ప్రపంచంలో వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది? | What is the only continent in the world without trees? | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది?

Published Thu, Jun 5 2014 10:10 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM

What is the only continent in the world without trees?

 1.    ‘ది గ్రాండ్ కానియన్ ఆఫ్ కొలరాడో’ ఎక్కడ ఉంది?
     యూఎస్‌ఏ
 
 2.    సోనారన్ ఎడారి ఎక్కడ ఉంది?
     మెక్సికో, ఉత్తర అమెరికా
 
 3.    ‘ఎక్సోటిక్’ నదులు అంటే?
     వర్షపాతం సమృద్ధిగా సంభవించే ప్రాంతంలో జనించి, ఎడారుల ద్వారా ప్రవహించే నదులు.
     ఉదా: నైలు (ఆఫ్రికా), సింధు (ఆసియా)
 
 4.    విక్టోరియా జలపాతం ఏ నదిపై ఉంది?
     జాంబేజీ (ఆఫ్రికా)
 
 5.    నయాగారా జలపాతం ఏ దేశంలో ఉంది?
     యూఎస్‌ఏ
 
 6.    దక్షిణ అమెరికాలోని సవన్నా ప్రాంతాన్ని ఏమంటారు?
     కంపాలు
 
 7.    ‘హవానాలు’ అనే శ్రేష్టమైన చుట్టలకు ప్రసిద్ధి చెందిన దేశం?
     క్యూబా
 
 8.    దక్షిణ అమెరికాలోని సమశీతోష్ణ మండల ప్రాంతాన్ని ఏమంటారు?
     పెటగోనియా
 
     {పాంతం    - గడ్డి భూముల పేరు
     యురేషియా    - స్టెప్పీలు
     ఉత్తర అమెరికా- ప్రయరీలు
     దక్షిణ అమెరికా- పంపాలు
     దక్షిణ ఆఫ్రికా    - వెల్డులు
     ఆస్ట్రేలియా    - డౌన్‌లు
 
 9.    ప్రపంచ పంచదార గిన్నెగా ప్రసిద్ధి చెందిన దేశం?
     క్యూబా
 
 10.   ప్రపంచ ప్రసిద్ధి చెందిన ‘కింబర్లే’ గనులు ఏ నిక్షేపాలకు నిలయం?
     వజ్రాలు
 
 11.    రుతువును ‘మౌసమ్’ అని పిలుస్తారు. ఇది ఏ భాషా పదం?
     అరబ్బీ
 
 12.    భారతదేశంలో అత్యధిక వర్షపాతాన్ని నమోదు చేసే ప్రాంతమైన మాసిన్రామ్, చిరపుంజీ ఏ కొండల్లో ఉన్నాయి?
     ఖాసీ కొండలు
 
 13.    ‘అన్నం’ తీరం ఏ దేశంలో ఉంది?
     వియత్నాం
 
 14.    ‘సజీవ శిలాజ భూమి’ అని ఏ దేశాన్ని పేర్కొంటారు?
     ఆస్ట్రేలియా
 
 15.    ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత ఉన్న దేశం ఏది?
     బంగ్లాదేశ్
 
 16.    ‘అమెరికా దేశ క్రీడా ప్రాంగణం’ అని ఏ నగరాన్ని పిలుస్తారు?
     కాలిఫోర్నియా
 
 17.    ప్రపంచంలో అతిలోతైన మంచినీటి సరస్సు ఏది?
     బైకాల్ సరస్సు
 
 18.    ‘శీతల ధ్రువం’ అని ఏ ప్రాంతాన్ని పిలుస్తారు?
     సైబీరియా
 
 19.    ప్రపంచంలో న్యూస్‌ప్రింట్‌ను అధికంగా ఉత్పత్తి చేసే దేశం?
     కెనడా
 
 20.   ప్రపంచంలోకెల్లా అతి విశిష్టమైన ఇనుప ఖనిజ నిక్షేపాలు ఏ దేశంలో ఉన్నాయి?
     స్వీడన్
 
 21.    {పపంచంలో అతిపెద్ద అల్యూమినియం కర్మాగారం ఏ దేశంలో ఉంది?
     కెనడా
 
 22.    ‘అరోరా బొరియాలిస్’ అంటే ఏమిటి?
     ఆకాశంలో అప్పుడప్పుడు ఏర్పడే ఆకుపచ్చ, ఎరుపు రంగు తెరలు
 
 23 . ప్రపంచంలో కెల్లా అతిపెద్ద మంచుకొండ ఏ సముద్రంలో ఉంది?
     పసిఫిక్
 
 24.   ప్రపంచంలో వృక్షాలు లేని ఏకైక ఖండం ఏది?
     అంటార్కిటికా
 
 25.    అంటార్కిటికాలో భారత్ నెలకొల్పిన పరిశోధన కేంద్రాల పేర్లు?
     దక్షిణ గంగోత్రి, మైత్రి
 
 26.    కర్నూలు రాజధానిగా ఆంధ్రరాష్ర్టం ఎప్పుడు ఏర్పడింది?
     1953 అక్టోబరు 1
 
 27.    ప్రపంచంలో అత్యధిక వర్షం కురిసే ప్రాంతం?
     వయలీలీ పర్వత ప్రాంతం (హవాయి ద్వీపం) (1234.4 సెం.మీ)
 
 28.    దక్షిణ భారతదేశంలో ప్రవహించే నదుల్లో పెద్దది?
     గోదావరి
 
 29.    ఆఫ్రికాలో ఉన్న ఎడారులేవి?
     సహారా, కలహారి
 
 30.    అటకామా ఎడారి ఎక్కడ ఉంది?
     దక్షిణ అమెరికా
 
 31.    కృష్ణానది ఉపనదుల్లో పెద్దది?
     తుంగభద్ర
 
 32.    పెన్నానది ఆంధ్రప్రదేశ్‌లోని ఏ జిల్లాలో మొదట ప్రవేశిస్తుంది?
     అనంతపురం
 
 33.    సునామీలకు మరో పేరు?
     వేలా తరంగాలు (Tidal Waves)
 
 34.   ప్రపంచంలో అత్యధిక వేలాపరిమితి ఎక్కడ నమోదైంది?
     ఫండీ అఖాతం (తూర్పు కెనడా)
 
 35.    భూ మధ్య రేఖా ప్రాంతంలో భూగోళం చుట్టూ ఏర్పడే అల్పపీడన మేఖలను ఏమంటారు?
     భూమధ్య రేఖ ప్రశాంత మండలం
 (డోల్డ్రమ్స్)
 
 36.   ప్రపంచంలో అత్యంత దట్టమైన అడవులేవి?
     సెల్వాలు
 
 37.   ప్రపంచంలో అత్యధికంగా గంధకం ఉత్పత్తి చేస్తున్న దేశం ఏది?
     మెక్సికో
 
 38.    పత్తి ఏ మృత్తికల్లో ఎక్కువగా పండుతుంది?
     నల్లరేగడి నేలలు
 
 39.    పొగాకు పరిశోధన కేంద్రం ఎక్కడ ఉంది?
     రాజమండ్రి
 
 40.    పత్తి పరిశోధన కేంద్రం ఉన్న పట్టణం?
     నంద్యాల (కర్నూలు)
 
 41.    చెరకు పరిశోధనా కేంద్రం ఎక్కడ ఉంది?
     అనకాపల్లి (విశాఖపట్నం)
 
 42.    మిరప పరిశోధన కేంద్రం ఉన్న ప్రదేశం?
     లాం (గుంటూరు)
 
 43.    భారత ప్రామాణిక కాల నిర్ణయ రేఖాంశం?
     82బీని తూర్పు రేఖాంశం
 
 44.    {X-°^Œ కాలం కంటే, భారత ప్రామాణిక కాలం ఎంత ముందుంటుంది?
     5 గంటల 30 నిమిషాలు
 
 45.    భారతదేశ భూ భాగం సరిహద్దు మొత్తం పొడవు ఎంత?
     15,200 కి.మీ.
 
 46.    భారతదేశ తీరరేఖ పొడవు ఎంత?
     6,100 కి.మీ.
 
 47.    భారతదేశంతో ఉమ్మడి సరిహద్దును పంచుకుంటున్న దేశాల సంఖ్య?
     7
 
 48.    భారత్, చైనా మధ్యనున్న విభజన రేఖను ఏమంటారు?
     మెక్ మోహన్ రేఖ
 
 49.    భారత్, శ్రీలంకను వేరు చేస్తున్నవేవి?
     మన్నార్ సింధుశాఖ, పాక్ జలసంధి
 
 50.    విస్తీర్ణంలో అతిపెద్ద రాష్ర్టం ఏది?
     రాజస్థాన్ (చిన్న రాష్ట్రం - గోవా)
 
 51.    అతి పొడవైన తీరరేఖ ఉన్న రాష్ర్టం ఏది?
     గుజరాత్
 
 52.    మూడు సముద్రాల కలయికతో తీరరేఖ ఉన్న రాష్ర్టం ఏది?
     తమిళనాడు
 
 53.    భారతదేశం ఉత్తర చివరి నుంచి దక్షిణ చివరి సరిహద్దు వరకు దూరం ఎంత?
     3214 కి.మీ.
 
 54.    భారతదేశ పడమర చివర నుంచి తూర్పు చివరి వరకు ఉన్న దూరం ఎంత?
     2933 కి.మీ.
 
 55.    భారత్, శ్రీలంక మధ్యనున్న దీవి ఏది?
     పాంబన్ దీవి
 
 56.    లక్ష దీవుల్లోని అతిపెద్ద దీవి?
     మినికాయ్ దీవి
 
 57.   ప్రపంచంలో అతి ఎత్తై పీఠభూమి?
     పామీరు పీఠభూమి
 
 58.    ‘బంగర్’ అంటే ఏమిటి?
     ప్రాచీన కాలంలో ఏర్పడిన ఒండలి మైదానం
 
 59.    ‘ఖాదర్’ అంటే?
     ఇటీవలి కాలంలో ఏర్పడిన ఒండలి మైదానం
 
 60.    ఆరావళి పర్వతాల్లో ఎత్తైది ఏది?
     గురుశిఖర్ పర్వతం
 
 61.    ద్వీపకల్ప పీఠభూమిలో ఎత్తై శిఖరం?
     అనైముడి (అన్నామలై పర్వతాలు)     (2695మీ.)
 
 62.    నీలగిరి పర్వతాల్లో ఎత్తైది ఏది?
     దొడబెట్ట (2637 మీ.)
 
 63.    ఊటి (ఉదకమండలం) వేసవి విడిది కేంద్రం ఏ పర్వతాల్లో ఉంది?
     నీలగిరి (తమిళనాడు)
 
 64.    భారతదేశ గొప్ప ఎడారిగా ప్రసిద్ధి చెందింది?
     థార్ ఎడారి
 
 65.    మహానది ఏ రాష్ర్టంలో ఉంది?
     ఒడిశా
 
 66.    కిలిమంజారో (టాంజానియా) ఏవిధమైన అగ్నిపర్వతం?
     విలుప్త అగ్నిపర్వతం
 
 67.    సంవత్సరానికి ఎంత సముద్ర జలం ఆవిరి రూపంలో వాతావరణాన్ని చేరుతుంది?
     3,30,000 ఘ.కి.మీ.
 
 68.    సముద్ర జలాల్లో కరిగి ఉన్న లవణాల పరిమాణాన్ని ఏమంటారు?
     లవణీయత
 
 69.    సముద్ర జలాల సరాసరి లవణీయత?
     33% - 37%

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement