క్లరికల్ కొలువులు.. సుస్థిర కెరీర్‌కు వేదికలు | JOBS .stable career clerical Platforms | Sakshi
Sakshi News home page

క్లరికల్ కొలువులు.. సుస్థిర కెరీర్‌కు వేదికలు

Published Wed, Jun 4 2014 10:59 PM | Last Updated on Thu, Sep 6 2018 10:05 PM

క్లరికల్ కొలువులు.. సుస్థిర కెరీర్‌కు వేదికలు - Sakshi

క్లరికల్ కొలువులు.. సుస్థిర కెరీర్‌కు వేదికలు

ఎస్‌బీఐ దేశ వ్యాప్తంగా 5,092 క్లరికల్ ఉద్యోగాల భర్తీకి  నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో హైదరాబాద్ సర్కిల్‌కు సంబంధించి 208 పోస్టులున్నాయి. జనరల్ కేటగిరీకి 104, ఎస్సీలకు 33, ఎస్టీలకు 15, ఓబీసీలకు 56 పోస్టులు కేటాయించారు. గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఫైనలియర్ లేదా ఫైనల్ సెమిస్టర్‌లో ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే వీరు 2014, ఆగస్టు 31 నాటికి గ్రాడ్యుయేషన్ పూర్తయినట్లు ఇంటర్వ్యూ సమయంలో ధ్రువీకరణ పత్రం సమర్పించాల్సి ఉంటుంది.
 
 వయసు: 2014, మే 1 నాటికి కనిష్ట వయో పరిమితి 20 ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 28 ఏళ్లు. మే 2, 1986; మే 1, 1994 మధ్య జన్మించిన వారు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీలకు ఐదేళ్లు; ఓబీసీలకు మూడేళ్లు; పీడబ్ల్యూడీ జనరల్‌కు పదేళ్లు- ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు- ఓబీసీలకు 13 ఏళ్లు మినహాయింపు ఉంటుంది.ఎంపిక విధానం: క్లరికల్ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసే క్రమంలో ముందుగా ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో చూపిన ప్రతిభ, అందుబాటులో ఉన్న ఖాళీల ఆధారంగా కటాఫ్ నిర్ణయించి తర్వాతి దశ అయిన ఇంటర్వ్యూకు ఒక్కో పోస్ట్‌కు ముగ్గురిని ఎంపిక చేస్తారు.
 
 ఆన్‌లైన్ పరీక్ష విధానం:
 సబ్జెక్టు    మార్కులు
 జనరల్ అవేర్‌నెస్    40
 జనరల్ ఇంగ్లిష్     40
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్    40
 రీజనింగ్ ఎబిలిటీ    40
 మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/కంప్యూటర్ నాలెడ్జ్    40
 సమయం: 2 గం. 15 ని.లు
 నెగిటివ్ మార్కులున్నాయి. ప్రతి తప్పు సమాధానానికి వచ్చిన మార్కుల్లో 1/4 మార్కు తగ్గిస్తారు. ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ పరీక్ష దశను దాటాలంటే అభ్యర్థులు ప్రతి సబ్జెక్టులోనూ విడివిడిగా నిర్దేశ అర్హత మార్కులు సాధించాలి.
 
 ముఖ్య తేదీలు:
 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్: మే 26, 2014- జూన్ 14, 2014.
 ఫీజు చెల్లింపు (ఆన్‌లైన్):
 మే 26, 2014- జూన్ 14, 2014.
     ఫీజు చెల్లింపు (ఆఫ్‌లైన్):
 మే 28, 2014- జూన్ 17, 2014.
     ఆన్‌లైన్ పరీక్ష: జూలై/ఆగస్టు, 2014.
     ఫీజు: ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ/ఎక్స్‌ఎస్ అభ్యర్థులకు రూ. 100. జనరల్ అండ్ ఓబీసీ అభ్యర్థులకు రూ. 450.
     వెబ్‌సైట్: www.statebankofindia.com;
     www.sbi.co.in
 
 ప్రిపరేషన్ ప్రణాళిక
  జనరల్ అవేర్‌నెస్: జనరల్ అవేర్‌నెస్‌లో అధిక మార్కులు సాధించాలంటే సమకాలీన అంశాలు, ఆర్థిక-సామాజిక-రాజకీయ పరిణామాలపై దృష్టిసారించాలి. రోజూ దినపత్రికలు చదువుతూ ముఖ్యమైన విషయాలను నోట్స్ రూపంలో రాసుకోవాలి. బ్యాంకింగ్ రంగ నేపథ్యానికి సంబంధించిన నాలెడ్జ్ కోసం ఒక ఫైనాన్షియల్ డైయిలీని చదవాలి. బ్యాంకింగ్ రంగానికి సంబంధించిన తాజా పరిణామాలు, బ్యాంకింగ్ పదజాలం-వాటి అర్థాలపై అవగాహన ఉండాలి. బ్యాంకుల తాజా పాలసీలు, ఆర్‌బీఐ తాజా పరపతి విధానాలు, దేశంలో బ్యాంకింగ్ రంగ పురోగమన, తిరోగమన గణాంకాలు-కారణాలపై అవగాహన ఏర్పరచుకోవాలి. అదేవిధంగా జనరల్ నాలెడ్జ్‌కు సంబంధించి ముఖ్యమైన సంఘటనలు, ప్రదేశాలు, క్రీడలు-విజేతలు, అవార్డులు-విజేతలు; శాస్త్రవేత్తలు-ఆవిష్కరణలు; పుస్తకాలు- రచయితలు; ముఖ్యమైన రోజులు తదితరాలపై అవగాహన పెంచుకోవాలి.
 
 Ex: International Literacy Day is observed on which of the following days every year?
     a) September 8     b) September 7
     c) September 3     d) October 8
 Ans: a
 Ex: UN on 12th May, 2014 appointed a woman to head UN peacekeeping Force in Cyprus (UNFICYP). With this appointment, the woman became the first ever female to head a UN peace-keeping force in its entire history. Name her?
     a) Kristin Lund
     b) Rashida Manjoo of South Africa
     c)    Phumzile Mlambo Ngcuka of South Africa
     d) Helen Clark of New Zealand
 Ans: a
 జనరల్ ఇంగ్లిష్:
 బ్యాంక్ పరీక్షలో చాలా మంది అభ్యర్థులు ముఖ్యంగా గ్రామీణ నేపథ్యం ఉన్న వారు క్లిష్టంగా భావించే విభాగం జనరల్ ఇంగ్లిష్. ఈ విభాగంలో ఎక్కువ మార్కులు సాధించేందుకు యాంటానిమ్స్, సినానిమ్స్, వొకాబ్యులరీ, బేసిక్ గ్రామర్‌పై పట్టు సాధించాలి. వొకాబ్యులరీపై అవగాహనతో కాంప్రహెన్షన్ ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సులభంగా సమాధానాలు గుర్తించవచ్చు. వొకాబ్యులరీపై పట్టుసాధించేందుకు ఇంగ్లిష్ దినపత్రికలు చదువుతూ వాటిలో వివిధ సందర్భాల్లో ఉపయోగించిన పదాలను అధ్యయనం చేయాలి. స్పాటింగ్ ది ఎర్రర్స్ కోసం బేసిక్ గ్రామర్, సబ్జెక్ట్ - వెర్బ్ సంబంధం, టెన్సెస్‌పై అవగాహన ఉండాలి. మొత్తంమీద పదో తరగతి స్థాయిలోని గ్రామర్ అంశాలపై అవగాహన పెంచుకుంటే ఇంగ్లిష్‌లో అధిక మార్కులు సాధించడం సులువే.
  Ex: choose the word which is most opposite in meaning to given word "rude'?
 Ans: courteous.
 
 క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్:
 గణిత శాస్త్రానికి సంబంధించిన ప్రశ్నలు అడిగే ఈ విభాగంలో అధిక స్కోర్ సాధించాలంటే వర్గాలు, ఘనాలు, కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగహారాలు, క.సా.గు, గ.సా.భా. వంటి బేసిక్స్‌ను ఔపోసన పట్టాల్సిందే. టేబుల్స్, పై చార్ట్స్, లైన్ గ్రాఫ్స్, బార్ గ్రాఫ్స్, డేటా సఫీషియన్సీ, నంబర్ సిరీస్, పర్సంటేజ్‌లు, వడ్డీ అంశాలు, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టెన్స్, పార్ట్‌నర్‌షిప్, యావరేజెస్ ముఖ్యమైనవి. వీటికి తేలిగ్గా సమాధానాలు గుర్తించేందుకు ప్రాక్టీస్‌కు మించిన మార్గం లేదు. కాబట్టి ఈ విభాగం విషయంలో ప్రాక్టీస్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి.
 
 n    Ex: The ratio of the ages A and B seven years ago was 3:4 respectively. The ratio of their ages nine years from now will be 7:8 respectively. What is B's age at present?
     a) 25 years    b) 26 years
     c) 28 years    d) 23 years    e) 27 years
 Ans: d
 
 రీజనింగ్ ఎబిలిటీ:
 అభ్యర్థి నిర్ణయాత్మక శక్తిని అంచనా వేసేందుకు రీజనింగ్‌పై ప్రశ్నలు ఇస్తున్నారు. మిగిలిన ప్రశ్నలతో పోలిస్తే రీజనింగ్‌కు సంబంధించిన ప్రశ్నలకు సమాధానాలు గుర్తించేందుకు కొంచెం ఎక్కువ సమయం పడుతుంది. అయితే చిట్కాల ద్వారా సాధన చేస్తే త్వరగా సమాధానాలు గుర్తించవచ్చు. రీజనింగ్‌లో సిరీస్; అనాలజీ; క్లాసిఫికేషన్; కోడింగ్ అండ్ డీకోడింగ్; డెరైక్షన్స్; బ్లడ్ రిలేషన్స్; సీటింగ్ అరేంజ్‌మెంట్స్; ఆల్ఫాబెట్ టెస్ట్, ర్యాంకింగ్, పజిల్స్, స్టేట్‌మెంట్స్ అండ్ కన్‌క్లూజన్స్; నాన్ వెర్బల్ రీజనింగ్ తదితర అంశాలుంటాయి. ఈ విభాగాల నుంచి వచ్చే ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలను గుర్తించేందుకు ఉన్న ఏకైక మార్గం ప్రాక్టీస్. దీంతో సబ్జెక్టుపై పట్టు సాధించవచ్చు.
 
   Ex: Study the following arrangement carefully and answer the question given below..
     B U B D C E D B D E U B A D C B E A C D A E B A U A C D B C A C
     Q: Which of the following is the eighth to the left of the twentieth from the left end of the above
     1) ఇ     2) ఉ     3) U     4) ఆ    5) అ
 
 మార్కెటింగ్ ఆప్టిట్యూడ్/ కంప్యూటర్ నాలెడ్జ్:
 కేవలం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రిక్రూట్‌మెంట్ పరీక్షలో మాత్రమే కనిపించే విభాగం మార్కెటింగ్ ఆప్టిట్యూడ్ అండ్ కంప్యూటర్ అవేర్‌నెస్. అయితే వాస్తవానికి ఈ విభాగంలోని ప్రశ్నలు సులభంగా ఉంటున్నాయనేది నిపుణుల అభిప్రాయం. మార్కెటింగ్‌కు సంబంధించి మార్కెటింగ్ రకాలు, బ్రాండింగ్, మార్కెటింగ్ పదజాలంపై అవగాహన పెంపొందించుకోవాలి. TAT(Turn around time), గిైక (Word of mouth), ైగి (Share of wallet) వంటి సంక్షిప్తాల (abbreviations)ను తెలుసుకోవాలి. కంప్యూటర్ అవేర్‌నెస్‌కు సంబంధించి బేసిక్ కంప్యూటర్ టెర్మినాలజీ, హార్‌‌డవేర్ అండ్ సాఫ్ట్‌వేర్ బేసిక్స్, కంప్యూటర్ యూసేజ్, బేసిక్ పార్‌‌ట్స ఆఫ్ కంప్యూటర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, ఇంటర్నెట్, ఎంఎస్ ఆఫీస్, వర్‌‌డ, ఎక్స్‌సెల్, పవర్‌పాయింట్ తదితరాలపై అవగాహన పెంపొందించుకోవాలి.
 
    Ex: Modern styles of marketing are ...
     a) Telemarketing     b) Web marketing
     c) Advertisement on the net
     d) Emails     e) All of these
 Ans: e
     a) print Text     b) computer gaming
     c) Enter text     d) Draw pictures
     e) control sound on the screen
 
 వేగం.. విజయ మంత్రం:
 బ్యాంకు పరీక్షల్లో విజయ సాధనలో అత్యంత కీలక పాత్ర పోషించే అంశం వేగం. ప్రశ్నలు ఆబ్జెక్టివ్ విధానంలో ఉన్నప్పటికీ.. వాటి సాధనలో అన్వయ సామర్థ్యం అవసరం ఎంతగానో ఉంటుంది. మరోవైపు అందుబాటులోని సమయం కూడా పరిమితమే. ముఖ్యంగా క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ విభాగంలో గణిత సంబంధ ప్రశ్నలకు సమాధానం కనుక్కోవాలంటే అంచెలవారీగా (స్టెప్‌వైజ్) నిర్దిష్ట సమస్యను పరిష్కరిస్తూ సాగాలి. అదే విధంగా జనరల్ ఇంగ్లిష్ విభాగంలోని ప్యాసేజ్ ఆధారిత ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలంటే వేగంగా చదవడం; కీలక పదాలను గుర్తించడం; ప్యాసేజ్ కింద అడిగిన ప్రశ్నను చదువుతున్నప్పుడే దానికి సంబంధించిన సమాధానం ప్యాసేజ్‌లో ఎక్కడ ఉందో జ్ఞప్తికి తెచ్చుకోవడం వంటి నైపుణ్యాలు సొంతం చేసుకోవాలి.

వీటన్నిటికీ ప్రధాన పరిష్కారం నిరంతర ప్రాక్టీస్. ఒక అంశాన్ని చదువుతున్నప్పుడు దానికి సంబంధించిన ప్రీవియస్ ప్రశ్నలను పరిశీలించాలి. అంతేకాకుండా ప్రతి చాప్టర్ పూర్తయ్యాక స్వీయ సమయ పరిమితి విధించుకుని సెల్ఫ్ టెస్ట్ రాయాలి. తొలి దశలో తెలిసిన ప్రశ్నలకు సమాధానం ఇవ్వాలి. అవి ఎంత సమయంలో పూర్తయ్యాయో గుర్తించాలి. అక్కడితో ఆగకుండా తెలియని ప్రశ్నలకు సమాధానం ఇచ్చేందుకు ఉపక్రమించాలి. ఇలా.. రెండు దశల్లో సెల్ఫ్ టెస్ట్ పూర్తి చేసుకుని నిరాటంకంగా ఎన్ని ప్రశ్నలకు సమాధానం ఇవ్వగలిగారు? ఎన్ని ప్రశ్నల్లో దోషాలు తలెత్తాయి? అని విశ్లేషించుకోవాలి. సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు పరీక్ష కోణంలో ముఖ్యమైనవా? కాదా? అని పరిశీలించాలి. ఇందుకోసం గత నాలుగైదేళ్ల ప్రశ్నపత్రాలను శాస్త్రీయంగా విశ్లేషించాలి. ఆ చాప్టర్‌లోని అంశాలకు లభిస్తున్న వెయిటేజీని గుర్తించి దానికనుగుణంగా సాగాలి. వెయిటేజీ ఎక్కువగా ఉండి, కష్టంగా ఉన్న టాపిక్స్‌కు శిక్షణ తీసుకోవడానికి వెనుకాడొద్దు.
 
 సమయపాలన కీలకం:
 సాధారణంగా ప్రిపరేషన్ క్రమంలో అభ్యర్థులు ముందుగా తమకు పట్టున్న అంశాలను పూర్తిచేసి తర్వాత మిగతా వాటిపై దృష్టి మళ్లించే ఆలోచనతో ఉంటారు. కానీ ఇది సరికాదు. దీనివల్ల ప్రిపరేషన్ చివరి దశకు వచ్చేటప్పటికి కొన్ని అంశాలు పూర్తికాని పరిస్థితి తలెత్తే ప్రమాదం ఉంది. ఇది పరీక్షలో ప్రతికూల ప్రభావం చూపుతుంది. కాబట్టి.. ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌ను చదివేలా టైం మేనేజ్‌మెంట్ పాటించాలి. అందుబాటులో ఉన్న సమయాన్ని పరిగణనలోకి తీసుకుంటే ప్రతి రోజు కనీసం 8 నుంచి పది గంటలు ప్రిపరేషన్‌కు కేటాయించి.. సమయం పరంగా ప్రతి సబ్జెక్ట్‌కు సమ ప్రాధాన్యం ఇవ్వాలి. అంతేకాకుండా ప్రతి రోజు చదివిన అంశాల పునశ్చరణకు కొంత సమయం కేటాయించుకోవాలి. అదే విధంగా ప్రతివారం ఆ వారంలో చదివిన వాటిని పునశ్చరణ చేసుకోవాలి. అంతేకాని మూస ధోరణిలో చదువుకుంటూ వెళితే అవగాహన స్థాయి ఏ మేరకు ఉందో తెలుసుకోవడం కష్టమవుతుంది. ఇప్పటికే పలు బ్యాంక్ పరీక్షలు రాసిన అభ్యర్థులు వాటిలో తమకు వచ్చిన మార్కులు, ఎందులో వెనుకంజలో ఉన్నామో గమనించి, ఆ అంశాలపై మరింత దృష్టి సారించాలి. పరీక్షకు రెండు వారాల ముందు నుంచి రివిజన్‌కే కేటాయించాలి.
 
 మాక్ టెస్ట్‌లు:
 అభ్యర్థులు గుర్తుంచుకోవాల్సిన మరో ప్రధానాంశం మాక్ టెస్ట్‌లకు హాజరు కావడం. కనీసం అయిదు మాక్ టెస్ట్‌లకైనా హాజరు కావాలి. కోచింగ్ సెంటర్లు, కాంపిటీటివ్ వెబ్ పోర్టల్స్ తదితర మార్గాల ద్వారా మాక్‌టెస్ట్‌లకు హాజరయ్యే అవకాశం అందుబాటులో ఉంది. దీన్ని వినియోగించుకోవాలి. నిర్దేశిత సమయంలో ఎన్ని ప్రశ్నలు పూర్తిచేశాం? ఎన్ని సరైన సమాధానాలిచ్చాం? అని విశ్లేషించుకోవాలి.
 
 రిఫరెన్స్ బుక్స్:
           ఆర్.ఎస్.అగర్వాల్-వెర్బల్ అండ్ నాన్ వెర్బల్ రీజనింగ్.
     అర్హింత్ పబ్లికేషన్స్- మార్కెటింగ్, కరెంట్ అఫైర్స్.
     మనోరమ ఇయర్ బుక్- జనరల్ అవేర్‌నెస్.
     అరుణ్ శర్మ- క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్.
     ఏబీసీ ఆఫ్ ఇంగ్లిష్, దాచేపల్లి పబ్లికేషన్స్- ఇంగ్లిష్.
 
 ప్రాక్టీస్.. ప్రాక్టీస్.. అదే విజయ మంత్రం
 ఎస్‌బీఐ క్లరికల్ కేడర్ పరీక్షలో విజయం సాధించాలంటే ప్రాక్టీస్ చాలా ముఖ్యం. ప్రాక్టీస్ కోసం ప్రతియోగితా కిరణ్, ప్రతియోగితా దర్పణ్ మ్యాగజైన్స్ ఉపయోగపడతాయి. వాటిలో ఇచ్చిన ప్రశ్నల సాధన ద్వారా ప్రిపరేషన్‌లో బలాలు, బలహీనతలు తెలుస్తాయి. వాటికనుగుణంగా ప్రిపరేషన్ ప్రణాళికను మార్చుకునేందుకు వీలుంటుంది. జనరల్ అవేర్‌నెస్‌లో 20 శాతం వరకు కరెంట్ అఫైర్స్, ఏడు శాతం వరకు బ్యాంకింగ్ సంబంధిత అంశాలపై ప్రశ్నలు వస్తాయి. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిడ్యూడ్ విభాగాలకు ఎన్‌ఎస్‌బీ మెటీరియల్ ఉపయోగపడుతుంది. కంప్యూటర్/మార్కెటింగ్ విభాగంలో అడిగే ప్రశ్నలు ప్రామాణికంగా ఉంటాయి. బ్యాంకింగ్ రంగంలో వచ్చే కొత్త టెక్నాలజీ ఏదైనా ఉంటే దానికి సంబంధించిన అంశాలను గుర్తుంచుకోవాలి. మార్కెటింగ్ కోసం నేను కోచింగ్ సెంటర్ మెటీరియల్, ఎడ్యుకేషన్ మ్యాగజైన్లలో ఇచ్చే మోడల్ పేపర్లపై మాత్రమే ఆధారపడ్డాను. మరో ముఖ్యవిషయం ఏమిటంటే ఆన్‌లైన్ పరీక్ష కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్ చాలా ముఖ్యం. కరెంట్ అఫైర్స్‌పై అప్‌డేట్‌గా ఉండాలి.
 - ఎల్.రాంమనోహర్,
 ఎస్‌బీఐ క్లరికల్ విజేత.
 
 టిప్స్
 ప్రిపరేషన్‌కు రోజుకు కనీసం నాలుగు గంటలు కేటాయించుకోవాలి. రీజనింగ్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌లకు ఎక్కువ సమయం కేటాయించాలి. రోజువారీ టైం టేబుల్ వేసుకొని ప్రిపరేషన్ కొనసాగించాలి. రోజుకు ఐదారు ఇంగ్లిష్ పదాలను నేర్చుకోవాలి. వాటి సహాయంతో వాక్యాలను తయారు చేయడం ప్రాక్టీస్ చేయాలి. దీనివల్ల వొకాబ్యులరీపై పట్టు ఏర్పడుతుంది. ఇలాచేస్తే కాంప్రెహెన్షన్ (10 మార్కులు), కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ (10 మార్కులు) ప్రశ్నలకు తేలిగ్గా సమాధానాలు రాయొచ్చు.దినపత్రికలు చదవడం, న్యూస్‌బులెటన్లను చూడ టం ద్వారా కరెంట్ అఫైర్స్‌పై పట్టు సాధించవచ్చు.గత పరీక్షల్లో విజేతల సూచనలను, అనుభవాలను తెలుసుకోవాలి. భావ సారూప్యం ఉన్న వారితో కలిసి గ్రూప్‌గా చదవడం కూడా ఉపయోగపడుతుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement