‘పారా మెడికల్’ దరఖాస్తు గడువు పెంపు | Paramedicalapplication deadline is extended | Sakshi
Sakshi News home page

‘పారా మెడికల్’ దరఖాస్తు గడువు పెంపు

Published Sat, Oct 18 2014 2:05 AM | Last Updated on Sat, Sep 2 2017 3:00 PM

Paramedicalapplication deadline is extended

విజయవాడ: బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ, బీఎస్సీ (ఎంఎల్‌టీ) కోర్సుల్లో చేరేందుకు గడువును 24 సాయంత్రం 5గంటల  వరకు పొడిగించినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ బాబూలాల్ తెలిపారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఈ-చలానా గడువును 20వరకు పొడిగించినట్లు తెలిపారు.
 
 ఎండీ అడ్మిషన్లకు..: ఎండీ (ఆయుర్వేద, హోమియో, యునానీ) అడ్మిషన్లకు ఈనెల 26న నిర్వహించనున్న ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును 22వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ-చలానా డౌన్‌లోడుకు 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు, చలానా కట్టేందుకు 20వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. సంబంధిత ధ్రువపత్రాలతో 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా యూనివర్సిటీలో అందజేయాలని సూచించారు. వివరాలను యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో చూడవచ్చని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement