్
6. అగరువత్తుల తయారీకి ప్రసిద్ధి చెందిన పట్టణం?
వేటపాలెం
7. భూభ్రమణం వల్ల ఉత్పత్తయ్యే శక్తిని ‘కొరియాలిస్ ఎఫెక్ట్’గా పిలుస్తారు. దీనివల్ల ఏ పరిణామాలు ఏర్పడుతున్నాయి?
ఉత్తరార్ధ గోళంలో వీచే పవనాలు
కుడివైపునకు, దక్షిణార్ధ గోళంలో వీచే పవనాలు ఎడమవైపునకు వెళ్తున్నాయి.
8. హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్ర వాతాలను ఏ పేరుతో పిలుస్తారు?
సైక్లోన్లు
9. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఏడారి?
సోనారన్
10. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం?
వయలీలీ
11. ‘సజీవ శిలాజ భూమి’(ద ల్యాండ్ ఆఫ్ లివింగ్ ఫాసిల్స్) గా ప్రఖ్యాతి చెందిన దేశం?
ఆస్ట్రేలియా
12. జాతీయాదాయం అంటే?
ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి
13. భారతదేశ తీర రేఖ పొడవు?
6,100 కి.మీ.
14. మూలధనాన్ని వాడుకున్నందుకు చెల్లించే ధరను ఏమంటారు?
వడ్డీ
15. మనదేశంలో అడవుల విస్తీర్ణం ఎంత శాతం?
21
16. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో గత దశాబ్ది జనాభావృద్ధి రేటు?
17.64 శాతం
17. ఏ రాష్ర్టంలో ఎక్కువమంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు?
హిమాచల్ ప్రదేశ్
18. భారతదేశంలో అత్యధిక సాగుభూమికి వేటి ద్వారా నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది?
బావులు
19. ‘నీలి విప్లవం’ అంటే?
చేపల ఉత్పత్తిని పెంచడం
20. మాంగనీస్ నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లా?
శ్రీకాకుళం
21. సింధునాగరికత విలసిల్లిన కాలం?
క్రీ.పూ. 2500 - 1750
22. రుగ్వేదంలో యుద్ధానికి పర్యాయపదంగా ‘గవిష్ఠి’ అనే పదం వాడారు. ‘గవిష్ఠి’ అంటే అర్థం?
ఆవుల కోసం అన్వేషించడం
23. ‘శ్వేతాంబరులు’ ఏ మతానికి చెందినవారు?
జైనమతం
24. అశోకుని కాలంలో ‘ధర్మ మహా మాత్రులు’ అంటే ఎవరు?
దర్మబోధనలు చేసే ప్రత్యేక అధికారులు
25. శాతవాహనుల పాలనలోని సామాజిక పరిస్థితులను వివరించే శిల్పాలు ఎక్కడు న్నాయి?
అమరావతి
26. వేంగీ చాళుక్యుల కాలంలో గ్రామాలను పర్యవేక్షించే అధికారులను ఏమని పిలిచేవారు?
రాష్ర్టకూట మహాత్తర
27. గ్రామ సభలకు సంపూర్ణ అధికారాలిచ్చిన రాజులు?
చోళులు
28. వ్యవసాయాభివృద్ధి కోసం కాలువలను తవ్వించిన ఢిల్లీ సుల్తాన్?
ఫిరోజ్ షా తుగ్లక్
29. ‘నృత్త రత్నావళి’ గ్రంథాన్ని రాసినవారు?
జాయపసేనాని
30. ‘పొట్టీకాదు, పొడగరీ కాదు, బొద్దుగా ఉండి ముఖం మీద మచ్చలు ఉంటాయి’ ఇది ఏ రాజు గురించి చేసిన ప్రస్తావన?
}Mృష్ణదేవరాయలు
31. భారతదేశంలో ‘స్థానిక స్వపరిపాలన పిత’గా ప్రసిద్ధిగాంచిన బ్రిటిష్ గవర్నర్ జనరల్?
లార్‌డ రిప్పన్
32. భారతదేశంలో ఆంగ్లేయుల పాలన కాలంలో మద్రాస్ రాష్ర్టంలో ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం?
రైత్వారీ పద్ధతి
33. ఏటా పంటలు పండించే భూమిని అక్బర్ కాలంలో ఏ విధంగా పిలిచేవారు?
పోలాజ్
34. చైనా మహాకుడ్యాన్ని (ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) నిర్మించిన ఆ దేశ రాజవంశం?
చింగ్ వంశం
35. {Mూసేడులు అంటే?
మతయుద్ధాలు
36. పారిశ్రామిక విప్లవం మొదటిసారి ఏ దేశంలో ప్రారంభమైంది?
ఇంగ్లండ్
37. ‘బలప్రయోగం’ (బ్లడ్ అండ్ ఐరన్) అనే విధానంతో జర్మనీ ఏకీకరణ సాధించిన వారు?
బిస్మార్‌క
38. ‘వర్‌సయిల్స్ సంధి’ ఏ సంవత్సరంలో జరిగింది?
1919
39. సోవియట్ రష్యా కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటైన రక్షణాత్మక వ్యవస్థ?
నాటో
40. భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశం (1885) ఎక్కడ జరిగింది?
బొంబాయి
41. జలియన్ వాలాబాగ్ ఉదంతం ఎప్పుడు జరిగింది?
ఏప్రిల్ 13, 1919
42. మెక్‌డోనాల్డ్ ప్రకటించిన కమ్యూనల్ అవార్‌డకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారు?
గాంధీజీ
43. ఏ ప్రణాళిక ప్రకారం భారతదేశ విభజన జరిగింది?
మౌంట్‌బాటన్
44. వందేమాతర ఉద్యమానికి తక్షణ కారణం?
బెంగాల్ విభజన
45. ‘వివేకవర్ధిని’ పత్రికను నిర్వహించినవారు?
కందుకూరి వీరేశలింగం
46. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అస్పృశ్యతను నిషేధించింది?
17వ
47. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది?
న్యూయార్‌క
48. భారత రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైనవారు?
సచ్చిదానంద సిన్హా
49. మన రాజ్యాంగంలోని ‘ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో చేర్చారు?
ఐర్లాండ్
50. మన రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రాథమిక విధులెన్ని?
11
51. పంచాయతీరాజ్‌కు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణను ఎప్పుడు చేశారు?
1993
52. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయా లని చెబుతున్న రాజ్యాంగ ప్రకరణ?
40
53. ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తిహక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు?
44వ
54. అంబేద్కర్ దృష్టిలో ప్రాథమిక హక్కులకు ‘ఆత్మ’ వంటి హక్కు?
రాజ్యాంగ పరిహార హక్కు
55. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన అంశాలు?
సామ్యవాద, లౌకిక
56. రాష్ర్టపతి వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు?
పార్లమెంట్
57. రాజ్యసభలో సమాన సంఖ్యలో స్థానా లున్న రాష్ట్రాలు?
ఆంధ్రప్రదేశ్, తమిళనాడు
58. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు?
65 ఏళ్లు
59. గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు?
రాష్ర్టపతి
60. మనరాష్ర్టంలో ప్రస్తుతం ఉన్న స్థానిక స్వపరిపాలన సంస్థలు వరుసగా?
గ్రామ పంచాయతీ - మండల పరిషత్ - జిల్లా ప్రజాపరిషత్