సురైయా బోస్‌కు యుధ్‌వీర్ అవార్డు
23వ యుధ్‌వీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు సురైయా హస్సన్ బోస్‌కు లభించింది. అంతరించిపోతున్న హిమారో, పైథాని, జమవర్, మస్రూ, నిజామీ-పర్షియన్ నైపుణ్యాలను పునరుజ్జీవింప చేసినందుకు ఆమె యుధ్‌వీర్ అవార్డుకు ఎంపికయ్యారు.
సౌరవ్‌గోసాల్‌కు ఆసియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డు
భారత ఏస్ క్రీడాకారుడు సౌరవ్‌గోసాల్‌ను 2013 అత్యుత్తమ ఆసియా పురుషుల క్రీడాకారుడిగా డాటో అలెక్స్‌లీ అవార్డుకు ఆసియా స్క్వాష్ ఫెడరేషన్ ఎంపిక చేసింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన అన్నీ ఆయు వింగ్ చి అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా ఎంపికైంది. అత్యుత్తమ పురుషుల టీమ్‌గా భారత పురుషుల జట్టు నిలిచింది. అత్యుత్తమ మహిళల టీమ్‌గా హాంగ్‌కాంగ్ జూనియర్ జట్టు ఎంపికైంది.
రమేశ్ అగర్వాల్‌కు గ్రీన్ నోబెల్ అవార్డు
చత్తీస్‌గఢ్ పర్యావరణ కార్యకర్త రమేశ్ అగర్వాల్‌కు గోల్డ్‌మాన్ పర్యావరణ బహుమతి లభించింది. గ్రీన్ నోబెల్ అని కూడా పిలిచే ఈ అవార్డును ఏప్రిల్ 27న శాన్‌ఫ్రాన్సిస్కోలో ప్రకటించారు. ఈ అవార్డు కింద రూ. 1.06 కోట్ల నగదు బహుకరిస్తారు.
అవార్డులు: రమేశ్ అగర్వాల్‌కు గ్రీన్ నోబెల్ అవార్డు
Published Wed, Apr 30 2014 10:21 PM | Last Updated on Thu, Jul 11 2019 5:01 PM
Advertisement
Advertisement