హెల్త్‌కేర్‌లో ప్రవేశాలు | Healthcare Admissions | Sakshi
Sakshi News home page

హెల్త్‌కేర్‌లో ప్రవేశాలు

Published Thu, Dec 3 2015 1:26 AM | Last Updated on Sun, Sep 3 2017 1:23 PM

హెల్త్‌కేర్‌లో ప్రవేశాలు

హెల్త్‌కేర్‌లో ప్రవేశాలు

హెల్త్‌కేర్(పారా మెడికల్)లో అడ్వాన్స్‌డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవిదేశాల్లో పారామెడికల్ నిపుణుల కొరత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఉస్మానియా విశ్వవిద్యాలయం వివిధ ఆసుపత్రులకు అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహించే అవకాశం కల్పించింది.
 
 అడ్వాన్స్‌డ్ పీజీ డిప్లొమా కోర్సులు
     1.    అనెస్తీషియా టెక్నాలజీ
     2.    కార్డియాక్ టెక్నాలజీ
     3.    క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ
     4.    డయాలిసిస్ టెక్నాలజీ
     5.    ఎమర్జెన్సీ మెడికల్ కేర్
     6.    ఎకో కార్డియోగ్రఫీ అండ్ సోనోగ్రఫీ
     7.    మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ
     8.    మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ
     9.    ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ
     10.    ఫిజీషియన్ అసిస్టెంట్
     11.    పర్‌ఫ్యూజన్ టెక్నాలజీ
     12.    రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ
     13.    హెల్త్‌కేర్ టెక్నాలజీ
     14.    హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ బిల్లింగ్.
 అర్హత: కనీసం ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 1- 12 కోర్సులు చేసేందుకు అర్హులు. మిగిలిన డిగ్రీ అభ్యర్థులు (ఓరియంట్ లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో మినహా) 13, 14 కోర్సులను చేయవచ్చు.
 
 కోర్సు కాలపరిమితి: రెండేళ్లు. మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి ఏడాది థియరీ, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. రెండో ఏడాది ప్రాక్టికల్స్‌లో శిక్షణ అందిస్తారు. ఇందులో ఎలాంటి ఇంటర్న్‌షిప్ ఉండదు. హాస్పిటళ్ల అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులను మలిచేలా సిలబస్‌ను రూపొందించారు. కొన్ని కోర్సుల్లో కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ బిల్డింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ అందిస్తున్నారు.
 
 ఉద్యోగావకాశాలు: వీటిలో శిక్షణ పూర్తి చేసినవారు ఆసుపత్రులు, చిన్న స్థాయి ఎమర్జెన్సీ సెంటర్లు, ప్రైవేటు ల్యాబ్‌లు, బ్లడ్ డోనార్ సెంటర్‌లు, డాక్టర్ల క్లినిక్‌లలో ఉద్యోగాలు పొందవచ్చు. ట్రీట్‌మెంట్‌లో వీరు డాక్టర్లకు సహాయపడతారు. రోగులకు పూర్తిస్థాయి ఆరోగ్య సేవలు అందిస్తారు. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్‌లో ల్యాబొరేటరీ మేనేజర్లు, సూపర్‌వైజర్లు, కన్సల్టెంట్స్ వంటి హోదాల్లో పనిచేయవచ్చు.
 
 కోర్సు ఫీజు: రూ.12,500
 దరఖాస్తు రుసుం: రూ.800. డెబిట్/ క్రెడిట్ కార్డులు/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు రుసుం చెల్లించవచ్చు.దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్‌లైన్‌లోనే సమర్పించాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా సీట్లు నిర్ణయిస్తారు.
 
 కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలు
 ట్రాన్స్‌ఫర్ సర్టిఫికెట్
  డిగ్రీ/పీజీ సర్టిఫికెట్
 కన్సాలిడేటెడ్ సర్టిఫికెట్
 సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(ఎస్‌ఎస్‌సీ)మార్క్స్ మెమో.
 లోకల్/నాన్ లోకల్ సర్టిఫికెట్.
 కమ్యూనిటీ, నేటివిటీ సర్టిఫికెట్
 డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్.
 ఒరిజినల్, రెండు సెట్ల జిరాక్స్ ధ్రువపత్రాల కాపీలను కౌన్సెలింగ్ సమయంలో తీసుకురావాలి.
 
 రిజర్వేషన్
 85 శాతం సీట్లను లోకల్ ఏరియా విద్యార్థులకు కేటాయించారు. మిగిలిన 15 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీ కింద ఉంచారు. ఇందులో నాన్‌లోకల్ అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.ప్రతి కోర్సులో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం ఎస్టీలకు, 6 శాతం ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఇందులో బీసీ విద్యార్థులకు కూడా వారి సబ్ క్లాస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించారు. బీసీ-ఏ: 7 శాతం; బీసీ-బి: 10 శాతం; బీసీ-సీ:1 శాతం; బీసీ-డి: 7 శాతం; బీసీ-ఈ: 4 శాతం(కోర్టు తీర్పును అనుసరించి).
 
 కోర్సులను అందిస్తున్న ఆసుపత్రులు
 ఈ కోర్సులను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో అందిస్తారు.
 యశోదా హాస్పిటల్స్, సికింద్రాబాద్
 జీవీకే ఎమర్జెన్సీ మేనేజ్‌మెంట్ అండ్ రీసెర్చ్
 ఇన్‌స్టిట్యూట్, సికింద్రాబాద్
 మెడ్విన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, నాంపల్లి
 ఓమ్ని హాస్పిటల్స్, దిల్‌సుఖ్‌నగర్.
 సన్‌షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్
 కేర్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, బంజారా హిల్స్
 మ్యాట్రిక్స్ హాస్పిటల్స్
 
 ముఖ్య తేదీలు
 దరఖాస్తుకు చివరి తేదీ: 15 డిసెంబరు, 2015
 కౌన్సెలింగ్ నిర్వహణ: 18 డిసెంబరు, 2015
 కౌన్సెలింగ్ వేదిక: డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆఫీస్, ఓయూ క్యాంపస్, హైదరాబాద్.
 వెబ్‌సైట్స్: www.osmania.ac.in;
 www.ouadmissions.com
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement