release notification
-
ఇక కిక్కే కిక్
షాపింగ్ మాల్స్ బార్లా మందుబాబులకు మద్యం మరింత చేరువకానుంది. శ్లాబ్ ధరల్లో స్వల్ప మార్పులు చేయడమే కాకుండా.. ఇకపై మద్యం అన్ని ప్రాంతాల్లో.. అన్నిచోట్లా అందుబాటులో ఉండేలా సోమవారం ప్రభుత్వం నూతన మద్యం పాలసీని ప్రకటించింది. ముఖ్యంగా షాపింగ్‌మాల్స్‌లో మద్యం విక్రయాలకు అనుమతినిచ్చింది. ధరల్లో చిన్నపాటి మార్పులు, కొత్త శ్లాబ్‌లు చేర్చి నూతన మద్యం పాలసీని సిద్ధం చేసింది. ఈ క్రమంలో జిల్లాలో మంగళవారం వైన్ షాపుల కేటాయింపునకు గజిట్ విడుదల కానుంది. - శ్లాబ్ ధరల్లో స్వల్ప మార్పులు - లెసైన్స్ ఫీజుల పెంపు - ఆదాయం కోసం ప్రభుత్వ నిర్ణయాలు - నేడు వైన్‌షాపుల గజిట్ నోటిఫికేషన్ విడుదల సాక్షి, విజయవాడ : జిల్లాలో 335 వైన్‌షాపులు ఉన్నాయి. వీటిలో ఇకపై 35 షాపులు ప్రభుత్వమే నిర్వహిస్తుంది. మిగిలిన 300 షాపులకు గజిట్ నోటిఫికేషన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించి.. లాటరీ ప్రక్రియ ద్వారా లెసైన్సులు జారీ చేయనున్నారు. దీనివల్ల ఏడాదికి సగటున రూ.20కోట్ల వరకు ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. ఈ ఏడాది పాలసీలో మార్పులు చేయడం వల్ల ఆదాయం మరింత పెరిగే అవకాశం ఉంది. విజయవాడ డివిజన్లో ఉన్న 162 వైన్‌షాపుల్లో 16, మచిలీపట్నంలోని 173 వైన్‌షాపుల్లో 19 ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఈ క్రమంలో ఎక్సైజ్‌శాఖ అధికారులు సోమవారమంతా హైదరాబాద్‌లోనే ఉండి సుదీర్ఘ కసరత్తు చేశారు. మంగళవారం జిల్లాలో గజిట్‌ను విడుదల చేయనున్నారు. మంగళవారం నుంచి 27వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించి 29న మచిలీపట్నంలోని కలెక్టరేట్లో లాటరీ ప్రక్రియ ద్వారా షాపులు కేటాయించనున్నారు. మారిన శ్లాబ్‌లు ఈసారి ప్రభుత్వం ఏడు రకాల శ్లాబ్‌లు ప్రకటించింది. ఐదు లక్షలపైన జనాభా ఉండే ప్రాంతంలో గతంలో రూ.64 లక్షల లెసైన్స్ ఫీజు ఉండేది. దీనిని రూ.65 లక్షలకు మార్చారు. ఇది విజయవాడ నగరానికే వర్తిస్తుంది. ఐదువేల జనాభాలోపు ఉన్న ప్రాంతంలో రూ.30లక్షలు, 5 నుంచి 10వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.34 లక్షలు, 10 నుంచి 25వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.37లక్షలు, 25వేల నుంచి 50వేల జనాభా ఉన్న ప్రాంతాల్లో రూ.40లక్షలు, 50వేల నుంచి మూడు లక్షల జనాభా ఉన్న ప్రాంతంలో రూ.50 లక్షల శ్లాబ్‌లు నిర్ణయించారు. అయితే, జిల్లాలో రూ.65లక్షల శ్లాబ్, మున్సిపాలిటీల్లో రూ.45 లక్షల శ్లాబ్ ఎక్కువగా వర్తిస్తుంది. గతంలో దరఖాస్తు ధర కామన్‌గా రూ.30వేలు ఉండేది. ఈ ధరను గ్రామీణ ప్రాంతాలకే పరిమితం చేసి.. పట్టణ ప్రాంతాలకు రూ.40వేలు, నగరాలకు రూ.50వేలుగా నిర్ణయించారు. ఇదంతా తిరిగి చెల్లించని రుసుము కావటంతో వీటిద్వారా సుమారు రూ.10 కోట్లపైనే ఆదాయం ప్రభుత్వానికి వస్తుంది. గత ఏడాది జిల్లాలో లెసైన్స్ ఫీజుల ద్వారా ఏడాదికి రూ.116 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ ఏడాది అది మరింత పెరుగుతుందని అధికారుల అంచనా. సగటున రూ.125 కోట్ల నుంచి రూ.130 కోట్ల వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంది. గత ఏడాది 335 వైన్‌షాపులకు గానూ 307 షాపులు మాత్రమే లాటరీ ద్వారా వ్యాపారులు దక్కించుకున్నారు. మిగిలిన షాపులు రెండేళ్లుగా ఖాళీగానే ఉన్నాయి. ఈ ఏడాది ప్రభుత్వమే 35 షాపులు నిర్వహించనున్న క్రమంలో ఖాళీగా మిగిలే షాపుల్లో ఎక్కువ ప్రభుత్వమే నిర్వహించే అవకాశం ఉంది. -
ఎఫ్‌సీఐలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టులు
ఫుడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐ) వివిధ జోన్లలో మేనేజ్మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 349 ఖాళీలతో విడుదలైన ప్రకటనలో సౌత్‌జోన్‌లోనే 113 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష తరహాలో ఉన్నందున బ్యాంకు పరీక్షలకు సిద్ధమౌతున్న వారికి ఇది సదవకాశం. మొత్తం పోస్టులు: మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, అకౌంట్స్, మూవ్మెంట్, ఎలక్ట్రికల్, టెక్నికల్)-349 అర్హత: మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, మూవ్మెంట్): 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు) లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్మేనేజ్మెంట్ ట్రైనీ (అకౌంట్స్): సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు ఎంబీఏ(ఫైనాన్స్)/డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.మేనేజ్మెంట్ ట్రైనీ(టెక్నికల్/ఎలక్ట్రికల్ / మెకానికల్ /సివిల్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో డిగ్రీ వయసు: 2015 ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంది. ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, బృంద చర్చ, ఇంటర్వ్యూలు ఉంటాయి.రాతపరీక్ష: మేనేజ్మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, మూవ్మెంట్) పోస్టులకు జనరల్ ఆప్టిట్యూడ్ పక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే 120 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఈ పరీక్షలో రీజనింగ్, డేటా అనాలసిస్, కంప్యూటర్ అవేర్నెస్, జనరల్ అవేర్నెస్, మేనేజ్మెంట్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.అకౌంట్స్, టెక్నికల్/ఎలక్ట్రికల్/మెకానికల్/సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకు జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్షతోపాటు మరో పరీక్ష ఉంటుంది. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ విదానంలో 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి.దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి ఒక జోన్లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు: దరఖాస్తు ఫీజు రూ. 600. ఎస్సీ, ఎస్టీలు, పీడబ్ల్యూడీ, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. ఎస్బీఐ ఇంటర్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అన్ని నేషనల్ బ్యాంకుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు. ముఖ్యతేదీలు: దరఖాస్తులు ప్రారంభం: జూన్ 2, 2015. దరఖాస్తులకు చివరితేదీ: జూలై2, 2015. వెబ్సైట్: -
ఆర్బీఐలో ఉద్యోగాలు
భారతీయ సెంట్రల్ బ్యాంక్.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) 504 అసిస్టెంట్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది.మొత్తం పోస్టులు: 504; జనరల్-279, ఓబీసీ-99, ఎస్సీ-83, ఎస్టీ-43 పోస్టులు ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌కు 30 పోస్టులు కేటాయించారు.అర్హత: జనరల్, ఓబీసీ అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించాలి.(ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పాస్ మార్కులు ఉంటే సరిపోతుంది) కనీస కంప్యూటర్ పరిజ్ఞానం తప్పనిసరి.వయసు: 18 నుంచి 28 సంవత్సరాల మధ్య ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు పదేళ్ల వయోసడలింపు ఉంది. ఎంపిక ప్రక్రియ: రెండు దశల్లో ఎంపిక ప్రక్రియ ఉంటుంది. రాత పరీక్ష: ఆన్లైన్ విధానంలో 200 మార్కులకు పరీక్ష ఉంటుంది. ప్రశ్నపత్రం హిందీ, ఇంగ్లిష్ మాధ్యమాల్లో ఉంటుంది. రెండు గంటల వ్యవధిలో సమాధానాలు గుర్తించాలి. విభాగం ప్రశ్నలు మార్కులు రీజనింగ్ 40 40 ఇంగ్లిష్ లాంగ్వేజ్ 40 40 న్యూమెరికల్ ఎబిలిటీ 40 40 జనరల్ అవేర్నెస్ 40 40 కంప్యూటర్ నాలెడ్జ్ 40 40 మొత్తం 200 200 ప్రతీ విభాగంలోనూ కనీస మార్కులతో ఉత్తీర్ణత సాధించాలి. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కుల కోత ఉంటుంది. వ్యక్తిగత ఇంటర్వ్యూ: ఆన్లైన్ పరీక్షలో ఉత్తీర్ణులైన వారినే ఇంటర్వ్యూకు ఆహ్వానిస్తారు. ఎంపిక ప్రక్రియలో ఆన్లైన్ పరీక్ష, ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది. దరఖాస్తు విధానం: ఆన్లైన్ విధానంలోనే దరఖాస్తు చేయాలి. వివరాలన్నీ పూర్తిచేశాక దరఖాస్తును ఒకసారి పరిశీలించి ఫైనల్‌గా సబ్మిట్ చేసి ఫీజు పేమెంట్ ఆప్షన్ ఎంచుకోవాలి. దరఖాస్తు రుసుం: జనరల్, ఓబీసీ అభ్యర్థులు రూ.450, ఎస్సీ, ఎస్టీ పీడబ్ల్యూడీ అభ్యర్థులు రూ. 50 దరఖాస్తు రుసుంను ఆన్లైన్ విధానంలో క్రెడిట్/డెబిట్ కార్డు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించవచ్చు. ఈ రిసిప్ట్ జనరేట్ అవగానే దరఖాస్తు పూర్తవుతుంది. చివరి తేది: జూలై 3, 2015. 23 జూనియర్ ఇంజనీర్ పోస్టులు జూనియర్ ఇంజనీర్ పోస్టులకు ఔత్సాహిక అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. మొత్తం పోస్టులు-23: సివిల్- 11, ఎలక్ట్రికల్- 12 అర్హత: జూనియర్ ఇంజనీర్ (సివిల్)-కనీసం 65 శాతం మార్కులతో కనీసం రెండేళ్లు పనిఅనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా/ కనీసం 55 శాతం మార్కులతో కనీసం ఒకేడాది పని అనుభవంతో సివిల్ ఇంజనీరింగ్‌లో బీటెక్.జూనియర్ ఇంజనీర్ (ఎలక్ట్రికల్)-కనీసం 65 శాతం మార్కులతో రెండేళ్ల పని అనుభవంతో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్/ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్‌లో మూడేళ్ల డిప్లొమా లేదా కనీసం 55 శాతం మార్కులతో ఎలక్ట్రికల్ విభాగంలో బీటెక్.వయసు 20 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉండాలి. అంటే జూన్ 6, 1985 నుంచి జూన్ 5, 1995 మధ్యలో జన్మించి ఉండాలి. చివరి తేది: జూన్ 26, 2015 వెబ్సైట్: -
'పెద్దల’పోటాపోటీ
‘పెద్దల’ సభపై జిల్లా నేతల కన్ను పడింది. ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు పోటాపోటీ లాబీయింగ్‌కు తెరలేపారు. అధిష్టానం హామీ తమకే ఉందంటూ ఎవరికివారు పావులు కదుపుతుండడం జిల్లా రాజకీయాల్లో చర్చకు దారితీసింది. ముఖ్యమంత్రి కే సీఆర్ ఆశీస్సులతో ఎమ్మెల్యేల కోటాలో ఎమ్మెల్సీ పదవి దక్కించుకునేందుకు టీఆర్ఎస్ సీనియర్ నాయకులుహరీశ్వర్రెడ్డి, యాదవరెడ్డి ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మూడు రోజలుగా సీఎం క్యాంపు కార్యాలయం చుట్టూ చక్కర్లు కొడుతున్న ఇరువురు నేతలు శాసనమండలి చాన్స్‌పై గట్టి నమ్మకమే పెట్టుకున్నారు. - ఎమ్మెల్యేల కోటాపై హరీశ్వర్, యాదవరెడ్డి కన్ను - జోరుగా లాబీయింగ్.. - సీఎం హామీకి ప్రయత్నాలు - కుదరకపోతే స్థానికసంస్థల కోటాలో చాన్స్‌కు పట్టు సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: స్థానిక సంస్థల కోటాలో జిల్లాకు రెండు ఎమ్మెల్సీలు రానున్నాయి. ఇటీవల పట్నం నరేందర్‌రెడ్డి పదవీ విరమణతో ఒక సీటు ఖాళీ కాగా, రాష్ట్ర విభజన నేపథ్యంలో అదనంగా జిల్లాకు మరోస్థానం లభించింది. ఈ రెండింటికీ త్వరలోనే నోటిఫికేషన్ వెలువడే అవకాశముంది. ఈ స్థానాల నుంచి పోటీ చేసేందుకు హరీశ్వర్‌రెడ్డి, యాదవరెడ్డి సుముఖత చూపుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలంటే ఆర్థిక ఇబ్బందులు, శ్రమతో కూడుకున్నది కావడంతో ఎమ్మెల్యేల కోటావైపు మొగ్గు చూపుతున్నారు. ఇటీవల ఎమ్మెల్సీగా పదవీకాలం పూర్తయి న యాదవరెడ్డి తనకు మరోసారి అవకాశం కల్పించే అంశాన్ని పరిశీలించాలని గులాబీ అధిష్టానాన్ని కోరుతుం డగా, కష్టకాలంలో టీఆర్ఎస్కు అండగా నిలిచిన తనకు చాన్స్ ఇవ్వాలని మాజీ ఎమ్మెల్యే హరీశ్వర్‌రెడ్డి అభ్యర్థిస్తున్నారు. ఎమ్మెల్యేల కోటాలో పరిమిత సంఖ్యలో సీట్లు ఉం డడం.. వీటికి పోటీ తీవ్రంగా ఉన్న నేపథ్యంలో జిల్లా నేతల కు అవకాశం లభిస్తుందో లేదో అనేది ఉత్కంఠగా మారింది. ఉభయతారకంగా.. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాక యాదవరెడ్డి ఆ పార్టీలో చేరారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున జెడ్పీ చైర్మన్ అభ్యర్థిగా బరిలో దిగిన యాదవరెడ్డి నవాబుపేట నుంచి జెడ్పీటీసీగా గెలుపొందారు. అయితే, జిల్లా పరిషత్ పీఠం దక్కించుకునేందుకు తగినంత సంఖ్యలో సీట్లు దక్కకపోవ డం.. క్యాంపు నిర్వహణ కష్టంగా భావి ంచిన ఆయన అనూహ్యంగా గులాబీ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో జిల్లాలో రాజకీయ సమీకరణలు తారుమారు కావడంతో జెడ్పీ కుర్చీ కాస్తా అధికారపార్టీ వశమైంది. ఇప్పటికీ నవాబ్‌పేట జెడ్పీటీసీగా కొనసాగుతున్న యాదవరెడ్డి మళ్లీ ఎమ్మెల్సీ పదవి ఇస్తారనే గట్టిహామీ తీసుకున్న తర్వాతే గులాబీ కం డువా కప్పుకున్నారనే ప్రచారం జరి గింది. ఎమ్మెల్యేల కోటాలోనే ఆయనకు ఛాన్స్ ఇస్తారని ఆయన సన్నిహితవర్గాలు అభిప్రాయపడ్డాయి. ఈ నేపథ్యం లోనే ఎమ్మెల్సీ పదవిపై ఆశలు పెట్టుకున్నారు. అనూహ్యంగా హరీశ్వర్‌రెడ్డి తెరమీదకు రావడంతో పోటీ నెల కొంది. లోకల్‌బాడీ కోటాలో రెండు ఎమ్మెల్సీ పదవులకు త్వరలోనే ఎన్నికలు జరుగనున్నందున.. ఎమ్మెల్యేల కోటాలో ఒకరికి ఛాన్స్ ఇస్తానని సీఎం హామీ ఇచ్చినట్లు పార్టీవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అయితే, ఈ కోటాలో తమ పేరునే ఖరారు చేయాలని ఇరువురు పట్టుబడుతున్నట్లు సమాచారం. స్థానికసంస్థల కోటాలో ఖర్చు భరించ డం తనవల్ల కాదని, గతంలో జెడ్పీ చైర్మన్ పీఠాన్నీ ఇదే కారణంతో వదులుకున్నందున తన పేరును ఎమ్మెల్యేల కో టాలో పరిగణనలోకి తీసుకోవాలని యాదవరెడ్డి అధిష్టానానికి విన్నవించినట్లు తెలిసింది. కాగా, హరీశ్వర్‌రెడ్డి సై తం ఎమ్మెల్యేల కోటాపైనే మొగ్గు చూ పుతున్నారు. పట్టువిడుపులు తప్పవంటే స్థానిక సంస్థల కోటాలోనైనా పోటీకి రెడీ కావాలని ఆయన భావిస్తున్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. -
క్లరికల్ కొలువులు.. సుస్థిర కెరీర్‌కు వేదికలు
ఎస్బీఐ దేశ వ్యాప్తంగా 5,092 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో హైదరాబాద్ సర్కిల్‌కు సంబంధించి 208 పోస్టులున్నాయి. జనరల్ కేటగిరీకి 104, ఎస్సీలకు 33, ఎస్టీలకు 15, ఓబీసీలకు 56 పోస్టులు కేటాయించారు. గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనలియర్ లేదా ఫైనల్ సెమిస్టర్లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు 2014, ఆగస్టు 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తయినట్లు ఇంటర్వ్యూ సమయంలో ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది. వయసు: 2014, మే 1 నాటికి కనిష్ట వయో పరిమితి 20 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 28 ఏళ్లు. మే 2, 1986; మే 1, 1994 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ జనరల్‌కు పదేళ్లు- ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు- ఓబీసీలకు 13 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.ఎంపిక విధానం: క్లరికల్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ముందుగా ఆన్లైన్లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ, అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి తర్వాతి దశ అయిన ఇంటర్వ్యూకు ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని ఎంపిక చేస్తారు. ఆన్లైన్ పరీక్ష విధానం: సబ్జెక్టు మార్కులు జనరల్ అవేర్నెస్ 40 జనరల్ ఇంగ్లిష్ 40 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ 40 రీజనింగ్ ఎబిలిటీ 40 మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/కంప్యూటర్ నాలెడ్జ్ 40 సమయం: 2 గం. 15 ని.లు నెగిటివ్ మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కుల్లో 1/4 మార్కు తగ్గిస్తారు. ఆన్లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష దశను దాటాలంటే అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులోనూ విడివిడిగా నిర్దేశ అర్హత మార్కులు సాధించాలి. ముఖ్య తేదీలు: ఆన్లైన్ రిజిస్ట్రేషన్: మే 26, 2014- జూన్ 14, 2014. ఫీజు చెల్లింపు (ఆన్లైన్): మే 26, 2014- జూన్ 14, 2014. ఫీజు చెల్లింపు (ఆఫ్‌లైన్): మే 28, 2014- జూన్ 17, 2014. ఆన్లైన్ పరీక్ష: జూలై/ఆగస్టు, 2014. ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్ఎస్ అభ్యర్థులకు రూ. 100. జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు రూ. 450. వెబ్సైట్: www.statebankofindia.com; www.sbi.co.in ప్రిపరేషన్ ప్రణాళిక జనరల్ అవేర్నెస్: జనరల్ అవేర్‌నెస్‌లో అధిక మార్కులు సాధించాలంటే సమకాలీన అంశాలు, ఆర్థిక-సామాజిక-రాజకీయ పరిణామాలపై దృష్టిసారించాలి. రోజూ దినపత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. బ్యాంకింగ్ రంగ నేపథ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కోసం ఒక ఫైనాన్షియల్ డైయిలీని చదవాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం-వాటి అర్థాలపై అవగాహన ఉండాలి. బ్యాంకుల తాజా పాలసీలు, ఆర్బీఐ తాజా పరపతి విధానాలు, దేశంలో బ్యాంకింగ్ రంగ పురోగమన, తిరోగమన గణాంకాలు-కారణాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ముఖ్యమైన సంఘటనలు, ప్రదేశాలు, క్రీడలు-విజేతలు, అవార్డులు-విజేతలు; శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు; పుస్తకాలు- రచయితలు; ముఖ్యమైన రోజులు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి. Ex: International Literacy Day is observed on which of the following days every year? a) September 8 b) September 7 c) September 3 d) October 8 Ans: a Ex: UN on 12th May, 2014 appointed a woman to head UN peacekeeping Force in Cyprus (UNFICYP). With this appointment, the woman became the first ever female to head a UN peace-keeping force in its entire history. Name her? a) Kristin Lund b) Rashida Manjoo of South Africa c) Phumzile Mlambo Ngcuka of South Africa d) Helen Clark of New Zealand Ans: a జనరల్ ఇంగ్లిష్: బ్యాంక్ పరీక్షలో చాలా మంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న వారు క్లిష్టంగా భావించే విభాగం జనరల్ ఇంగ్లిష్. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు యాంటానిమ్స్, సినానిమ్స్, వొకాబ్యులరీ, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. వొకాబ్యులరీపై అవగాహనతో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. వొకాబ్యులరీపై పట్టుసాధించేందుకు ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతూ వాటిలో వివిధ సందర్భాల్లో ఉపయోగించిన పదాలను అధ్యయనం చేయాలి. స్పాటింగ్ ది ఎర్రర్స్ కోసం బేసిక్ గ్రామర్, సబ్జెక్ట్ - వెర్బ్ సంబంధం, టెన్సెస్‌పై అవగాహన ఉండాలి. మొత్తంమీద పదో తరగతి స్థాయిలోని గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకుంటే ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించడం సులువే. Ex: choose the word which is most opposite in meaning to given word "rude'? Ans: courteous. క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్: గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో అధిక స్కోర్ సాధించాలంటే వర్గాలు, ఘనాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, క.సా.గు, గ.సా.భా. వంటి బేసిక్స్‌ను ఔపోసన పట్టాల్సిందే. టేబుల్స్, పై చార్ట్స్, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, డేటా సఫీషియన్సీ, నంబర్ సిరీస్, పర్సంటేజ్‌లు, వడ్డీ అంశాలు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్నర్షిప్, యావరేజెస్ ముఖ్యమైనవి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించేందుకు ప్రాక్టీస్‌కు మించిన మార్గం లేదు. కాబట్టి ఈ విభాగం విషయంలో ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. n Ex: The ratio of the ages A and B seven years ago was 3:4 respectively. The ratio of their ages nine years from now will be 7:8 respectively. What is B's age at present? a) 25 years b) 26 years c) 28 years d) 23 years e) 27 years Ans: d రీజనింగ్ ఎబిలిటీ: అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; బ్లడ్ రిలేషన్స్; సీటింగ్ అరేంజ్మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్, స్టేట్మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్; నాన్ వెర్బల్ రీజనింగ్ తదితర అంశాలుంటాయి. ఈ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. దీంతో సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు. Ex: Study the following arrangement carefully and answer the question given below.. B U B D C E D B D E U B A D C B E A C D A E B A U A C D B C A C Q: Which of the following is the eighth to the left of the twentieth from the left end of the above 1) ఇ 2) ఉ 3) U 4) ఆ 5) అ మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/ కంప్యూటర్ నాలెడ్జ్: కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ పరీక్షలో మాత్రమే కనిపించే విభాగం మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ అవేర్నెస్. అయితే వాస్తవానికి ఈ విభాగంలోని ప్రశ్నలు సులభంగా ఉంటున్నాయనేది నిపుణుల అభిప్రాయం. మార్కెటింగ్‌కు సంబంధించి మార్కెటింగ్ రకాలు, బ్రాండింగ్, మార్కెటింగ్ పదజాలంపై అవగాహన పెంపొందించుకోవాలి. TAT(Turn around time), గిైక (Word of mouth), ైగి (Share of wallet) వంటి సంక్షిప్తాల (abbreviations)ను తెలుసుకోవాలి. కంప్యూటర్ అవేర్‌నెస్‌కు సంబంధించి బేసిక్ కంప్యూటర్ టెర్మినాలజీ, హార్డవేర్ అండ్ సాఫ్ట్వేర్ బేసిక్స్, కంప్యూటర్ యూసేజ్, బేసిక్ పార్ట్స ఆఫ్ కంప్యూటర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్, వర్డ, ఎక్స్‌సెల్, పవర్‌పాయింట్ తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి. Ex: Modern styles of marketing are ... a) Telemarketing b) Web marketing c) Advertisement on the net d) Emails e) All of these Ans: e a) print Text b) computer gaming c) Enter text d) Draw pictures e) control sound on the screen వేగం.. విజయ మంత్రం: బ్యాంకు పరీక్షల్లో విజయ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించే అంశం వేగం. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. వాటి సాధనలో అన్వయ సామర్థ్యం అవసరం ఎంతగానో ఉంటుంది. మరోవైపు అందుబాటులోని సమయం కూడా పరిమితమే. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో గణిత సంబంధ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలంటే అంచెలవారీగా (స్టెప్‌వైజ్) నిర్దిష్ట సమస్యను పరిష్కరిస్తూ సాగాలి. అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ విభాగంలోని ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే వేగంగా చదవడం; కీలక పదాలను గుర్తించడం; ప్యాసేజ్ కింద అడిగిన ప్రశ్నను చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన సమాధానం ప్యాసేజ్లో ఎక్కడ ఉందో జ్ఞప్తికి తెచ్చుకోవడం వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి. వీటన్నిటికీ ప్రధాన పరిష్కారం నిరంతర ప్రాక్టీస్. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలించాలి. అంతేకాకుండా ప్రతి చాప్టర్ పూర్తయ్యాక స్వీయ సమయ పరిమితి విధించుకుని సెల్ఫ్ టెస్ట్ రాయాలి. తొలి దశలో తెలిసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అవి ఎంత సమయంలో పూర్తయ్యాయో గుర్తించాలి. అక్కడితో ఆగకుండా తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇలా.. రెండు దశల్లో సెల్ఫ్ టెస్ట్ పూర్తి చేసుకుని నిరాటంకంగా ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు? ఎన్ని ప్రశ్నల్లో దోషాలు తలెత్తాయి? అని విశ్లేషించుకోవాలి. సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు పరీక్ష కోణంలో ముఖ్యమైనవా? కాదా? అని పరిశీలించాలి. ఇందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి. ఆ చాప్టర్లోని అంశాలకు లభిస్తున్న వెయిటేజీని గుర్తించి దానికనుగుణంగా సాగాలి. వెయిటేజీ ఎక్కువగా ఉండి, కష్టంగా ఉన్న టాపిక్స్‌కు శిక్షణ తీసుకోవడానికి వెనుకాడొద్దు. సమయపాలన కీలకం: సాధారణంగా ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు ముందుగా తమకు పట్టున్న అంశాలను పూర్తిచేసి తర్వాత మిగతా వాటిపై దృష్టి మళ్లించే ఆలోచనతో ఉంటారు. కానీ ఇది సరికాదు. దీనివల్ల ప్రిపరేషన్ చివరి దశకు వచ్చేటప్పటికి కొన్ని అంశాలు పూర్తికాని పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. ఇది పరీక్షలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి.. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ను చదివేలా టైం మేనేజ్మెంట్ పాటించాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రతి రోజు కనీసం 8 నుంచి పది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించి.. సమయం పరంగా ప్రతి సబ్జెక్ట్‌కు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి రోజు చదివిన అంశాల పునశ్చరణకు కొంత సమయం కేటాయించుకోవాలి. అదే విధంగా ప్రతివారం ఆ వారంలో చదివిన వాటిని పునశ్చరణ చేసుకోవాలి. అంతేకాని మూస ధోరణిలో చదువుకుంటూ వెళితే అవగాహన స్థాయి ఏ మేరకు ఉందో తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇప్పటికే పలు బ్యాంక్ పరీక్షలు రాసిన అభ్యర్థులు వాటిలో తమకు వచ్చిన మార్కులు, ఎందులో వెనుకంజలో ఉన్నామో గమనించి, ఆ అంశాలపై మరింత దృష్టి సారించాలి. పరీక్షకు రెండు వారాల ముందు నుంచి రివిజన్‌కే కేటాయించాలి. మాక్ టెస్ట్‌లు: అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ప్రధానాంశం మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం. కనీసం అయిదు మాక్ టెస్ట్‌లకైనా హాజరు కావాలి. కోచింగ్ సెంటర్లు, కాంపిటీటివ్ వెబ్ పోర్టల్స్ తదితర మార్గాల ద్వారా మాక్‌టెస్ట్‌లకు హాజరయ్యే అవకాశం అందుబాటులో ఉంది. దీన్ని వినియోగించుకోవాలి. నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలు పూర్తిచేశాం? ఎన్ని సరైన సమాధానాలిచ్చాం? అని విశ్లేషించుకోవాలి. రిఫరెన్స్ బుక్స్: ఆర్.ఎస్.అగర్వాల్-వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్. అర్హింత్ పబ్లికేషన్స్- మార్కెటింగ్, కరెంట్ అఫైర్స్. మనోరమ ఇయర్ బుక్- జనరల్ అవేర్నెస్. అరుణ్ శర్మ- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్. ఏబీసీ ఆఫ్ ఇంగ్లిష్, దాచేపల్లి పబ్లికేషన్స్- ఇంగ్లిష్. ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. అదే విజయ మంత్రం ఎస్బీఐ క్లరికల్ కేడర్ పరీక్షలో విజయం సాధించాలంటే ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ప్రాక్టీస్ కోసం ప్రతియోగితా కిరణ్, ప్రతియోగితా దర్పణ్ మ్యాగజైన్స్ ఉపయోగపడతాయి. వాటిలో ఇచ్చిన ప్రశ్నల సాధన ద్వారా ప్రిపరేషన్లో బలాలు, బలహీనతలు తెలుస్తాయి. వాటికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకునేందుకు వీలుంటుంది. జనరల్ అవేర్‌నెస్‌లో 20 శాతం వరకు కరెంట్ అఫైర్స్, ఏడు శాతం వరకు బ్యాంకింగ్ సంబంధిత అంశాలపై ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిడ్యూడ్ విభాగాలకు ఎన్ఎస్బీ మెటీరియల్ ఉపయోగపడుతుంది. కంప్యూటర్/మార్కెటింగ్ విభాగంలో అడిగే ప్రశ్నలు ప్రామాణికంగా ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో వచ్చే కొత్త టెక్నాలజీ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన అంశాలను గుర్తుంచుకోవాలి. మార్కెటింగ్ కోసం నేను కోచింగ్ సెంటర్ మెటీరియల్, ఎడ్యుకేషన్ మ్యాగజైన్లలో ఇచ్చే మోడల్ పేపర్లపై మాత్రమే ఆధారపడ్డాను. మరో ముఖ్యవిషయం ఏమిటంటే ఆన్లైన్ పరీక్ష కాబట్టి టైమ్ మేనేజ్మెంట్ చాలా ముఖ్యం. కరెంట్ అఫైర్స్‌పై అప్డేట్గా ఉండాలి. - ఎల్.రాంమనోహర్, ఎస్బీఐ క్లరికల్ విజేత. టిప్స్ ప్రిపరేషన్‌కు రోజుకు కనీసం నాలుగు గంటలు కేటాయించుకోవాలి. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి. రోజువారీ టైం టేబుల్ వేసుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. రోజుకు ఐదారు ఇంగ్లిష్ పదాలను నేర్చుకోవాలి. వాటి సహాయంతో వాక్యాలను తయారు చేయడం ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల వొకాబ్యులరీపై పట్టు ఏర్పడుతుంది. ఇలాచేస్తే కాంప్రెహెన్షన్ (10 మార్కులు), కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ (10 మార్కులు) ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయొచ్చు.దినపత్రికలు చదవడం, న్యూస్బులెటన్లను చూడ టం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించవచ్చు.గత పరీక్షల్లో విజేతల సూచనలను, అనుభవాలను తెలుసుకోవాలి. భావ సారూప్యం ఉన్న వారితో కలిసి గ్రూప్‌గా చదవడం కూడా ఉపయోగపడుతుంది. -
రేపే మలివిడత పంచాయతీ ఎన్నికలు
చిత్తూరు (అర్బన్), న్యూస్‌లైన్: జిల్లాలో మలివిడత పంచాయతీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. 3 సర్పంచ్, రెండు వార్డు స్థానాలకు ఈ నెల 18న ఎన్నికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని 8 సర్పంచ్, 135 వార్డు సభ్యుల స్థానాలకు గత నెల అధికారులు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. రిజర్వేషన్ల కారణంగా ఐదు పంచాయతీలకు, 47 వార్డులకు నామినేషన్లు దాఖలు కాలేదు. 86 వార్డుల్లో సభ్యుల ఎన్నిక ఏకగ్రీవమయ్యాయి. 18న జరగనున్న ఎన్నికలకు అధికారులు, సిబ్బందిని నియమిస్తూ కలెక్టర్ రాంగోపాల్ గురువారం ఆదేశాలు జారీ చేశారు. 103 మందికి విధులు.. పంచాయతీ ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడానికి అధికారులు చర్యలు చేపట్టారు. మొత్తం 11 పోలింగ్ స్టేషన్లలో జరిగే ఎన్నికలకు స్టేజ్-1 అధికారులుగా 33 మందిని, స్టేజ్-2 అధికారులుగా 5 మందిని, పోలింగ్ అధికారులుగా 11 మందిని, 22 మందిని అదనపు పోలింగ్ అధికారులుగా, 32 మందిని ఇతర విధులకు కేటాయిస్తూ జిల్లా ఎన్నికల అధికారి ఆదేశాలు జారీ చేశారు. శనివారం ఉదయం ఏడు నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఎన్నికలు నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం రెండు గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రారంభించి, సాయంత్రం ఫలితాలు ప్రకటిస్తారు. ఆపై ఉప సర్పంచ్‌లను ఎన్నుకుంటారు. ఎన్నికలు జరిగే ప్రాంతాలు ఇవే ఐరాల మండలంలోని నాంపల్లె సర్పంచ్ స్థానానికి ఐదు మంది, తొట్టంబేడు మం డలం కాసరం పంచాయతీకి ఇద్దరు, కేవీబీపురం మండలంలోని పాతపాళెం పంచాయతీకి ఇద్దరు చొప్పున అభ్యర్థులు బరిలో నిలిచారు. పులిచెర్ల మండలం జీ.రామిరెడ్డిగారిపల్లెలో 2వ వార్డుకు, రామకుప్పం మండలం విజలాపురం పంచాయతీలోని 2వ వార్డుకు ఇద్దరేసి చొప్పున మొత్తం నలుగురు అభ్యర్థులు బరిలో ఉన్నారు. -
పంచాయతీ ‘ఉప’ ఎన్నికలకు రెడీ
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: వివిధ కారణాలతో గత ఏడాది జూన్‌లో ఎన్నికలు నిలిచిపోయిన రెండు గ్రామ పంచాయతీలకు ఈ నెల 18న ఎన్నికలకు జరగనున్నాయి. ఈ మేరకు జిల్లా పంచాయతీ కార్యాలయం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసేందుకు కసరత్తు పూర్తి చేసింది. మరణాలు, రాజీనామాలతో ఖాళీగా ఉన్న 21 పంచాయతీ వార్డులకు కూడా ఎన్నికలు నిర్వహించేందుకు యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఈ ఎన్నికలకు ఈ నెల మూడో తేదీ నుంచి ఆరు వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. పంచాయతీ పోరు ఇప్పుడెందుకంటే... గత ఏడాది జూన్‌లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో సంగారెడ్డి మండలం చింతల్‌పల్లి పంచాయతీ సర్పంచ్ పదవిని ఎస్టీలకు రిజర్వు చేశారు. అయితే అర్హులైన ఎస్టీ ఓటర్లు ఎవరూ పంచాయతీ పరిధిలో సర్పంచ్ పదవికి నామినేషన్లు దాఖలు కాలేదు. కౌడిపల్లి మండ లం రాయిలాపూర్‌లో సర్పంచ్ పదవికి ఇద్దరు నామినేషన్లు వేసినా పరిశీలనలో అవి తిరస్కరణకు గురయ్యాయి. ఇక రాయిలాపూర్‌లో 5వ వార్డులు, చింతపల్లిలో ఒక వార్డుకు నామినేషన్లు దాఖలు కాలేదు. ఇటీవలి కాలంలో జిల్లాలోని ముగ్గురు వార్డు సభ్యులు మరణించగా, మరో ఇద్దరు తమ పదవులకు రాజీనామా చేశారు. దీంతో జిల్లాలో మొత్తం 21 వార్డులకు ఎన్నికలు నిర్వహించనున్నారు. కలెక్టర్ స్మితా సబర్వాల్ పరిశీలనలో వున్న ఫైలు ఆమోదం పొందిన వెంటనే మూడో తేదీన నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తెలుస్తోంది.