‘పారా మెడికల్’ దరఖాస్తు గడువు పెంపు
విజయవాడ: బీఎస్సీ (నర్సింగ్), బీపీటీ, బీఎస్సీ (ఎంఎల్టీ) కోర్సుల్లో చేరేందుకు గడువును 24 సాయంత్రం 5గంటల వరకు పొడిగించినట్లు డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ రిజిస్ట్రార్ బాబూలాల్ తెలిపారు. ఈ దరఖాస్తులకు సంబంధించి ఈ-చలానా గడువును 20వరకు పొడిగించినట్లు తెలిపారు.
ఎండీ అడ్మిషన్లకు..: ఎండీ (ఆయుర్వేద, హోమియో, యునానీ) అడ్మిషన్లకు ఈనెల 26న నిర్వహించనున్న ప్రవేశపరీక్షల దరఖాస్తు గడువును 22వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఈ-చలానా డౌన్లోడుకు 19వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు, చలానా కట్టేందుకు 20వ తేదీ సాయంత్రం 4 గంటల వరకు గడువు పొడిగించినట్లు చెప్పారు. సంబంధిత ధ్రువపత్రాలతో 22వ తేదీ మధ్యాహ్నం ఒంటిగంటలోగా యూనివర్సిటీలో అందజేయాలని సూచించారు. వివరాలను యూనివర్సిటీ వెబ్సైట్లో చూడవచ్చని పేర్కొన్నారు.