భారతీయ సెంట్రల్ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) 504 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం పోస్టులు: 504; జనరల్-279, ఓబీసీ-99, ఎస్సీ-83, ఎస్టీ-43 పోస్టులు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌కు 30 పోస్టులు కేటాయించారు.అర్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి.(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది) కనీస కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.వయసు: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంది.
ఎంపిక ప్రక్రియ:
రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.
రాత పరీక్ష: ఆన్‌లైన్ విధానంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి.
విభాగం ప్రశ్నలు మార్కులు
రీజనింగ్ 40 40
ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40
న్యూమెరికల్ ఎబిలిటీ 40 40
జనరల్ అవేర్‌నెస్ 40 40
కంప్యూటర్ నాలెడ్జ్ 40 40
మొత్తం 200 200
ప్రతీ విభాగంలోనూ కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది.
వ్యక్తిగత ఇంటర్వ్యూ: ఆన్‌లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలోనే దరఖాస్తు చేయాలి. వివరాలన్నీ పూర్తిచేశాక దరఖాస్తును ఒకసారి పరిశీలించి ఫైనల్‌గా సబ్‌మిట్ చేసి ఫీజు పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 50 దరఖాస్తు రుసుంను ఆన్‌లైన్ విధానంలో క్రెడిట్/డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఈ రిసిప్ట్ జనరేట్ అవగానే దరఖాస్తు పూర్తవుతుంది.
చివరి తేది: జూలై 3, 2015.
23 జూనియర్ ఇంజనీర్ పోస్టులు
జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు-23: సివిల్- 11, ఎలక్ట్రికల్- 12 అర్హత: జూనియర్ ఇంజనీర్ (సివిల్)-కనీసం 65 శాతం మార్కులతో కనీసం రెండేళ్లు పనిఅనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/ కనీసం 55 శాతం మార్కులతో కనీసం ఒకేడాది పని అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్.జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-కనీసం 65 శాతం మార్కులతో రెండేళ్ల పని అనుభవంతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా కనీసం 55 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ విభాగంలో బీటెక్.వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే జూన్ 6, 1985 నుంచి జూన్ 5, 1995 మధ్యలో జన్మించి ఉండాలి.
చివరి తేది: జూన్ 26, 2015
వెబ్‌సైట్:
ఆర్‌బీఐలో ఉద్యోగాలు
Published Thu, Jun 18 2015 12:05 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM
Advertisement