Ramesh Agarwal
-
అగర్వాల్ మృతికి వైఎస్ జగన్ సంతాపం
‘దైనిక్ భాస్కర్’ రమేశ్ అగర్వాల్ అస్తమయం అహ్మదాబాద్: దేశంలో ప్రఖ్యాతిగాంచిన దైనిక్ భాస్కర్ గ్రూప్ చైర్మన్ రమేశ్ చంద్ర అగర్వాల్(73) బుధవారం గుండెపోటుతో కన్నుమూశారు. బుధవారం అహ్మదా బాద్‌కు విమానంలో చేరుకున్న ఆయనకు ఎయిర్పో ర్టులోనే గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయన్ను దగ్గర్లోని అపోలో ఆస్పత్రికి తరలించారు. అయితే, అప్పటికే ఆయన తుదిశ్వాస విడిచారని ఆస్పత్రి వైద్యులు స్పష్టంచేశారు. గురువారం సాయంత్రం భోపాల్‌లో అంత్యక్రియలు నిర్వహిస్తారని దైనిక్ భాస్కర్ గ్రూప్ సీనియర్ ఉద్యోగి ఒకరు చెప్పారు. అగర్వాల్ మరణవార్త తెలిసి గుజరాత్ సీఎం విజయ్ రూపానీ, రాష్ట్ర కాంగ్రెస్ నేతలు ఆస్పత్రిలో ఆయనకు నివాళులర్పించారు. మధ్యప్రదేశ్ సీఎం శివరాజ్‌సింగ్ చౌహాన్ సైతం సంతాపం తెలిపారు. అగర్వాల్ మృతివార్త తెలిసి పత్రికావర్గాల్లో విషాదఛాయలు అలుముకున్నాయి. తండ్రితో కలసి భోపాల్‌కు: 1944 నవంబర్ 30న ఝాన్సీలో జన్మించిన అగర్వాల్.. తండ్రి ద్వారకప్రసాద్ అగర్వాల్‌తో కలసి భోపాల్‌కు తరలివచ్చారు. 1958లో దైనిక్ భాస్కర్ వార్తాపత్రికను ప్రారంభించారు. అగర్వాల్ నేతృత్వంలో దైనిక్‌భాస్కర్ గ్రూప్ 14 రాష్ట్రాల్లో 62 ఎడిషన్లను పబ్లిష్ చేస్తోంది. సర్క్యులే షన్‌పరంగా ప్రపంచంలో నాలుగో అతిపెద్ద వార్తాపత్రికగా రికార్డుల కెక్కింది. దైనిక్ భాస్కర్ చైర్మన్ మృతికి జగన్ సంతాపం సాక్షి, హైదరాబాద్: దైనిక్ భాస్కర్ గ్రూపు చైర్మన్ రమేష్ చంద్ర అగర్వాల్ మృతి పట్ల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. అగర్వాల్ కుటుంబీకులకు జగన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
అవార్డులు: రమేశ్ అగర్వాల్‌కు గ్రీన్ నోబెల్ అవార్డు
సురైయా బోస్‌కు యుధ్వీర్ అవార్డు 23వ యుధ్వీర్ ఫౌండేషన్ మెమోరియల్ అవార్డు సురైయా హస్సన్ బోస్‌కు లభించింది. అంతరించిపోతున్న హిమారో, పైథాని, జమవర్, మస్రూ, నిజామీ-పర్షియన్ నైపుణ్యాలను పునరుజ్జీవింప చేసినందుకు ఆమె యుధ్వీర్ అవార్డుకు ఎంపికయ్యారు. సౌరవ్గోసాల్కు ఆసియన్ స్క్వాష్ ఫెడరేషన్ అవార్డు భారత ఏస్ క్రీడాకారుడు సౌరవ్గోసాల్ను 2013 అత్యుత్తమ ఆసియా పురుషుల క్రీడాకారుడిగా డాటో అలెక్స్లీ అవార్డుకు ఆసియా స్క్వాష్ ఫెడరేషన్ ఎంపిక చేసింది. హాంగ్‌కాంగ్‌కు చెందిన అన్నీ ఆయు వింగ్ చి అత్యుత్తమ మహిళా క్రీడాకారిణిగా ఎంపికైంది. అత్యుత్తమ పురుషుల టీమ్‌గా భారత పురుషుల జట్టు నిలిచింది. అత్యుత్తమ మహిళల టీమ్‌గా హాంగ్‌కాంగ్ జూనియర్ జట్టు ఎంపికైంది. రమేశ్ అగర్వాల్‌కు గ్రీన్ నోబెల్ అవార్డు చత్తీస్‌గఢ్ పర్యావరణ కార్యకర్త రమేశ్ అగర్వాల్‌కు గోల్డ్‌మాన్ పర్యావరణ బహుమతి లభించింది. గ్రీన్ నోబెల్ అని కూడా పిలిచే ఈ అవార్డును ఏప్రిల్ 27న శాన్ఫ్రాన్సిస్కోలో ప్రకటించారు. ఈ అవార్డు కింద రూ. 1.06 కోట్ల నగదు బహుకరిస్తారు. -
భారతీయుడికి గోల్డ్‌మాన్ బహుమతి
శాన్ ఫ్రాన్సిస్కో: క్షేత్రస్థాయిలో పర్యావరణ పరిరక్షణకు విశేష కృషి చేసిన ఛత్తీస్‌గఢ్ పర్యావరణ కార్యకర్త రమేశ్ అగర్వాల్ ప్రతిష్టాత్మక ‘గోల్డ్‌మాన్ పర్యావరణ బహుమతి’ని గెలుపొందారు. రమేశ్‌తో సహా ఈ ఏడాది ఆరు ఖండాల నుంచి ఆరుగురు కార్యకర్తలు ఈ అవార్డుకు ఎంపికయ్యారు. అవార్డు కింద విజేతలకు రూ.1.06 కోట్ల నగదు అందజేస్తారు. రాయ్‌పూర్‌లో ఇంటర్నెట్ కేఫ్ నడుపుతున్న రమేశ్ సమాచార హక్కు చట్టం ద్వారా స్థానికుల్లో పర్యావరణ పరిరక్షణపై చైతన్యం తీసుకొచ్చారు. పర్యావరణ అనుమతులు లేకుండానే బొగ్గు గనుల తవ్వకం కోసం ప్రయత్నించిన జిందాల్ స్టీల్ అండ్ పవర్ లిమిటెడ్‌కు వ్యతిరేకంగా పోరాడిన రమేశ్ ఆ కంపెనీ ప్రాజెక్టును అడ్డుకున్నారు. దీంతో ఆయనపై కత్తిగట్టిన పారిశ్రామిక శక్తులు 2008లో కిరాయి వ్యక్తి ద్వారా కాల్పులు జరిపించగా కాలి ఎముకలు ఛిద్రమై ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. -
ఆంధ్ర యాపిల్‌ను మార్కెట్లోకి తెస్తాం
=మూడేళ్లలో పరిశోధన ఫలితాలు =శాస్త్రవేత్త డాక్టర్ రమేష్ అగర్వాల్ =లంబసింగిలో స్థల పరిశీలన చింతపల్లి, న్యూస్‌లైన్: సిమ్లా యాపిల్ మాదిరిగా ఆంధ్ర యాపిల్‌ను మార్కెట్లోకి తేవడమే లక్ష్యంగా పరిశోధనలు చేస్తున్నట్టు హైదరాబాద్‌కు చెందిన సెంటర్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయాలజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ రమేష్ అగర్వాల్ తెలిపారు. శాస్త్రవేత్తల బృందం చింతపల్లి మండలం లంబసింగి ప్రాంతంలో శనివా రం పర్యటించింది. అతి తక్కువ ఉష్ణోగ్రతలు నమోదవుతున్న ఈ ప్రాంతంలో యాపిల్ సాగుపై పరిశోధనలు జరిపేందుకు స్థల పరిశీలన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ (న్యూఢిల్లీ)ఆధ్వర్యంలో చింతపల్లి ప్రాంతంలో యాపిల్ సాగుపై పరిశోధనలు చేస్తామన్నారు. ప్రస్తుతం మన దేశంలో జమ్ముకాశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్ ప్రాంతాల్లో యాపిల్‌ను వాణిజ్య పరంగా సాగు చేస్తున్నారని చెప్పారు. సముద్ర మట్టానికి 3,800 అడుగుల ఎత్తులో ఉన్న లంబసింగి ప్రాంతంలో జీరో డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్న నేపథ్యంలో ఇక్కడ ప్రయోగాత్మకంగా యాపిల్ సాగు చేపట్టేందుకు నిర్ణయించామన్నారు. సోలాన్‌లోని వై.ఎస్.ప్రమార్ హార్టికల్చర్ యూనివర్సిటీ నుంచి కొన్ని రకాల యాపిల్ విత్తనాలను తెచ్చి జనవరి, ఫిబ్రవరి నెలల్లో ప్రయోగాత్మక సాగు చేపట్టనున్నట్టు తెలిపారు. ఇందుకు లంబసింగి సమీపంలోని రాజుపాకలు, చింతపల్లి ప్రాంతీయ పరిశోధన స్థానాల్లో యాపిల్ మొక్కలు నాటుతామన్నారు. మూడు, నాలుగేళ్లలో పరిశోధన ఫలితాలు నిర్ధారణ అవుతాయని చెప్పారు. పరిశోధనలు విజయవంతమైతే అరకు, అనంతగిరి ప్రాంతాల్లో కూడా పరిశోధనలు జరుపుతామని, తర్వాత సాగుకు ప్రభుత్వ పరంగా రైతులను ప్రోత్సహించే చర్యలు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో సెంట్రల్ ఫర్ సెల్యూలర్ మాలిక్యులర్ బయాలజీ సీనియర్ ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ వీరభద్రరావు, సీనియర్ ఎస్ఈ వై.వి.రామారావు, స్థానిక పరిశోధన స్థానం ఏడీఆర్ డాక్టర్ వేణుగోపాలరావు, శాస్త్రవేత్త ప్రదీప్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.