bommana boina srinivas
-
ఆర్ఆర్సీ గ్రూప్-డి నమూనా ప్రశ్నపత్రం
ప్రశ్నల సంఖ్య: 100 గరిష్ఠ మార్కులు: 100 సమయం: 90 నిమిషాలు గమనిక: సమాధానం తప్పుగా గుర్తించిన ప్రతి ప్రశ్నకు 1/3 మార్కుల కోత విధిస్తారు. 1. {బిటన్ ఆర్థిక సహాయంతో ఏర్పాటు చేసిన ఇనుము ఉక్కు కర్మాగారం ఏది? 1) భిలాయ్ 2) రూర్కెలా 3) దుర్గాపూర్ 4) బొకారో 2. శ్వేత విప్లవం వేటి ఉత్పత్తికి సంబంధించింది? 1) నూనె గింజలు 2) చేపలు 3) వ్యవసాయ ఉత్పత్తులు 4) పాలు 3. కన్హా జాతీయ పార్కు ఏ రాష్ట్ట్రంలో ఉంది? 1) జార్ఖండ్ 2) ఉత్తరప్రదేశ్ 3) మధ్యప్రదేశ్ 4) ఛత్తీస్‌గఢ్ 4. మన్నార్ సింధుశాఖ ఏ ప్రాంతాల మధ్య విస్తరించి ఉంది? 1) బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్ 2) ఇండియా, శ్రీలంక 3) బంగ్లాదేశ్, అండమాన్ నికోబార్ దీవులు 4) ఇండియా, మాల్దీవులు 5. {పపంచవ్యాప్తంగా పగలు, రాత్రి సమానంగా ఉండే రోజు ఏది? 1) మార్చి 21 2) జూన్ 21 3) డిసెంబర్ 22 4) జూలై 4 6. బేరింగ్ జలసంధి ఏ రెండు ఖండాల మధ్య ఉంది? 1) ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా 2) ఉత్తర అమెరికా, ఆసియా 3) ఆఫ్రికా, ఐరోపా 4) ఆఫ్రికా, ఆసియా 7. ఏ ఓడరేవును ‘క్వీన్ ఆఫ్ అరేబియా’ అని పిలుస్తారు? 1) కాండ్ల 2) మార్మగోవా 3) ముంబై 4) కొచ్చిన్ 8. ఏ వాతావరణ పొరలో జెట్ విమానాలు ప్రయాణిస్తాయి? 1) ట్రోపో ఆవరణం 2) ఎక్సో ఆవరణం 3) స్ట్రాటో ఆవరణం 4) థర్మో ఆవరణం 9. రూర్ ఆఫ్ ఇండియా అని దేశంలోని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? 1) విదర్భ పీఠభూమి 2) మాల్వా పీఠభూమి 3) షిల్లాంగ్ పీఠభూమి 4) ఛోటానాగపూర్ పీఠభూమి 10. కిందివాటిలో అటవీ పరిశోధనా సంస్థ ఉన్న ప్రాంతం? 1) ఢిల్లీ 2) భోపాల్ 3) హైదరాబాద్ 4) డెహ్రాడూన్ 11. సాత్పురా, వింధ్య పర్వతాల మధ్య ప్రవహించే నది? 1) గోదావరి 2) గండక్ 3) తపతి 4) నర్మద 12. భారతదేశంలో అతి ప్రాచీనమైన చమురుశుద్ధి కర్మాగారం ఎక్కడ ఉంది? 1) హాల్దియా 2) దిగ్భాయ్ 3) బరౌనీ 4) కొచ్చిన్ 13. మోప్లాలు అంటే ఎవరు? 1) మధ్యప్రదేశ్‌లోని గిరిజనులు 2) అసోంలోని గిరిజనులు 3) కేరళలోని ముస్లింలు 4) పశ్చిమబెంగాల్లోని గిరిజనులు 14. 1952 జాతీయ అటవీ విధానం ప్రకారం భారత దేశ మొత్తం భౌగోళిక విస్తీర్ణంలో సుమారుగా ఎంతశాతం అడవులు విస్తరించి ఉండాలి? 1) 33 2) 23 3) 20 4) 21 15. ఇంగ్లండ్‌లోని లండన్‌లో ఉదయం 5.30 గంటల సమయం అయితే భారత దేశంలోని అలహాబాద్‌లో ఎంత సమయం అవుతుంది? 1) సాయంత్రం 5.30 గంటలు 2) ఉదయం 11.00 గంటలు 3) రాత్రి 11.00 గంటలు 4) ఉదయం 10.00 గంటలు 16. కిందివాటిలో అత్యంత ప్రకాశవంతమైన గ్రహం ఏది? 1) శని 2) బుధుడు 3) శుక్రుడు 4) భూమి 17. ఒక వ్యాపారి రెండు కుర్చీలను ఒక్కొక్కటి రూ. 600లకు అమ్మడం వల్ల మొదటి దానిపై 20 శాతం లాభం, రెండోదానిపై 20 శాతం నష్టం వచ్చింది. మొత్తం మీద అతడికి ఎంతశాతం లాభం/ నష్టం వస్తుంది? 1) 4% లాభం 2) 4% నష్టం 3) 6% నష్టం 4) లాభం లేదు, నష్టం లేదు 18. 64 ק 4 – 2 ׳ 8 – 4 = ? 1) – 4 2) 8 3) 252 4) 5.33 19. అ, ఆల సరాసరి బరువు 50 కి.గ్రా. ఆ, ఇ ల సరాసరి బరువు 70 కి.గ్రా. ఇ, అల సరాసరి బరువు 60 కి.గ్రా. అయితే అ బరువు ఎంత? 1) 100 కి.గ్రా. 2) 80 కి.గ్రా. 3) 60 కి.గ్రా. 4) 40 కి.గ్రా. 20. 40 లీటర్ల మిశ్రమంలో పాలు, నీళ్లు 4 : 1 నిష్పత్తిలో ఉన్నాయి. ఈ మిశ్రమానికి ఎన్ని లీటర్ల నీటిని కలిపితే పాలు, నీటి నిష్పత్తి 2 : 1 అవుతుంది? 1) 4 లీ. 2) 6 లీ. 3) 8 లీ. 4) 12 లీ. 21. ఒక పండ్ల వ్యాపారి 60 ఆపిల్ పండ్లను రూ. 600కు కొన్నాడు. అందులో 20 శాతం పండ్లు పాడయ్యాయి. మంచిగా ఉన్న పండ్లను ఒక్కొక్కటి రూ. 15 చొప్పున, చెడిపోయిన పండ్లను ఒక్కొక్కటి రూ.5 చొప్పున అమ్మితే అతడికి ఎంత శాతం లాభం వస్తుంది? 1) 10% 2) 20% 3) 30% 4) 36% 22. బారువడ్డీ ప్రకారం సంవత్సరానికి 12 శాతం వడ్డీరేటు చొప్పున రూ. 600 అసలు ఎన్నేళ్లలో రూ. 960ల మొత్తం అవుతుంది? 1) 5 2) 4 3) 3 4) 2 23. 250 మీ., 350 మీ. పొడవున్న రెండు రైళ్లు వరుసగా 85 కి.మీ./గంట, 95 కి.మీ./ గంట వేగాలతో వ్యతిరేక దిశలో ప్రయాణిస్తున్నాయి. అవి ఒకదాన్ని మరొకటి ఎంత సమయంలో దాటుతాయి? 1) 6.66 సె. 2) 12 సె. 3) 15 సె. 4) ఏదీకాదు 24. అ ఒక వ్యాపారాన్ని రూ. 12,000ల పెట్టుబడితో ప్రారంభించాడు. 4 నెలల తర్వాత రూ. 20,000ల పెట్టుబడితో ఆ ఆ వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివరన వారికి రూ. 38,000 లాభం వస్తే, అందులో అ వాటా ఎంత? 1) రూ. 12,000 2) రూ. 18,000 3) రూ. 20,000 4) రూ. 24,000 25. 20 మంది వ్యక్తులు రోజుకు 8 గంటల చొప్పున పనిచేస్తే 60 పనులను 18 రోజుల్లో పూర్తి చేయగలుగుతారు. 16 మంది వ్యక్తులు రోజుకు 12 గంటల చొప్పున పనిచేస్తే 60 పనులను ఎన్ని రోజుల్లో పూర్తి చేస్తారు? 1) 15 రోజులు 2) 7 1/2 రోజులు 3) 9 రోజులు 4) 12 రోజులు 27. ఒక యంత్రం ప్రస్తుత విలువ రూ. 40,000. ఆ యంత్రం ఏటా దాని విలువలో 10 శాతం కోల్పోతే, రెండు సంవత్సరాల తర్వాత దాని విలువ ఎంత ఉంటుంది? 1) రూ. 32,000 2) రూ. 32,400 3) రూ. 34,000 4) ఏదీకాదు 28. 20 గాజు గ్లాసులు ఉన్న ఒక పెట్టె కింద పడటం వల్ల కొన్ని గ్లాసులు పగిలాయి. మరికొన్ని మంచిగా ఉన్నాయి. పగిలిన గ్లాసులు, పగలని గ్లాసుల నిష్పత్తి కిందివాటిలో ఏది కాకపోవచ్చు? 1) 1 : 2 2) 1 : 4 3) 3 : 7 4) 4 : 5 29. రెండు సంఖ్యల క.సా.గు. 200. వాటి గ.సా.భా. 5. వాటిలో ఒక సంఖ్య 25 అయితే రెండో సంఖ్య ఏది? 1) 25 2) 35 3) 40 4) 45 31. రూ. 25,000లకు సంవత్సరానికి 20 శాతం వడ్డీరేటు చొప్పున రెండేళ్లకు ఎంత చక్రవడ్డీ అవుతుంది? 1) రూ. 11,000 2) రూ. 12,000 3) రూ. 16,000 4) రూ. 36,000 32. ఒక వ్యక్తి 25 మీ/సె. వేగంతో ప్రయాణిస్తూ, 4 గంటల్లో గమ్యం చేరుకున్నాడు. అతడు ప్రయాణించిన దూరం ఎంత? 1) 100 కి.మీ. 2) 360 కి.మీ. 3) 520 కి.మీ. 4) చెప్పలేం 33. ఒక తరగతిలోని 30 మంది విద్యార్థుల సరాసరి వయసు 15 సంవత్సరాలు. టీచర్ వయసును కూడా కలిపితే సరాసరి ఒక సంవత్సరం పెరుగుతుంది. అయితే టీచర్ వయసు ఎంత? 1) 30 ఏళ్లు 2) 36 ఏళ్లు 3) 45 ఏళ్లు 4) 46 ఏళ్లు 34. 4, 6, 10, 18, 34, 66, ? 1) 102 2) 124 3) 130 4) 132 35. అ ఒక పనిలో మూడో వంతును ఆరు రోజుల్లో పూర్తి చేస్తే మిగిలిన పనిని ఎన్ని రోజుల్లో పూర్తి చేయగలుగుతాడు? 1) 6 2) 12 3) 18 4) 24 36. అ, ఆలు ఇద్దరూ కలిసి వరుసగా రూ. 22,000, రూ. 34,000ల పెట్టుబడులతో వ్యాపారాన్ని ప్రారంభించారు. సంవత్సరం చివరన రూ.11,200 లాభం వస్తే అందులో ’అ’ వాటా ఎంత? 1) రూ.4400 2) రూ. 6800 3) రూ. 7200 4) రూ. 7600 37. Pride fruit of India అని దేన్ని పిలుస్తారు? 1) చింత 2) మామిడి 3) టమాటా 4) ఉసిరి 38. మానవ మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే భాగం ఏది? 1) మెడుల్లా 2) సెరిబెల్లం 3) హైపోథాలమస్ 4) పైవన్నీ 39. బియ్యాన్ని ఎక్కువగా పాలిష్ చేస్తే కోల్పోయే విటమిన్ ఏది? 1) ఆ1 2) ఆ12 3) ఉ 4) అ 40. కిందివాటిలో మూత్రపిండాలు సరిగా పనిచేయకుంటే చేసే ప్రక్రియ (చికిత్స)ఏది? 1) డయాలసిస్ 2) అటోప్సి 3) బయాప్సీ 4) కీమోథెరపీ 41. క్యాన్సర్ గురించి చేసే అధ్యయనాన్ని ఏమంటారు? 1) ఆర్నిథాలజీ 2) పాథాలజీ 3) జీరంటాలజీ 4) ఆంకాలజీ 42. చేపల్లో లభించే విటమిన్లేవి? 1) A, K 2) A, E -3) A, D 4) K, E 43. కిందివాటిలో రక్తానికి సంబంధించని వ్యాధి? 1) లుకేమియా 2) క్షయ 3) మలేరియా 4) డయాబెటిస్ 44. తాజ్‌మహల్ బీటలు వారడానికి కారణమైన వాయువు ఏది? 1) CO2 2) CFC 3) SO2 4) CO 45. కిందివాటిలో చర్మ వ్యాధి కానిది? 1) ఎక్జిమా 2) సోరియాసిస్ 3) క్షయ 4) ఎఖిని 46. పొడి విత్తనాల్లో సాధారణంగా ఉండాల్సిన నీటి శాతం? 1) 10% 2) 13% 3) 9% 4) 1% 47. ఐఇఖఐఅఖీ ఏ రాష్ట్రంలో ఉంది? 1) తెలంగాణ 2) కర్ణాటక 3) తమిళనాడు 4) బీహార్ 48. 2014 మ్యాన్ బుకర్ ప్రైజ్ ఏ దేశ రచయితకు లభించింది? 1) ఇంగ్లండ్ 2) న్యూజిలాండ్ 3) భారత్ 4) ఆస్ట్రేలియా 49. {పధానమంత్రి జన్‌ధన్ యోజన కార్యక్ర మాన్ని 2014లో ఏ తేదీన ప్రారంభిం చారు? 1) ఆగస్ట్ - 15 2) అక్టోబర్ - 2 3) ఆగస్ట్ - 28 4) సెప్టెంబర్ - 24 50. ఆస్కార్ అవార్డు పొందిన తొలి భారతీయ వ్యక్తి? 1) ఎ.ఆర్. రెహ్మాన్ 2) గుల్జార్ 3) భాను అథయా 4) సత్యజిత్ రే 51. అర్థశాస్త్రంలో నోబెల్ బహుమతిని ఎప్పటి నుంచి ప్రదానం చేస్తున్నారు? 1) 1901 2) 1959 3) 1969 4) 1949 52. 2014 యూత్ ఒలింపిక్ క్రీడలను ఏ నగ రంలో నిర్వహించారు? 1) ఇంచియాన్ 2) బీజింగ్ 3) హనోయ్ 4) నాన్జింగ్ 53. అమెజాన్ సంస్థ సహ వ్యవస్థాపకుడెవరు? 1) మార్క జుకర్‌బర్ 2) బిల్‌గేట్స్ 3) లారీ ఎలిసన్ 4) జెఫ్ బెజోస్ 54. కిందివాటిలో ఏ క్రీడలో ఆటగాళ్ల సంఖ్య 11? 1) వాలీబాల్ 2) బాస్కెట్ బాల్ 3) ఫుట్‌బాల్ 4) ఏదీకాదు 55. {పపంచ వాణిజ్య సంస్థ (డబ్ల్యూటివో)ను ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? 1) 1945 2) 1985 3) 2001 4) 1995 56. జాతీయ గీతాన్ని తొలిసారిగా 1911లో ఏ నగరంలో నిర్వహించిన జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశంలో ఆలపించారు? 1) లాహోర్ 2) కలకత్తా 3) సూరత్ 4) నాగ్‌పూర్ 57. కిందివాటిలో అణు జలాంతర్గామి ఏది? 1) ఐఎన్ఎస్ చక్ర 2) ఐఎన్ఎస్ విరాట్ 3) ఐఎన్ఎస్ విక్రాంత్ 4) ఐఎన్ఎస్ సింధు రక్షక్ 58. ఎం.చిన్నస్వామి స్టేడియం ఏ నగరంలో ఉంది? 1) చెన్నై 2) బెంగళూరు 3) కాన్పూర్ 4) కోల్‌కతా 59. గుజరాత్ రాష్ట్రంలోని అణు విద్యుత్ కేంద్రం ఏది? 1) కైగా 2) రావత్ భట్టా 3) కాక్రపార్ 4) నరోరా 60. ‘గ్లింప్సెస్ ఆఫ్ వరల్డ్ హిస్టరీ’ పుస్తక రచయిత ఎవరు? 1) మహాత్మాగాంధీ 2) జవహర్ లాల్ నెహ్రూ 3) దాదాబాయ్ నౌరోజీ 4) ఎస్. రాధాకృష్ణన్ 61. జాతీయ గ్రామీణాభివృద్ధి సంస్థ (ఎన్ఐ ఆర్డీ) ఏ నగరంలో ఉంది? 1) న్యూఢిల్లీ 2) లక్నో 3) హైదరాబాద్ 4) పుణే 62. {పాజెక్ట్ టైగర్ కార్యక్రమాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1) 1963 2) 1973 3) 1983 4) ఏదీకాదు 63. {పపంచ ఓజోన్ దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? 1) సెప్టెంబర్ - 8 2) సెప్టెంబర్ - 16 3) అక్టోబర్ - 8 4) అక్టోబర్ - 16 64. {పస్తుత జాతీయ భద్రతా సలహాదారు ఎవరు? 1) అజిత్ దోవల్ 2) శివశంకర్ మీనన్ 3) రాజీవ్ త్రివేది 4) ఎ.పి. సింగ్ 65. గాజు పలక మందాన్ని, తీగ వ్యాసాన్ని కనుగొనేందుకు ఉపయోగించే పరికరం? 1) స్పెరా మీటర్ 2) వెర్నియర్ కాలిపర్స 3) స్క్రూగేజీ 4) స్కేలు 66. కాంతి ఉద్దీపన తీవ్రతకు S.I ప్రమాణం? 1) ఆంపియర్ 2) కెల్విన్ 3) ఓమ్ 4) కాండెలా 67. కిందివాటిలో సదిశ రాశి కానిది? 1) ఉష్ణోగ్రత 2) స్థానభ్రంశం 3) వేగం 4) బలం 68. న్యూటన్ మూడో గమన సూత్రంపై ఆధారపడి కదిలే వాహనం? 1) విమానం 2) హెలికాప్టర్ 3) జెట్ విమానం 4) రైలు 69. రోడ్డు రోలర్ ఏ స్థితిలో ఉంటుంది? 1) స్థిర నిశ్చలస్థితి 2) అస్థిర నిశ్చల స్థితి 3) తటస్థ నిశ్చల స్థితి 4) ఏదీకాదు 70. విమానాల్లో ఎత్తు కొలవడానికి ఉపయో గించే పరికరం? 1) బారో మీటర్ 2) ఆల్టీమీటర్ 3) హైగ్రోమీటర్ 4) హైడ్రోమీటర్ 71. థర్మామీటర్లో ఉపయోగించే లోహం? 1) పాదరసం 2) కాపర్ 3) బ్రోమిన్ 4) ఐరన్ 72. అనుధైర్ఘ్య తరంగాలకు ఉదాహరణ? 1) నీటి తరంగాలు 2) కాంతి తరంగాలు 3) ధ్వని తరంగాలు 4) తీగలో ఏర్పడే తరంగాలు 73. కిందివాటిలో వాయు వాయిద్యానికి ఉదాహరణ? 1) సితార్ 2) బుల్ - బుల్ 3) వీణ 4) క్లారినెట్ 74. మోటార్ వాహనాల హెడ్‌లైట్స్‌లో ఉపయో గించే దర్పణం? 1) కుంభాకార 2) పుటాకార 3) సమతల 4) వాలు 75. రసాయనాల రాజు అని దేన్నంటారు? 1) HCL 2) H2SO4 3) H3PO4 4)HNO3 76. ఎలుకలను చంపేందుకు ఉపయోగించే మందులో వాడేది? 1) ఎర్ర భాస్వరం 2) సల్ఫర్ 3) తెల్ల భాస్వరం 4) క్లోరిన్ 77. CCL3NO2ని ఏమంటారు? 1) క్లోరోఫామ్ 2) టియర్ గ్యాస్ 3) పాస్జీన్ 4) బ్లీచింగ్ పౌడర్ 78. క్షార గుణం ఉన్న మానవ శరీర ద్రవం? 1) జఠర రసం 2) మూత్రం 3) లాలాజలం 4) రక్తం 79. కిందివాటిలో అత్యంత శ్రేష్టమైన బొగ్గు? 1) ఆంథ్రసైట్ 2) బిట్యూమినస్ 3) లిగ్నైట్ 4) పీట్ 80. కిందివాటిలో మిశ్రమ ఎరువు? 1) DAP 2) MAP 3) KCl 4) నైట్రోఫాస్క్ 81. కిందివాటిలో ఉత్పతనం చెందే పదార్థం? 1) కర్పూరం 2) అయోడిన్ 3) NH4Cl 4) పైవన్నీ 82. ఢిల్లీలో కుతుబ్‌మినార్‌కు సమీపంలో ఉన్న ఉక్కు స్తంభాన్ని నిర్మించింది ఎవరు? 1) ఢిల్లీ సుల్తానులు 2) మొగల్ రాజులు 3) గుప్తులు 4) అశోకుడు 83. {పజలు ‘బలి’ అనే పన్నును మొదటిసారిగా ఏ కాలంలో చెల్లించారు? 1) హరప్పా నాగరికత 2) ఆర్య నాగరికత 3) క్రీ.పూ. 6వ శతాబ్దంలో 4) మౌర్యుల కాలంలో 84. పంటలు బాగా పండటానికి సౌకర్యాలు కల్పించి, ఎక్కువ దిగుబడి ద్వారా రాబడి పెంచడానికి ప్రయత్నాలు చేసినవారు? 1) మహ్మద్‌బిన్ తుగ్లక్ 2) అల్లావుద్దీన్ ఖిల్జీ 3) అక్బర్ 4) శివాజీ 85. ప్లాసీ యుద్ధం జరిగిన సంవత్సరం? 1) 1757 2) 1761 3) 1765 4) 1752 86. ‘ఖిలాఫత్ దినం’గా పాటించిన రోజు? 1) 1919 అక్టోబరు 17 2) 1919 అక్టోబరు 2 3) 1919 నవంబరు 21 4) 1919 నవంబరు 14 87. {పజలకు జీవించే హక్కును కల్పించిన రాజ్యాంగ అధికరణ? 1) 14వ అధికరణ 2) 16వ అధికరణ 3) 21వ అధికరణ 4) 32వ అధికరణ 88. UNICEF పూర్తి రూపం? 1) యునెటైడ్ నేషన్స ఇన్స్టిట్యూట్ ఆఫ్ సెంట్రల్ ఎడ్యుకేషన్ ఫోరమ్ 2) యునెటైడ్ నేషన్స ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స ఆన్ ఎడ్యుకేషన్ అండ్ ఫెడరేషన్ 3) యునెటైడ్ నేషన్స ఇన్స్టిట్యూట్ అండ్ కౌన్సిల్ ఆన్ ఫోరమ్ ఫర్ ఎడ్యుకేషన్ 4) యునెటైడ్ నేషన్స ఇంటర్నేషనల్ చిల్డ్రన్స ఎమర్జెన్సీ ఫండ్ 89. కేంద్ర - రాష్ట్రాల మధ్య అధికార విభజనను రాజ్యాంగంలోని ఎన్నో షెడ్యూల్ తెలియజేస్తోంది? 1) 7 2) 8 3) 9 4) 10 90. 163వ రాజ్యాంగ అధికరణం ఎవరి గురించి తెలియజేస్తుంది? 1) గవర్నర్ 2) ముఖ్యమంత్రి 3) అడ్వకేట్ జనరల్ 4) రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ 91. కేంద్రంలో రాజ్యసభ ఏ సంవత్సరంలో ఏర్పడింది? 1) 1947 2) 1948 3) 1950 4) 1951 92. కిందివారిలో గ్రామసభలో సభ్యులెవరు? 1) 18 ఏళ్లు నిండిన గ్రామంలోని {పతి వ్యక్తి 2) ఓటర్ జాబితాలో ఉన్నవారు 3) పంచాయతీ వార్డు సభ్యులు, గ్రామ కార్యదర్శి, అధ్యక్షుడు (సర్పంచ్) 4) పైవారందరూ 93. జిల్లా కలెక్టర్‌కు జీతభత్యాలను ఎవరు చెల్లిస్తారు? 1) రాష్ట్ర ప్రభుత్వం 2) కేంద్ర ప్రభుత్వం 3) గవర్నర్ 4) రాష్ట్రపతి 94. ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ‘విటో అధికారం’ ఉన్న దేశం? 1) జర్మనీ 2) ఫ్రాన్స 3) జపాన్ 4) ఏదీకాదు 95. కిందివాటిలో కేంద్రం వసూలు చేసే ప్రత్యక్ష పన్ను? 1) కస్టమ్స్ ట్యాక్స్ 2) ఎక్సైజ్ ట్యాక్స్ 3) కార్పొరేషన్ ట్యాక్స్ 4) సేల్స్ ట్యాక్స్ 96. ఆర్థిక సంఘం ప్రస్తుత చైర్మన్? 1) రంగరాజన్ 2) విజయ్ కేల్కర్ 3) రఘురామ్ రాజన్ 4) వేణుగోపాల్ రెడ్డి 97. జాతీయ పనికి ఆహార పథకాన్ని ఏ సంవత్సరంలో ప్రారంభించారు? 1) 2001 2) 2002 3) 2004 4) 2005 98. 2011 జనాభా లెక్కల ప్రకారం గత దశాబ్దంలో (2001-11) జనాభా వృద్ధిరేటు ఎంత? 1) 17.7% 2) 16.8% 3) 16.54% 4) 17.46% 99. {Oపెవేట్ బ్యాంక్‌ల స్థాపనకు అనుమతులిచ్చే అధికారం ఎవరికి ఉంది? 1) రాష్ట్రపతి 2) కేంద్ర ప్రభుత్వం 3) రిజర్వ బ్యాంక్ ఆఫ్ ఇండియా 4) ఆర్థిక సంఘం చైర్మన్ 100. ‘మనీ లాండరింగ్’ అంటే? 1) {పభుత్వ అనుమతి లేకుండా డబ్బును ఇతర దేశాల్లో దాచుకోవడం 2) నల్లధనాన్ని అక్రమ పద్ధతుల్లో తెల్లధనంగా మార్చుకోవడం 3) అక్రమంగా సంపాదించిన ధనాన్ని ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం ద్వారా చెలామణిలోకి తేవడం 4) చట్ట వ్యతిరేకంగా డబ్బును అప్పులకు ఇవ్వడం సమాధానాలు 1) 3; 2) 4; 3) 3; 4) 2; 5) 1; 6) 2; 7) 4; 8) 3; 9) 4; 10) 4; 11) 4; 12) 2; 13) 3; 14) 1; 15) 2; 16) 3; 17) 2; 18) 1; 19) 4; 20) 3; 21) 3; 22) 1; 23) 2; 24) 2; 25) 1; 26) 3; 27) 2; 28) 4; 29) 3; 30) 3; 31) 1; 32) 2; 33) 4; 34) 3; 35) 2; 36) 1; 37) 2; 38) 3; 39) 1; 40) 1; 41) 4; 42) 3; 43) 2; 44) 3; 45) 3; 46) 2; 47) 1; 48) 4; 49) 3; 50) 3; 51) 3; 52) 4; 53) 4; 54) 3; 55) 4; 56) 2; 57) 1; 58) 2; 59) 3; 60) 2; 61) 3; 62) 2; 63) 2; 64) 1; 65) 3; 66) 4; 67) 1; 68) 3; 69) 3; 70) 2; 71) 1; 72) 3; 73) 4; 74) 2; 75) 2; 76) 3; 77) 2; 78) 4; 79) 1; 80) 4; 81) 4; 82) 3; 83) 2; 84) 1; 85) 1; 86) 1; 87) 3; 88) 4; 89) 1; 90) 2; 91) 4; 92) 2; 93) 1; 94) 2; 95) 3; 96) 4; 97) 3; 98) 1; 99) 3; 100) 1. -
అక్షరాలను చాలా అందంగా రాసే రాజు?
హర్షవర్ధనుడు (క్రీ.శ. 606 - 647) గుప్తుల పతనానంతరం ఉత్తర భారతదేశంలో చిన్నచిన్న స్వతంత్ర రాజ్యాలేర్పడ్డాయి. వాటిలో ‘స్థానేశ్వరం’ ఒకటి. ఈ రాజ్యాన్ని పుష్యభూతి వంశం పాలించేది. వీరిలో ప్రసిద్ధి చెందినవాడు హర్షవర్ధనుడు. ఇతడినే హర్షుడు అంటారు. ఇతడు స్థానేశ్వరం, కనూజ్లను ఏకం చేసి పాలించాడు. తర్వాత రాజధానిని స్థానేశ్వరం నుంచి కనూజ్కు మార్చాడు. బాణభట్టుడు రాసిన ‘హర్షచరితం’ అనే కావ్యం హర్షుడి గురించి తెలియజేస్తోంది. ఇతడికి‘శీలాదిత్య’, ‘సకలోత్తరాపథేశ్వరుడు’ అనే బిరుదులు ఉన్నాయి. ఇతడు వేయించిన బన్సీఖేరో, మధుబన్ శాసనాలతోపాటు చైనా యాత్రికుడు హ్యూయాన్‌త్సాంగ్ రచనలు కూడా ఇతడి పాలన గురించి వివరిస్తున్నాయి. హర్షుడు దక్షిణ భారతదేశాన్నంతటినీ జయించాలనుకున్నాడు. కానీ బాదామి చాళుక్య రాజైన రెండో పులకేశి చేతిలో ఓడిపోవడం వల్ల అతడి కోరిక నెరవేరలేదు. హర్షుడి రాజ్యం నర్మదానది వరకు విస్తరించి ఉండేది. పులకేశి వేయించిన ఐహోలు శాసనం ద్వారా ఈ విషయం తెలుస్తోంది. హర్షుడి కాలంలో పంటలో 1/6వ భాగాన్ని శిస్తుగా వసూలు చేసేవారు. దీన్ని ‘ఉద్రుంగ’ పన్ను అనేవారు. దీంతోపాటు అమ్మకం పన్ను ‘తుల్యమేయ’ విధించేవారు. పన్నులు వసూలు చేసే అధికారులను ‘ధ్రువాధీకరణ’, ‘గౌల్మిక’ అని పిలిచేవారు. గుప్తులు స్థాపించిన నలందా విశ్వవిద్యాలయ అభివృద్ధికి హర్షుడు 100 గ్రామాలను దానం చేసినట్టుగా హ్యూయాన్‌త్సాంగ్ రచించిన సీ-యూ-కీ ద్వారా తెలుస్తోంది. ఇతడు సౌరాష్ట్రలో మౌఖారి వంశస్థులు నెలకొల్పిన వల్లభి విశ్వవిద్యాలయ అభివృద్ధికి కూడా కృషి చేశాడు. చరిత్రకారులు గుప్త యుగం, రాజపుత్ర యుగానికి హర్షుడిని వారధిగా పేర్కొంటారు. హర్షుని కాలంలో రాజభాష సంస్కృతం. ఇతడు స్వయంగా కవి. రత్నావళి, నాగానందం, ప్రియదర్శిక అనే సంస్కృత నాటకాలను రాశాడు. ఇతడి ఆస్థానకవి బాణభట్టుడు. బాణుడు హర్ష చరిత్రతోపాటు ‘కాదంబరి’ అనే కావ్యాన్ని రాశాడు. ఇవి సంస్కృత సాహిత్యంలో ‘మణిరత్నాలు’గా వెలుగొందాయి. హర్షుడి ఆస్థానంలో మయూరుడు (సూర్య శతకం), మాతంగుడు, దివాకరుడు అనే కవులు కూడా ఉండేవారు. సుభాషిత శతకాన్ని రాసిన భర్తృహరి కూడా హర్షుడి కాలానికి చెందినవాడే. హర్షుడి ‘నాగానందం’ ఇత్సింగ్ (చైనా యాత్రికుడు) ద్వారా చైనా, జపాన్‌కు విస్తరించింది. హ్యూయాన్‌త్సాంగ్: క్రీ.శ. 630లో హర్షుని పాలనాకాలంలో భారతదేశాన్ని సందర్శించాడు. ఇతడు ప్రసిద్ధ చైనా యాత్రికుడు. బౌద్ధ భిక్షువు అయిన హ్యూయాన్‌త్సాంగ్ బౌద్ధ విజ్ఞానాన్ని పొందడానికి ఇండియాకు వచ్చాడు. భారతదేశంలోని సామాజిక, రాజకీయ పరిస్థితులను పరిశీలించి రచనలు చేశాడు. భారతదేశ ప్రాచీన చరిత్ర తెలుసుకోవడానికి ఇవి ప్రస్తుతం ముఖ్యమైన ఆధారాలుగా ఉన్నాయి. హర్షునిపై ఇతడికి ప్రత్యేక అభిమానం ఉన్నట్లుగా ‘సీ-యూ-కీ’ ద్వారా తెలుస్తోంది. హర్షుడి గురించి తెలుసుకోవడానికి ఇదే ముఖ్య ఆధారం. ఈ గ్రంథంలో హర్షుడిని ‘పంచరాజ్యాలకు’ ప్రభువుగా పేర్కొన్నాడు. ‘హ్యూలీ’ రాసిన హ్యూయాన్‌త్సాంగ్ జీవిత చరిత్ర హ్యూయాన్‌త్సాంగ్, హర్షుడి గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. హ్యూయాన్‌త్సాంగ్ క్రీ.శ. 644లో స్వదేశానికి తిరిగి వెళ్లాడు. హర్షుడు బౌద్ధమతం స్వీకరించడానికి హ్యూయాన్త్సాంగ్తో దగ్గరి సంబంధాలే కారణం. ఇతడు కనూజ్లో హ్యూయాన్‌త్సాంగ్ అధ్యక్షతన అన్ని మతాలకు చెందినవారితో గొప్ప పరిషత్‌ను నిర్వహించాడు. ప్రతి ఐదేళ్లకోసారి ప్రయాగ వద్ద ‘సర్వస్వధాన’ కార్యక్రమాన్ని నిర్వహించేవాడు. దీన్నే ‘మహామోక్ష పరిషత్’ అంటారు. ఈ కార్యక్రమాల ద్వారా హర్షుడు తన ఆస్తినంతా ప్రజలకు దానం చేసేవాడు. హ్యూయాన్‌త్సాంగ్ 6వ మహామోక్ష పరిషత్‌కు హాజరయ్యాడు. రాజపుత్రులు హర్షుడి పాలనానంతరం ఉత్తర భారతదేశం చిన్న చిన్న రాజ్యాలుగా విడిపోయింది. వీటిని పాలించిన రాజులను రాజపుత్ర రాజులు అంటారు. అంతర్గత వైషమ్యాలతో ఐకమత్యం లోపించడం వల్ల రాజపుత్రులు బలహీనులయ్యారు. దీన్ని అదనుగా తీసుకొని విదేశీయులు దండయాత్రలు చేశారు. రాజపుత్ర యుగం క్రీ.శ. 650 నుంచి 1200 వరకు ఉనికిలో ఉంది. కానీ ఈ లోపే క్రీ.శ. 712లో అరబ్బులు ‘సింధు దండయాత్ర’ జరిపి ఇండియాలో మహ్మదీయుల పాలనకు నాంది పలికారు. అరబ్బుల దండయాత్ర ఉత్తరభారతదేశంలోని చిన్న రాజ్యాల్లో కనూజ్, మాళ్వా, కాశ్మీర్, సింధు, బెంగాల్, నేపాల్, అస్సాం ముఖ్యమైనవి. సింధు రాజ్యాన్ని దాహిర్ అనే హిందూరాజు పాలించేవాడు. దాహిర్ అసమర్థ పాలనతో విసుగు చెందిన ప్రజలు అతడిని ద్వేషించారు. క్రీ.శ. 708లో శ్రీలంక నుంచి ఇరాన్ పాలకుడైన ఆల్ హజాజ్కు కానుకలతో వెళుతున్న ఓడలను సింధుదేశ సముద్రపు దొంగలు దేబాల్ ఓడరేవు సమీపంలో దోచుకున్నారు. ఇందుకు ఆగ్రహించిన ఆల్హజాజ్ దాహిర్‌ను నష్టపరిహారం చెల్లించాలని కోరాడు. దాహిర్ నిరాకరించడంతో ఆల్హజాజ్ అరబ్బు సైన్యాన్ని సింధుపైకి రెండుసార్లు పంపించాడు. దాహిర్ ఈ దాడులను తిప్పికొట్టాడు. క్రీ.శ. 712లో మహ్మద్‌బిన్ కాశిం నాయకత్వంలో అరబ్బు సైన్యం దేబాల్ ఓడ రేవును ఆక్రమించుకొని దోచుకుంది. రేవర్ (రోర్) వద్ద జరిగిన యుద్ధంలో కాశిం చేతిలో దాహిర్ మరణించాడు. సింధు రాజ్య రాజధాని అయిన అరోర్ కోటను కూడా కాశిం ధ్వంసం చేసి తన ఆధీనంలోకి తెచ్చుకున్నాడు. క్రీ.శ.713లో అపార ధనరాశులకు నిలయమైన ముల్తాన్ నగరాన్ని అరబ్బులు దోచుకొని నాశనం చేశారు. సింధు రాజ్యాన్ని పూర్తిగా ఆక్రమించిన తర్వాత కాశిం కనూజ్, కాశ్మీర్లను ఆక్రమించుకునే ప్రయత్నంలో ఉండగా క్రీ.శ. 716లో ఖలీఫా (ముస్లింల మత పెద్ద) సింధు నుంచి కాశింను పిలిపించి హత్య చేయించాడు. ఇస్లాం విజయ పతాకాన్ని మొదటగా భారత భూభాగంపై ప్రతిష్టించిన ఘనత మహ్మద్‌బిన్ కాశింకు దక్కుతుంది. దాహిర్ అంతర్గత విరోధులు, చిన్న చిన్న రాజ్యాల రాజులు సింధులో కాశిం విజయయాత్రలకు సహాయపడ్డారు. అరబ్బుల వల్ల భారతదేశ మత, సాంస్కృతిక, విద్యా, వైజ్ఞానిక, రంగాల ప్రాముఖ్యత ఇతర ముస్లిం రాజ్యాలు, యూరప్ దేశాలకు తెలిసింది. హిందూ, ముస్లిం వర్గాలు మత పరంగా, సాంస్కృతిక పరంగా పరస్పరం ప్రభావితమయ్యాయి. బ్రహ్మగుప్తుడి బ్రహ్మసిద్ధాంతం, ఆయుర్వేద శాస్త్రమైన చరక సంహిత, నీతిశాస్త్రమైన పంచతంత్రం అరబ్బీ భాషలోకి అనువదితమయ్యాయి. చాలామంది హిందూ రాజులు, ప్రముఖులు, ప్రజలు ఇస్లాంను స్వీకరించి ఇండో యూరో ముస్లిం మతవ్యాప్తికి దోహదం చేశారు. హిందూ వేదాంతం, కర్మసిద్ధాంతం, దర్శనాలు ఇస్లాంపై ప్రభావం చూపాయి. ఇవి మహమ్మదీయుల్లో సూఫీ సిద్ధాంతం పుట్టడానికి కారణమయ్యాయి. మాదిరి ప్రశ్నలు 1. అరబ్బులు ముల్తాన్‌ను ఏమని కొనియాడారు? ఎ) వజ్రాల నగరం బి) బంగారు నగరం సి) ధనరాశుల నగరం డి) అందమైన నగరం 2. సింధుపై అరబ్బుల దండయాత్రకు ప్రధాన కారణం? ఎ) ఇస్లాం మత వ్యాప్తి బి) సింధును దోచుకోవడం సి) అరబ్బుల ఓడలను సింధుప్రాంత దొంగలు దోచుకోవడం డి) దాహిర్‌పై ఖలీఫా శత్రుత్వం 3. మహ్మద్ బిన్ కాశిం దండయాత్ర చేసినప్పుడు సింధు చక్రవర్తి ఎవరు? ఎ) ఆల్ హజాజ్ బి) దాహిర్ సి) జయసింహుడు డి) జయచంద్రుడు 4. సూఫీ సిద్ధాంతాన్ని ఆచరించినవారెవరు? ఎ) ఇస్లాంను ఆచరించే హిందూమత విశ్వాసులు బి) హిందూమతంలోని ఇస్లాం విశ్వాసులు సి) హిందూ మతంలో మంచి విశ్వాసాలను ఇస్లాంలో ప్రవేశ పెట్టాలనుకునే ముస్లింలు డి) ఇస్లాంలోని ఆదర్శనీయమైన పద్ధ తులను హిందూమతంలో పాటించా లనుకున్న హిందువులు 5. భారతదేశంలో మొదటిసారిగా ముస్లిం పాలన నెలకొల్పినవారు? ఎ) టర్కీలు బి) అఫ్గాన్లు సి) ఉజ్బెక్లు డి) అరబ్బులు 6. యాత్రికుల యువరాజుగా పేరొందిన విదేశీ యాత్రికుడు? ఎ) పాహియాన్ బి) ఇత్సింగ్ సి) మార్కోపోలో డి) హ్యూయాన్‌త్సాంగ్ 7. కిందివాటిలో సరికాని జత ఏది? ఎ) హర్షుడు- నాగానందం బి) బాణుడు- కాదంబరి సి) మయూరుడు- ఆదిపురాణం డి) భర్తృహరి- సుభాషిత శతకం 8. తుల్యమేయ అంటే? ఎ) పంటపై విధించే పన్ను బి) పుల్లరి పన్ను సి) వివాహ పన్ను డి) అమ్మకం పన్ను 9. అక్షరాలను చాలా అందంగా రాసే నైపుణ్యం ఉన్న రాజు? ఎ) హర్షుడు బి) అశోకుడు సి) చంద్రగుప్త విక్రమాదిత్యుడు డి) శివాజీ 10. హర్షుడికాలంలో ప్రఖ్యాతి చెందిన విశ్వ విద్యాలయం ఏది? ఎ) తక్షశిల బి) విక్రమశిల సి) వల్లభి డి) నలందా 11. అరబ్బులు సింధుపై దండయాత్ర జరిపిన సంవత్సరం? ఎ) క్రీ.శ. 726 బి) క్రీ.శ. 712 సి) క్రీ.శ. 722 డి) క్రీ.శ 728 12. హర్షుడు రచించిన నాటకం? ఎ) హర్షచరిత్ర బి) పంచతంత్రం సి) రత్నావళి డి) పంచసిద్ధాంతం 13. కిందివాటిలో హ్యూయాన్‌త్సాంగ్ రచన ఏది? ఎ) షా-కివో-కీ బి) సీ-యూ-కీ సి) క్వీ-షో-కువై డి) హర్షచరిత్ర 14. గౌల్మిక అంటే ఏమిటి? ఎ) పన్ను వసూలు చేసే అధికారి బి) పన్ను నిర్ణయ అధికారి సి) మార్కెటింగ్ అధికారి డి) గణాంకాధికారి 15. హర్షుడు మహామోక్షపరిషత్లను ఎందుకు నిర్వహించేవాడు? ఎ) కవులను, సాహిత్యకారులను సన్మా నించడానికి బి) తాను రాసిన గ్రంథాలను ప్రజలకు పరిచయం చేయడానికి సి) తన యుద్ధ విజయాలను గ్రంథస్థం చేయమని కవులను ప్రోత్సహించ డానికి డి) ఏదీకాదు సమాధానాలు 1) బి; 2) సి; 3) బి; 4) సి; 5) డి; 6) డి; 7) సి; 8) డి; 9) ఎ; 10) డి; 11) బి; 12) సి; 13) బి; 14) ఎ; 15) డి. -
ప్రపంచంలో వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది?
1. ‘ది గ్రాండ్ కానియన్ ఆఫ్ కొలరాడో’ ఎక్కడ ఉంది? యూఎస్ఏ 2. సోనారన్ ఎడారి ఎక్కడ ఉంది? మెక్సికో, ఉత్తర అమెరికా 3. ‘ఎక్సోటిక్’ నదులు అంటే? వర్షపాతం సమృద్ధిగా సంభవించే ప్రాంతంలో జనించి, ఎడారుల ద్వారా ప్రవహించే నదులు. ఉదా: నైలు (ఆఫ్రికా), సింధు (ఆసియా) 4. విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది? జాంబేజీ (ఆఫ్రికా) 5. నయాగారా జలపాతం ఏ దేశంలో ఉంది? యూఎస్ఏ 6. దక్షిణ అమెరికాలోని సవన్నా ప్రాంతాన్ని ఏమంటారు? కంపాలు 7. ‘హవానాలు’ అనే శ్రేష్టమైన చుట్టలకు ప్రసిద్ధి చెందిన దేశం? క్యూబా 8. దక్షిణ అమెరికాలోని సమశీతోష్ణ మండల ప్రాంతాన్ని ఏమంటారు? పెటగోనియా {పాంతం - గడ్డి భూముల పేరు యురేషియా - స్టెప్పీలు ఉత్తర అమెరికా- ప్రయరీలు దక్షిణ అమెరికా- పంపాలు దక్షిణ ఆఫ్రికా - వెల్డులు ఆస్ట్రేలియా - డౌన్లు 9. ప్రపంచ పంచదార గిన్నెగా ప్రసిద్ధి చెందిన దేశం? క్యూబా 10. ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘కింబర్లే’ గనులు ఏ నిక్షేపాలకు నిలయం? వజ్రాలు 11. రుతువును ‘మౌసమ్’ అని పిలుస్తారు. ఇది ఏ భాషా పదం? అరబ్బీ 12. భారతదేశంలో అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతమైన మాసిన్రామ్, చిరపుంజీ ఏ కొండల్లో ఉన్నాయి? ఖాసీ కొండలు 13. ‘అన్నం’ తీరం ఏ దేశంలో ఉంది? వియత్నాం 14. ‘సజీవ శిలాజ భూమి’ అని ఏ దేశాన్ని పేర్కొంటారు? ఆస్ట్రేలియా 15. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం ఏది? బంగ్లాదేశ్ 16. ‘అమెరికా దేశ క్రీడా ప్రాంగణం’ అని ఏ నగరాన్ని పిలుస్తారు? కాలిఫోర్నియా 17. ప్రపంచంలో అతిలోతైన మంచినీటి సరస్సు ఏది? బైకాల్ సరస్సు 18. ‘శీతల ధ్రువం’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు? సైబీరియా 19. ప్రపంచంలో న్యూస్‌ప్రింట్‌ను అధికంగా ఉత్పత్తి చేసే దేశం? కెనడా 20. ప్రపంచంలోకెల్లా అతి విశిష్టమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఏ దేశంలో ఉన్నాయి? స్వీడన్ 21. {పపంచంలో అతిపెద్ద అల్యూమినియం కర్మాగారం ఏ దేశంలో ఉంది? కెనడా 22. ‘అరోరా బొరియాలిస్’ అంటే ఏమిటి? ఆకాశంలో అప్పుడప్పుడు ఏర్పడే ఆకుపచ్చ, ఎరుపు రంగు తెరలు 23 . ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మంచుకొండ ఏ సముద్రంలో ఉంది? పసిఫిక్ 24. ప్రపంచంలో వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది? అంటార్కిటికా 25. అంటార్కిటికాలో భారత్ నెలకొల్పిన పరిశోధన కేంద్రాల పేర్లు? దక్షిణ గంగోత్రి, మైత్రి 26. కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ర్టం ఎప్పుడు ఏర్పడింది? 1953 అక్టోబరు 1 27. ప్రపంచంలో అత్యధిక వర్షం కురిసే ప్రాంతం? వయలీలీ పర్వత ప్రాంతం (హవాయి ద్వీపం) (1234.4 సెం.మీ) 28. దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో పెద్దది? గోదావరి 29. ఆఫ్రికాలో ఉన్న ఎడారులేవి? సహారా, కలహారి 30. అటకామా ఎడారి ఎక్కడ ఉంది? దక్షిణ అమెరికా 31. కృష్ణానది ఉపనదుల్లో పెద్దది? తుంగభద్ర 32. పెన్నానది ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో మొదట ప్రవేశిస్తుంది? అనంతపురం 33. సునామీలకు మరో పేరు? వేలా తరంగాలు (Tidal Waves) 34. ప్రపంచంలో అత్యధిక వేలాపరిమితి ఎక్కడ నమోదైంది? ఫండీ అఖాతం (తూర్పు కెనడా) 35. భూ మధ్య రేఖా ప్రాంతంలో భూగోళం చుట్టూ ఏర్పడే అల్పపీడన మేఖలను ఏమంటారు? భూమధ్య రేఖ ప్రశాంత మండలం (డోల్డ్రమ్స్) 36. ప్రపంచంలో అత్యంత దట్టమైన అడవులేవి? సెల్వాలు 37. ప్రపంచంలో అత్యధికంగా గంధకం ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది? మెక్సికో 38. పత్తి ఏ మృత్తికల్లో ఎక్కువగా పండుతుంది? నల్లరేగడి నేలలు 39. పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది? రాజమండ్రి 40. పత్తి పరిశోధన కేంద్రం ఉన్న పట్టణం? నంద్యాల (కర్నూలు) 41. చెరకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది? అనకాపల్లి (విశాఖపట్నం) 42. మిరప పరిశోధన కేంద్రం ఉన్న ప్రదేశం? లాం (గుంటూరు) 43. భారత ప్రామాణిక కాల నిర్ణయ రేఖాంశం? 82బీని తూర్పు రేఖాంశం 44. {X-°^Œ కాలం కంటే, భారత ప్రామాణిక కాలం ఎంత ముందుంటుంది? 5 గంటల 30 నిమిషాలు 45. భారతదేశ భూ భాగం సరిహద్దు మొత్తం పొడవు ఎంత? 15,200 కి.మీ. 46. భారతదేశ తీరరేఖ పొడవు ఎంత? 6,100 కి.మీ. 47. భారతదేశంతో ఉమ్మడి సరిహద్దును పంచుకుంటున్న దేశాల సంఖ్య? 7 48. భారత్, చైనా మధ్యనున్న విభజన రేఖను ఏమంటారు? మెక్ మోహన్ రేఖ 49. భారత్, శ్రీలంకను వేరు చేస్తున్నవేవి? మన్నార్ సింధుశాఖ, పాక్ జలసంధి 50. విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ర్టం ఏది? రాజస్థాన్ (చిన్న రాష్ట్రం - గోవా) 51. అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ర్టం ఏది? గుజరాత్ 52. మూడు సముద్రాల కలయికతో తీరరేఖ ఉన్న రాష్ర్టం ఏది? తమిళనాడు 53. భారతదేశం ఉత్తర చివరి నుంచి దక్షిణ చివరి సరిహద్దు వరకు దూరం ఎంత? 3214 కి.మీ. 54. భారతదేశ పడమర చివర నుంచి తూర్పు చివరి వరకు ఉన్న దూరం ఎంత? 2933 కి.మీ. 55. భారత్, శ్రీలంక మధ్యనున్న దీవి ఏది? పాంబన్ దీవి 56. లక్ష దీవుల్లోని అతిపెద్ద దీవి? మినికాయ్ దీవి 57. ప్రపంచంలో అతి ఎత్తై పీఠభూమి? పామీరు పీఠభూమి 58. ‘బంగర్’ అంటే ఏమిటి? ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానం 59. ‘ఖాదర్’ అంటే? ఇటీవలి కాలంలో ఏర్పడిన ఒండలి మైదానం 60. ఆరావళి పర్వతాల్లో ఎత్తైది ఏది? గురుశిఖర్ పర్వతం 61. ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తై శిఖరం? అనైముడి (అన్నామలై పర్వతాలు) (2695మీ.) 62. నీలగిరి పర్వతాల్లో ఎత్తైది ఏది? దొడబెట్ట (2637 మీ.) 63. ఊటి (ఉదకమండలం) వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాల్లో ఉంది? నీలగిరి (తమిళనాడు) 64. భారతదేశ గొప్ప ఎడారిగా ప్రసిద్ధి చెందింది? థార్ ఎడారి 65. మహానది ఏ రాష్ర్టంలో ఉంది? ఒడిశా 66. కిలిమంజారో (టాంజానియా) ఏవిధమైన అగ్నిపర్వతం? విలుప్త అగ్నిపర్వతం 67. సంవత్సరానికి ఎంత సముద్ర జలం ఆవిరి రూపంలో వాతావరణాన్ని చేరుతుంది? 3,30,000 ఘ.కి.మీ. 68. సముద్ర జలాల్లో కరిగి ఉన్న లవణాల పరిమాణాన్ని ఏమంటారు? లవణీయత 69. సముద్ర జలాల సరాసరి లవణీయత? 33% - 37% -
సాంఘిక శాస్త్రం
సంపన్నమైన భారత భౌగోళిక నైసర్గిక వ్యవస్థకు మూలం, బలం ఇక్కడి శీతోష్ణస్థితి పరిస్థితులు. మానవ మనుగడకు కావాల్సిన అన్ని అవసరాలు తీర్చడంలో ప్రముఖ పాత్ర వహించే వాతావరణ స్థితిగతులపై శీతోష్ణస్థితి ప్రభావం అధికంగా ఉంటుంది. విశాల భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో రకరకాల ఉష్ణోగ్రతలు, వర్షపాత విస్తరణలు నెలకొని ఉన్నాయి. అవి కూడా స్థిరంగా ఉండకుండా మార్పులకు లోనవుతున్నాయి. భారతదేశ శీతోష్ణస్థితి మన దేశ శీతోష్ణస్థితిని ‘ఉష్ణమండల రుతుపవన శీతోష్ణస్థితి’గా పిలుస్తారు. ‘రుతువు’ను ఆంగ్లంలో ‘మాన్సూన్’ అంటారు. ఇది ‘మౌసమ్’ అనే అరబిక్ పదం నుంచి వచ్చింది. దేశం మొత్తం మీద ఒకే రకమైన రుతుపవన శీతోష్ణస్థితి ఉన్నప్పటికీ ఉష్ణోగ్రత, వర్షపాతం, పవనాలు, ఆర్ధ్రత, పీడన మేఖలలు విభిన్నంగా ఉన్నాయి. రాజస్థాన్‌లో ఉష్ణోగ్రత అత్యధికంగా 50C (జూన్‌లో), కార్గిల్ సమీపంలోని డ్రాస్ వద్ద అత్యల్ప ఉష్ణోగ్రత-40C (డిసెంబర్లో) నమోదైంది. మాసిన్రామ్ (మేఘాలయ)లో అత్యధిక వర్షపాతం 1141 సెం.మీ. అయితే జైసల్మీర్ (రాజస్థాన్)లో అత్యల్ప వర్షపాతం 12 సెం.మీ. నమోదవుతుంది. మన దేశ వాతావరణాన్ని నాలుగు రుతువులుగా (కాలాలుగా) విభజించారు. అవి.. 1. శీతాకాలం 2. వేసవికాలం 3. నైరుతి రుతుపవన కాలం 4. ఈశాన్య రుతుపవన కాలం రుతుపవనాలు ఉష్ణోగ్రతల్లోని వైవిధ్యం, అంతర ఆయనరేఖా అభిసరణ స్థానం, ట్రోపో ఆవరణం పైభాగంలో వాయుప్రసరణం లాంటి అనేక కారణాల వల్ల ‘రుతుపవనాలు’ ఏర్పడుతున్నాయి. భారత ఉపఖండం, హిందూ మహాసముద్రాల మధ్య రుతువులను (కాలం) అనుసరించి పవనాలు వీయడాన్ని, వెనుకకు మరలడాన్ని ‘రుతుపవనాలు’ అంటారు. ఈ పవనాల దిశను బట్టి రెండు రకాల రుతుపవన కాలాలుగా గుర్తించారు. అవి... నైరుతి రుతుపవనాలు: (జూన్ మధ్య నుంచి సెప్టెంబర్ వరకు వీస్తాయి) వేసవిలో భారత భూభాగంపై తీవ్రమైన అల్ప పీడన వ్యవస్థ ఏర్పడుతుంది. అదే సమయంలో సముద్ర ప్రాంతంలో అధిక పీడనం ఏర్పడుతుంది. ఈ అధిక పీడన ప్రాంతం నుంచి అల్ప పీడన ప్రాంతం వైపు వీచే గాలులను నైరుతి రుతుపవనాలుగా పిలుస్తారు. ఇవి భారతదేశ నైరుతి దిశగా మొదట కేరళ తీరంలో ప్రవేశిస్తాయి. మలబార్ తీరంలో (కేరళ) అధిక వర్షాలకు ఇవే కారణం. ఈశాన్య రుతుపవనాలు: (సెప్టెంబరు మధ్య నుంచి డిసెంబరు మధ్య వరకు వీస్తాయి) శీతాకాలంలో సముద్ర భాగంపై అల్పపీడనం ఏర్పడటం వల్ల ఈ పవనాలు భూభాగం నుంచి సముద్రాల వైపు ఈశాన్య దిశ నుంచి వీస్తాయి. నైరుతి రుతుపవనాలే ఉత్తర భారతదేశంలో తిరోగమనం చెంది ఈశాన్య రుతుపవనాలుగా మారుతాయి. అందుకే వీటిని తిరోగమన రుతుపవనాలుగా కూడా పిలుస్తారు. ఇవి మొదట పంజాబ్‌లో ప్రవేశిస్తాయి. ఈ కాలంలో తుఫాన్లు అధికంగా వస్తాయి. రుతుపవనారంభం వేసవికాలంలో భారత భూభాగంపై ఏర్పడిన అల్పపీడన వ్యవస్థ, భూమధ్యరేఖా ప్రాంతపు తేమతో కూడిన పవనాలను హిందూ మహాసముద్రం ఆకర్షిస్తుంది. ఈ సముద్ర ప్రభావిత గాలుల వల్ల ఉరుములు, మెరుపులు సంభవించిన తర్వాత అకస్మాత్తుగా వర్షం కురుస్తుంది. దీన్నే ‘రుతుపవనారంభం’ అంటారు. ఇది మొదటగా కేరళ తీరంలో ప్రారంభ మవుతుంది. వర్షపాత విస్తరణ- సమస్యలు దేశమంతా (తమిళనాడు తీరం మినహా) నైరుతి రుతుపవనాల వల్లే అధిక వర్షం కురుస్తుంది. తమిళనాడు తీరంలో మాత్రం ఈశాన్య రుతుపవనాల వల్ల అధిక వర్షం పడుతుంది. దేశంలోని వర్షపాత విస్తరణను గమనిస్తే పశ్చిమబెంగాల్, ఒడిశా తీరాల నుంచి పశ్చిమంగా, వాయవ్యంగా పోయేకొద్దీ వర్షపాతం తగ్గుతుంది. దక్షిణాన పశ్చిమ, తూర్పు తీరాల నుంచి దక్కన్ పీఠభూమి అంతర్భాగాల వైపు వెళ్తూ ఉంటే వర్షపాతం తగ్గుతుంది. వర్షపాత విస్తరణలో ఈ విధమైన అనిశ్చితి, క్రమరహిత, అధిక వైవిధ్యత, అసమానతల వల్ల వ్యవసాయాభివృద్ధి కుంటుపడుతోంది. వర్షపాతంలోని తీవ్రతల వల్ల అతివృష్టి (వరదలు), అనావృష్టి (కరువులు) ఏర్పడుతున్నాయి. ఈ కారణాల వల్లే ‘భారతీయ వ్యవసాయం అంటే రుతుపవనాలతో జూదం’ అనే నానుడి వచ్చింది. కరువు - తీవ్రమైన కరువు భారత వాతావరణ విభాగం ప్రకారం సామాన్య వర్షపాతంలో 75 శాతం కంటే తక్కువ కురిసిన స్థితిని ‘కరువు’ అనీ, 50 శాతం కంటే తక్కువ వర్షపాతం ఉండే స్థితిని ‘తీవ్రమైన కరువు’ అని పిలుస్తారు. కరువు నష్టాల నియంత్రణకు ప్రభుత్వం ‘కరువుకు గురయ్యే ప్రాంతాల ప్రణాళిక’ (drought prone area plan) ను 1973లో రూపొందించింది. -
సాంఘిక శాస్త్రం
జాతీయవాద ఉద్యమాలు ఆధునిక ప్రపంచ యుగ ప్రారంభంలో ఆర్థికంగా, సైనికంగా బలంగా మారిన యూరప్‌లోని ప్రధాన దేశాల మధ్య విద్వేషాలు పెరిగాయి. ఒక జాతి ప్రజలందరూ ఒకే దేశ భౌగోళిక ప్రాంత పాలనలోనే ఉండాలనే వాదనతో పొరుగు దేశాలతో యుద్ధానికి కాలుదువ్వాయి. ఈ జాతీయవాద ఉద్యమాలు మొదట ఫ్రాన్‌సలో ప్రారంభమయ్యాయి. వీటికి ఆద్యుడు నెపోలియన్. నెపోలియన్ ఆగడాలను నిలువరించడానికి మిగతా యూరప్ దేశాలన్నీ ఏకమై ఆయనను ఓడించాయి. ఈ దేశాలన్నీ వియన్నా సమావేశాన్ని (క్రీ.శ. 1815) నిర్వహించాయి. ఫ్రెంచి ప్రజల జాతీయ విప్లవ భావాలను అణగదొక్కాయి. పర్యావసానంగా 1830, 1848లలో ఫ్రెంచి తిరుగుబాట్లు తలెత్తాయి. జర్మనీ, ఇటలీల్లోనూ ఏకీకరణ ఉద్యమాలు చెలరేగాయి. సామ్యవాద ఉద్యమాలు కూడా ఆరంభమై చివరికి ఫ్రాన్సలోనే ప్రపంచంలో మొట్టమొదటి క మ్యూనిస్టు ప్రభుత్వం (క్రీ.శ. 1871) ఏర్పడింది. ప్రధానంగా చదవాల్సిన అంశాలు : ఫ్రాన్‌సలో 1848 తిరుగుబాటు చెలరేగడానికి కారణాలు, సార్డీనియా నాయకత్వం కింద ఇటలీ ఏ విధంగా ఏకీకరణ సాధించింది? జర్మనీ ఏకీకరణలో బిస్మార్‌క నిర్వహించిన పాత్ర గురించి విద్యార్థులు బాగా చదవాలి. పై అంశాల నుంచి 4 మార్కుల ప్రశ్నను అడిగే వీలుంది. అలాగే రెడ్‌షర్‌ట్స, కార్బోనరి, యంగ్ ఇటలీల నేపథ్యం, వాటి లక్ష్యం, వాటి నాయకుల గురించి విపులంగా తెలుసుకోవాలి. కార్‌లమార్‌క్స, కౌంట్కవూర్, గారీబాల్డీ భావాలు, అవి వారి లక్ష్యాలను చేరుకోవడానికి ఎలా తోడ్పడ్డాయో విశ్లేషించుకోవాలి. వీటి నుంచి 2 మార్కుల ప్రశ్న లేదా, 1 మార్కు ప్రశ్న వచ్చే ఆస్కారం ఉంది. ప్రపంచ రాజకీయ పటాన్ని ముందుంచుకొని ఆయాదేశాల భౌగోళిక చిత్రాన్ని గమనిస్తూ అధ్యయనం చేస్తే మ్యాప్ పాయింటింగ్‌కు ఉపయోగపడుతుంది. ఈ చాప్టర్ నుంచి ఒక నాలుగు మార్కుల ప్రశ్న, లేదా ఒక రెండు మార్కుల ప్రశ్న తప్పనిసరిగా వస్తుంది. వాటితోపాటు ఒక 1 మార్కు ప్రశ్న, ఆబ్జెక్టివ్ ప్రశ్నలు రెండు (2ణ బీ = 1 మార్కు) రావచ్చు. అంటే పాఠ్యాంశం నుంచి విద్యార్థులు మొత్తం 4 నుంచి 6 మార్కులు పొందే అవకాశముంది. పాఠ్యాంశంలోని ప్రధానాంశాలు {ఫాన్సలోని కోర్సికా దీవిలో జన్మించిన ‘నెపోలియన్ బోనపార్టీ’ ఆధునిక ప్రపంచ చరిత్రలో ప్రముఖ స్థానాన్ని పొందాడు. మంచి విద్యావంతుడైన నెపోలియన్పై ‘రూసో’ ప్రభావం చాలా ఉంది. క్రీ.శ. 1785లో ఫ్రెంచి సైన్యంలో చేరిన నెపోలియన్ వివిధ హోదాల్లో అనేక యుద్ధాల్లో ముఖ్య పాత్ర పోషించి, ఫ్రాన్స విజయ పరంపరను కొనసాగించాడు. క్రీ.శ. 1804లో ఫ్రాన్స చక్రవర్తిగా ప్రకటించుకున్న నెపోలియన్ ‘నేలపై పడి ఉన్న ఫ్రాన్స కిరీటాన్ని నేను నా కత్తితో పెకైత్తాను’ అని సమర్థించుకున్నాడు. అనేక దురాక్రమణపూరిత యుద్ధాల ద్వారా మిగతా యూరప్ దేశాలను వణికించాడు. ‘ఖండాంతర వ్యవస్థ’ను ప్రవేశపెట్టి ఇంగ్లండ్ వర్తక వాణిజ్యాలను ధ్వంసం చేశాడు. నెపోలియన్ ఆగడాలను నిలువరించాలని నిశ్చయించుకున్న యూరప్ దేశాలు ‘మెటర్నిక్’ (ఆస్ట్రియా చాన్స్‌లర్) నాయకత్వం లో ఉమ్మడి సైన్యాన్ని ఏర్పాటు చేసుకున్నాయి. క్రీ.శ. 1813 లీప్జిగ్ యుద్ధం (బ్యాటిల్ ఆఫ్ నేషన్స), క్రీ.శ. 1815 వాటర్లూ యుద్ధాల్లో నెపోలియన్‌ను ఓడించాయి. మెటర్నిక్ కన్వీనర్‌గా యూరప్ దేశాల కూటమి క్రీ.శ. 1815లో ఆస్ట్రియా రాజధాని ‘వియన్నా’లో సమావేశమైంది. ఈ సమావేశంలో వివిధ దేశాల జాతీయ విప్లవ భావాలను విస్మరించడం వల్ల యూరప్‌లో జాతీయవాద ఉద్యమాలు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగానే క్రీ.శ. 1830లో ఫ్రెంచి విప్లవం వచ్చింది. ఇది ఇతర యూ రప్ దేశాలకు మార్గదర్శకమైంది. అందువల్ల ‘ఫ్రాన్స తుమ్మినప్పుడల్లా యూరప్‌కు జలుబు చేస్తుందని’ చెబుతారు. ఫ్రాన్‌సలో క్రీ.శ. 1848లో జరిగిన మరో తిరుగుబాటులో ‘లూయి ఫిలిప్’ రాజరిక పాలన రద్దయి, లూయి బ్లాంక్ ఆధ్వర్య ంలో ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడింది. ఈ పరిణామం ఇటలీ, జర్మనీల్లో జాతీయ చైతన్యం ఉద్భవించడానికి తోడ్పడింది. ప్రష్యా ప్రధానమంత్రి ‘ఓట్టోవోన్ బిస్మార్‌క’ తన క్రూరమైన బలప్రయోగ విధానంతో జర్మనీ ఏకీకరణను క్రీ.శ. 1871లో సాధించాడు. జోసెఫ్ మజ్జిని, కౌంట్కవూర్, గారిబాల్డీ, విక్టర్ ఎమ్మాన్యూల్-2 కృషి ఫలితంగా క్రీ.శ. 1870లో ఇటలీ ఏకీకరణ సాధ్యమైంది. యూరప్ సమాజంలో ఆర్థికపరమైన అసమానతలను నిర్మూలించడానికి 19వ శతాబ్దంలో సామ్యవాద ఉద్యమాలు ఆవిర్భవించాయి. వీటిలో చురుకైన పాత్ర పోషించినవారు... రాబర్ట ఓవెన్, సెయింట్ సైమన్, లూయీ బ్లాంక్, కార్‌లమార్‌క్స. క్రీ.శ. 1848 తిరుగుబాటు తర్వాత ఫ్రాన్స లో ఏర్పడిన రిపబ్లిక్ ప్రభుత్వ విధానాలను సామ్యవాదులు విభేదించారు. రిపబ్లికన్లు, సామ్యవాదులు ఒక అంగీకారానికి వచ్చి నెపోలియన్-3 నాయకత్వంలో రాజ్యాంగబద్ధమైన ప్రభుత్వాన్ని ఏర్పరిచారు. తర్వాత నెపోలియన్-3 రాజరికం వైపు మరలి క్రీ.శ. 1852లో చక్రవర్తిగా ప్రకటించుకున్నాడు. ఈయన చేసిన అనేక యుద్ధాల వల్ల ఫ్రాన్స ఆర్థిక వ్యవస్థ పతనమైంది. సామ్యవాదుల నాయకత్వంలో ప్రజలు తిరుగుబాటు చేసి క్రీ.శ. 1871లో పారిస్‌లో ‘కమ్యూన్’ ప్రభుత్వాన్ని నెలకొల్పారు. ప్రపంచంలో ఏర్పాటైన మొదటి కమ్యూనిస్టు ప్రభుత్వం ఇదే. కాని దీన్ని ఫ్రెంచ్ సైన్యం తీవ్రంగా అణచివేసింది. -
వీఆర్వో/ వీఆర్ఏ పంచాయతీ సెక్రటరీలు ప్రత్యేకం
1. మకర రేఖ ప్రాంతంలో ఏ రోజున సూర్యకిరణాలు లంబంగా పడతాయి? డిసెంబరు 22 2. సాధారణంగా ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు ఎప్పుడు ప్రవేశిస్తాయి? జూన్ రెండో వారంలో 3. ప్రపంచంలో అరుదైన ఎర్ర చందనం వృక్షాలు ఏ జిల్లాలో ఉన్నాయి? కడప 4. పండ్లతోటల సాగుకు అనుకూలమైన నేలలు/మృత్తికలు? ఒండ్రు మృత్తికలు 5. వరి ఎక్కువగా ఏ రాష్ర్టంలో పండుతుంది? పశ్చిమబెంగాల్ 6. అగరువత్తుల తయారీకి ప్రసిద్ధి చెందిన పట్టణం? వేటపాలెం 7. భూభ్రమణం వల్ల ఉత్పత్తయ్యే శక్తిని ‘కొరియాలిస్ ఎఫెక్ట్’గా పిలుస్తారు. దీనివల్ల ఏ పరిణామాలు ఏర్పడుతున్నాయి? ఉత్తరార్ధ గోళంలో వీచే పవనాలు కుడివైపునకు, దక్షిణార్ధ గోళంలో వీచే పవనాలు ఎడమవైపునకు వెళ్తున్నాయి. 8. హిందూ మహాసముద్రంలో ఏర్పడే చక్ర వాతాలను ఏ పేరుతో పిలుస్తారు? సైక్లోన్లు 9. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లోని ఏడారి? సోనారన్ 10. ప్రపంచంలో అత్యధిక వర్షపాతం నమోదైన ప్రాంతం? వయలీలీ 11. ‘సజీవ శిలాజ భూమి’(ద ల్యాండ్ ఆఫ్ లివింగ్ ఫాసిల్స్) గా ప్రఖ్యాతి చెందిన దేశం? ఆస్ట్రేలియా 12. జాతీయాదాయం అంటే? ఉత్పత్తి కారకాల దృష్ట్యా నికర జాతీయోత్పత్తి 13. భారతదేశ తీర రేఖ పొడవు? 6,100 కి.మీ. 14. మూలధనాన్ని వాడుకున్నందుకు చెల్లించే ధరను ఏమంటారు? వడ్డీ 15. మనదేశంలో అడవుల విస్తీర్ణం ఎంత శాతం? 21 16. 2011 జనాభా లెక్కల ప్రకారం భారత దేశంలో గత దశాబ్ది జనాభావృద్ధి రేటు? 17.64 శాతం 17. ఏ రాష్ర్టంలో ఎక్కువమంది గ్రామాల్లోనే నివసిస్తున్నారు? హిమాచల్ ప్రదేశ్ 18. భారతదేశంలో అత్యధిక సాగుభూమికి వేటి ద్వారా నీటిపారుదల సౌకర్యం లభిస్తుంది? బావులు 19. ‘నీలి విప్లవం’ అంటే? చేపల ఉత్పత్తిని పెంచడం 20. మాంగనీస్ నిల్వలు ఎక్కువగా ఉన్న జిల్లా? శ్రీకాకుళం 21. సింధునాగరికత విలసిల్లిన కాలం? క్రీ.పూ. 2500 - 1750 22. రుగ్వేదంలో యుద్ధానికి పర్యాయపదంగా ‘గవిష్ఠి’ అనే పదం వాడారు. ‘గవిష్ఠి’ అంటే అర్థం? ఆవుల కోసం అన్వేషించడం 23. ‘శ్వేతాంబరులు’ ఏ మతానికి చెందినవారు? జైనమతం 24. అశోకుని కాలంలో ‘ధర్మ మహా మాత్రులు’ అంటే ఎవరు? దర్మబోధనలు చేసే ప్రత్యేక అధికారులు 25. శాతవాహనుల పాలనలోని సామాజిక పరిస్థితులను వివరించే శిల్పాలు ఎక్కడు న్నాయి? అమరావతి 26. వేంగీ చాళుక్యుల కాలంలో గ్రామాలను పర్యవేక్షించే అధికారులను ఏమని పిలిచేవారు? రాష్ర్టకూట మహాత్తర 27. గ్రామ సభలకు సంపూర్ణ అధికారాలిచ్చిన రాజులు? చోళులు 28. వ్యవసాయాభివృద్ధి కోసం కాలువలను తవ్వించిన ఢిల్లీ సుల్తాన్? ఫిరోజ్ షా తుగ్లక్ 29. ‘నృత్త రత్నావళి’ గ్రంథాన్ని రాసినవారు? జాయపసేనాని 30. ‘పొట్టీకాదు, పొడగరీ కాదు, బొద్దుగా ఉండి ముఖం మీద మచ్చలు ఉంటాయి’ ఇది ఏ రాజు గురించి చేసిన ప్రస్తావన? }Mృష్ణదేవరాయలు 31. భారతదేశంలో ‘స్థానిక స్వపరిపాలన పిత’గా ప్రసిద్ధిగాంచిన బ్రిటిష్ గవర్నర్ జనరల్? లార్డ రిప్పన్ 32. భారతదేశంలో ఆంగ్లేయుల పాలన కాలంలో మద్రాస్ రాష్ర్టంలో ప్రవేశపెట్టిన భూమి శిస్తు విధానం? రైత్వారీ పద్ధతి 33. ఏటా పంటలు పండించే భూమిని అక్బర్ కాలంలో ఏ విధంగా పిలిచేవారు? పోలాజ్ 34. చైనా మహాకుడ్యాన్ని (ద గ్రేట్ వాల్ ఆఫ్ చైనా) నిర్మించిన ఆ దేశ రాజవంశం? చింగ్ వంశం 35. {Mూసేడులు అంటే? మతయుద్ధాలు 36. పారిశ్రామిక విప్లవం మొదటిసారి ఏ దేశంలో ప్రారంభమైంది? ఇంగ్లండ్ 37. ‘బలప్రయోగం’ (బ్లడ్ అండ్ ఐరన్) అనే విధానంతో జర్మనీ ఏకీకరణ సాధించిన వారు? బిస్మార్‌క 38. ‘వర్సయిల్స్ సంధి’ ఏ సంవత్సరంలో జరిగింది? 1919 39. సోవియట్ రష్యా కూటమికి వ్యతిరేకంగా ఏర్పాటైన రక్షణాత్మక వ్యవస్థ? నాటో 40. భారత జాతీయ కాంగ్రెస్ ప్రథమ సమావేశం (1885) ఎక్కడ జరిగింది? బొంబాయి 41. జలియన్ వాలాబాగ్ ఉదంతం ఎప్పుడు జరిగింది? ఏప్రిల్ 13, 1919 42. మెక్‌డోనాల్డ్ ప్రకటించిన కమ్యూనల్ అవార్డకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన వారు? గాంధీజీ 43. ఏ ప్రణాళిక ప్రకారం భారతదేశ విభజన జరిగింది? మౌంట్‌బాటన్ 44. వందేమాతర ఉద్యమానికి తక్షణ కారణం? బెంగాల్ విభజన 45. ‘వివేకవర్ధిని’ పత్రికను నిర్వహించినవారు? కందుకూరి వీరేశలింగం 46. భారత రాజ్యాంగంలోని ఏ అధికరణం అస్పృశ్యతను నిషేధించింది? 17వ 47. ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడుంది? న్యూయార్క 48. భారత రాజ్యాంగ పరిషత్తు తాత్కాలిక అధ్యక్షుడిగా ఎన్నికైనవారు? సచ్చిదానంద సిన్హా 49. మన రాజ్యాంగంలోని ‘ఆదేశిక సూత్రాలను ఏ దేశ రాజ్యాంగ స్ఫూర్తితో చేర్చారు? ఐర్లాండ్ 50. మన రాజ్యాంగంలో నిర్దేశించిన ప్రాథమిక విధులెన్ని? 11 51. పంచాయతీరాజ్‌కు సంబంధించిన 73వ రాజ్యాంగ సవరణను ఎప్పుడు చేశారు? 1993 52. గ్రామ పంచాయతీలను ఏర్పాటు చేయా లని చెబుతున్న రాజ్యాంగ ప్రకరణ? 40 53. ప్రాథమిక హక్కుల నుంచి ఆస్తిహక్కును ఏ రాజ్యాంగ సవరణ ద్వారా తొలగించారు? 44వ 54. అంబేద్కర్ దృష్టిలో ప్రాథమిక హక్కులకు ‘ఆత్మ’ వంటి హక్కు? రాజ్యాంగ పరిహార హక్కు 55. 42వ రాజ్యాంగ సవరణ ద్వారా మన రాజ్యాంగ ప్రవేశికలో చేర్చిన అంశాలు? సామ్యవాద, లౌకిక 56. రాష్ర్టపతి వేతనాన్ని ఎవరు నిర్ణయిస్తారు? పార్లమెంట్ 57. రాజ్యసభలో సమాన సంఖ్యలో స్థానా లున్న రాష్ట్రాలు? ఆంధ్రప్రదేశ్, తమిళనాడు 58. సుప్రీంకోర్టు న్యాయమూర్తుల పదవీ విరమణ వయసు? 65 ఏళ్లు 59. గవర్నర్‌ను ఎవరు నియమిస్తారు? రాష్ర్టపతి 60. మనరాష్ర్టంలో ప్రస్తుతం ఉన్న స్థానిక స్వపరిపాలన సంస్థలు వరుసగా? గ్రామ పంచాయతీ - మండల పరిషత్ - జిల్లా ప్రజాపరిషత్