- భారీగా హాజరైన వృత్తి విద్య విద్యార్థులు
- 1186 ఖాళీలకు అభ్యర్థుల ఎంపిక
విద్యారణ్యపురి : హన్మకొండలోని ప్రభుత్వ వృత్తి విద్య జూనియర్ కళాశాలలో శుక్రవారం నిర్వహించిన అప్రెంటిస్ షిప్ మేళాకు విశేష స్పందన లభించింది. వివిధ ప్రాంతాలకు చెందిన వేలాది మంది విద్యార్థులు తరలిరావడంతో కళాశాల ఆవరణతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కిక్కిరిసిపోయాయి. ఇంట ర్మీడియట్‌లో ఇంజినీరింగ్, పారామెడికల్ తదితర ఒకేషనల్ కోర్సుల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అప్రెంటిస్ షిప్‌కు ఎంపిక చేయడం కో సం ఈ మేళా ఏర్పాటుచేశారు.
ఈ సందర్భంగా ఎన్‌పీడీసీఎల్ హెచ్‌ఆర్‌డీ(సీజీఎం) రాజారావు మాట్లాడుతూ వృత్తి విద్యాకోర్సు లు పూర్తిచేసి విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ పూర్తి చేయడం ద్వారా వారిలో స్వయం ఉపాధి నైపుణ్యాలు పెంపొందుతాయన్నారు. చెన్నై బోర్డు ఆఫ్ డెరైక్టర్ వీఎస్.పాండే, హైదరాబాద్‌లోని ఎస్‌ఐవీఈ రీడర్ జి.శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడుతూ అప్రెంటిస్ షిప్ వల్ల భవిష్యత్‌లో జీవితానికి అవసరమైన మెళకువులు నేర్చుకోవచ్చని తెలిపారు.
కార్యక్రమంలో ఇంటర్ వి ద్య ఆర్‌ఐఓ మలహల్‌రావు, జిల్లా వృత్తి విద్యాధికారి ఎ.పరాంకుశం, వివిధ కళాశాలల ప్రిన్సిపాళ్లు వి.లక్ష్మారెడ్డి, కోదండపాణితో పాటు టీఎస్ ఎన్‌పీడీసీఎల్, సింగరేణి కాలరీస్ కం పెనీ లిమిటెడ్‌తో పాటు హైదరాబాద్‌కు చెందిన శ్రీ సాఫ్ట్ సొల్యూషన్స్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్, హ్యుందాయ్ మోటా ర్స్, ఎస్కార్ట్ ఎంటర్‌ప్రైజెస్, పలు ప్రైవేటు ఆస్పత్రులు ప్రతినిధులు పాల్గొని తమ కంపెనీల్లో అప్రెంటిస్ షిప్ కోసం అభ్యర్థులను ఎంపిక చేశారు.
ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఇంజినీరింగ్, కామ ర్స్ అండ్ బిజినెస్ మేనేజ్‌మెంట్ విభాగాల్లోని 1043 వేకెన్సీలు, మధ్యాహ్నం 2 నుంచి సా యంత్రం 5గంటల వరకు పారా మెడికల్ అగ్రికల్చర్ విభాగాల్లోని 143 వేకన్సీల్లో అభ్యర్థుల ఎంపిక జరిగింది.