paramedical
-
భవిష్యత్ అంధకారం..!
ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ కోర్సులు చేసినా పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్లు చేసుకోలేక.. ఉద్యోగాలకు అనర్హులైన వారు జిల్లాలో చాలామంది ఉన్నారు. వాస్తవానికి కోర్సు పూర్తికాగానే వీరంతా ఆరు నెలల పాటు అప్రెంటిషిప్ పూర్తి చేయాల్సి ఉండగా.. జిల్లాలో అప్రెంట్‌షిప్ చేసే అవకాశం లేకపోవడంతో విద్యార్థులకు దీని గురించి ఎవరూ చెప్పడం లేదు. ఫలితంగా వారంతా ఉద్యోగాలకు అనర్హులవుతున్నారు. సాక్షి, కళ్యాణదుర్గం: వృత్తి విద్యా కోర్సులు చదివితే వెంటనే ఉపాధి అవకాశాలు దక్కడంతో పాటు ఉద్యోగాలకు అర్హత ఉంటుందని చాలా మంది ఈ కోర్సుల్లో చేరుతున్నారు. అక్కడి అధ్యాపకులు కూడా భవిష్యత్ బాగుంటుందని చెబుతుండటంతో ఎక్కువ మంది ఈ కోర్సుల్లో చేరారు. ఇలా అధ్యాపకులు, ఇతరుల మాటలు నమ్మి మల్టీపర్పస్ హెల్త్ వర్కర్(ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్(ఎంఎల్టీ) చేసిన విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరంగా మారింది. పారామెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోలేక.. ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు ఆరు నెలల పాటు అప్రెంట్‌షిప్ పూర్తి చేస్తేనే పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేస్తారు. ఏదైనా ఉద్యోగానికి దరఖాస్తు చేసుకోవాలంటే వీరు తప్పనిసరిగా పారామెడికల్ బోర్డు రిజిస్ట్రేషన్ నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. కానీ జిల్లాలో ఈ కోర్సులు పూర్తి చేసిన చాలా మంది విద్యార్థులు అప్రెంట్‌షిప్ పూర్తి చేయలేదు. అలా చేయాలని ఇంతవరకూ వీరిలో చాలామందికి తెలియదు. తెలిసినా జిల్లాలో అలాంటి అవకాశం లేదు. దీంతో చాలా మంది బోర్డులో రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోలేకపోయారు. అప్రెంట్‌షిప్ పూర్తి చేస్తేనే రిజిస్ట్రేషన్ జిల్లాలో 29 ఒకేషనల్ గ్రూపులున్న కళాశాలలుండగా ప్రత్యేకించి ఆరు కళాశాలల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ గ్రూపులు ఉన్నాయి. పదేళ్లుగా ఈ కళాశాలల్లో ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) పూర్తి చేసిన వారు 550 మంది ఉంటారు. వీరిలో కేవలం 50 మంది మాత్రమే అప్రెంట్‌షిప్ చేశారు. ఏ ఒక్కరూ పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ కాలేదు. ఇక మిగిలిన ఆరు కళాశాలల్లో ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ చదివిన వేలాది మంది విద్యార్థుల భవిష్యత్ ఇలాగే ఉంది. వాస్తవానికి ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ కోర్సులు పూర్తి చేసిన వారు రూ.1000 చెల్లించి ఆంధ్ర వైద్య విధాన పరిషత్ ట్రైనింగ్ అప్రెంట్‌షిప్ పూర్తి చేసుకోవాలి. అనంతరం పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. అప్రెంట్షిప్కు అవకాశం అంతంతే.. కళ్యాణదుర్గం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదివిన ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ విద్యార్థులు అప్రెంట్‌షిప్ చేయడానికి అంతం త మాత్రమే అవకాశాలున్నాయి. 2014 వరకు చెన్నైకి చెందిన బోర్డు అప్రెంట్‌షిప్ ట్రైనింగ్ సంస్థతో కళాశాల ఒప్పందం కుదుర్చుకుని అప్రెంట్‌షిప్ చేయించేవారు. ప్రస్తుతం ఆ సంస్థతో ఒప్పందాలు లేవు. అనంతపురంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో మాత్రమే కొంతవరకు అవకాశం ఉంది. అనంతపురం ప్రభుత్వాసుపత్రిలో అప్రెంట్‌షిప్ చేస్తున్న వారికీ పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో విద్యార్థులకు నష్టం జరుగుతోంది. ఇంటర్ బోర్డు, పారా మెడికల్ బోర్డు సమన్వయ లోపం ఇంటర్మీడియట్ బోర్డు, పారా మెడికల్ బోర్డు అధికారుల సమన్వయ లోపంతో ఒకేషనల్ కోర్సులు చదివిన విద్యార్థులు సతమతమవుతున్నట్లు తెలుస్తోంది. కోర్సు పూర్తయిన అనంతరం అప్రెంట్‌షిప్ చేసి పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ చేసుకోవాలి. కోర్సు పూర్తి చేసిన విద్యార్థులు విజయవాడలోని పారా మెడికల్ బోర్డుకు వెళ్లి రిజిస్టర్ చేయాలని అభ్యర్థించగా ఇది తమకు సంబంధం లేదని.. కళాశాలల వారే చూసుకుంటారని చెబుతున్నట్లు బాధితులు వాపోతున్నారు. దీంతో వేలాది మంది విద్యార్థులు ఇబ్బంది పడుతూ ఉద్యోగావకాశాలను కూడా కోల్పోతున్నారు. సచివాలయ ఉద్యోగాలకు అనర్హులు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంఎల్టీ, ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్) కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు అనర్హలుగా మిగిలిపోయారు. అప్రెంటిషిప్ లేక పారా మెడికల్ బోర్డులో రిజిస్టర్ కాక... దరఖాస్తు చేయడానికి వెళ్లిన అభ్యర్థులు తిరస్కరణకు గురయ్యారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు, పాలకులు దృష్టి సారించి తమకు న్యాయం చేయాలని బాధిత విద్యార్థులు కోరుతున్నారు. సమస్య వాస్తవమే.. ఎంపీహెచ్‌డబ్ల్యూ(ఎఫ్), ఎంఎల్టీ చదివిన విద్యార్థులు అప్రెంట్‌షిప్ చేసేలా చర్యలు తీసుకుంటున్నాం. పారా మెడికల్ బోర్డులో రిజిస్ట్రేషన్ విషయ మై ఉన్నతాధికారులతో చర్చిస్తున్నాం. ఈ సమస్య పరిష్కారమైతే విద్యార్థులకు అన్ని విధాలా న్యాయం జరుగుతుంది. ఒకేషనల్ గ్రూపులు చదివే విద్యార్థులకు ఈ విషయమై అవగాహన కల్పిస్తున్నాం. – రాజారాం, వృత్తి విద్యా కోర్సుల జిల్లా అధికారి -
పారా మెడికల్ డిగ్రీ కౌన్సెలింగ్‌కు నోటిఫికేషన్
25 నుంచి 28 వరకు సర్టిఫికెట్ల పరిశీలన విజయవాడ (హెల్త్ యూనివర్సిటీ): ఏపీలో పారామెడికల్ (నాలుగేళ్ల బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ) కోర్సుల్లో అడ్మిషన్లకు జరిగే వెబ్ కౌన్సెలింగ్‌లో భాగంగా ఈనెల 25 నుంచి 28వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహిస్తున్నట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ రిజిస్ట్రార్ డాక్టర్ ఎస్.అప్పలనాయుడు తెలిపారు. ఈ మేరకు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసింది. సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ, విశాఖపట్నం ఆంధ్ర యూనివర్సిటీ, తిరుపతి ఎస్వీ యూనివర్సిటీలో హెల్ప్‌లైన్ సెంటర్లను ఏర్పాటు చేశారు. అభ్యర్థులు నోటిఫికేషన్లో తెలిపిన విధంగా ర్యాంకుల ప్రకారం ఏ హెల్ప్‌లైన్ కేంద్రాల్లోనైనా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరు కావచ్చు. అన్ రిజర్వుడు 15 శాతం సీట్ల కోసం హాజరయ్యే తెలంగాణ అభ్యర్థులు మాత్రం విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరుకావాలి. బీఎస్సీ నర్సింగ్, బీపీటీ, బీఎస్సీ ఎంఎల్టీ కోర్సులకు దరఖాస్తు చేసుకున్న పీహెచ్ అభ్యర్థులు, పోస్టు బేసిక్ నర్సింగ్ (రెండేళ్ల) కోర్సుకు దరఖాస్తు చేసుకున్న వారు ఈనెల 28న విజయవాడ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీలో హాజరు కావాలి. మెరిట్ లిస్టు, ర్యాంకు కార్డులు, నోటిఫికేషన్ వివరాలు యూనివర్సిటీ ( హెచ్‌టీటీపీ://డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.యూజీఎన్టీఆర్యూహెచ్ఎస్.ఇన్, హెచ్‌టీటీపీ://ఎన్టీఆర్యూహెచ్ఎస్.ఏపీ.ఎన్ఐసీ.ఇన్) వెబ్సైట్లలో పొందవచ్చు. అభ్యర్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు హాజరైనప్పుడు వాడకంలో ఉన్న సొంత ఫోన్ నంబర్‌ను నమోదు చేయించుకోవాలి. -
హెల్త్‌కేర్‌లో ప్రవేశాలు
హెల్త్‌కేర్(పారా మెడికల్)లో అడ్వాన్స్డ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థుల నుంచి ఉస్మానియా విశ్వవిద్యాలయం దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. దేశవిదేశాల్లో పారామెడికల్ నిపుణుల కొరత ఉంది. దీన్ని దృష్టిలో ఉంచుకొని, ఉస్మానియా విశ్వవిద్యాలయం వివిధ ఆసుపత్రులకు అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా కోర్సులు నిర్వహించే అవకాశం కల్పించింది. అడ్వాన్స్డ్ పీజీ డిప్లొమా కోర్సులు 1. అనెస్తీషియా టెక్నాలజీ 2. కార్డియాక్ టెక్నాలజీ 3. క్యాత్ ల్యాబ్ టెక్నాలజీ 4. డయాలిసిస్ టెక్నాలజీ 5. ఎమర్జెన్సీ మెడికల్ కేర్ 6. ఎకో కార్డియోగ్రఫీ అండ్ సోనోగ్రఫీ 7. మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ 8. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ 9. ఆపరేషన్ థియేటర్ టెక్నాలజీ 10. ఫిజీషియన్ అసిస్టెంట్ 11. పర్ఫ్యూజన్ టెక్నాలజీ 12. రెస్పిరేటరీ థెరపీ టెక్నాలజీ 13. హెల్త్‌కేర్ టెక్నాలజీ 14. హెల్త్ ఇన్సూరెన్స్ అండ్ బిల్లింగ్. అర్హత: కనీసం ఒక లైఫ్ సైన్స్ సబ్జెక్టుతో డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు 1- 12 కోర్సులు చేసేందుకు అర్హులు. మిగిలిన డిగ్రీ అభ్యర్థులు (ఓరియంట్ లాంగ్వేజ్ సబ్జెక్టుల్లో మినహా) 13, 14 కోర్సులను చేయవచ్చు. కోర్సు కాలపరిమితి: రెండేళ్లు. మొత్తం నాలుగు సెమిస్టర్లు ఉంటాయి. మొదటి ఏడాది థియరీ, ప్రాక్టికల్ ట్రైనింగ్ ఉంటుంది. రెండో ఏడాది ప్రాక్టికల్స్‌లో శిక్షణ అందిస్తారు. ఇందులో ఎలాంటి ఇంటర్న్‌షిప్ ఉండదు. హాస్పిటళ్ల అవసరాలకు అనుగుణంగా అభ్యర్థులను మలిచేలా సిలబస్‌ను రూపొందించారు. కొన్ని కోర్సుల్లో కంప్యూటర్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో, స్పోకెన్ ఇంగ్లిష్, కమ్యూనికేషన్ బిల్డింగ్ వంటి సాఫ్ట్ స్కిల్స్‌లో శిక్షణ అందిస్తున్నారు. ఉద్యోగావకాశాలు: వీటిలో శిక్షణ పూర్తి చేసినవారు ఆసుపత్రులు, చిన్న స్థాయి ఎమర్జెన్సీ సెంటర్లు, ప్రైవేటు ల్యాబ్‌లు, బ్లడ్ డోనార్ సెంటర్లు, డాక్టర్ల క్లినిక్‌లలో ఉద్యోగాలు పొందవచ్చు. ట్రీట్మెంట్లో వీరు డాక్టర్లకు సహాయపడతారు. రోగులకు పూర్తిస్థాయి ఆరోగ్య సేవలు అందిస్తారు. హెల్త్ కేర్ అడ్మినిస్ట్రేషన్‌లో ల్యాబొరేటరీ మేనేజర్లు, సూపర్వైజర్లు, కన్సల్టెంట్స్ వంటి హోదాల్లో పనిచేయవచ్చు. కోర్సు ఫీజు: రూ.12,500 దరఖాస్తు రుసుం: రూ.800. డెబిట్/ క్రెడిట్ కార్డులు/నెట్ బ్యాంకింగ్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు రుసుం చెల్లించవచ్చు.దరఖాస్తు విధానం: దరఖాస్తును ఆన్లైన్లోనే సమర్పించాలి. ఈ కోర్సుల్లో ప్రవేశాల కోసం కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. మెరిట్ ఆధారంగా సీట్లు నిర్ణయిస్తారు. కౌన్సెలింగ్‌లో సమర్పించాల్సిన ధ్రువపత్రాలు ట్రాన్స్ఫర్ సర్టిఫికెట్ డిగ్రీ/పీజీ సర్టిఫికెట్ కన్సాలిడేటెడ్ సర్టిఫికెట్ సెకండరీ స్కూల్ సర్టిఫికెట్(ఎస్ఎస్సీ)మార్క్స్ మెమో. లోకల్/నాన్ లోకల్ సర్టిఫికెట్. కమ్యూనిటీ, నేటివిటీ సర్టిఫికెట్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్. ఒరిజినల్, రెండు సెట్ల జిరాక్స్ ధ్రువపత్రాల కాపీలను కౌన్సెలింగ్ సమయంలో తీసుకురావాలి. రిజర్వేషన్ 85 శాతం సీట్లను లోకల్ ఏరియా విద్యార్థులకు కేటాయించారు. మిగిలిన 15 శాతం సీట్లను ఓపెన్ కేటగిరీ కింద ఉంచారు. ఇందులో నాన్‌లోకల్ అభ్యర్థులకు సీట్లను కేటాయిస్తారు.ప్రతి కోర్సులో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం ఎస్టీలకు, 6 శాతం ఎస్సీలకు రిజర్వ్ చేశారు. ఇందులో బీసీ విద్యార్థులకు కూడా వారి సబ్ క్లాస్ ఆధారంగా రిజర్వేషన్లు నిర్ణయించారు. బీసీ-ఏ: 7 శాతం; బీసీ-బి: 10 శాతం; బీసీ-సీ:1 శాతం; బీసీ-డి: 7 శాతం; బీసీ-ఈ: 4 శాతం(కోర్టు తీర్పును అనుసరించి). కోర్సులను అందిస్తున్న ఆసుపత్రులు ఈ కోర్సులను ఉస్మానియా విశ్వవిద్యాలయానికి అనుబంధంగా ఉన్న ఆసుపత్రుల్లో అందిస్తారు. యశోదా హాస్పిటల్స్, సికింద్రాబాద్ జీవీకే ఎమర్జెన్సీ మేనేజ్మెంట్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, సికింద్రాబాద్ మెడ్విన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, నాంపల్లి ఓమ్ని హాస్పిటల్స్, దిల్సుఖ్నగర్. సన్‌షైన్ హాస్పిటల్స్, సికింద్రాబాద్ కేర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సెన్సైస్, బంజారా హిల్స్ మ్యాట్రిక్స్ హాస్పిటల్స్ ముఖ్య తేదీలు దరఖాస్తుకు చివరి తేదీ: 15 డిసెంబరు, 2015 కౌన్సెలింగ్ నిర్వహణ: 18 డిసెంబరు, 2015 కౌన్సెలింగ్ వేదిక: డెరైక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ ఆఫీస్, ఓయూ క్యాంపస్, హైదరాబాద్. వెబ్‌సైట్స్: www.osmania.ac.in; www.ouadmissions.com -
ఇరు రాష్ట్రాల మధ్య ‘పారామెడికల్’ అగ్ని
బోర్డు కార్యదర్శిపై పలు ఆరోపణలు పదవి నుంచి తప్పుకోవాలంటూ ఏపీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఆదేశాలు తెలంగాణలో పనిచేస్తున్నందువల్ల మీకు ఆ అధికారం లేదన్న బోర్డు కార్యదర్శి రెండుసార్లు ఆదేశించినా నో కేర్ హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల మధ్య మరో వివాదాగ్ని రాజుకుంది. పారామెడికల్ బోర్డుకు కార్యదర్శి నియామకంలో ఆధిపత్యంకోసం ఇరు రాష్ట్రాల వైద్య ఆరోగ్య శాఖలు తీవ్రంగా పోటీ పడుతున్నాయి. ఈ బోర్డులో కోట్లాది రూపాయల నగదు నిల్వలుండడం ఆధిపత్య అగ్నికి ఆజ్యం పోసినట్టయింది. పారామెడికల్ కళాశాలల నిర్వహణ, అనుమతులు, సర్టిఫికెట్ల రిజిస్ట్రేషన్ తదితరాలన్నింటినీ పారామెడికల్ బోర్డు చూస్తుంది. దీంతోపాటు రెండు రాష్ట్రాల కార్యకలాపాల్నికూడా నిర్విహ స్తుంది. ఈ బోర్డు కార్యదర్శిగా రిటైర్డ్ ఉద్యోగి బీఎన్ కుమార్‌ను అప్పటి ఉమ్మడి ప్రభుత్వం నియమించింది. ఈ నేపథ్యంలో కుమార్‌పై పలు ఆరోపణలొచ్చాయి. దీంతో బోర్డు కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పుకోవాలని, వైద్యవిద్యా సంచాలకులు ఆ బాధ్యత ల్ని చేపట్టాలంటూ ఏపీ వైద్య ఆరోగ్యశాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎల్వీ సుబ్రమణ్యం ఉత్తర్వులు జారీచేశారు. ఈ ఆదేశాలు అందుకున్న బోర్డు కార్యదర్శి.. ‘ప్రస్తుతం పారామెడికల్ బోర్డు తెలంగాణ రాష్ట్రంలో ఉంది. నా నియమాకం ఉమ్మడి రాష్ట్రంలో జరిగింది. తెలంగాణలోనే పనిచేస్తున్నందువల్ల నన్ను బాధ్యతల నుంచి తప్పుకోమని సూచించే అధికారం మీకు లేదు’ అంటూ ఘాటుగా సమాధాన మిచ్చారు. దీంతో ఏపీ వైద్య ఆరోగ్యశాఖ విస్తుపోయింది. ఉమ్మడి రాష్ట్రంలో నియమితులైనందువల్ల పదవి నుంచి కచ్చితంగా దిగిపోవాల్సిందేనంటూ రెండోసారీ ఆదేశాలు జారీచేశారు. అయితే కుమార్ తిరిగి అదే సమాధానమిచ్చారు. పారామెడికల్ బోర్డులో కార్యదర్శిగా పనిచేస్తున్న బీఎన్ కుమార్ ఏపీకి చెందిన వ్యక్తి. ఆయనకు తెలంగాణ ప్రభుత్వం మద్దతు ఉన్నందువ ల్లనే సీనియర్ ఐఏఎస్‌ను ప్రశ్నించగలిగారంటూ అధికార వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఇదిలా ఉండగా బాధ్యతల నుంచి తప్పుకోం డంటూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ నుంచి ఆదేశాలు అందుకున్న కార్యదర్శి కుమార్ బోర్డులో పనిచేస్తున్న నలుగురు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఔట్సోర్సింగ్ ఉద్యోగుల్ని ఉన్నఫళంగా తీసేశారు. దీంతో వివాదం బాగా ముదిరింది. బోర్డు పరిధిలో రూ.7 కోట్ల నగుదు నిల్వలున్నాయి. ఇవి ఎవరికి ఎలా వాటా ఇవ్వాలనే విషయం కూడా ఇప్పటికీ ఓ కొలిక్కి రాలేదు. కాగా, ఉన్నతాధికారులు ఒకరిపై ఒకరికి కోపం ఉంటే వాళ్లు చూసుకోవాలి గానీ చిన్న ఉద్యోగులమైన తమను తొలగించడమేంటంటూ ఔట్సోర్సింగ్ ఉద్యోగులు వాపోతున్నారు. -
‘పారా మెడికల్’ దరఖాస్తు గడువు పెంపు
విజయవాడ: బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ, బీఎస్సీ (ఎంఎల్టీ) కోర్సుల్లో చేరేందుకు గడువును 24 సాయంత్రం 5గంటల వరకు పొడిగించినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ బాబూలాల్ తెలిపారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఈ-చలానా గడువును 20వరకు పొడిగించినట్లు తెలిపారు. ఎండీ అడ్మిషన్లకు..: ఎండీ (ఆయుర్వేద, హోమియో, యునానీ) అడ్మిషన్లకు ఈనెల 26న నిర్వహించనున్న ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును 22వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ-చలానా డౌన్లోడుకు 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు, చలానా కట్టేందుకు 20వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. సంబంధిత ధ్రువపత్రాలతో 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా యూనివర్సిటీలో అందజేయాలని సూచించారు. వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు. -
అప్రెంటిస్ షిప్ మేళాకు విశేష స్పందన
భారీగా హాజరైన వృత్తి విద్య విద్యార్థులు 1186 ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక విద్యారణ్యపురి : హన్మకొండలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అప్రెంటిస్ షిప్ మేళాకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తరలిరావడంతో కళాశాల ఆవరణతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఇంట ర్మీడియట్‌లో ఇంజినీరింగ్, పారామెడికల్ తదితర ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అప్రెంటిస్ షిప్‌కు ఎంపిక చేయడం కో సం ఈ మేళా ఏర్పాటుచేశారు. ఈ సందర్భంగా ఎన్పీడీసీఎల్ హెచ్ఆర్డీ(సీజీఎం) రాజారావు మాట్లాడుతూ వృత్తి విద్యాకోర్సు లు పూర్తిచేసి విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేయడం ద్వారా వారిలో స్వయం ఉపాధి నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. చెన్నై బోర్డు ఆఫ్ డెరైక్టర్ వీఎస్.పాండే, హైదరాబాద్‌లోని ఎస్ఐవీఈ రీడర్ జి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అప్రెంటిస్ షిప్ వల్ల భవిష్యత్‌లో జీవితానికి అవసరమైన మెళకువులు నేర్చుకోవచ్చని తెలిపారు. కార్యక్రమంలో ఇంటర్ వి ద్య ఆర్ఐఓ మలహల్రావు, జిల్లా వృత్తి విద్యాధికారి ఎ.పరాంకుశం, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు వి.లక్ష్మారెడ్డి, కోదండపాణితో పాటు టీఎస్ ఎన్పీడీసీఎల్, సింగరేణి కాలరీస్ కం పెనీ లిమిటెడ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాఫ్ట్ సొల్యూషన్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హ్యుందాయ్ మోటా ర్స్, ఎస్కార్ట్ ఎంటర్ప్రైజెస్, పలు ప్రైవేటు ఆస్పత్రులు ప్రతినిధులు పాల్గొని తమ కంపెనీల్లో అప్రెంటిస్ షిప్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, కామ ర్స్ అండ్ బిజినెస్ మేనేజ్మెంట్ విభాగాల్లోని 1043 వేకెన్సీలు, మధ్యాహ్నం 2 నుంచి సా యంత్రం 5గంటల వరకు పారా మెడికల్ అగ్రికల్చర్ విభాగాల్లోని 143 వేకన్సీల్లో అభ్యర్థుల ఎంపిక జరిగింది.