ఇంటర్‌తో ఉద్యోగాలివిగో..!! | Inter Qualification with Government jobs | Sakshi
Sakshi News home page

ఇంటర్‌తో ఉద్యోగాలివిగో..!!

Published Wed, May 4 2016 12:38 AM | Last Updated on Sun, Sep 3 2017 11:20 PM

ఇంటర్‌తో ఉద్యోగాలివిగో..!!

ఇంటర్‌తో ఉద్యోగాలివిగో..!!

ఇంటర్మీడియట్ స్పెషల్
ఇంటర్మీడియెట్ పూర్తయ్యాక ప్రభుత్వ రంగంలో ఉద్యోగావకాశాలున్నాయి. ముఖ్యంగా త్రివిధ దళాలైన.. ఇండియన్ ఆర్మీ, ఇండియన్ నేవీ, ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లతోపాటు యూపీఎస్సీ, ఎస్‌ఎస్‌సీ క్రమం తప్పకుండా ప్రకటనలు విడుదల చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇంటర్ ఉత్తీర్ణులకు ఉన్న ఉద్యోగాలు.. వాటి వివరాలు..
 
నేషనల్ డిఫెన్స్ అకాడెమీ అండ్ నేవల్ అకాడెమీ
ఎన్‌డీఏ అండ్ ఎన్‌ఏ పరీక్షను యూపీఎస్సీ ఏటా రెండుసార్లు నిర్వహిస్తోంది. ఇందులో ఉత్తీర్ణులైనవారు పైలట్, బీటెక్, బీఎస్సీ, బీఏ కోర్సులు ఉచితంగా పూర్తిచేయడమే కాకుండా.. లెఫ్ట్‌నెంట్, సబ్ లెఫ్ట్‌నెంట్, ఫ్లైయింగ్ ఆఫీసర్ హోదాతో త్రివిధ దళాల్లో కొనసాగొచ్చు. ట్రేడ్ శిక్షణలో నెలకు * 21,000 స్టైఫండ్ లభిస్తుంది. 35,000కుపైగా వేతనంతో కెరీర్ ఆరంభమవుతుంది.
 
అర్హత:
ఆర్మీ వింగ్: ఏ గ్రూప్‌లోనైనా ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎయిర్‌ఫోర్స్, నేవల్ వింగ్స్.. నేవల్ అకాడెమీ: మ్యాథ్స్, ఫిజిక్స్‌తో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. అవివాహిత పురుషులు మాత్రమే అర్హులు.
ఎంపిక: రాత, శారీరక పరీక్షలు, ఇంటర్వ్యూ ఆధారంగా.
వెబ్‌సైట్: www.upsc.gov.in
 
కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ ఎగ్జామినేషన్
కేంద్రప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖలు/విభాగాల్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్, లోయర్ డివిజన్ క్లర్క్స్ పోస్టుల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నిర్వహించే పరీక్ష.. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవల్ (10+2) ఎగ్జామినేషన్.
అర్హత : గుర్తింపు పొందిన బోర్డ్ నుంచి 12వ తరగతి ఉత్తీర్ణత.
వయోపరిమితి: నోటిఫికేషన్‌లో నిర్దేశించిన తేదీనాటికి 18 నుంచి 27 ఏళ్లు.
ఎంపిక విధానం: రాతపరీక్ష/స్కిల్ టెస్ట్ ఆధారంగా. వెబ్‌సైట్: http://ssc.nic.in
 
త్రివిధ దళాల్లో..

ఇండియన్ నేవీ
సైలర్ ఆర్టిఫిషర్ అప్రెంటీస్
అర్హత: 55% మార్కులతో ఇంటర్ ఎంపీసీ.
ఎంపిక విధానం: రాత పరీక్ష, దేహదారుఢ్య పరీక్ష
 
సీనియర్ సెకండరీ రిక్రూటర్స్
అర్హత: ఎంపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియట్ ఉత్తీర్ణత
వయోపరిమితి: 17-21 ఏళ్లు
ఎంపిక విధానం: రాతపరీక్ష, దేహదారుఢ్య పరీక్ష
వెబ్‌సైట్: www.nausena-bharti.nic.in
 
ఇండియన్ ఆర్మీ
10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం
వయోపరిమితి: 16 1/2-19 1/2 ఏళ్లు
అర్హత: 70 శాతం మార్కులతో ఇంటర్ ఎంపీసీ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: సర్వీస్ సెలక్షన్ బోర్డ్ (ఎస్‌ఎస్‌బీ) ఇంటర్వ్యూ ద్వారా
 
సోల్జర్ టెక్నికల్
అర్హత:
ఇంటర్మీడియెట్ ఎంపీసీ
వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు
ఎంపిక విధానం: దేహదారుఢ్య పరీక్ష, రాత పరీక్ష
 
క్లర్క్, స్టోర్ కీపర్
అర్హత:
50 శాతం మార్కులతో ఏదైనా గ్రూప్‌తో ఇంటర్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 17 1/2-23 ఏళ్లు.
ఎంపిక: రాత, శారీరక పరీక్షల ద్వారా
 
ఇండియన్ ఎయిర్‌ఫోర్స్
గ్రూప్-ఎక్స్ (టెక్నికల్ ట్రేడ్స్)
వయోపరిమితి: 17-22 ఏళ్లు
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఎంపీసీ ఉత్తీర్ణత.
గ్రూప్-వై (నాన్‌టెక్నికల్)
అర్హత: 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
వయోపరిమితి: 17-25 ఏళ్లు
ఎంపిక: రాత, శారీరక పరీక్ష ద్వారా
 
తెలుగు రాష్ట్రాల్లో...

రెవెన్యూ శాఖ
వీఆర్‌ఓ (విలేజ్ రెవెన్యూ ఆఫీసర్)
అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా.
 
టీఎస్ పోలీస్
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్,కమ్యూనికేషన్)
అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత, శారీరక సామర్థ్య పరీక్ష
వెబ్‌సైట్: www.tslprb.in
 
ఏపీ పోలీస్
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్, ఏఆర్,కమ్యూనికేషన్)
అర్హత: ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత.
ఎంపిక విధానం: రాత, శారీరక సామర్థ్య పరీక్ష
వెబ్‌సైట్:  www.apstatepolice.org

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement