ఎఫ్‌సీఐలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు | Management Trainee posts in FCI | Sakshi
Sakshi News home page

ఎఫ్‌సీఐలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు

Published Thu, Jun 18 2015 12:08 AM | Last Updated on Sun, Sep 3 2017 3:53 AM

Management Trainee posts in  FCI

ఫుడ్ కార్పొరేషన్ ఇండియా లిమిటెడ్ (ఎఫ్‌సీఐ) వివిధ జోన్లలో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 349 ఖాళీలతో విడుదలైన ప్రకటనలో సౌత్‌జోన్‌లోనే 113 ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీకి నిర్వహించే రాత పరీక్ష బ్యాంకు స్పెషలిస్ట్ ఆఫీసర్ పరీక్ష తరహాలో ఉన్నందున బ్యాంకు పరీక్షలకు సిద్ధమౌతున్న వారికి ఇది సదవకాశం.
 
 మొత్తం పోస్టులు: మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, అకౌంట్స్, మూవ్‌మెంట్, ఎలక్ట్రికల్, టెక్నికల్)-349
 అర్హత: మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, మూవ్‌మెంట్): 60 శాతం మార్కులతో ఏదైనా డిగ్రీ (ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 55 శాతం మార్కులు) లేదా సీఏ, ఐసీడబ్ల్యూఏ, సీఎస్మేనేజ్‌మెంట్ ట్రైనీ (అకౌంట్స్): సంబంధిత సబ్జెక్టులో డిగ్రీతోపాటు ఎంబీఏ(ఫైనాన్స్)/డిప్లొమా పూర్తిచేసి ఉండాలి.మేనేజ్‌మెంట్ ట్రైనీ(టెక్నికల్/ఎలక్ట్రికల్ / మెకానికల్ /సివిల్ ఇంజనీరింగ్): సంబంధిత విభాగంలో డిగ్రీ వయసు: 2015 ఆగస్టు 1 నాటికి 28 ఏళ్లు మించరాదు. ఓబీసీ అభ్యర్థులకు మూడేళ్లు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులకు ఐదేళ్ల వయోసడలింపు ఉంది.
 
 ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, బృంద చర్చ, ఇంటర్వ్యూలు ఉంటాయి.రాతపరీక్ష: మేనేజ్‌మెంట్ ట్రైనీ (జనరల్, డిపో, మూవ్‌మెంట్) పోస్టులకు జనరల్ ఆప్టిట్యూడ్ పక్ష ఉంటుంది. ఆబ్జెక్టివ్ విధానంలో ఉండే 120 ప్రశ్నలకు 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఈ పరీక్షలో రీజనింగ్, డేటా అనాలసిస్, కంప్యూటర్ అవేర్‌నెస్, జనరల్ అవేర్‌నెస్, మేనేజ్‌మెంట్, కరెంట్ అఫైర్స్ నుంచి ప్రశ్నలు వస్తాయి.అకౌంట్స్, టెక్నికల్/ఎలక్ట్రికల్/మెకానికల్/సివిల్ ఇంజనీరింగ్ పోస్టులకు జనరల్ ఆప్టిట్యూడ్ పరీక్షతోపాటు మరో పరీక్ష ఉంటుంది. అభ్యర్థి దరఖాస్తు చేసుకున్న సబ్జెక్టు నుంచి ఆబ్జెక్టివ్ విదానంలో 120 ప్రశ్నలకు పరీక్ష ఉంటుంది. 90 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి.దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థి ఒక జోన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఫీజు: దరఖాస్తు ఫీజు రూ. 600. ఎస్సీ, ఎస్టీలు, పీడబ్ల్యూడీ, మహిళలకు ఫీజు మినహాయింపు ఉంది. ఎస్‌బీఐ ఇంటర్ నెట్ బ్యాంకింగ్, క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అన్ని నేషనల్ బ్యాంకుల ద్వారా ఫీజు చెల్లించవచ్చు.
 
 ముఖ్యతేదీలు:
 దరఖాస్తులు ప్రారంభం: జూన్ 2, 2015.
 దరఖాస్తులకు చివరితేదీ: జూలై2, 2015.
 వెబ్‌సైట్:
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement